3, డిసెంబర్ 2015, గురువారం

సమస్య - 1873 (వదినను ముద్దాడె మరఁది...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..... 
వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్. 

40 కామెంట్‌లు:

 1. ముదముగ తల్లిని మించిన
  యదనపు హృదయమును పంచి యాదర మొప్పన్
  కదిలించు మదిని ప్రియమగు
  వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్

  రిప్లయితొలగించండి
 2. పదియేండ్ల బుడతడాతడు
  ముదముననొక లడ్డునిత్తు ముద్దిడ ననగా
  నొదుగుచు వాత్సల్యమ్మున
  వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్.

  రిప్లయితొలగించండి
 3. కదలాడు బొమ్మలాగున
  పదిమాసము లైన లేని బాలుండొకడే
  అదరక,బెదరకజేరియు
  వదిననుముద్దాడె మరిది పదుగురు చూడన్
  2.అదిచిన్ని పెళ్లికూతురు
  వదినను ముద్దాడె మరిది పదుగురు చూడన్
  బదులుగ తానొక టివ్వగ?
  మదిగల భావాల మమత మై మరిపించున్|

  రిప్లయితొలగించండి
 4. పదుగురి లో పలుచనగా
  సదమదమవజేసి సతియె సాధించుచుతాన్
  హృదయము లేదన. తనువిని
  వదినను, ముద్దాడె మరిది పదుగురు జూడన్

  రిప్లయితొలగించండి
 5. చదువది యెంతయొ గల్గియు
  విధివశమున నుండియొక్క వింతౌవ్యాధిన్
  యెదురుగ నెవరని తెలియక
  వదినను ముద్దాడె మరిది పదుగురు జూడన్

  రిప్లయితొలగించండి
 6. ముదితకు చిన్నత్త కొడుకు
  పదునెనిమిది నెలల వాడు వనితకు చనువై
  వదనము పై నధరమతో
  వదినను ముద్దాడె మరది పదుగురు చూడన్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మగారూ నమస్కారం.
   పదేళ్ళు మరీ ఎక్కువ
   పదిమాసాలుకొంచెం తక్కువ అనిపించిందండీ.
   మీ పదునెనిమిది నెలలు చక్కగా సరిపోయిందండీ

   తొలగించండి
  2. ఆంజనేయ శర్మగారూ నమస్కారం.
   పదేళ్ళు మరీ ఎక్కువ
   పదిమాసాలుకొంచెం తక్కువ అనిపించిందండీ.
   మీ పదునెనిమిది నెలలు చక్కగా సరిపోయిందండీ

   తొలగించండి
  3. ధన్యవాదాలండీ Shashima గారూ....నమస్కారములు.

   తొలగించండి
 7. మదపిచ్చి ముదిరి తలచెను
  యెదురుగ నెవరైన నేమి యీప్సితమొదవన్
  బెదరక వదురుచు నాతడు
  వదిను ముద్దాడె మరిది పదుగురు జూడన్

  రిప్లయితొలగించండి
 8. వదిన తనదు మూడేండ్ల మ
  రఁదిని నిడి నిజాంకమున కరం బనురక్తిన్
  ముదమున ముద్దీయ మనగ
  వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్.

  రిప్లయితొలగించండి
 9. సదనమున యాడు పాపడు
  వదినను ముద్దాడె;మరది పదుగురు చూడన్
  పదిలముగా పాపనిన్ నిం
  పొదవగ నెత్తుకొని తాను బుగ్గలు నిమిరెన్

  రిప్లయితొలగించండి
 10. రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. 1.
   పదహారునెలల వయసున
   మదిదోచెడు సుందరుండు మరదే యైనన్
   ముదితకు చనువై మెలగుచు
   వదినను ముద్దాడె మరది పదుగురు చూడన్ .

