2, డిసెంబర్ 2015, బుధవారం

సమస్య - 1872 (కూడు గుడ్డ లేల...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
కూడు గుడ్డ లేల మేడ లుండ. 

27 కామెంట్‌లు:

  1. మదము పెరిగి మనిషి మైకమం దునదేల
    కూడు గుడ్డ లేల మేడ లుండ
    వెండి కొండ నుండి వేడిమి నెరుగని
    శివున కేమి దెలుసు నవని బాధ

    రిప్లయితొలగించండి
  2. కూడు గుడ్డ చాలు మేడలక్కరలేదు
    సాగిపోవు బ్రతుకు చక్కగాను
    కూడు గుడ్డ లేల మేడ లుండననుచు
    బుగ్గి పాలు చేయ బోకు బ్రతుకు

    రిప్లయితొలగించండి
  3. మనుజున కవసరము మనుటకు మేలైన
    కూడు గుడ్డ, లేల మేడ లుండ?
    తినగ లేని నాడు తీరని వ్యాధితో
    బట్టగట్ట లేని బ్రతుకదవ్వ

    రిప్లయితొలగించండి
  4. మనుజునకునుజాలు మనుటకు మేలైన
    కూడు గుడ్డ, లేల మేడ లుండ?
    తినగ లేని నాడు తీరని వ్యాధితో
    బట్టగట్ట లేని బ్రతుకదవ్వ

    రిప్లయితొలగించండి
  5. మనిషి కవసరమ్ము మనుగడ సాగింప
    కూడు గుడ్డ;లేల మేడలనుచు
    సంబరపడు చుండు సంసారమౌ స్వర్గ
    మందురార్యు లెల్ల మహిని నిజము.

    2ధనమదమ్ము చేత దర్పమ్ము జూపుచు
    'కూడు గుడ్డ లేల మేడ లుండ
    చాలు' ననెడి మూర్ఖజనుల బాగు పరచ
    యిలను శక్యమౌనె యేరి కైన.

    రిప్లయితొలగించండి
  6. దాన ధర్మములను దారముగం బీద
    సాద లెల్లరకును సలుప దగును
    ధనము గలిగె నేని ధనవంతులకు నీయ
    కూడు గుడ్డ లేల మేడ లుండ.

    రిప్లయితొలగించండి
  7. కూడుగుడ్డలేల మేడలుండయనుచు
    నుడువ రాదు మేడ లుండు నెడల
    కూడు గుడ్ఢలకును కొదవగలదె యిల?
    నార్య! చెపుమ ,మీరు నవునొ ,కాదొ ?

    రిప్లయితొలగించండి
  8. కూడు గుడ్డ లేల మేడ లుండననుచు
    విర్ర వీగ కోయి వెఱ్ఱి వాడ !
    కూడు గుడ్డ లేక గూర్చున్న మేడలో
    కడుపు నింపి దిరుగ గలవె నిలను? !!!

    రిప్లయితొలగించండి
  9. చిక్కి పోవు మాకు జీవించుటకు చాలు
    కూడు గుడ్డ లేల మేడ లుండ
    వలయు నవియు కలిమి పరులకు భరత
    దేశ పునికి గాంచ దెలియ గలదు.

    రిప్లయితొలగించండి
  10. గురువు గారికి నమస్కారములు......

    పసిడి రాశు లెవడు భక్షింప గాలేరు
    వలయు తలకు నీడ బ్రతక చాలు
    కూడు గుడ్డ, లేల మేడ, లుండవలయు
    మంచి మానవతయు మమత సుమ్ము.

    (కూడుగుడ్డలు, ఏల మేడలు, ఉండవలయు )
    మూడవ పాదము వివరణ,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మగారు నమస్కారము. మూడవ పాదముపై గల సంశయం గురించి..
      మేడలు అనగా ఉన్నత భవనములు అని నాభిప్రాయము . అవి ధనవంతులకు మాత్రమే
      ఉంటాయి. నిరుపేదలకు తలదాచు కొనుటకు గుడిసెనో లేక చిన్న
      ఇల్లో ఉంటుందే కాని మేడలు ఉండవని నా భావన. ఈ స్థితి భారత
      దేశములో కనిపిస్తుంది కదా

      తొలగించండి
    2. Laxminarayan Ganduri గారూ నమస్కారం, మీ అభిప్రాయంతో నేనేకీభవిస్తున్నాను. నా పూరణలోనీ అంతరార్థమూ అదియే బంగారు బిస్కత్తుల నెవడూ తినడు తలదాచుకొను నీడ
      ఆకలిదీర్చు కూడు మానరక్షణకు గుడ్డ చాలునని... యెందుకు మేడలని, వుండాలి మంచితనం మానవత మమతలు ఇవిచాలని భావము.

