24, డిసెంబర్ 2015, గురువారం

పద్యరచన - 1127

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి. 

22 కామెంట్‌లు:

  1. ఎన్నెన్ని రంగులున్నవె
    మన్నన సేసెదరునిన్న మహిలో జనులే
    నిన్నిక మించెడు సొగసరి
    నెన్నడు కాంచంగలేము నీవే ఘనమౌ

    ధాత నేర్పు దెలుపు సీతకోకచిలుక
    అంద మదియు జూడ నవని లోన
    సొబగు లీను విరుల సోయగమ్ముకు తాను
    సాటి యనుచు నిలుచు కీటకమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘మన్నన సేసెదరు నిన్ను/నిన్నె’ అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
    2. ధన్యవాదములండి ...గురువుగారూ....సరిచేయగలను

      తొలగించండి
  2. భీతిని గలిగించెడు బహు
    రోతౌ గొంగడి పురుగది రూపాంతరమై
    సీతాకోకచిలుకగను
    భూతలమున దైవసృష్టి బొగడగ తరమే

    రిప్లయితొలగించండి
  3. రోతగ గొంగళి పురుగుగ
    భీతిని గొలుపిన కనులకు ప్రీతిని జేయన్
    నీ తపము పూర్తియవగా
    సీతాకోకగను మారి చెలువొందితివే.

    రిప్లయితొలగించండి
  4. రంగు రంగుల తోడను రమ్య మలరి
    చూడ ముచ్చట గొల్పును జూప రులకు
    చెలువు గలదిసీ తాకోక చిలుక యార్య !
    దశ లు దశలుగ మారును దనర యదియ

    రిప్లయితొలగించండి
  5. సీతాకోకచిలుక కడు
    ప్రీతిని గూర్చును సతతము వీక్షక తతికిన్
    నాతులచీరెల రంగుల
    తా తిరుగుచు పూలపైన త్రాగుచు తేనెన్ /
    తో తిరుగుచుపువ్వు నుండి దోచుచు తేనెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. కమనీయ వర్ణ సముదా
    యము నన్నలరుచు ఛదద్వ యాకర్షణ వి
    భ్రమ, సీతా కోక చిలుక,
    సుమ మకరందాశను గన చోద్యంబాయెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పత్రమున చిత్రము కడు వి
      చిత్రము గన్నేత్రములకు చిత్తంబునకున్
      చిత్రానుభూతి నిచ్చి ప
      విత్రానందము నొసంగె విస్తారముగన్

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. సీతకోక-చిలుక రీతిగనుండగ?
    సీతకోకచిలుక-చేర్చి కొనెన?
    సీత,కోక,చిలుక,సింగారమున్ జూడ?
    సృష్టి కర్త రచనె పుష్టి మనకు.

    రిప్లయితొలగించండి
  8. .రెక్కలురేపు యూహల నిరీక్షణ జేయక పువ్వునవ్వగా?
    టక్కునవాలి తేలికగ టక్కరిచే మకరంద మంతయున్
    మెక్కెడి తొండమున్ నిడుచు”మేటిగ రెక్కలరంగుజూడగా
    చక్కదనాలచిల్క| ననజాలక కీటకమాయె|మాయగా|
    3.జన్మ జన్మల బంధంబు జగతియందు
    కలదటంచు నిరూపణ దెలుపు” సీత
    కోకచిలుకల దశలు|సంకోచ మేల
    నన్న భావనగనుపించు వన్నెలందు”.

    రిప్లయితొలగించండి
  9. అరె! సీతాకోకచిలుక
    మరిమరి పలు విరులపైన మధురిమ గ్రోలన్
    ధరణిని మేలగునది పర
    పరాగ సంపర్క క్రియకు బాసట యగుచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  10. దశలను దాటిన తదుపరి
    పసగల రంగులను దాల్చి పరువము తోడన్
    మిసమిస సీతాకోకయి
    కుసుమముపైవ్రాలి గ్రోలు ఖుసిగా మధువున్!!!

    రిప్లయితొలగించండి

  11. రంగులీను చున్న రమణీయతను జూడ
    అలరు చుండు మనము నవని యందు
    చూడచూడ దాని సొబగు హెచ్చుచు నుండు
    చిన్ని సీతకోక చిలుకయదియె

    నలువ సృష్ఠిలోని నయగారమునుగాంచ
    దాని హొయలు చూడ తమియు హెచ్చు.
    తాకినంత తనువు తల్లడిల్లచునుండు
    కమ్మనైన పులుగు కనుల విందు.

    రిప్లయితొలగించండి