   2.
   మృదువగు కరములు రెండును
   వదనము పైజేర్చి యామె పాలము పై తా
   నధరముల తోడ బాలుడు
   వదినను ముద్దాడె మరది పదుగురు చూడన్ ,

   తొలగించండి

 11. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  ఛ౦ ద ము = మ ధ్యా క్క ర

  వదిన మాతృస్వరూప యని
  ...... వచియి౦చెద. | రది యట్లు౦డ. :--
  వదిన. విధవ యైన లేక
  ........ వ౦ధ్య యైనను " సి౦గ్ " కులమున
  వదినను మరది పె౦డ్లాడు ,
  ........... పడయగ స౦తతిన్ | కా న
  వదినను ముద్దాడె మరది
  .......... పదుగురు మెచ్చ " రా౦ సి౦గు "

  { వ౦ద్య. = గొ డ్రా లు }

  రిప్లయితొలగించండి
 12. వదలక కంటికి రెప్పగ
  ముదముగ తనబిడ్డవోలె మురిపెము తోడన్
  పదియేళ్ళుగ బెంచెడి తన
  వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్!!!

  రిప్లయితొలగించండి
 13. అదియే మిచిత్రమో యది
  వదినను ముద్దాడె మరది పదుగురు చూడ
  న్నదియా , బాలున కప్పుడు
  పదిమాసములే గద మరి వయసున్జూడన్

  రిప్లయితొలగించండి
 14. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  పది మ౦ ది కొడుకు లొకనికి |
  మొదటి తనయునికి వివాహము జరిగె, మరి యా
  సుదతికి ి చి న్నతడు మరది |
  వదినెను ముద్దాడె మరది పదుగరు మెచ్చన్ !

  రిప్లయితొలగించండి
 15. గదలను పట్టి సమరమునఁ
  గదియ సజాతులు, రఘుపతి కాండము తో వే
  తుదముట్టించెన్ వాలిని
  వదినను ముద్దాడె మరిది పదుగురు చూడన్

  రిప్లయితొలగించండి
 16. వదినయె ద్రౌపది. నకులున
  కిది చిత్ర వివాహమౌట యేవురు పతులై
  కుదురుగ భర్తయు నౌటను
  వదినను ముద్దాడె మరది పదుగురు చూడన

  రిప్లయితొలగించండి
 17. ముదమొందగ జేసెను తన
  వదినను, ముద్దాడె మరఁది పదుగురు చూడన్

  ఎదురుగ నిలచిన తన ప్రియ

  'మదవతిని', గనినినవారి మతులున్ జెదరన్.

  రిప్లయితొలగించండి
 18. పదములు తడబడ వేయుచు
  ముదముగ పరుగెత్తు చిన్ని ముద్దుల మరిదిన్
  వదిన పరుగులిడి బట్టగ
  వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్.

  రిప్లయితొలగించండి
 19. ముదమున చినతమ్నుని తా
  వదినై యనురాగ సుధలు పంచెనటంచున్
  నుదుటన మెప్పుగ నన్నయె
  వదినను ముద్దాడె, మరఁది పదుగురు చూడన్!

  రిప్లయితొలగించండి
 20. ముదిరన వయసున పెండిలి
  కుదరగ, మంటపము చెంత కూర్చొని యుండన్
  వదలని తొలినెచ్చెలి, అర
  వది, నను ముద్దాడె, మరఁది, పదుగురు చూడన్ [ మరఁది,+పదుగురు చూడన్]

  రిప్లయితొలగించండి
 21. వదలక చంకననెత్తుక
  ముదముననొక లడ్డునిత్తు ముద్దిడుమనగా
  నొదుగుచు బోసిగ నవ్వుచు
  వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్.

  రిప్లయితొలగించండి
 22. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  నాన్నగారి అంత్యకర్మలలో వ్యస్తుణ్ణై మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.
  దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 23. ఊకదంపుడు గారు, మీ పూరణ వైవిధ్యంతో చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 24. అదిగో! అన్నను చూడుడు!
  వదినను ముద్దాడె!:...మరఁది పదుగురు చూడన్
  కుదురుగ కూర్చొనియుండక...
  అదరగ చప్పట్లు కొట్టె హడలిన యవ్వల్!

  రిప్లయితొలగించండి
 25. కుదరగ బాల్యవివాహము
  ముదమున మా తాత లెల్ల ముద్దుగ చూడన్
  కదలుచు తడబడు కాళ్ళను
  వదినను ముద్దాడె మరఁది పదుగురు చూడన్

  రిప్లయితొలగించండి