      తొలగించండి
  11. మత్తు గొల్పు మదిర మదవతి సరసన
    కూడు గుడ్డ లేల? మేడలుండ
    గుడిసె లేల?,మనది కులుకు తళుకు లొల్కు
    దేవభూమి గాదె ..తెలుగు సీమ

    రిప్లయితొలగించండి
  12. “శోభనాన మనము శోధనజేయగ
    కూడు.”గుడ్డలేల?మేడలుండ
    ఇద్దరొక్కటైన-సిద్దులు దీవించ?
    వంశ వృద్ధిజరుగు|అంశమిదియె.

    రిప్లయితొలగించండి
  13. * గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    వణిజ వృత్తి యేల ?. వ్యాపార మది యేల. ?
    కూడు గుడ్డ . లేల. మేడ లు౦డ.
    మేడ లు౦ట వలన మె౦డుగా వచ్చును
    ప్రతిఫలమ్ము మనకు పట్టణమున
    ..............................................

    కూడుగుడ్డ. లేల మేడలు౦డ. = కూడు గుడ్డలు + ఏల. మేడలు౦డ =
    కూడు గుడ్డలు ఏలు రీతి గా మేడలు౦డ
    = ( ఏలు = ఇచ్చి పోషి౦చు )
    పట్టణమున మేడలే కూడు గుడ్డ లిచ్చి
    పోషి౦చును
    .......... .........................

    రిప్లయితొలగించండి
  14. దేవతల సరసన దేవేంద్ర సభనుండ
    కూడు గుడ్డ లేల ? మేడ లుండ ,
    చావులేని చోట సబ్యత్వముండగా ,
    తోడు లేదటంచు గోడదేల ?

    చాలినంత కల్లు సారాలె యుండగా
    కూడు గుడ్డ లేల ?మేడ లుండ
    దేశమేలు వాన్కి, దిక్కు మొక్కును లేక
    తిండి లేని బడుగు లుండ నేల?

    రిప్లయితొలగించండి
  15. {పెళ్లిచూపులపుడువరుని పెళ్లివారుకోరిన కోర్కెలు}
    2.వరునికట్నమందు పల్సరుబండిని
    కూడు.”గుడ్డలేల?మేడలుండ
    ఒకటి నివ్వచాలు సకలముగోరము
    వజ్రహారమొకటివదువుకిమ్ము.{చాలుఅన్నారట}

    రిప్లయితొలగించండి
  16. అందమైన పడతు కందించ చేతిని
    కూడుగుడ్డలేల, మేడలుండ
    చాలు, కొత్త జంట సంతోషమునుగొన
    పగలు రాత్రి కూడ పరవశించి

    రిప్లయితొలగించండి
  17. చంద్రమౌళి రామారావుగారి పూరణ :-
    పనియు పాటులేని వరబద్ధకస్తుడు
    కట్టుకొనుచు పగలు గాలిమేడ
    లూహల జగమందు నూరేగుచిటులనె
    కూడు గుడ్డ లేల మేడ లుండ.

    రిప్లయితొలగించండి
  18. చంద్రమౌళి రామారావుగారి పూరణ :-
    పనియు పాటులేని వరబద్ధకస్తుడు
    కట్టుకొనుచు పగలు గాలిమేడ
    లూహల జగమందు నూరేగుచిటులనె
    కూడు గుడ్డ లేల మేడ లుండ.

    రిప్లయితొలగించండి
  19. లేని దానిఁ బొంద మానవుని తపన
    మేడలున్న వారె మిన్న యనుచు
    కలలు గనెడు వాడు తలపోసె నీరీతి
    " కూడు గుడ్డ లేల మేడలుండ"

    రిప్లయితొలగించండి