పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మారణాయుధాలు తయారుచేయు వారు చేసే ప్రార్థన వ్యర్థమున్న భావము తో వ్రాసాను. దక్షుడునిరీశ్వర యాగము చేసి యనుభవించాడు. సవరించిన పద్యము తిలకించగోర్తాను.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ జీవుల జన్మ మృత్యువులు చేసిన కర్మ ఫలంబులంద్రు,నన్ గావగ రావదేలనని కాలుని చెంతకు జేరు కార్యముల్ వేవిధ రీతులన్ బరపి , వేదికలందున భక్తునట్టు లా దైవము గాల్వ రాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
పావనమైన చిత్తమును భక్తియు శ్రద్ధయు లేక యించుకన్
రిప్లయితొలగించండిమోవిని దైవ కీర్తనయు ముద్దుగ పల్కక నొక్కసారియున్
కేవలమేదియో జనులకెల్లరకున్ తమ గొప్పచాటగన్
దైవముఁ గొల్వరా దనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పావనుడౌ పరాత్పరుని భక్తిగ కొల్చెడు మార్గ మెద్ది? స
రిప్లయితొలగించండిద్భావన తోడగొల్చి భగవంతు గటాక్షము నొందవచ్చు నా
కోవెల జేరి భూరిగను కోర్కెలగోరుచు స్వార్థచిత్తుడై
దైవము గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్ .
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భావము నందుభే దమట పాపము లందున దేలువా రలే
రిప్లయితొలగించండిదైవముఁ గొల్వరా దనుచు , ధర్మవిధుల్ వచియింతు రెల్లెడన్
జీవము పోయినన్ జపము జేయుచు భక్తిని వీడకుం డగా
కోవెల లందునన్ గనుము కోరగ కోర్కెల జాబితా లకై
పిన్నిగారూ నమస్కారం క్రింది విధంగా భావం సుస్పష్జటమే కదా
తొలగించండికావరమొంది ప్రేలుదురు కల్మషమే మదిగల్గువారలున్
దైవముఁ గొల్వరా దనుచు , ధర్మవిధుల్ వచియింతు రెల్లెడన్
జీవము పోయినన్ జపము జేయుచు భక్తిని వీడకుండగా
కోవెలలోని దేవుడిని గొల్చిన ముక్తిని తానొసంగనిన్.
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి వాక్యంలో క్రియాపదం లోపించింది. శశికాంత్ మల్లప్ప గారి సవరణ బాగుంది. లేదా “భావమునందు భేదమట పాపము జేయుచు చెప్పుచుందురే...” అనండి.
కావరమొంది ప్రేలుదురు కల్మషమే మదిగల్గు వారలున్
తొలగించండిదైవముఁ గొల్వరా దనుచు , ధర్మవిధుల్ వచియింతు రెల్లెడన్
జీవము పోయినన్ జపము జేయుచు భక్తిని వీడకుం డగా
కోవెల లోని దేవుడిని గొల్చిన ముక్తిని తానొసం గనిన్
శ్రీ శశికాంత్ మల్లప్ప గారికి మరియు గురుదేవులకు ధన్య వాదములు
కావలెనన్న కార్యములు కామిత సిద్ధిని గల్గజేయగన్
రిప్లయితొలగించండిచేవది యెంతగల్గినను చేయగ బూనుట పాడియౌను తా
దైవము గూడ చేయినిడ దప్పక వచ్చును గాన యూరకే
దైవముఁ గొల్వరా దనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
శశికాంత్ మల్లప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపావనమైన క్షేత్రముల భార్యయు పుత్రులు దోడురాగ సం
తొలగించండిభావిత దానధర్మములు పన్నుగ సల్పుచుఁ దమ్ము నిత్యముం
బ్రోవగ వేడనుత్తమము లోకవినాశన కాంక్షితంబుగన్
దైవముఁ గొల్వరా దనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పద్యంలో ఉత్తరార్ధంలో ‘ధర్మవిదులు లోకవినాశ కాంక్షతో దైవమును కొల్వరాదంటారు” అనడం యుక్తం కాదేమో అని అనుమానం.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మారణాయుధాలు తయారుచేయు వారు చేసే ప్రార్థన వ్యర్థమున్న భావము తో వ్రాసాను. దక్షుడునిరీశ్వర యాగము చేసి యనుభవించాడు. సవరించిన పద్యము తిలకించగోర్తాను.
తొలగించండిపావనమైన క్షేత్రముల భార్యయు పుత్రులు దోడురాగ సం
భావిత దానధర్మములు పన్నుగ సల్పుచుఁ దమ్ము నిత్యముం
బ్రోవగ వేడనుత్తమము క్రూర మనస్సున స్వార్థ చింతలన్
దైవముఁ గొల్వరా దనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్.
