28, డిసెంబర్ 2015, సోమవారం

సమస్య – 1897 (యాగ మనిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యాగ మనినఁ గడు భయమ్ము గలిగె.

53 కామెంట్‌లు:

 1. కద్రువ శాపాన్ని తలచుకొన్న సర్పాలకు......

  తక్షకుని వలన పరీక్షిన్మహారాజు
  మిత్తినొందఁగ జనమేజయుండు
  చేటు నాగులకని చేయఁబోయెడి సర్ప
  యాగ మనినఁ గడు భయంబు గలిగె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనుల చేత వివిధ జన్నముల్ జరిపించి
   విత్తముల బడియరె వేదవిదులు
   ఋత్విజుండు గోరు నత్యాశగాంచినన్
   యాగమనినఁ గడు భయమ్ము గలిగె.

   పరిణయ మునకొకటి పదవి పొంద నొకటి
   సిరులు గోరి యొకటి వరుణుని కొరకంచు
   క్రతువు పేర జేయు ఖర్చులన్ గాంచిన
   యాగమనినఁ గడుభ యమ్ము గలిగె.

   జాతకాలు జెప్పి జన్నమున్ జరిపించి
   దండిగాను ధనము దండుకొనెడు
   అయ్యవారు జెప్పె నారోగ్య రక్షకై
   యాగమనినఁ గడు భయమ్ము గలిగె

   తొలగించండి
  2. గురువు గారికి నమస్కారమండీ....మీ పద్యం అద్భుతమండి.

   తొలగించండి
  3. ఆంజనేయ శర్మ గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో ‘బడయరె’ అనండి. మూడవపాదంలో యతి తప్పింది. ‘ఋత్విజుండు గోరు హెచ్చు సంభావనన్’ అందామా?
   రెండవపూరణ రెండవపాదంలో గణదోషం. ‘వరుణున కని’ అనండి.

   తొలగించండి
 2. తీర్థ యాత్ర లన్నితిరిగి దర్శించితి
  కాని కొన్నిమిగిలె గాంచ లేదు
  వయసు మీరె కాశి, పావన ప్ర
  యాగ మనినఁ గడు భయమ్ము గలిగె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   వృద్ధాప్యం, ప్రయాణక్లేశం అంటూ ప్రయాగను గురించిన మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.

   తొలగించండి
 3. వంట జేసిరింట వందమంది కొరకు
  చూడగ పదిమంది చేరివచ్చె
  ఆపదార్థ ములును యన్నమ్ము నేటికే
  యాగమనినఁ గడు భయమ్ము గలిగె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   ఆగమైన ఆహారపదార్థాలను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. జన్మ తిథిని చూచి జాతకఫలమును
  బట్టి చెప్పు చుంద్రు బలము లేదు
  గాన జేయు మన్న క్రతువు,ఖర్చువినగ
  యాగ మనిన కడు భయమ్ము గలిగె.

  రిప్లయితొలగించండి
 5. బదరికెడల వయసు భారమ్ముగాతోచె,
  వారణాసి యనగ వణుకు బుట్టె,
  వెంకటాచలమన సంకటమ్మె గయ ప్ర
  యాగ మనిన గడు భయమ్ము గలిగె !!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంద పీతాంబర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘వెడలు’ను ‘ఎడల’ అన్నారు. “బదరి కేగ/ బదరికిఁ జన” అనండి.

   తొలగించండి
 6. ప్రాణ భీతి లేని ప్రాణులఁ గంటిమే
  శృంగి శాప తప్త చిత్తు తక్ష
  కుని మనంబు నందు జనమేజయ కృతాహి
  యాగ మనినఁ గడు భయమ్ము గలిగె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. శృంగి శాప మొసగె శీఘ్రమే మరణింప
  సర్పకాటు చేత చచ్చె రాజు
  యతని సుతుడు జేయ హరిభుక్కు లకు నెల్ల
  యాగ మనిన గడు భయమ్ము గలిగె.

  రిప్లయితొలగించండి
 8. శృంగి శాప మొసగె శీఘ్రమే మరణింప
  సర్పకాటు చేత చచ్చె రాజు
  యతని సుతుడు జేయ హరిభుక్కు లకు నెల్ల
  యాగ మనిన గడు భయమ్ము గలిగె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘రాజు+అతని’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చచ్చె నృపతి| యతని...’ అనండి.

   తొలగించండి
 9. సిరుల గూర్చి సతము క్షేమమిచ్చుచునుండి
  యజ్ఞ యాగ చయము యశము నిచ్చు
  లేశమైన ధనము లేనట్టి నరునకు
  యాగ మనిన కడు భయమ్ము కలిగె.

  రిప్లయితొలగించండి
 10. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. కేసియారు ప్రజలకే మేలుఁ గూర్చఁగ
  చేయుచుంటి ననఁగఁ చేష్ట లుడిగి
  యన్యపక్ష నాయకాదులకు నయుత
  యాగ మనినఁ గడు భయంబు గలిగె.

  రిప్లయితొలగించండి
 12. కలిమి లేని వాడు క్రతువుల నేరీతి
  యాచరించ గలుగు నవనియందు
  పెరుగు చున్న ధరలు పెనుభార మయినంత
  యాగ మనినఁ గడు భయమ్ము గలిగె

  రిప్లయితొలగించండి
 13. గురువుగారూ మీ పూరణ అత్యంతాద్భుతమండి....

