26, డిసెంబర్ 2015, శనివారం

దత్తపది - 86 (అసి-కసి-నుసి-మసి)

కవిమిత్రులారా,
అసి - కసి - నుసి - మసి
పై పదాలను ఉపయోగించి సూర్యోదయాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

51 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. గురువుగారికి నమస్కారములు

   అసితమౌ ధ్వాంతము న్నంతమ్ము జేయగా
   .. ప్రాగ్దిశాద్రులలోన . ప్రభవమంది
   గగనాని కెగబ్రాకి కదులుచుండగ రవి
   యింపగు నభమున కెంపులమరె
   కమలాలు వికసించు సమయమాసన్నమై
   శోభించె సరసుల సోయగమ్ము
   మ్రాను సిగరమందు రవళించు ఖగములు
   స్వాగతించెనినుని సంతసమున

   కశ్యపాత్మజుండు కదలి వచ్చెననుచు
   తామసికన కాంతి దాళలేక
   తరలి వెడలె దాను మరలవత్తుననుచు
   పుడమి విరిసి మురిసె పూర్వసంధ్య

   తొలగించండి
 2. ఆంజనేయ శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘నభముకున్’ అనారాదు. ‘నభమునకున్’ అనడం సాధువు. ‘నభమున కెంపు లమరె’ అనండి. ‘తామసి+ఇక’ అన్నప్పుడు సంధి లేదు. ‘కన/కడు కాంతి దాళ(?)లేక’ అందామా?

  రిప్లయితొలగించండి
 3. మసి బూసి లోకమంతయు
  కసితోడను నిలచినట్టి కాళపు నిశినే
  అసిబోలిన కరములతో
  నుసిజేసి వెలుగులను యరుణుండిదె పంపెన్.

  రిప్లయితొలగించండి
 4. మిత్రులందఱకు నమస్సులు!

  సీ.
  అసితోత్పలములను వసివాడఁ జేయుచు
  .....బిసరుహమ్ములను వికసితులనుగఁ
  జేయుచు నుదయాద్రి చేతనమ్మిడఁగాను
  .....జవరాలి నునుసిగ్గు సరణి వెలిఁగి
  నమసిత లోకబాంధవుఁ డవై యెల్లఱ
  .....భక్తిప్రపత్తులఁ బఱఁగఁ గొనుచు
  ముల్లోకములకును త్వల్లాస్యపుంగాంతి
  .....దినదినమ్మును నిచ్చి దీవన లిడి

  గీ.
  వెలిఁగిపోయెడి ఖద్యోత! వీతిహోత్ర!
  తిగ్మఘృణి! రవి! భాస్కర! తిమిరవైరి!
  మిహిర! దినకర! ఖగ! వేధ! మిత్ర! సూర్య!
  పద్మబాంధవ! స్వర్మణి! ప్రణతు లివియె!!

  రిప్లయితొలగించండి
 5. గుండు మధుసూదన్ గారూ,
  అద్భుతమైన పూరణ. మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. మసిబో సినటుల మేఘము
  కసికసి గానుంట మిన్నుకానక రవియు
  న్నసిబో లుచునా మింటను
  నుసిజే సెను దనదుకాంతి నోముల రాజా!

  రిప్లయితొలగించండి
 7. అసి ధారాంశువు లగని వి
  కసితము లాయె కమలములు కనువిందుగ భా
  ను సితామల బింబమును భ్ర
  మసి శశియనగం గలువలు మండలి గనినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు

   తొలగించండి
 8. చీకటులు సమసి పోయె ప్రాచీ దిశను
  సిందురము వోలె చదల భాసించె నినుడు
  కసిమసగె హిమాంశుడు ఖరుని ఆసికి
  కలువ కొలనున ముకుళించె కరము మోడ్చి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   మొదటిపాదం చివర, మూడవపాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ప్రణామములు సవరించిన పద్యము
   చీకటి సమసి పోయె ప్రాచీదిశ ను
   సిందురమువోలె చదల భాసి౦చెనినుడు
   కసిమసగెను హిమాంశుడు.ఖరుని ఆసికి
   కలువ కొలనున ముకుళించె కరము మోడ్చి.

   తొలగించండి
  3. గురుదేవులకు ప్రణామములు సవరించిన పద్యము
   చీకటి సమసి పోయె ప్రాచీదిశ ను
   సిందురమువోలె చదల భాసి౦చెనినుడు
   కసిమసగెను హిమాంశుడు.ఖరుని ఆసికి
   కలువ కొలనున ముకుళించె కరము మోడ్చి.

