31, డిసెంబర్ 2015, గురువారం

సమస్య – 1900 (షణ్మాసము లనఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే.
ఈ సమస్యను పంపిన కవిమిత్రమా! ధన్యవాదాలు. ఇంతకూ ఈ క్లిష్టసమస్యకు మీ పూరణను సిద్ధం చేసుకున్నారా?

62 కామెంట్‌లు:

 1. గురువు గారికి నమస్కారము

  తాతతో ఒక మనుమడు విరహముతో పలికిన మాటగానూహించిన పూరణము

  మన్మడు పురిటికి తనసతి
  చిన్మయి నేపంపి పిదప చింతించుచు దా
  నున్మాదముతో పలికెను
  షన్మాసములనగ నొక్క సంవత్సరమే.

  చిన్మయి = అతని భార్యపేరు
  ఉన్మాదము = విరహము

  రిప్లయితొలగించండి
 2. గురువు గారికి నమస్కారము

  తాతతో ఒక మనుమడు విరహముతో పలికిన మాటగానూహించిన పూరణము

  మన్మడు పురిటికి తనసతి
  చిన్మయి నేపంపి పిదప చింతించుచు దా
  నున్మాదముతో పలికెను
  షన్మాసములనగ నొక్క సంవత్సరమే.

  చిన్మయి = అతని భార్యపేరు
  ఉన్మాదము = విరహము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసింపదగినదే. పూరణ కూడ బాగున్నది. కాని సమస్యలో ప్రాసాక్షరం ‘ణ్మ’ కదా! దానిని మార్చకూడదు.

   తొలగించండి
 3. షణ్ముఖుడు కార్తి కేయుడు
  షణ్మతములు నారు దశములు చార్వాకమనన్
  షణ్మత స్తాపన శంకరు
  షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే

  హమ్మయ్య కిట్టించాను గానీ ! ఎన్నితప్పులో ?

  రిప్లయితొలగించండి
 4. రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీరే ‘కిట్టించాను’ అన్నాక ఏమంటాను? బాగుందంటాను.
   ‘షణ్మత స్థాపన’ అన్నపుడు ‘త’ గురువై గణదోషం. ‘షణ్మతముల నిడె..’ అనండి.

   తొలగించండి
  2. షణ్ముఖుడు కార్తి కేయుడు
   షణ్మతములు నారు దశములు చార్వాకమనన్
   షణ్మత ములనెడి శంకరు
   షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమ

   తొలగించండి

 5. షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే
  లాగగును ? కంది వారు బ్లాగు నందు
  దినమునకు రెండు ప్రశ్నలరయ గాంచిన
  షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే !

  శుభోదయం
  జిలేబి


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ భావంలో చక్కని ‘లాజిక్కు’ ఉంది. బాగుంది. కాని ఆ భావానికి ‘ణ్మ’ ప్రాసతో కందం వ్రాయడం నా వల్ల కాదు. __/\_

   తొలగించండి
  2. కంది వారు,

   హమ్మయ్య! వచన కవిత కి పెద్ద పీట వేసుకోవచ్చు :)

   జేకే !

   చీర్స్
   జిలేబి

   తొలగించండి
 6. గురువుగారికీ, పెద్దలకు నమస్కారం. నాకు వచ్చిన రీతిలో రెండు పూరణలు చేశాను. ఎంతో కష్టమైన షన్మతసారమును ఈషన్మాత్రమున నేర్చిన షణ్ముఖుడనే చిన్నవాడు సంవత్సరమంటే మాత్రం ఆరునెలలే అని తప్పుగా అనుకున్నాడు అని. అలాగే షాణ్మాతురుడైన కుమారస్వామి ఎంతో సులువుగా షణ్మతములను నేర్చుకున్నాడు కాని తప్పుగా సంవత్సరమంటే ఆరునెలలే అనుకున్నాడు అని. భావం తప్పయినా, పద్యంలో తప్పులున్నా మన్నించి సవరణలు తెలియచేయగలరు. ధన్యవాదలు.
  కం:

  షణ్ముఖుడనుచిరుతజదివె
  షణ్మతసారమునొకనీషణ్మాత్రమునన్
  షణ్ముఖుడెతలచెతప్పుగ
  షణ్మాసములనఁగనొక్కసంవత్సరమే

  షణ్మత ములవిభ వములీ
  షణ్మాత్రమునజదివెచిరుషాణ్మాతురుడే
  షణ్ముఖుడనుకొనెతప్పుగ
  షణ్మాసములనగనొక్కసంవత్సరమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేదుల సుభద్ర గారూ,
   మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘షణ్మతసారమ్ము నొక్క క్షణమాత్రమునన్’ అందామా?

