8, డిసెంబర్ 2015, మంగళవారం

సమస్య - 1878 (చనుబాలను తండ్రి తీయ...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
చనుబాలను తండ్రి తీయ సంతసమందెన్. 
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో) 

52 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు

    వనమందున నడయాడుచు
    చినపాపయె ముళ్ళ పొదన చిక్కుకు పోవన్
    తనయ భయమ్మున విలపిం
    చను, బాలను తండ్రి తీయ సంతస మందెన్

    రిప్లయితొలగించండి
  2. అనువగు నిలయమ్మనుకొని
    చనుఁ , బాలను తండ్రి తీయ సంతస మందెన్
    కనులకు పండుగ జేసెడి
    ఘనమగు పుత్రికను ప్రీతి కౌగిలి జేర్చెన్

    రిప్లయితొలగించండి
  3. తన బిడ్డ బోరు బావినఁ
    గనిపించక జారె ననుచుఁ గనుగొని, చేదన్
    గొని కొక్కె మమర లోనకుఁ
    జనుఁ బాలను తండ్రి తీయ సంతస మందెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మరో ప్రయత్నము పరిశీలించ మనవి.

      కనులెర్ర బారెనన సుత
      చినగిన్నెకు తల్లితీసి సిద్ధముఁ జేయన్
      కొనగోట కన్నులనిడన్
      చనుబాలను తండ్రి తీయ సంతసమందెన్!

      తొలగించండి
  4. తినుటకురమ్మను కోపిం
    చను బాలను తండ్రిదీయ సంతసమందెన్
    అనుకొన్న దాటవస్తువు
    కొనిబెట్టగ కొంతశాంతి కూతురు కబ్బెన్
    2.తినగల తిండికి కండయు
    అనుదినమున పాలుమంచి ఆరోగ్యంబే
    కొనిదెచ్చినవవి తాపిం
    చనుఁబాలను తండ్రిదీయ సంతస మందెన్


    రిప్లయితొలగించండి
  5. పెనుకేకలనూయలనే
    తనకాలితొ తన్నియేడ్వ తల్లియె స్నాన
    మ్మునకేగగ వడినాడిం
    చను, బాలను తండ్రి తీయ సంతసమందెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. తన కాలిని తన్ని... అని తృతీయార్థంలో ద్వితీయను ప్రయోగించవచ్చు.

      తొలగించండి
    2. మాస్టరుగారూ ! ధన్యవాదములు.


      పెనుకేకలనూయలనే
      తనకాలిని తన్నియేడ్వ తల్లియె స్నాన
      మ్మునకేగగ వడినాడిం
      చను, బాలను తండ్రి తీయ సంతసమందెన్.

      తొలగించండి
  6. వినకమ్మ నిద్ర బొమ్మన
    తననెత్తుక బొమ్మననుచు తండ్రిని గోరన్
    వెనువెంట బయట నాడిం
    చను, బాలను తండ్రి తీయ సంతసమందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. మునిమాపున గోవులు యిం
    డ్లను జేరెను.సాలలోన ద్రాగి కుడితి దూ
    డను నాక,సుతుడు,ఆలకు
    చను బాలను తండ్రి తీయ సంతస మందెన్

    రిప్లయితొలగించండి
  8. జననియె కార్యా లయమును
    జనినప్పుడు నూయలందు శయనించిన యా
    చినకూతురు యే విలపిం
    చను బాలను తండ్రితీయ సంతస మొందెన్

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. తనయుం డొక్కనినె కరం
      బనురక్తిం జూచు భర్త పరితాపమునన్
      జననిని వెతకుచు నిటునటు
      చను బాలను తండ్రి తీయ సంతసమందెన్.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. పనిలో పాపను చూచుట
    తను మరచిన తరుణమందు తల్లిని జూడన్
    గునగున ప్రాకుచు రోడ్డుకు
    చను, బాలను దండ్రిదీయ సంతసమందెన్!!!

    రిప్లయితొలగించండి
  11. తను విిడెను తలి, తన ప్రియ
    తనయను పోషించ బెంచె తానొక గోవున్
    అను దినమున సుత దేనువు
    చనుబాలను తండ్రి తీయ సంతసమందెన్.

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. చనుబాలను తండ్రి తీయ సంతసమందెన్.


      తనువును విడె తలి, తన ప్రియ
      తనయను పోషించ బెంచె తండ్రియె గోవున్
      అను దినమున సుత ధేనువు
      చనుబాలను తండ్రి తీయ సంతసమందెన్.


      తొలగించండి
    2. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    కనుమిదె బ౦గరు హారము
    కొని తెచ్చితి నమ్మ నీకు కొనుమని , యె౦తో
    చనువున తన దరికి , యథే
    ఛ్ఛను బాలను త౦డ్రి తీయ... స౦తస మ౦దెన్ ! !

    ................. ................................... ....

    { తీయు = దగ్గరకు తీసుకొను ;

    బాలను త౦డ్రి తీయ. = అమ్మాయిని అనగా

    కూతురును దగ్గరకు తీసుకొనగా }

    రిప్లయితొలగించండి
  14. పనివాడు రాడనుచు సుత
    వినిపించిన గోవుపాలు పితుకగ గోశా
    లనరిగి హరికి నివేదిం
    చనుఁ బాలను తండ్రి తీయ సంతసమందెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. రైతు కుటుంబాలలో సమయానికి యిల్లాలు పాలు తియ్యకపోతే గేదెలు గోలగోల చేస్తాయి.
    పనిమీద చనిన జనని స
    ద నమ్మునకు చేరకున్న తగుసమయములో
    నె నుపసరము కరము తపిం
    చను, బాలను తండ్రితీయ సంతస మందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. పనిలో మునిగిన తల్లియె
    తనయకు గల బాధనాప తలమున్కలవన్
    కనుగొని జని సముదాయిం
    చను , బాలను తండ్రి తీయ సంతసమందెన్.