   తొలగించండి
 9. కసి లేనట్టి కరంబులన్బరచి భూ కాంతా ప్రమోదుండు గా ,
  మసి తో నిండిన చిమ్మ చీకటుల సమ్మ్య క్కాన్తి దీపింప గా ,
  అసి ధారా వ్రతుడైన మానవుని రమ్యాన్తర్ వివేకంబుతో
  నుసి లో దాగిన నగ్నియై వెలిగె భానుండంత ప్రాగ్దిక్కునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   చక్కని పూరణ నందించారు. బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 10. అసివంటి కిరణములతో
  మసిగావించుచు మనుజుల,మార్తాండుడు తా
  నుసిగావించుచు తరువుల
  కసితోడ విసిగినజనుల కగుపించెనిలన్.
  కసి=చిరాకు

  రిప్లయితొలగించండి
 11. . అసియాడు కిరణాలు నుసిగొల్పగా రవి
  ------------------తిరుణాల నింగిలోతిరుగనెంచి|
  కసికందు చూపులా,కరుణించు శక్తిలా
  ---------లోకోన్నతంబెంచు పోకడెంచి
  మసిముట్టు జీవుల విసుగును మాన్పించి
  -----------ఆకసంబును కవి సాకునట్లు
  నుసిబెంచు కల్మష విసుగును మాన్పించ
  -------ఉదయాన,హృదయానకదలనెంచి
  తూర్పుదిశయందు సంధ్యనేమార్పుజేసి
  మసక చీకట్లు లోకాన మసలనీక
  సప్త వర్ణాలు కాంతిలో సాగుజేయు
  ఉదయభానుండు యుర్వికినుజ్వలుండు|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘చూపులా, శక్తిలా’ అనడం వ్యావహారికం. ‘చూపుగా, శక్తిగా’ అనండి. ‘కల్మష విసుగును’ అనడం దుష్టసమాసం. ‘కలుషాల విసుగును’ అనండి. ‘భానుడు+ఉర్వి’ అన్నపుడు యడాగమం రాదు. ‘భానుడీ యుర్వికి’ అనండి.

   తొలగించండి
 12. అసితము బట్టిన జగతిని
  మసినే తరలించి వేగ మహమును నింప
  న్నుసిజేయ నిశిని రవియె వి
  కసితము లయ్యె కొలకువున కంజాతములే!!!


  రిప్లయితొలగించండి
 13. అసిగొని వెల్గు రేఖలను సవితృడు వి
  కసిత మవ్వ జంపె చలి మాంద్య సుఖమిట్లు
  నుసినుసినవజేయనుదయించి సురుచిరము
  మసిగొనక సుందరముగాను మనము సతము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శశికాంత్ మల్లప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని ఛందస్సు అర్థం కాలేదు.

   తొలగించండి
  2. అసిగొ నుచువెల్గు రేఖల నుసవి తృడువి
   కసిత మవ్వజం పెచలిమాం ద్యసుఖ మిట్లు
   నుసిను సినవజే యనుదయిం చిసురు చిరము
   మసిగొ నకసుంద రముగాను మనము సతము

   తొలగించండి
 14. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  భాను డుదయి౦ప దిశల౦దు ప్రబలె కా౦తి

  విశ్రమి౦చెను సి రి చూ లి విడిచి ధనువు

  అసితమౌ నిశాభామ సిగ్గెసగ మలగె

  వికసితమయె జలజముల్ రవి కిరణమున

  { సి రి చూ లి = మన్మధుడు ;

  నిశాభామ = రాత్రి యను స్త్రీ ;

  మలగె=వెనుదిరిగెను }

  .....................................
  దత్తపది పూరణము తర్వాత.
  .....................................

  సూర్యోదయము పై సీసము వ్రాస్తున్నాను

  దయచేసి స్వీకరి౦చ ప్రార్థన ::----
  ............................................

  సుమశరమ్ములు వేసి సొలసి పోయిన యట్టి
  ..... మదను౦డు తా విశ్రమ౦బు జె౦దె
  బాలార్కు డుదయి౦చె ధ్వా౦తము నశియి౦చె
  ..... పా౦డుద్యుతి దిశలన్ ప్రబలె నౌర
  ద్విజకులారావ గీతిక * యుషోదయకాల
  ..... పుణ్యాహవచనపు స్ఫూర్తి నిచ్చె
  జనసమూహ౦బెల్ల దినచర్య గావి౦చి
  ..... " మేలు " గా౦చు కొరకు మేలుకొనిరి

  కాలమను ఘన ప్రవహణ గమనమ౦దు
  ప్రగతి తీరము జేరగ జగతి c బ్రజలు
  తరలుచున్నారు మిగుల నుత్కర్ష మొదవ
  లోక బా౦ధవ. వారల బ్రోవు మయ్య. !

  { మేలు=శుభము | ప్రవహణ గమనమ౦దు =

  నౌ కా యానము న౦దు }


  ..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ, దాని ననుసరించి చెప్పిన సీసము రెండూ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   సీసము రెండవపాదం ఉత్తరార్ధంలో గణదోషం. ‘దిశలన్’ అన్నచోట ‘దిశల’ అంటే సరి.

   తొలగించండి
 15. అసితాంగము గల తామసి
  కసితో నుసిచేసి తాను కబ ళిం చెనుగా
  ఘస్రపతి తూర్పున పొడిచి
  వెస కమలములు వికసిం చె వేడుక తోడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘ఘస్రపతి’ అన్నపుడు ప్రాస తప్పింది. ‘కబళించగ నా|కసమున ఘస్రపతి పొడిచె’ అనండి.