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువుగారు. సవరించి తిరిగి రాస్తాను

   తొలగించండి
 7. మిత్రులందఱకు నమస్సులు!

  షణ్ముఖ శర్మయె తెలిపెను
  మృణ్మయ పాత్రలె మదీయ మిత్రములని! యీ
  షణ్మాత్రముఁ గన ద్విగుణిత
  షణ్మాసములనఁగ నొక్క సంవత్సరమే!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. గుండు మధుసూదన్ గారు బహుకాల దర్శనము. నమస్కారములు.
   నన్నయ భట్టారకుని భారతములో ఆది పర్వము చతుర్థాశ్వాసము లో 37 వ పద్యమును గమనించండి.
   రెండవ పాదములోని “నిన్నుఁ దొట్టి” లో సహజ సరళమైన “దొ” వెనుకనున్నట్టి యరసున్న. పరిశీలించి మీ యభిప్రాయము తెలుప గోర్తాను. ముద్రణా దోషము కాక పోవచ్చునని భావిస్తాను.
   [దొట్టి= తో, కూడా అనే యర్థమే యన్వయమవుతుంది.
   తొట్టి = 1. నోరు వెడల్పును, అడుగు సన్నమునైన గంపవంటి మట్టి పాత్రము;
   2. పసులు నీళ్లుత్రాగుట లోనగువాని కుపయుక్తముగ ఱాతితో కట్టిన కట్టడము;
   3. కొప్పెర.
   అన్వయమవదు కద.]

   వనజభవప్రభావుఁ డగువాని వసిష్ఠు నపత్యశోక మ
   న్వననిధి లోన ముంచిన యవారిత సత్త్వుఁ డు నిన్నుఁ దొట్టి యీ
   యనిమిషు లెల్ల వానికి భయంపడుచుండుదు రట్టి యుగ్రకో
   పనుకడ కిప్పుడేఁ గు మని పాడియె యిప్పని నన్నుఁ బంపఁ గన్.

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   ‘నిన్నుఁ దొట్టి’ లోని అర్ధానుస్వారం ముద్రణాదోషమని నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం నా దగ్గర మహాభారతం ప్రతులు లేవు. వాటిని గుండు మధుసూదన్ గారికే ఇచ్చాను. గత సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారి భారత సంపుటులను నేనే వారికి తెచ్చి ఇచ్చాను. వారి సమాధానం కోసం ఎదురుచూద్దాం.

   తొలగించండి
  4. మిత్రులు కంది శంకరయ్య గారు, కామేశ్వర రావు గార్లకు నమస్సులు!

   నేను పాఠశాలనుండి నేరుగ వరంగల్ చౌరస్తాకు వచ్చుటచే, నింటియందుఁగల భారతమునుం జూచునవకాశ మిప్పుడు నాకు లేదు. అయినను నాకుం దెలిసినంతవరకు నిది ముద్రణదోషము కాదు. ఎందుకనఁగ నిచ్చట "నిన్నున్ + తొట్టి" యనియే రావలెను. తొట్టి యనఁగాఁ [దొంటి...తొల్లిఁటి...తొలుతటి...తోడుకొని... యను రూపాంతరముతోఁబాటు] మొదలు, మొదలుకొని యను నర్థములున్నవి. తొట్టి యను పదమునకు మీరు చెప్పిన యర్థములే కాక, తొట్టి యను ప్రత్యయార్థమునఁ గూడ [తోన్, తోడన్...వలె] నున్నది. నన్నయయే గ్రంథ ప్రారంభమునఁ జేసిన "హిమకరుఁ దొట్టి..."యను ప్రయోగము "హిమకరుని మొదలుకొని..."యనునర్థమునే నిరూపించుచున్నది.అటులనే "నిన్నుఁ దొట్టి..." యనఁగ "నిన్ను మొదలుకొని..." యను నర్థమే వచ్చుచున్నది. కావున నిది "తొట్టి"యే కాని, "దొట్టి"కాదు. ఇంటికిఁ బోయిన పిదప నిదియే యర్థమున్నచో నూరకుండెదను. నా విశ్లేషణము విభేదించినచోఁ దగు సమాచారముతో మఱలఁ దెలిపెదను. స్వస్తి.

