10, డిసెంబర్ 2015, గురువారం

సమస్య - 1880 (రాధేయుని శత్రువు....)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్. 

21 కామెంట్‌లు:

  1. వేధించక తననేమియు
    బాధించక స్నేహమనెడు బంధముతో దు
    ర్యోధనుడే చెరపుటచే
    రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్

    రిప్లయితొలగించండి
  2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి పూరణ...

    శ్రీధరుఁడు మెచ్చినను దు
    ర్యోధనుని చెలిమి వధించె యుద్ధమునందున్
    దా ధర్మము విడి నడుపగ
    రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్.

    రిప్లయితొలగించండి
  3. సాధారణుడైన తనకున
    సాధారణ గౌరవ మొసంగిసఖ్యత జూపన్
    నా దూరాలోచనతో
    రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్.

    రిప్లయితొలగించండి
  4. సాధారణుడైన తనకున
    సాధారణ గౌరవ మొసంగిసఖ్యత జూపన్
    నా దూరాలోచనతో
    రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్.

    రిప్లయితొలగించండి
  5. నాధా! వింటివె యీయది
    రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్
    రాధేయుడు కురురాజులు
    నీధరణిన్నేలిరార్య! యిచ్చను జెలిమిన్

    రిప్లయితొలగించండి
  6. మాధవుడు తెలిపె "కర్ణా!
    రాధేయుడ కావు, కుంతి ,రవికి సుతుడ వై
    ఆధర్మజు కన్నవ"గుట
    రాధేయుని శత్రువు కురు రాజనిరి బుధుల్

    రిప్లయితొలగించండి
  7. గురువు గారికి నమస్కారములు నిన్న దశాహం అనుకుంటాను...పూర్తిగా నిమగ్నం కావలసిన పిత్రుయజ్ఞం మన జన్మకు సార్థకత నొసగే దివ్యయజ్ఞం....

    ఛేదింప శత్రు బలము సు
    యోధను డే పన్నె వలయు యుక్తిగ, గన నా
    యోధుని దుష్టుని చేయన్
    రాధేయుని శత్రువు కురు రాజనిరి బుధుల్

    రిప్లయితొలగించండి
  8. మాధవసఖుండు పార్ధుడు
    రాధేయుని శత్రువు, కురురాజనిరి బుధుల్
    యాథార్ధ్యము వచియింపగ
    రాధేయునిసహచరుండు రారాజుగదా!!!

    రిప్లయితొలగించండి
  9. మాధవుడు తెలిపె "కర్ణా!
    రాధేయుడ కావు, కుంతి ,రవికి సుతుడ వై
    ఆధర్మజు కన్నవ"గుట
    రాధేయుని శత్రువు కురు రాజనిరి బుధుల్

    రిప్లయితొలగించండి
  10. ఈధరఁ గుంతీ సూనుం
    డా ధర్మజునకను బెద్ద యాదిత్యజుడున్
    బాధిత దుష్టా నుచరుడు
    రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆధర్మున కనుజుడు నై
      యీ ధర్మతనయున కన్న యీప్సిత వరదా
      తాధమసహవాసార్తుడు
      రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్.

      తొలగించండి
    2. నా శతక పద్యము:
      కాపురుషుల సాంగత్యము
      వాపును సద్గుణము లెల్ల భానుసుతు డటన్
      పాపిగ మారె సుయోధను
      దాపున జని పోచిరాజతనయా వినుమా

      తొలగించండి
  11. . రాధేయుని మిత్రత్వం
    బాధారపు యుద్దమందు-నసువులు బాయన్
    శోధించి చదివి దెలిపిరి
    రాధేయుని శత్రువు-కురురాజనిరి బుధుల్

    రిప్లయితొలగించండి
  12. వాదన లెందుకు వినుమిట
    యద్దాన గుణుని దురాత్ముడనుచు పిలువ దు
    ర్యోధను డే హేతువనుచు
    రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్

    రిప్లయితొలగించండి
  13. నిన్నటి పూరణ:
    సమయోచిత నిర్ణయమని
    'నమో' పిలువ 'బాబు' వెంట నడచిన ఫలమై
    తమవారలు మంత్రులగుచుఁ
    'గమలము' వికసిసించెఁ 'జంద్ర' కాంతులు సోకన్!

    రిప్లయితొలగించండి
  14. .ఆధర్షంబగు తీర్పిది {ఆధర్షం=తిరస్కారం}
    రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్
    సాధారణ సంస్కృతిలో
    బాధించెడి మాటయగును భారత మందున్|




    రిప్లయితొలగించండి
  15. సమస్య
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మధ్యాక్కర

    రాధేయునికి శత్రువు కురు ......... రాజనిరి బుధుల్ నిజమిది
    యోధుడు కానీను డని , సు
    ........... యోధను డాతని చెలిమి
    సాధి౦చి , బలిచేసె తనదు
    ........... స్వార్థమునకు | మ
    హా ధర్మపరుడు దాన క్రి
    ......... యా శీలుడు రవి సుతు౦డు ! !







    ి

    రిప్లయితొలగించండి
  16. ఈ ధారుణి తానేల న
    సాధారణ ఘటన లెన్నొ సమకూర్చంగన్
    శోధనకు హితుడె , కాడా
    రాధేయుని శత్రువు , కురురా జనిరి బుధుల్.

    రాధా తనయుడు గాదని
    శోధించగ గూఢచారి , శూరుని కర్లున్
    బాధా తప్తుని జేసెన్ ;
    రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్.

    యోధుడు కర్ణుడు నిజముగ
    రాధేయుడు గాడటంచు గ్రహియించిన దు
    ర్యొధనుని నటన జూడగ
    రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్.

    రిప్లయితొలగించండి
  17. తా దురమున విజయమ్మును
    సాధించ కురుపతి సలిపె సఖ్యత, నికృతిన్
    పాథుని పుత్రుని తోడను
    రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్

    రిప్లయితొలగించండి
  18. వేధించెను రాజ్యమొసగి
    బాధించెను నెయ్యమునను బహువిధములుగా
    సాధించెను చావు కడకు...
    రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్ :)

    రిప్లయితొలగించండి