30, డిసెంబర్ 2015, బుధవారం

సమస్య – 1899 (అవనీశ్వరు లెల్ల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

52 కామెంట్‌లు:

 1. భవనము లందున కులుకుచు
  సవనము లనుపేరు బెట్టి చషకము బట్టన్
  కవనము లల్లుచు ప్రీతిగ
  అవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు

  1. అవని తలమ్మును పాలిం
   ప వయోజనులకు ధనమును పంచుచు రణము
   న్నవినీతి తోడ గెలిచెడు 
   యవనీ శ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్ 

   రణము = ఎన్నికలు

   తొలగించండి
 3. గురువు గారికి నమస్కారములు

  అవని తలమ్మును పాలిం
  ప వయోజనులకు ధనమును పంచుచు రణమున్ 
  యవినీతి తోడ గెలిచెడు 
  యవనీ శ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్ 

  రణము = ఎన్నికలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘రణమున్+అవినీతి’ అన్నపుడు యడాగమం రాదు. ‘యుద్ధం| బవినీతితోడను గెలుచు| నవనీశ్వరు లెల్ల...’ అనండి.

   తొలగించండి
 4. అవినీతికి పాల్పడమను
  నవనీశ్వరులెల్ల కల్లలాడెడు వారల్
  సవినయముగ ప్రార్థింతుము
  భువనేశ్వరిప్రజలనెల్ల బ్రోవుము తల్లీ !!!

  రిప్లయితొలగించండి

 5. కాబూలీ నగరమున ఫోను మాటలాడి
  పాకు నగరమునకు నరేంద్రుడు ఏగెన్ !
  అగుపించిరి చిరునగవుల తోడి రాజుల్ !
  అవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్ ?

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ భావానికి (పూర్తిగా కాదనుకోండి!) నా పద్యరూపం...

   ఎవరయ్యా శత్రువు లీ
   భువిలో? నాకస్మికముగ పోయెను మన మో
   డి విమాన మెక్కి పాకుకు;
   నవనీశ్వరు లెల్ల కల్ల లాడెడువారల్.

   తొలగించండి
 6. శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
  కవి పండితులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు...
  ===========*=============
  నవ విధముల నవలీలగ
  నవినిని గల సకల ధనము నార్జించెడి యీ
  యవినీతి ఖ్యాతి గల్గిన
  యవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్

  రిప్లయితొలగించండి
 7. గురుదేవులు మన్నించాలి, పై పద్యం అన్ని విధములుగా సకల సంపదలను దోచు కొనెడి రాజకీయ నాయకులపై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కందుల వరప్రసాద్ గారూ,
   బహుకాల దర్శనం! సంతోషం!
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘అవని’ టైపాటువల్ల ‘అవిని’ అయింది.

   తొలగించండి
 8. అవగతమైనది పూర్వపు
  అవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్
  కవివర! కారని, యుందురు
  సవినయ హరిచంద్రు రీతి సత్యార్థేశుల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘హరిశ్చంద్రు’ని ‘హరిచంద్రు’ డన్నారు. ‘సవిధి హరిశ్చంద్రు రీతి సత్యాన్వేషుల్’ అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 9. రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘వారల్+అవినాశు’ డని విసంధిగా వ్రాయరాదు. ‘ఆడించే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘పాత్గులు’...?

   తొలగించండి
  2. గురువు గారికి వందనములు పద్యమును సవరించితిని అవనియు,భవమును,భవనము,
   లవనీశ్వరు లెల్ల కల్ల,లాడెడువారల్
   భువనేశ్వరు డాడి౦చెడి
   భవనాటకరంగ మందు పాత్ర లగుటచే

   తొలగించండి
 10. అవగత మవని విధ మస
  త్య వచను డాధర్మజుండు దలుపన్ వంచిం
  చె వరుణుని హరిశ్చంద్రుడె
  యవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్

  హరిశ్చంద్రుడు వరుణ దేవా నాకు గొప్ప వీరుడైన కొడుకు పుట్టితే నీకతనిని బలిపశువు జేసి అగ్నిలో హోమము చేస్తానని వేడుకోగా వరుణుని ప్రసాదమున రోహితుడు పుట్టెను. కానీ హరిశ్చంద్రుడు పుత్ర ప్రేమతో తాత్సారము చేసి బలి ఇవ్వడు. శునశ్సేపుడను ముని పుత్రున్ని యిస్తాడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   చక్కని ఐతిహ్యంతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 11. భవ జంజా టము తోడ త
  నవారల ప్రగతిని కోరి నటన సలుపుచున్ 
  కువలయమందున బుట్టిన 
  యవనీశ్వరులెల్ల క ల్లలాడెడు వారల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. అవినీతియు నక్రమముల
  కవలేశము జడవకుండ నవనీ జనులన్
  వివిధ వితమ్ముల దోచెడు
  అవనీశ్వరులెల్ల కల్ల లాడెడు వారల్!!!