    రిప్లయితొలగించండి
  17. వినయా! కంటికి వాడుము
    చనుబాలను, తండ్రితీయ సంతసమందెన్
    తనయనుగుంబిడ్డనునపు
    డనురాగముతోడ పిలిచి యాడించంగన్

    రిప్లయితొలగించండి
  18. అనువైన చోటు గానక
    చను బాలను తండ్రి తీయసంతసమందెన్
    అనువుగ జూచుచు నచ్చో
    కనుగలిగి నడువ మనుచును కమ్మగ పలికెన్.

    రిప్లయితొలగించండి
  19. అనువైన చోటు గానక
    చను బాలను తండ్రి తీయసంతసమందెన్
    అనువుగ జూచుచు నచ్చో
    కనుగలిగి నడువ మనుచును కమ్మగ పలికెన్.

    రిప్లయితొలగించండి
  20. sir, the riddle is in poor taste. Scholars providing answers to such lines perplexes me. Better to avoid such innuendos.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. G K K గారికి నమస్కారం . సమస్యాపూరణలలో ఇలాంటి సమస్యలు ఇవ్వబడటం చాలా సహజమే. ఈ సమస్యని నేను యథాతథం గానూ , పదాలను వేరు విధం గా అన్వయించి కూడా ఎలాంటి అశ్లీలత లేకుండా పూరించాను. అలాగే ఇతరులు కూడా.ఒక సమస్య పైకి అశ్లీలంగా , విచిత్రం గా కనిపించటం పూరన లో సమంజసం గా ఉండటం సమస్యాపూరన లోని కళ . బహుశః మీకు సమస్యాపూరణల పట్ల అంతగా అవగాహన లేకపోవటం వలన ఏదో విచిత్రం గా అనిపించ వచ్చు.ప్రంబంధాలలో కనిపించే శృంగారం తో పోలిస్తే ఈ సమస్యా పూరణలలో ఉండేది ఎంత ?

      తొలగించండి
  21. జి.కె.కె. గారూ, (గొట్టిముక్కల కృష్ణమూర్తి గారు కాదు కదా!)
    మీ సూచనను ధన్యవాదాలతో స్వీకరిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  22. మిత్రులందఱకు నమస్సులు!

    అనారోగ్య కారణమున కొంతకాలము మన బ్లాగునకు దూరము కావలసి వచ్చినది. మన్నింపుఁడు.

    (కుమార్తె మనవి వినిన తండ్రి కృత్యము)

    "మనవి యిదె జనక! దూడయె
    చనుబాలనుఁ ద్రావకుండెఁ జని పిండు" మనన్
    మనవి విని చనియు నావుల
    చనుబాలను తండ్రి తీయ సంతసమందెన్!

    మఱియొక పూరణము:
    (సరస్సులో మునిఁగిపోవుచున్న బాలికను రక్షించుమనిన కుమార్తె కోరికను మన్నించిన తండ్రి కృత్యము)
    "జనకా మునుఁగుచు నుండెను
    చినబాలిక సరసిలోన! శీఘ్రమె యటకున్
    జని తీయు" మనఁగ, మునుఁగం
    జను బాలను తండ్రి తీయ, సంతసమందెన్!

    రిప్లయితొలగించండి
  23. గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. ధనికొండ రవిప్రసాద్ గారి పూరణములు.....

    ఘనమగు నొక విప్లవమున
    తన తండ్రియె ధరణిన బడి దాహమ్మనగా
    తన స్తన్య మిచ్చె కూతురు
    చనుబాలను తండ్రి తీయ సంతసమందెన్
    (ఇది ఫ్రెంచ్ విప్లవమో మరో శ్రామికవిప్లవమో గుర్తు లేదు కానీ ఆ పోరాటం లో తండ్రి స్పృహతప్పి పడిపోగా నీరు లభించని సమయం లో కూతురు తన స్తనాన్ని ఆ తండ్రికి అందించి ప్రాణం కాపాడింది. ఇది ఒక చిత్రకారుడు బొమ్మ కూడా వేశాడు.)

    తన ముద్దు బిడ్డ ప్రాకుచు
    తన పెరటిన నూతి దెసకు తరలగ నూహిం
    పని రీతి తండ్రి వచ్చ్హెను
    చను బాలను తండ్రి తీయ సంతస మందెన్.

    తన తండ్రి కంటి బాధకు
    తన నడుగగ సంశయింప తల్లి యడుగగన్
    తన యుగ్గుగిన్నె నుంచిన
    చనుబాలను తండ్రి తీయ సంతస మందెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధనికొండ రవిప్రసాద్ గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. పనిలో మగ్నమ్మౌచును
    కనుగొని కవిహంస మెండు కంపము నొందన్...
    తన ఘన కావ్యమ్మును చిం
    చను, బాలను తండ్రి తీయ సంతసమందెన్

    రిప్లయితొలగించండి
  26. అనకాపల్లిని పెరడున
    పనిలేనిది చిన్న పిల్ల పరువుల నిడుచున్
    కనుగొని గోమాతవియౌ
    చనుబాలను తండ్రి తీయ సంతసమందెన్

    రిప్లయితొలగించండి