   తొలగించండి
  5. కామేశ్వర రావు గారూ,
   నిశిత పరిశీలన చేయకుండా ‘ముద్రణాదోషం’ అన్నందుకు మన్నించండి. గుండు మధుసూదన్ గారి సమాధానం చూచిన తర్వాత ‘ఆంధ్రభారతి’ని సంప్రదిస్తే తెలిసిన విషయాలివి.
   ‘తొట్టి’ అనేది తొట్టు అనే అకర్మక క్రియాపదానికి క్త్వార్థకరూపం. కొట్టు > కొట్టి వలె.
   తొట్టు శబ్దానికి అకర్మక క్రియగా ‘స్పృశించు, అవలంబించు, మొదలుకొను’ అనే అర్థాలిచ్చి మొదలుకొను అనే అర్థానికి ఉదాహరణగా “క. వనకేళీ కౌతుకమునఁ, జనియెను శర్మిష్ఠఁ దొట్టి సఖులెల్ల ముదం, బునఁ గొలిచిరాఁగ. (భార. ఆది. ౩, ఆ.) ఇచ్చి ‘ఈ యర్థమునకు క్త్వార్థమునందే ప్రయోగము’ అని కూడ చెప్పింది.
   మార్గదర్శకులైన గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు.

   తొలగించండి
  6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మంచివిషయములు తెలిసినవి. ధన్యవాదములు.

   తొలగించండి
  7. సాహితీ సంబంధమైన చర్చల వలన రచనా మార్గము సుగమమగును! నిశిత పరిశీలనము వలన ప్రయోగ పటిమ పటిష్టమగును! ఇది కవులకు, రచయితలకుఁ జాల యవసరము! ఇట్టి పరిశీలనా మార్గముం ద్రొక్కుటకు మార్గదర్శకులు శంకరయ్యగారు, మీరే కదా!

   ఈ ’తొట్టి’ శబ్దమునకు మరిన్ని ప్రయోగములు కలవు...
   తొట్టి = మొదలు చేసికొను, మొదలుకొను (ఈ యర్థమున నిది "తొట్టి" అను క్త్వార్థక రూపముతోనే యుండును.)
   చం. హిమకరుఁ దొట్టిపూరు భరతేశ కురు ప్రభు పాండుభూపతుల్, క్రమమున వంశకర్తలనఁగా మహి నొప్పిన యస్మదీయ వం,శమున.... భార. ఆది.1.14.
   ఉ. కావలివారిఁ దొట్టి పురిఁ గల్గు జనంబులలోన గాఢ ని,ద్రా వివశత్వమొందని విధంబున వాఁడొకరుండు లేఁడు..... హరి.పూ.5.117.
   చం.సురపతిఁ దొట్టి దేవతలు శుంభ నిశుంభ ముఖోగ్ర దానవే, శ్వరులకుఁ వాఱుచుండుదురు సంగర భూముల.... మార్క.6.150.

   >>ఇట్టి పరిశీలనము నాకు ఆమోదయోగ్యము...మోదదాయకము!
   మిత్రులు కామేశ్వరరావుగారికి, శంకరయ్యగారికి ధన్యవాదములు!!
   స్వస్తి.

   తొలగించండి
 8. షణ్మాస దక్షిణాయన
  షణ్మాసపుటయనమొకటి సరియుత్తరమే
  షణ్ముఖ !వినుమా రెండగు
  షణ్మాసములనగనొక్కసంవత్సరమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 9. షణ్ముఖుడ ! యారునెలలెగ
  షణ్మాసములనగ, నొక్క సంవత్సరమే
  షణ్మాసపురెండింతలు
  షణ్మతములుజెప్పెనిట్లు సరియా?కాదా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘...యారు నెలలే’ అనండి.

   తొలగించండి
 10. షణ్ముఖి చదువుచు నిట్లనె
  షణ్మాసములనగ నొక్క సంవత్సరమే
  మృణ్మయి సరిదిద్దుచు ననె
  షణ్మాసములనగ నారు సరిగా గనుమా!!!

  రిప్లయితొలగించండి
 11. షణ్ముఖుడు కార్తికేయుడు
  షణ్మతముల సంఖ్యయారు సందియ మది యీ
  షణ్మాత్రము లేదు యుగళ
  షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. షణ్మాసము లుత్తరదిశ
  షణ్మాసమ్ములు వలకడ చరియింపంగన్
  రాణ్మణి రవి,నీ యుగళపు
  షణ్మాసము లనగ నొక్క సంవత్సరమే

  రిప్లయితొలగించండి
 13. షణ్ముఖ శాస్త్రి కళత్రము
  షణ్ముఖి పురిటికి వెడలగ సంతాపితుడై
  షణ్ముఖుడీరీతి పలికె
  షణ్మాసములనగ నొక్క సంపత్సరమే