ఓహో... లోకవినాశహేతువులైన ఆయుధాల గురించా మీరు ప్రస్తావించింది? బాగుంది. సవరించిన పూరణ కూడా బాగుంది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిదైవము గొల్వరాదనుచుధర్మవిధుల్ వచియింతురెల్లెడన్
రిప్లయితొలగించండిదైవముగొల్వరాదనుట ధర్మవిరుధ్ధముగాదలంచుమా
దైవము, దల్లిదండ్రుల పదంబులుమ్రొక్కెడువారికెప్పుడు
న్నీవధన్గలుంగునట యిబ్బడిగామరి మోక్షముల్సదా
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్వయలోపం ఉన్నట్టుంది. ‘ఎప్పుడు న్నీవధన్గలుంగునట...’ ?
యీవసుధన్
రిప్లయితొలగించండి్
రిప్లయితొలగించండి. సమస్య
* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
భావ గృహమ్ము న౦దు రిపు వర్గము వాసము
. . . చేయు చు౦డ - దు
ర్భావమన : ప్రవృత్తియును స్వార్థపరత్వము
. . . ని౦డ - ధూర్త. భ
క్త్యా వృత వేషధారణము న౦ది నటి౦చు
. . . " మహాత్ము " లెల్ల. రా
దైవము గొల్వరాదనుచు ధర్మవిదుల్ ్
. . . వచియి౦తు రెల్లెడన్
్
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోవెలకేగి మొక్కుబడిఁగోరికలన్నియు తీరునంచు నా
రిప్లయితొలగించండిదైవముఁగొల్వరాదనుచు ధర్మవిధుల్ వచియింతు రెల్లెడన్
భావనమందు నిక్కముగ పంకజ నాభుని నిల్పి కొల్చినన్
పావనుడైన పింగళుడు, పద్మ మగండిడు మోక్షమార్గమున్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శైవము వైష్ణవమ్మనెడు శాఖల భేదము పెచ్చురిల్లుచున్
రిప్లయితొలగించండిగోవుల గాచి గోపికల కోకల దోచిన వెన్నదొంగ మీ
దేవుడనంచు శైవులును, తల్లని భూతిధరించి సర్పమున్
వావికి దాల్చు శంభుడని వైష్ణవు లిత్తరి వాదులాడుచున్
దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిభావమునన్ పరోపకృతి పట్టని బంధును, సంగరంబునన్
వావిరి కాని గుఱ్ఱమును వాడుట కూడదు, గాఢభక్తితో
కావలె నీ దయారసము కావుమటన్నను పల్కబోని యే
దైవముఁ గొల్వరా దనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేవుడు నిర్వికారుడని దేవుడు విశ్వమునంత నిండి తా
రిప్లయితొలగించండిజీవుల నేలుచుండునని చెప్పుచు నిత్యము చిత్తశుద్ధితో
భావమునందు గొల్చినను బాధలు తొల్గును శిల్ప రూపుడౌ
దైవముఁ గొల్వరా దనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిజీవుల జన్మ మృత్యువులు చేసిన కర్మ ఫలంబులంద్రు,నన్
గావగ రావదేలనని కాలుని చెంతకు జేరు కార్యముల్
వేవిధ రీతులన్ బరపి , వేదికలందున భక్తునట్టు లా
దైవము గాల్వ రాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కావరమందు నాశ పాశమున కాంక్షల పొందునమోసగించుచున్
రిప్లయితొలగించండిదైవము గొల్వరాదనుచు ధర్మవిదుల్వచియింతు రెల్లడన్
దేవుని సన్నిదానమునతీరిక చేతను భక్తిభావనా
ధ్యేయము నందు వేడుటయె ధర్మము కర్మను మాన్పుపద్దతౌ.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. సవరించండి.
ఈశ్వ రప్ప గారూ నాలుగవ పాదంలో ప్రాస తప్పింది.సరిచేయండి.
తొలగించండిజీవన ప్రక్రియల్ నిలువ చేటగు రీతిగ త్రవ్వకాల ప
రిప్లయితొలగించండిర్యావరణమ్ము ధ్వంసమగు నా ఖనిజమ్ముల దోచి, సంపదల్
కోవెల రాయడున్ కరుణఁ గూర్చగ వజ్రకిరీట సేవలన్
దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతురెల్లడన్!
రావలె క్రొత్త రాజ్యమని రచ్చల బండల నెక్కి ప్రేలుచున్
రిప్లయితొలగించండిపోవలె కేసియారనుచు పోకిరి కూతలు కూసిరోయుచున్
కేవల మెన్నికల్ గెలువ కేకలు పెట్టుచు మందిరమ్ములన్
దైవముఁ గొల్వరా దనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
పోవుచు దుడ్డు కోరుచును పొంకము మీరగ తుర్కభూమినిన్
రిప్లయితొలగించండిబావురుమంచు నాకలిని బాపుట కోసము మాటిమాటికిన్
గోవుల మాంసమున్ తినుచు గోకుల కృష్ణుని సంస్తుతించుచున్
దైవముఁ గొల్వరా దనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్