తమ సంతానమును మానవులు కర్కశంగా తమనుండి లాక్కుంటున్నారని విసిగిన వృక్షాలన్ని బ్రహ్మను మొరపెట్టు కున్నాయట తమ సుకుమార మైన పుష్పాలనెవరైనా తాకితే వెనువెంటనే వారి మరణము స్థిరమవ్వాలని
గౌతమ మహర్షి భార్య అహల్యను నిరాహారిగ వాయు భక్షిణిగ భస్మ శాయినిగ తపిస్తూ అందరికీ అదృశ్య రాలుగ వేల సంవత్సరాలు, శ్రీ రాముడు అక్కడికి వచ్చి ఆతిధ్యము స్వీకరించు నంత వరకు, ఉండుమని శపించెను. శ్రీరాముడు విశ్వామిత్రుని సూచన మేర కాశ్రమములో అహల్యను చూచి పాదములకు నమస్కరిస్తాడు. అహల్యకు శాప విమోచనమవుతుంది. ఆధారము: వాల్మీకి రామాయణము
అసుర సుర నరుల కగపడ ని సతి యహల్య పతి శాప నిందిత ఘన తా పసి యట రాముడు దన పద కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె నయ్యో. [తాఁకఁగనెను= తాకగా చూచెను; కోల్పడు=అగపడు; ఉసురు= ప్రాణము; అయ్యో=ఓ అయ్యా]
వసుధను నీటిని జల్లగ
రిప్లయితొలగించండికుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె న్యాం
బసురులు నమృతము కొఱకని
మిసిమిగ మోహిని నిగాంచె మీరిన కోర్కెన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'... గోల్పడె నయ్యో | యసురులు... ' అన్నా సరిపోతుంది.
క్షమించాలి రెండవ పాదంలో చివర ' న్యాయం " కి బదులు న్యాం ' అని టైపాటు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిసమస్యలోని టైపాటును సవరించాను. ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది (సవరించిన సమస్యకు అనుగుణంగా ఉంది). అభినందనలు.
శర్మగారూ నమస్కారం. భావాన్ని కొంత విపులీకరించ మనవి
తొలగించండితమ సంతానమును మానవులు కర్కశంగా తమనుండి లాక్కుంటున్నారని విసిగిన
తొలగించండివృక్షాలన్ని బ్రహ్మను మొరపెట్టు కున్నాయట తమ సుకుమార మైన పుష్పాలనెవరైనా తాకితే వెనువెంటనే వారి మరణము స్థిరమవ్వాలని
ధన్యవాదాలండీ
తొలగించండి
తొలగించండివిసిగిన కుటజము లన్నియు
నొసగమనుచు గోరె ధాత నొకవర మదియే
కుసుమాలను గావుమనుచు,
కుసుమము తాకగనె నుసురు గోల్పడె నయ్యో
గుసగుస లాడెను మల్లెలు
రిప్లయితొలగించండిరుసరుస లాడుచును నవ్వె రోజా పూవుల్
కసికసిగ పలికె నప్పుడు
కుసుమము తాఁకఁగనె నుసురు గోల్పడె న్యాయం
అక్కయ్యా,
తొలగించండిమీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.
స్విఫ్ట్ కీ కీబోర్డ్ లో టైప్ చేయడంలో 'నయ్యో' అన్నది 'న్యాయం' అయింది. మన్నించండి. సవరించాను.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఒసగుటకై నీ పూజన
రిప్లయితొలగించండికుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడెనయ్యో
యసువులు బాపుట తగదని
కుసుమాల వదిలి లతలను కొలుతును దేవా
శశికాంత్ మల్లప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజన అనకుండా పూజను / పూజకు... అనండి.
ధన్యవాదాలు గురువుగారూ
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముసియించగ కాలము తా
రిప్లయితొలగించండిపసియిచ్చిన శాపమునను పాండు విభుండే
స్వసతిగూడ మనసిజు
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడెనయ్యో
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిసమిసల విద్యుదమరిత
రిప్లయితొలగించండిప్రసూన మని యెరుగనట్టి భ్రమరము సుధకై
బిసబిసఁ గ్రోలఁగ వాలిన
కుసుమము తాకఁగనె నుసురుఁ గోల్పడెనయ్యో!
అసురున్ గూల్చెడు కొమరుని
రిప్లయితొలగించండిప్రసాదముగ నీయ శివుఁడు, పార్వతిని గనన్
విసరగ మన్మధుఁడు, హరున్
గుసుమము తాకఁగనె, నుసురుఁ గోల్పడె నయ్యో!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మిసమిసలాడెడి విరులతొ
రిప్లయితొలగించండినసమాక్షుని గొల్వనెంచి హరుషము తోడన్
విసవిస నడచుచు మొరటుగ
కుసుమము తాకగనె నుసురు గోల్పడె నయ్యో.
మిసమిసలాడెడి విరులతొ
రిప్లయితొలగించండినసమాక్షుని గొల్వనెంచి హరుషము తోడన్
విసవిస నడచుచు మొరటుగ
కుసుమము తాకగనె నుసురు గోల్పడె నయ్యో.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'మిసమిసలాడు విరులతో' అనండి.
కుసుమపు దళములమాటుగ
రిప్లయితొలగించండిముసుగున విష కల్పితంబు ముంచుట చేతన్
పసివాడట నాడుచుగని
కుసుమము తాకగనె నుసురు గోల్పడి నయ్యో|
౨కుసుమేసిన పైరందున
పసరంబటు గడ్డిమేయు పనిలో నుండన్
బుసగొట్టు పాముకాటుకు
కుసుమము తాకగనె నుసురు గోల్పడి నయ్యో|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గౌతమ మహర్షి భార్య అహల్యను నిరాహారిగ వాయు భక్షిణిగ భస్మ శాయినిగ తపిస్తూ అందరికీ అదృశ్య రాలుగ వేల సంవత్సరాలు, శ్రీ రాముడు అక్కడికి వచ్చి ఆతిధ్యము స్వీకరించు నంత వరకు, ఉండుమని శపించెను. శ్రీరాముడు విశ్వామిత్రుని సూచన మేర కాశ్రమములో అహల్యను చూచి పాదములకు నమస్కరిస్తాడు. అహల్యకు శాప విమోచనమవుతుంది. ఆధారము: వాల్మీకి రామాయణము
రిప్లయితొలగించండిఅసుర సుర నరుల కగపడ
ని సతి యహల్య పతి శాప నిందిత ఘన తా
పసి యట రాముడు దన పద
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె నయ్యో.
[తాఁకఁగనెను= తాకగా చూచెను; కోల్పడు=అగపడు; ఉసురు= ప్రాణము; అయ్యో=ఓ అయ్యా]
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.” తాఁకఁగనె” లో “క” తర్వాత అర్ధానుస్వారముంది గనుక తాకాగానె అని అర్థము రాదు గద.
తొలగించండిపోచిరాజు కామేశ్వరరావు గురూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సోకఁగ, ప్రాకఁగ, ఇంకఁగ.... ఇత్యాదులందు క తర్వాత అరసున్నా ఉంటుంది.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండితాకంగ; శోకంగ ... లకు మారు రూపములనుకుంటాను.
తొలగించండిపోచిరాజు కామేశ్వరరావు గురూ,
తొలగించండిఅది సోకఁగ.... శోకంగ కాదు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అది ముద్రా రాక్షస ఫలితము.
తొలగించండికుసుమించిన కుసుమ ముపై
రిప్లయితొలగించండిరసాయనమ్ముల విరివిగ రైతులు వాడన్
విషయ మెఱుంగని భ్రమరము
కుసుమము తాకగనె నుసురు గోల్పడె నయ్యో
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
:వ్యసనపరుడైన భ్రమరము
రిప్లయితొలగించండివిసుగును జెందక మధువును వేమరి గ్రోలన్
వసి వెదజల్లిన నొక విష
కుసుమము తాకగనె నుసురు గోల్పడె నయ్యో !
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కుసుమపు తీవెల దాగిన
రిప్లయితొలగించండిబుసపుర్వును గానలేక పుష్పలిహమ్మే
బిసబిస మధువును గ్రోలగ
కుసుమము తాకగనె నుసురు గోల్పడె నయ్యో!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విసమును చిమ్మెడి వ్రణమున
రిప్లయితొలగించండిపసిబాలుని బోలు ముసలి వగ్గును గాంచన్
పసగల వైద్యుని శస్త్రము
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె నయ్యో.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కుసుమము వెనుకన పురువది
రిప్లయితొలగించండికసికసిగా దినుచురేకు కాపుర ముండన్
విసమునుగానక తుమ్శెద
కుసుమముదాకగ నె నుసురుగోల్పడెనయ్యో
విసమంచు కీటకములకు
రిప్లయితొలగించండిరసాయనములు వెదజల్ల రైతన్నచటన్
రసమును కోరిన భ్రమరము
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె నయ్యో :(
ముసలము పుట్టిన రోజున
రిప్లయితొలగించండినసుగుచు ద్వారక నగరిని నారద పూజన్
ముసలిది విషవృక్షమ్మున
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె నయ్యో