   తొలగించండి
  2. సమ్యు తాసమ్యుత ప్రాస : రేఫయుత సమ్యుక్తాక్షరముతో రేఫరహితమైన అదే అక్షరమునకు ప్రాస చెల్లును. " శ్రీకర - ఈ క్రియ "

   తొలగించండి
 16. అసితాంగము గల తామసి
  కసితో నుసిచేసి తాను కబ ళిం చెనుగా
  ఘస్రపతి , క ని నును సిగ్గున
  వెస కమలములు వికసిం చె వేడుక తోడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ తాజా పూరణలోను ప్రాసదోషం ఉంది.

   తొలగించండి
  2. సమ్యు తాసమ్యుత ప్రాస : రేఫయుత సమ్యుక్తాక్షరముతో రేఫరహితమైన అదే అక్షరమునకు ప్రాస చెల్లును. " శ్రీకర - ఈ క్రియ "

   తొలగించండి
  3. రెడ్డి గారూ,
   మీరు చెప్పేదాక నాకు సంయుతాసంయుత ప్రాస గుర్తుకు రాలేదు. ధన్యవాదాలు. ఈ ప్రాసభేదాన్ని గురించి సంక్షిప్తంగా క్రింద ఇస్తున్నాను. దీనిపై వివరమైన వ్యాసాన్ని రేపు ఇస్తాను.
   సంయుతాసంయుత ప్రాస -
   రేఫంతో కాని లకారంతో కాని సంయుతమై ఉన్న హల్లుతో, రేఫ లకారాలు లేని అదే హల్లుతో ప్రాస కూర్చుట. (అనగా ప్రాసాక్షరాలుగా క్ర-క, క్లే-క మొదలైనవి ప్రయోగించుట). దీనిని చాలామంది లాక్షణికులు ఒప్పుకొనలేదు.
   ఉదా.
   పాఁడి ద్రచ్చఁగ నిమ్ము నా*తండ్రి కృష్ణ (పాఁడి-తండ్రి)
   వేఁడుకొనియెద నందాఁకఁ* బండ్లు దినుము (వేఁడు-బండ్లు)
   దుండగపు చేష్టలును నోటి*గాండ్రతనము (దుండ-గాండ్ర)
   మెండుగాఁ జొచ్చె నీకు నై*దేండ్లు కనఁగ. (మెండు-దేండ్లు) (అప్పకవీయము. 3-315)

   తొలగించండి
 17. కసిగ మసిబోలు చీకటిన్ కరుగ జేయ
  నసిగ కిరణముల్ పృధివిని యలరజేసె
  నదిగొ భాస్కరు డేతెంచె నుదయ సంధ్య
  ను సిరులనిడు పంటల నుర్వి కొసగ

  రిప్లయితొలగించండి
 18. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  ధ న్య వా ద ము లు గు రు వు గా రూ

  నిత్య పదాభి వ౦దనములు

  రిప్లయితొలగించండి
 19. అసితశైలమునైన నభ్రదీధితులతో
  .........వెల్గించు కరముల పెద్దవేల్పు !
  కసిని పైబడెడి రక్కసులు మందేహుల
  .........నర్ఘ్యాయుధమ్ముల నణచు శౌరి!
  మసిచేసి శైత్యమున్ మారుపల్కగనీక
  .........పొలిమేర దాటించు పొడుపుకొండ!
  నునుసిగ్గు తెరదీసి కనుమని పద్మినిన్
  .........కవ్వించి సాగు భాస్కర ప్రియుండు!

  జీవజాలమ్మునెల్లను జేరదీసి
  తనదు చైతన్య దీప్తుల తనియజేయ
  పెట్టె ప్రాగ్దిశాభామకు బొట్టు నొసట
  కర్మసాక్షియౌ భానుండు ధర్మమూర్తి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మనోజ్ఞమూ, సర్వజనాహ్లాదకరమూ ఐన పూరణ చేసి మెప్పించారు. అభినందనలు.

   తొలగించండి
 20. రిప్లయిలు
  1. అసిఁబోయెను బెదరుచు తా
   మసి వేకరముల వెలుంగ మర్కుడు దివిపై
   నుసిఁ బుట్టిన కమలములు వి
   కసితమగుచు జగతికినొక గమనము దెలుపన్

   తొలగించండి
 21. మేనరసిచూడ పైపైనిమెరుగులేమి
  వికసితస్తన భారంబువేణిపెంపు
  పీనకటియున నుసిగపూలు పిరుదులసీరు
  లసీత కనుదోయి పడుచుల కమరె పల్లె dr.p.satyanarayana

  రిప్లయితొలగించండి
 22. మేనరసిచూడ పైపైనిమెరుగులేమి
  వికసితస్తన భారంబువేణిపెంపు
  పీనకటియున నుసిగపూలు పిరుదులసీరు
  లసీత కనుదోయి పడుచుల కమరె పల్లె dr.p.satyanarayana

  రిప్లయితొలగించండి