  షణ్మాసములన నేమని
  మృణ్మయ బుద్ధిని గలిగిన మిత్రుని యడగన్
  షణ్ముఖుడిట్లుతె లిపెనట
  షణ్మాసములనగనొక్క సంవత్సరమే

  రిప్లయితొలగించండి
 14. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి సమస్యా పూరణ లో కవివరుల “భవజంజాటము” “వివిధ వితమ్ముల” పద ప్రయోగములు సరి గావేమోనని నా సందేహము. నా సంశయము తీర్చ గోర్తాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   రెండూ దోషాలే. నిన్న నాన్నగారి ప్రథమ మాసికంలో రోజంతా వ్యస్తుడనై అలసి ఉండడంతో మరీ లోతుగా పరిశీలించలేదు. ధన్యవాదాలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 15. షణ్ముఖ! మాసమ్మనినన్
  విన్మోయీ ఋతు వనియును వేరొక యెరుకౌ
  మన్మదికి దోచె గనుకను
  షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే.

  రిప్లయితొలగించండి
 16. *గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  షణ్ముఖ. ! ఆరు నెలలె గద
  షణ్మాసము లనగ | లేదు స౦శయ మిక నీ
  షణ్మాత్రమ్మును నీకు : -- ద్వి
  షణ్మాసములనగ నొక్క. స౦వత్సరమే

  రిప్లయితొలగించండి
 17. గురువుశిష్యునితోదెలుపు పాఠము
  షణ్ముఖ|”ఆయనమేగద
  షణ్మాసములనగ”నొక్కసంవత్సరమే
  షణ్మాసపు జత గలియగ
  షణ్మతసమ్మతముజూడ సర్వుల కిలలో”
  ఆయనము=ఉత్తర,దక్షనాయనములు.

  రిప్లయితొలగించండి
 18. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....

  షణ్మాసముల్దక్షిణమున
  షణ్మాసము లుత్తరమున సాగు ఖచరుడున్
  షణ్ముఖ! విను ద్విగుణీకృత
  షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలోని గణదోషాన్ని గమనించి మీరు పూరణను తొలగించారు. ‘షణ్మాసమ్ములు వలకడ’ అంటే సరి. (వలకడ = దక్షిణము)

   తొలగించండి
 19. షణ్ముఖు డైనట్టి గుహుడు
  షణ్మాతలయొక్కపాలు చవి చూచెనుదాన్
  షణ్ముఖు సోదరుడనె యిరు
  షణ్మాసము లనగ నొక్క సంవత్సరమే.

  రిప్లయితొలగించండి
 20. చిన్మయి తో పెల్లి చేసుకొనబోయే ప్రియుని ఆవేదన:

  తన్మయమందెడు కాలము
  మున్ముందుగనున్నదనుచు ముద్దుకు సెలవా?
  చిన్మయి! మనువాడగ నీ
  షఱ్మాసములన్న నొక్క సంవత్సరమే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 21. షణ్ముఖ శాస్త్రి కళత్రము
  షణ్ముఖి పురిటికి వెడలగ సంతాపితుడై
  షణ్ముఖుడీరీతి పలికె
  షణ్మాసములనగ నొక్క సంపత్సరమే 

  షణ్మాసములన నేమని
  మృణ్మయ బుద్ధిని గలిగిన మిత్రుని యడగన్ 
  షణ్ముఖుడిట్లుతె లిపెనట
  షణ్మాసములనగనొక్క సంవత్సరమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘మితుని నడుగన్’ అనండి.

   తొలగించండి
 22. ఆరుగురు మునులు కలసి క్షణము యుగమను రీతి మంత్రములు పఠిస్తూ వేచి చూచిరని చెప్పుట.
  షణ్మాత్రల కాలంబును
  షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే
  ఫణ్మంత్రములు పఠించుచు
  షణ్మునులు నిరీక్షణంబు సలిపిరి భక్తిన్
  [ఫట్+మంత్రములు=ఫణ్మంత్రములు; ఫట్ మొదలగు మంత్రములు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 23. షణ్ముఖుడగు కందుండీ
  షణ్మాత్రమువెను దిరుగడు సంగ్రామమునన్
  షణ్మాత్రలారె యవ ద్వై
  షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘షణ్మాత్ర లారు గద ద్వై...’ అనండి.

   తొలగించండి
 24. శ్రీగురుభ్యోనమః

  ఈణ్మా ప్రాసను కూర్చగ
  షణ్ముఖునిన్ దలచినంత చయ్యన దోచెన్
  రాణ్మని వినుమా ద్విగుణిత
  షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే

  రిప్లయితొలగించండి