22, డిసెంబర్ 2015, మంగళవారం

పద్యరచన - 1125

కవిమిత్రులారా,
పైచిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

28 కామెంట్‌లు:

  1. గురువుగారికి నమస్కారములు ....చిత్రానికనువైన పద్యము చాలారోజులతర్వాత ఇచ్చారు సంతోషం

    చింత కాయ జూడ నెంతవానికిగూడ
    నీరునూరునోట నిశ్చయమ్ము
    పులుపు చారు కదియె పులియోర యందున
    వంట శాల లోన ప్రముఖ మదియె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘నీరు నోట నూరు’ అనండి. బాగుంటుంది.

      తొలగించండి
  2. చింతిం చవలదు పెరడున
    చింతయె మనకున్న చాలు క్షేమం కరమౌ
    చింతలు బాపును నిజమట
    వింతగు లాభము లుమెండు వేయి విధమ్ముల్

    రిప్లయితొలగించండి
  3. చింత చెట్టు చూడ సంతసంబును హెచ్చు
    చిగురు,కాయ,పండు చేవ యుండు
    తినగ వలయు ననెడి తీవ్రమౌ కోరిక
    యధిక మగుచు నుండు నంతరాన.
    2.పేద సాదు జనుల కాధరవగుచుండు
    మితము గాను తిన్న హితము కల్గు
    పథ్యమగును చింతపచ్చడి నోటికి
    జబ్బు తగ్గుచుండు చవియు హెచ్చు.

    రిప్లయితొలగించండి
  4. అన్నయ్యగారూ నమస్తే
    రెండవపద్యం మొదటి పాదంలో ఆధరువు కాదు ఆదరువుగమనించ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  5. అన్నయ్యగారూ నమస్తే
    రెండవపద్యం మొదటి పాదంలో ఆధరువు కాదు ఆదరువుగమనించ ప్రార్థన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. చింతకాయలవ్వి వింతయేమున్నదో
    చిత్రమందుజూసిచెప్పగలమె
    పాతచింతకాయ పచ్చడౌటెపుడంచు
    నాత్ర పడెడు పాత్ర మాత్రమవక

    రిప్లయితొలగించండి
  7. చాల గొప్ప గాను చవులూరు రుచిలోన
    గొప్ప గుత్తి లాగు గోచరించు
    నుప్పునంజుకొనక నొప్పుగా పైనున్న
    మిసిమి చింతకాయ మెసవలేను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శశికాంత్ మల్లప్ప గారూ,
      మీ రెండవపద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. చింత చెట్టును వ్రేలాడే చిత్ర మందు
    చింత కాయల గుత్తులు చిత్ర ముగను
    కోసికొని రమ్ము పచ్చడి కొఱకు గాను
    పప్పు లోకూడ వేతును బాల ! వెళ్ళు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘వ్రేలాడే’ అనడం వ్యావహారికం, పైగా గణదోషం. ‘వ్రేలాడె’ అనండి.

      తొలగించండి
  9. చింత కొమ్మలందు సింగార మొలుకుచున్
    గుర్విణీల మదిని కొల్లగొట్టు
    అమ్మ వంటలందు కమ్మదనముగూర్చు
    నవని జనుల కదియు నౌషధమ్ము

    రిప్లయితొలగించండి
  10. చింత చిగురు తోడ చింతకాయలనిచ్చు
    చింత పండు నిచ్చి చింత దీర్చు
    చింత గింజలొసగి చివరకు మానిచ్చి
    పరుల కొరకె చింత ప్రాణ మొసగు!!!


    పప్పు జేయ చిగురు గొప్పగా నుండును
    పచ్చడైన నదియె పరమరుచియు
    చారుకూరలందు తీరుగా నొదిగెడు
    చింత లేని యిరవు క్షితిని గలదె ?!!!



    రిప్లయితొలగించండి
  11. మనోజ్ఞమైన యే చిత్రాని కైన నన్వయ మగునట్లుగా పూరణ:

    పత్రమున చిత్రము కడు వి
    చిత్రము గన్నేత్రములకు చిత్తంబునకున్
    చిత్రానుభూతి నిచ్చి ప
    విత్రానందము నొసంగె విస్తారముగన్

    ఆహా! నోరూరించు చింత కాయలవి:

    చూలాలుల కిష్టం బట
    మేలగు తీయని పులుపుల మేళపు రుచులన్
    వీలుగ గింజల తోడన్
    బాలిక లాడుదురు గూడి పరమప్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. చింతగ కాయలన్నియునుచెట్టుకు జేరెడి పట్టుయేలనో?”
    “కొంతయు జీవజాలములకోర్కెలు దీర్చుచు|కొమ్మనమ్మగా
    పంతము మాను బిడ్డలగ పండన కాయల గాలినూప? నా
    ద్యంతముహాయి|మాయదని దర్పము నందునజూపుటందుకే”.
    2చింతకాయపులుపు|చీదరించిననోరు
    పళ్ళ నాలుకందు పచ్చడగుచు
    గర్భ వతులకోర్కె కంతులవలె దీర్చి
    చింత మాన్పగలుగు చింత గుత్తి|
    3.పులుపుకు పుట్టినిల్లు గన వొంకర టింకరకాయలన్నియున్
    తలపు పరోప కారమును దత్తత చే చిగురించుచింతగా
    వలపును బెంచు వాల్జడల వన్నెయుగాకనుగర్భ ధారణా
    మలపునుమందుగా మలచిమౌని తపస్సుగకొమ్మ నిల్చెగా|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యాలఖండిక బాగున్నది. అభినందనలు.
      కొన్ని టైపాట్లున్నాయి. ‘వంకర’ను వొంకర అన్నారు.

      తొలగించండి
  13. చింతకాయ గనిన వింతగా నోటిలో
    నీరమూరు చుండు నిశ్చయముగ
    చిన్నతనము నందు చింతకాయల గోయ
    చెట్టులెక్కినాము పట్టు బట్టి

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ఏడాదంతయు చిగురో!
    కాడకు పూతయొ! గనంగ కాయో! పండో!
    వేడుకఁ జేయగ 'చింతకు'
    చూడగ తను పుట్టినిల్లు సుకరమ్మెటులౌ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి