22, డిసెంబర్ 2015, మంగళవారం

సమస్య – 1892 (మారజనకుఁ డతఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మారజనకుఁ డతఁడె మారవైరి.

49 కామెంట్‌లు:

  1. సృష్టి జేయు జగతి పుష్టినీయ గలడు
    మార జనకుఁ డతడె మార వైరి
    మసన మందు జనుల భసిత మలదుకొంచు
    పాప పున్నె మందు ప్రమద మలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పుష్టి నీయగల కు|మారజనకుఁ డతడె...’ అంటే బాగుంటుంది.

      తొలగించండి
    2. సృష్టి జేయు జగతి పుష్టినీయ గలకు
      మార జనకుఁ డతడె మార వైరి
      మసన మందు జనుల భసిత మలదుకొంచు
      పాప పున్నె మందు ప్రమద మలరు

      తొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరింప నున్నవి !

    శివాయ విష్ణురూపాయ
    శివరూపాయ విష్ణవే|
    శివస్య హృదయం విష్ణుః
    విష్ణోశ్చ హృదయం శివః||

    01)
    __________________________________________

    నామ రూప రహితు ♦ నేమని పిలచిన
    సృష్టి స్థితి లయల ♦ సేయు నొకడె !
    ఊర నూర మెరయు ♦ నుషపు డొకడు గాదె !
    మారజనకుఁ డతఁడె ♦ మారవైరి !
    __________________________________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సృష్టిస్థితి’ అన్నపుడు ‘ష్టి’ గురువై గణదోషం. ‘సృష్టి రిష్ట లయల...’ అనండి. (స్థితికి రిష్ట అన్న పర్యాయపదముంది).

      తొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    తలను గంగను మఱి తరుణేందు ధరియించుఁ
    గంఠమందు నురగ గరళములను!
    మూఁడు కన్నులున్న మొదటి వేల్పతఁడె! కు
    మార జనకుఁ డతఁడె మారవైరి!!

    రిప్లయితొలగించండి
  4. కరివదనుని గాంచి గౌరమ్మ బల్కె, కు
    మార, జనకుఁడతడె, మారవైరి,
    భక్తసులభు డగుచు ముక్తి నొసంగును
    ప్రమధనాధుడైన పరమశివుడు !!!

    రిప్లయితొలగించండి
  5. సకలభువనపాల సరసిజాసను తండ్రి
    మార జనకుడతడె ,మారవైరి
    భవుని విల్లు విరిచి పడతిచే పట్టిన
    హరికి మ్రొక్కు లిడుదు ననవరతము.
    2.సగము తనువు ననొసగె నగజాత కాతడు
    భోళ శంకరుండు భువిని నిజము
    వేడుఉఉఉకొన్న జనుల విడువడే పూట,కు
    మార జనకు డితడె మార వైరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కొన్ని టైపు దోషాలున్నవి.

      తొలగించండి
  6. 1.
    తారకుడను జంప తల్లి పార్వతి సుతు
    డగ్ని గర్భ మందు నంకురించె
    కార్తికేయుడనుచు నార్తితో పిలుచు, కు
    మారజనకు డతడె మారవైరి.

    2.
    గళము నందు విషము తలపైన గంగయు
    శిఖన చంద్రరేఖ శ్రీకరుండు
    పాల లోచనుండు పరమ పురుషుడు కు
    మార జనకు డతడె మారవైరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘తారకుని వధింప...’ అనండి. అలాగే ‘శిఖను’ అనండి.

      తొలగించండి
  7. సమస్య
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    అతి సులభ సమస్య. నడిగితిరి కద. కు
    ి
    మార జనకు డతడె = మార వైరి !

    ఆ కుమార సామి కగును త౦డ్రి = శివు౦డు

    మన్మధుని రిపువె = యుమాధవు౦డు


    క్షమి౦చ౦డి గురువు గారూ !

    Kumara స్వామి ని , కుమార సామి అన్నాను .
    రె౦డుపదాలను సమాస౦గా భావి౦చకొనకు౦డా
    సవరణ చేసుకొనుటకు వీలగు తు౦దా ?
    పెద్దగా దోషమేమీ లేదు కదా !
    పదక్రమ౦ బాగు౦టు౦దని ఉపయోగి౦చాను .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కుమారసామి’ అనడం గ్రామ్యం. ‘ఆ కుమారున కగు నసమనేత్రుడు తండ్రి’ అందామా?

      తొలగించండి
  8. మంచుకొండపై ప్రమథగణములు గొల్చు
    మంగళమయు డౌ యుమాధవుండు,
    దేవసైన్యముల కధిపతియౌ గిరిజాకు
    మార జనకు డతడె మారవైరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మంగళమయుడౌ’ అంటే గణదోషం. ‘మంగళమయు డగు నుమాధవుండు’ అనండి.

      తొలగించండి
    2. గురువు గారికి నమస్కృతులు మీసూచన మేరకు సవరించిన పద్యము
      మంచుకొండపై ప్రమథగణములు గొల్చు
      మంగళమయు డౌ యుమాధవుండు,
      దేవసైన్యముల కధిపతియౌ గిరిజాకు
      మార జనకు డతడె మారవైరి

      మంచుకొండపై ప్రమథగణములు గొల్చు
      మంగళ మయుడగు నుమాధవుండు,
      దేవసైన్యముల కధిపతియౌ గిరిజాకు
      మార జనకు డతడె మారవైరి

      తొలగించండి
    3. తిమ్మాజీ రావు గారూ,
      ‘మంగళమయుడౌ’ అన్నచోట గణదోషం లేదు. నేనే పొరబడ్డాను. మన్నించండి. ‘మంగళమయుడౌ నుమాధవుండు’ అనాలి.

      తొలగించండి
  9. ఏన్గు శిరము దెచ్చి యింపుగా నతికించి
    పత్ని మెచ్చ సుతుని ప్రాణమిచ్చి
    చేరదీసి ముద్దుజేసెనుగద ముద
    మార జనకుఁ డతఁడె మారవైరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      ఎన్నోసార్లు అన్నాను “మీ రూటే సపరేటు” అని. అన్నట్టుగానే మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. మీ అభిమానానికి ధన్యవాదాలు గురువుగారూ.

      తొలగించండి
  10. భస్మ ధారు డతడు మసన మందు వసించు
    సకల శుభము లీయు శంకరుండు
    నాగ భూష ణుండు నగజప తియు ను ,కు
    మార జనకు డతడె మార వైరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో యతి తప్పింది. భ-మ లకు యతిమైత్రి లేదు. కేవల పు-ఫు-బు-భు-ము లకు మాత్రమే ఉంది. ‘భస్మధారు డతడు వసియించు కాటిలో’ అనండి.

      తొలగించండి
  11. రిప్లయిలు
    1. శంభు డిందుమౌలి శంకరు డీశుండు
      నీలకంఠు డసమ నేత్రు డజుడు
      త్రిపురవైరి శివుడు దేవదేవుండు కు
      మారజనకుఁ డతఁడె మారవైరి.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. గట్టుపట్టి మగడు కాట్రేడె యగ్ని కు
    మార జనకుడతడె మార వైరి
    తపము చెరచ మరుడు తామసమున్ బొంది
    మూడవ కను తోడ ముగియ చేసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { శైవు లారా ! వైష్ణవు లారా ! అదిగో !

    హరిహరాలయము ! మీ ఇష్ట౦. హరి కైనా

    మ్రొక్క౦డి లేదా హరుని కైనా మ్రొక్క౦డి }


    ఆహ ! యద్భుతమ్ము ! హరిహరాలయ ; మదే

    మార జనకు ; డతడె మార వైరి ;

    శైవ వైష్ణవులు నస౦శయముగ మ్రొక్క ్

    గలరు హ రు ని , లేక నలరు హరిని ! !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మంచి పూరణ చెప్పి అలరింపజేశారు. అభినందనలు.

