4, డిసెంబర్ 2015, శుక్రవారం

సమస్య - 1874 (క్రోధ లోభ మోహములు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
క్రోధ లోభ మోహములు సద్గుణము లండ్రు. 

19 కామెంట్‌లు:

  1. సుగుణ మన్నది వెదకిన శూన్యమై చ
    రించు వారికి తెలియునే మంచి చెడ్డ
    లర్థ సాధనె లక్ష్యమౌ స్వార్థపరులు
    క్రోధ లోభ మోహములు సద్గుణము లండ్రు.

    రిప్లయితొలగించండి
  2. మదము మాత్సర్యమును వీడి మసలు వారు
    జగతి నిండుగ విరిసిన సంప దనగ
    కలియు గంబున నెరవేర కలను గాదె
    క్రోధ లోభ మోహములు సద్గుణము లండ్రు.

    రిప్లయితొలగించండి
  3. ఆరు మంది పగతురెల్లరంతరంగ
    మందు యుండి పశువులుగ మార్చిచుండు
    క్రోధ లోభమోహములు ;సద్గుణము లండ్రు
    శాంతి సహనంబులె ప్రజ సంఘమందు.

    రిప్లయితొలగించండి
  4. శాంతి దయయును ధర్మమ్ము క్షమయు జ్ఞాన
    సత్యములను గలుగుటయు సరిగ విడుట
    మదము మాత్సర్య కామము మరియు మూడు
    క్రోధ లోభ మోహములు, సద్గుణము లండ్రు.

    రిప్లయితొలగించండి

  5. వలయు క్రోధమ్ము ఛలమును ప్రతిఘటింప
    వలయు లోభమ్ము వ్యర్ధ ఖర్చులను బాప
    వలయు మోహమ్ము పరమాత్మ పైన,నిటుల
    క్రోధ లోభ మోహములు సద్గుణము లండ్రు

    రిప్లయితొలగించండి
  6. మదము మాత్సర్య కారణ మగు నరునకు
    క్రోధ లోభ మోహములు; సద్గుణము లండ్రు
    శాంత్యహింసలు దానము సత్యవచన
    పాలనము లివి జగతిని ప్రబల వలయు

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. శౌచమున్ త్యాగముంగృప సత్య నిరతి
      యార్జవమును దానము వినయాది గుణ త
      తులను, రహితము లైననీ దుర్గుణములు
      క్రోధ లోభ మోహములు, సద్గుణము లండ్రు.

      తొలగించండి
  8. సమస్య
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { నీవు మ౦చి మిత్రుని వైనచో
    ఈ క్రి౦ది సలహా నిమ్ము
    వాడు త్వరగా = " పైకి పోతాడు " }


    క్రోధ లోభ మోహములు సద్గుణము ల౦ద్రు

    గర్వ మత్సరములు సుమార్గమ్ము ల౦ ద్రు

    కనుక వినుము నా నీతి వాక్యముల నెపుడు

    * పైకి పోదువు * మిత్రమా త్వరగ నీవు ! !

    రిప్లయితొలగించండి
  9. బ్రహ్మ నాభుని గొల్చుచు భక్తితోడ
    బడుగు జనుల సేవించుచు, వర్జితమగు
    క్రోధ లోభమో హములు సద్గుణములంద్రు
    బుధ జనమ్ములు సత్వర ముక్తి బొంద

    రిప్లయితొలగించండి
  10. విడువవలెనని వచియింత్రు విబుధులివియె
    మదము కామము మత్సరం మరియు దంభ
    క్రోధలోభమోహములు,సద్గుణములండ్రు
    మమత కరుణయు నోరిమి సమత లనిల!!!

    రిప్లయితొలగించండి
  11. ఆశ నత్యాశగామార్చు నల్పబుద్ది
    క్రోధ,లోభ మోహములు|”సద్గుణము లండ్రు
    నాటిసంస్కృతినిలుపగ చాటగలిగి
    పరులమేలెంచు తత్వమే వరములగును”.
    2.క్రోధ మన్నది యుద్దాన మోధ మొసగు.
    లోభ ముంచుము చదువున లాభముండు
    నీతి నిలుపని మోహంబు నెగడునట్లు
    క్రోధ లోభ మోహములు|సద్గుణము లండ్రు|
    3.మనిషిమనసును ద్రుంచులే-మమతలేక
    క్రోధ,లోభ మోహములు|”సద్గుణము లండ్రు
    నీతి నిష్టలు ధర్మంబు నిలుపునట్లు
    సాగుజీవనమెప్పుడు సార్థకంబు.”


    రిప్లయితొలగించండి
  12. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గు౦డా సుబ్బ సహదేవుడు గారూ

    మీ పద్యాలు చూచి ఆన౦ది౦చే వారిలో
    నేనే మొదటి వాడను !

    రిప్లయితొలగించండి
  13. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గు౦డా సుబ్బ సహదేవుడు గారూ

    మీ పద్యాలు చూచి ఆన౦ది౦చే వారిలో
    నేనే మొదటి వాడను !

    రిప్లయితొలగించండి
  14. మనిషి పతన కారణములు మహిని యందు
    క్రోధ లోభ మోహములు, సద్గుణము లందు
    రవి నిజము, నీతి, ధర్మము భువి జనుల
    సజ్జనుల జేయు నటువంటి సాధనములు.

    రిప్లయితొలగించండి
  15. మనిషి పతన కారణములు మహిని యందు
    క్రోధ లోభ మోహములు, సద్గుణము లందు
    రవి నిజము, నీతి, ధర్మము భువిని జనుల
    సజ్జనుల జేయు నటువంటి సాధనములు.

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    ఈరోజు నాన్నగారి ఐదవ రోజు కార్యక్రమంలో వ్యస్తుణ్ణై ఉన్నాను.

    రిప్లయితొలగించండి
  17. పాపమునకివి హేతువుల్ భరణి యందు
    క్రోధ లోభమోహములు సద్గుణము లండ్రు
    పుణ్య మార్జన కొరకునై భువినిజేయు
    కర్మ లన్నిటిని బుధులు వర్మ! వినుము

    రిప్లయితొలగించండి