  రిప్లయితొలగించండి
 14. సంబరమ్ము తోడ కుంభమేళాజూడ
  మకర రాశి నరవి మసలు వేళ
  జరిగె తోపులాట జనసమూహమున ప్ర
  యాగమనిన కడు భయమ్ము గలిగె !!!

  రిప్లయితొలగించండి
 15. వ్యాపకము ముగిసిన, బ్యాంకులోనధికారి
  యాగ మనినఁ గడు భయమ్ము గలిగె
  కానిదైన నోటు కట్టిన డబ్బులో
  నుండెనేమొ యనెడు నూహ రాగ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. క్రతువుఖర్చు,శ్రమయు ప్రజలు భరించంగ
  యాగకర్త మంత్రి యతని సతీయు
  సొమ్ములొకరి వైన సోకు సేయు నొకడు
  యాగమనిన కడు భయమ్ము గలిగె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. మఖము నాశ నంబు మారీచుచేయగ
  తెలిసి నాదు మనసు తెలివివోయి
  యాగ మనగ గడుభ యమ్శు కలిగెనార్య!
  ప్రజల మేలు కొరకు వలయు చేయ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘మారీచు’ అని డుప్రత్యయం లేకుండా వ్రాశారు. ‘మఖము నాశనంబు మారీచుడే చేయ’ అనండి.

   తొలగించండి
 18. నాటు సారాయి త్రాగుచు నీటుగాను
  జరుపుకొనుచుంటి పండుగల్ కరము తృప్తి
  కడురసాయనముల్ చేర్చు కతన చక్ర
  యాగమన్న కడుభయమ్ముగలిగె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   పూరణ బాగుంది. కాని సమస్య ఆటవెలదిలో ఉంటే మీరు తేటగీతి వ్రాశారు. మీ పద్యానికి నా సవరణ.....
   నీటుగాను త్రాగి నాటు సారాయిని
   జరుప పండుగలను కరము తృప్తి
   కడు రసాయనములు కలియుటచే చక్ర
   యాగమన్నఁ గడు భయమ్ము గలిగె.

   తొలగించండి
 19. సమస్య చింతలేక చంద్రశేఖరు డెంచెను
  యాగమన్న కడుభయమ్ముగలిగె
  ననకమనసుజెప్ప| యాగము సాగించె
  ముఖ్య మంత్రి మనకుముఖ్య మనుచు.
  2.యజ్ఞ యాగమన్న ,నధిక తపసుజేయ?
  ఇంద్రునిమదియందు యిమిడియుండు
  యాగమనిన కడుభయమ్ము గలిగెనట
  పదవి వీడుటన్న సదరుదలచి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘మదియందు నిమిడియుండు’ అనండి.

   తొలగించండి
 20. అల్పులైనయట్టి యవనీశులకుఁ దమ
  శత్రురాజు చెలఁగి క్షాత్రధర్మ
  మనుసరించి చేయునట్టి యా హయమేధ
  యాగ మనినఁ గడు భయంబు గలిగె.

  రిప్లయితొలగించండి
 21. బొజ్జ నింపు కొనుచు భోగము లొందక
  తిండి లేక గుండ పిండి యగుచు
  పొగను మించి మంట సెగలను గుప్పించు
  యాగ మనినఁ గడు భయమ్ము గలిగె.

  రిప్లయితొలగించండి
 22. ఆగ మెంతొ జేసి ఆంద్రను విభజింప
  నాగ మింత నైన నాగకుండె
  యాగములను తిట్టు నాగమున్ మొదలయ్యె
  యాగ మనిన కడు భయమ్ము కలిగె.

  రిప్లయితొలగించండి
 23. ధనికొండ రవిప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. గురువుగారికి, పెద్దలందరికీ నమస్కారం. జనహితం కోసమని మొదలయిన యాగంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని 'ఆగం' అయినందువల్ల చండీ యాగమంటే భయం కలిగింది అన్న అర్ధంలో రాసిన పూరణ ఇది. పరిశీలించగలరు. ధన్యవాదాలు.
  ఆ.వె:

  జనులహితముకోరిజన్నముసలుపగ
  విపదనొకటిజరిగెవింతగనూ
  అగ్నికీలచెలగియాగమయినచండి
  యాగమనినగడుభయముగల్గె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేదుల సుభద్ర గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘విపద యొకటి’, ‘వింతగాను’ అనండి.

   తొలగించండి
 25. హిందువులుగ బుట్టి హిందుధర్మమును ద్వే
  షించు వారి కెంత హింస గలిగె !
  యాగముల నొనర్ప నది సహింతురె వారు
  యాగ మనగ కడు భయమ్ము కలిగె

  రిప్లయితొలగించండి
 26. పర్యవరణమంతపాడుదుమ్ముననిండి
  దుమ్ము దూళి పడక తుమ్ము లొచ్చె
  పొగకు కళ్ళ వెంట సెగలుకమ్ముచునుండ
  యాగమనినగడుభయముగల్గె

  రిప్లయితొలగించండి