      తొలగించండి
    2. మౌని ఈశ్వరునకు మర్యాద తోడను
      పుష్ప ఫలములనిడి పొంద గోరె
      సురలు గోరినంత మొరవినె పార్వతీ
      మా రజనకుడతడె మారవైరి!

      రజన = సంపాదన అయినపుడు
      రజనకుడు = సంపాదకుడు అవుతుందనే భావనతో పూరించాను. గురుదేవుల అభిప్రాయము తెలియజేయ ప్రార్థన.

      తొలగించండి
    3. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. పద్యం బాగుంది. అభినందనలు.
      కాని ‘రజనకుడు’ శబ్దం గురించే సందేహం. నేను చెప్పలేకున్నాను.

      తొలగించండి
  14. నిన్నటి సమస్యకు పూరణలు
    1.జీవుల యందు మానవుడె చెతన గల్గిన వాడు ప్రౌఢిమన్
    భావనజేసె, నీ ప్రకృతి,భానుడు,చంద్రుడు తారకావళుల్,
    యేవిధి గల్గె?దాని కొక నీశుని సృష్టిని జేసె .గాన నే
    దైవము గొల్వ రాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
    పూరణ 2.కావిరులైన మానవులు క్రమ్ముకొనంగను లోభమోహముల్,
    దెవునిపేర కానుకలు దీటుగ గైకొని మోసగించగా
    జీవునిలోనె దైవమది చేపడి యుండును,కల్లబొల్లి యౌ
    దైవముగొల్వ రాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. గురువుగారికి, పెద్దలకు నమస్కారం. ఈ రోజు సమస్య నాకు చాలా నచ్చింది. ఏమీ లేని ఆది భిక్షువు, అన్నీ ఇచ్చే ఆది గురువు అతనే, రెండు కళ్ళలోనూ కరుణ, మూడో కంటిలో చిచ్చు కల కంఠుడు అయిన శివుడే కందకుమారుడు అనగా కుమారస్వామి తండ్రి మరియు మన్మధుని వైరి అన్న అర్ధంలో రాశాను. దయచేసి పరిశీలించి తప్పులు తెలియచేయగలరు. ధన్యవాదాలు.
    ఆ.
    ఆది భిక్షువతడు, ఆదిగు రువగును
    రెండు కనుల కరుణ రెండు నొకటి
    కంట నుండు చిచ్చు,కంఠుడు, కందకు
    మారజనకుఁ డతఁడె మారవైరి.

    రిప్లయితొలగించండి
  16. వేదుల సుభద్ర గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. ధీర |సూర నిన్ను చేరదీసెనులే కు
    మార|జనకు డతడె|మార వైరి
    నిన్ను జంపి మరల నిందను మాన్పెను
    గజ ముఖుని జేయ? ఘనుడు హరుడు|

    రిప్లయితొలగించండి
  18. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    గజముఖుని జనకుని గా ,కపర్ధియె నాడు
    ద్రుంచి దక్షుని బ్రతికించి , పిదప
    గౌరి నేలు కొనగ కాముని గూల్చె, కు
    మారజనకు డతడె మార వైరి

    రిప్లయితొలగించండి
  19. వళ్ళు బడగ చర్మ మొళ్ళు గూల, జనని
    మార జనకుఁ డతఁడె మార, వైరి
    భావమదియె వద్దు వారిపైన, వలదు
    వదల వృద్ధ గృహము నందునింక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవికాంత్ మల్లప్ప గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  20. ఆ.వె
    కుడుములు తిను వాని కొమరునిగా నొంది
    లేనెల తల యందులిమడ జేసి
    తెల్లకొండ నుండు తెల్లదొరే ,సుకు
    మారజనకుఁ డతఁడె మారవైరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ స్వామి గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాకుంటే కొన్ని చిన్నచిన్న లోపాలు. ‘అందు లిమడజేసి’..? అక్కడ ‘లేనెల తలలోన లీలఁ జేర్చి’ అనండి.

      తొలగించండి