12, డిసెంబర్ 2015, శనివారం

పద్యరచన - 1080

కవిమిత్రులారా,
“కటకట యెంతమాట ననుఁ గాదని యాతఁడు...”
ఇది పద్యప్రారంభం. 
దీనికి కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.

16 కామెంట్‌లు:

  1. కటకట యెంతమాట నను గాదని యాతడు వీడిపోవునే?
    కటువుగ మాటలాడి మదిగాయము జేయగ నేల నమ్ముడీ
    యెటుజన నేరడా నరుడు యెందుకు మీకు భయమ్ము భర్తగా
    చిటికెన వ్రేలు పట్టితిని జీవిత మంతయు దోడునుండడే!
    ( ఉండునని భావం )

    రిప్లయితొలగించండి
  2. కటకట యెంతమాట ననుఁ గాదని యాతఁడు మాయ జేసినన్
    పటుతర మైనసాక్ష్యమది ప్రాపున నిల్చిన తేల కుండునే
    కటువగు నీమనిష్టలను గాదని వేరొక మార్గ మందున
    న్నిటునటు బోవనెంచినను నీసుడుగాంచి చలించ కుండునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘నీమనిష్ట’ లనడం దోషం.

      తొలగించండి
  3. కటకట యెంతమాట ననుగాదని యాతడు వంచనంబునన్
    చటపట పెళ్లిజేసుకొని సంపదనాశకు మోసగించుటా?
    విటులుగ విర్రవీగుటయ? విద్య వివేకము నున్న లాభమా?
    కటకట మందు జేర్చవలె కట్న పిశాచుల నాశనంబుకై


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘సంపదనాశకు’...?

      తొలగించండి
  4. కటకట యెంతమాట ననుగాదనియాతడు వీడునే రమన్
    పటుతరమైనబంధము నుబాయుట నాయముగాగ దోచెనే?
    కటువుగ నేలయైతివి? బకాసురుమేనమరందివే యిలన్ ?
    చిటికెన వ్రేలితో నిపుడుచీల్తునుగాహృదయంబునీయదిన్

    రిప్లయితొలగించండి
  5. కటకట యెంతమాట ననుఁ గాదని యాతఁడు నొక్క మానవున్
    చటుల మనంబు తోడ నొక శౌర్యవిహీనుని రాజ్యదూరునిన్
    పిటుకని రాము దా శరణు వేడె విభీషణుడంచు నెంచె న
    క్కట దశకంఠు డెట్లెఱుగు ఖండిత శాత్రవ గాత్రు రాఘవున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. కటకట యెంతమాట ననుఁగాదని యాతడు చేయడేపనిన్
    కుటిలమెరుంగనట్టి కడు కూర్మి సహాయుడు నాకు సర్వదా
    చటులమనస్సుతోడుతను సత్యపథమ్మును వీడ డెప్పుడున్
    పటుతరమైన విజ్ఞతయు పావన బావముతో మెలంగెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. కటకట యెంతమాట ననుఁ గాదని యాతఁడు మాయలేడినై
    యటమట బెట్ట బొమ్మనెడి నా రఘురాముని నేమిచేయుదున్
    తటతటలాడు నా యెడద తప్పదు రాముని బాణఘాత మీ
    పటుతర దేహలోభ మిక భ్రాంతి కదా నను డాసె మృత్యువే.

    రిప్లయితొలగించండి
  8. కటకట యెంతమాట ననుఁ గాదని యాతఁడు వీడిపోయెనే
    చిటపట లాడుచుండి తను చిందులు ద్రొక్కి విశిష్ట హోదకై...
    పటపట ఛిన్న మౌను తన పచ్చని టెక్కెము తుంటతుంటగా
    గుటగుట నీళ్ళు ద్రాగు తను గుండెలు బాదుచు నెన్నికందునన్ :)

    రిప్లయితొలగించండి
  9. కటకట యెంతమాట! ననుఁ గాదని యాతఁడు ప్రక్కనింటిదౌ
    బటువగు భామ నొల్లుచును బంగరు బొమ్మని కన్నుగొట్టగా
    కిటికిని మూసి వేయుచును క్రిందను త్రోయుచు వెల్లకిల్లగా
    పటపట పండ్లు రాలగను పట్టుకు కొట్టితి బండఱాతితో

    రిప్లయితొలగించండి