  వితము = ఉపాయము

  రిప్లయితొలగించండి
 13. అవగుణము జేర భీతిలు
  నవనీశ్వరులెల్ల-కల్లలాడెడు వారల్
  భువిలోన వెదకి జూచిన
  కవియైనను జెప్పలేడు గణనది యెంతో!


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. అవసరమా యిట్లనుటకు
  నవనీశ్వరులెల్ల కల్లలాడెడు వార
  ల్లవనింగల రాజులలో
  నెవరును మరి నిజము పలికె యీశులు లేరా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘వారల్| భువిలో గల...’ అనండి.

   తొలగించండి
 15. నవయువకులు సంఘంబున
  అవినీతిని పంచి పెంచి నైశ్వర్యంబే
  అవలీలగ రాగవిధిగ
  అవనీశ్వరు లెల్ల కల్లలాడెడి వారల్.
  2.భవితకు భాద్యత నుంచెడి
  కవివర,గురువరుల పలుకు కల్మష మదితో
  వివరణ లుంచకనేర్పిన
  అవనీశ్వరులెల్ల కల్లలాడెడివారల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘పెంచి యైశ్వర్యంబే’ అనండి.

   తొలగించండి
 16. అవనీతికి దూరమనుచు
  అవకాశము దొరకినంత అందుకొనెడి వా
  రు, విభవమునకై లొంగెడు
  అవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భువిలోని జనులు పల్కెద
   రవనీశ్వరులెల్ల కల్లలాడెడు వారల్
   భువిలో దానవుడాబలి
   పుడమిని తా దానమొసగి పొందడె ఖ్యాతిన్

   తొలగించండి
  2. భువిలోని జనులు పల్కెద
   రవనీశ్వరులెల్ల కల్లలాడెడు వారల్
   భువిలో దానవుడాబలి
   పుడమిని తా దానమొసగి పొందడె ఖ్యాతిన్

   తొలగించండి
  3. పియెస్సార్ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  4. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  5. భువి - రవ - భువి - పుడమి
   యతి సరిపోతుందా? దయచేసి తెలుపజేయ ప్రార్థన.

   తొలగించండి
  6. మూర్తి గారూ,
   భువి-రవ... ప్రాసయతి సరిపోతుంది.
   భువి-పుడమి... యతి సరిపోతుంది.

   తొలగించండి
 17. రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. స్తవనీయ రాముఁడు వినా
   వ్యవహారమ్ములఁ గనంగ వనితో! వసువో!
   యవసరమేదైన నడుప
   నవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్!

   తొలగించండి
  3. స్తవనీయ రాముఁడు వినా
   వ్యవహారమ్ములఁ గనంగ వనితో! వసువో!
   యవసరమేదైన నడుప
   నవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్!

   తొలగించండి
 18. భువనము నేలుట కొఱకై
  జవసత్వములుడుగ బడుగు జన హార్మ్య మునే
  హవనపు టాజ్యముగ దలచు
  యవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్.

  రిప్లయితొలగించండి
 19. ఈరోజు మా నాన్నగారి ప్రథమ మాసికం. రోజంతా వ్యస్తుణ్ణై యుండి మీ పూరణలపై వెంట వెంట స్పందించలేకపోయాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 20. గురువుగారికి, పెద్దలకు నమస్కారం. రాముని గొంతు పలికించి అబద్ధముచేతనూ, మోసముచేతనూ సీతను అపహరించుకు పోయిన రావణుదాదిగా రాజులందరూ కల్లలాడారు అన్న భావన లో రాసిన పూరణ. తప్పులు తెలియచేయగలరు. ధన్యవాదాలు.

  రవమున రాముని పోలుచు
  అవనిజ హరణము సలిపెను యసురుడు లంకా
  నవిఘుడు రావణు డాదిగ
  అవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్

  రిప్లయితొలగించండి
 21. వేదుల సుభద్ర గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సలిపెను+అసురుడు=సలిపె నసురుడు’ అవుతుంది, యడాగమం రాదు. ‘హరణమును సలిపె నసురుడు...’ అనండి. ‘లంకా నవిఘుడు’... అర్థం కాలేదు.

  రిప్లయితొలగించండి
 22. కవనము లల్లుచు ఘనముగ
  నవనీతపు మాటలాడి నచ్చిన రీతిన్
  సవరించి లెక్కలటునిటు
  నవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్

  రిప్లయితొలగించండి
 23. అవకతవక సంపదతో
  భవనమ్ములు కట్టి మేటి బంజర హిల్సున్
  భువనపు విజయము గోరెడి
  యవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్

  రిప్లయితొలగించండి