మిరపకాయలు మనదేశానివి కావు. మనవాళ్ళు పూర్వం కారంకోసం మిరియాల పొడినే వాడేవారు. విదేశీయులు ఈ కాయలను తెచ్చారు. మిరియాలకు బదులుగా వాడే కాయలు కనుక వీటిని ‘మిరియపుకాయ’ లన్నారు. క్రమంగా అదే మిరపకాయ అయింది. మిరియముల నూరి పూర్వులు మేలుగాను కారమును పొందుచుండిరి; దూరదేశ వాసు లీకాయలను దెచ్చి పరిచయమ్ము చేయ మిరియములకు బదులే యయినవి; మిరియపుంగాయ యైనది మిరపకాయ. (అన్నట్టు వేరుశనగ, తమాట మనవి కావు. మనం వాడుతున్నవాటిలో ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి)
వగరు తీపి పులుపులున్న పొగరు బెంచె
రిప్లయితొలగించండికారమించుక లేకున్న నోరు చెడదె
చిన్నదైననేమి మిరప యున్నచాలు
పేద వాడున్ ధనికుడును పేర్మితోడ
నాదరింతురు గమనింపు డవని యందు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మిరపలు గాంచిన చాలును
రిప్లయితొలగించండివరమని బజ్జీలు తినగ పరమ ప్రీతిన్
కొరికిన కారము మెండగు
నరకము నోరంత మండి నసాళము నంటున్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నసాళము’ అన్నచోట గణదోషం.
మిరపలు గాంచిన చాలును
తొలగించండివరమని బజ్జీలు తినగ పరమ ప్రీతిన్
కొరికిన కారము మెండగు
సురలోకము గనుపించు నంట సోద్దెమటన్నన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅక్కయ్యా,
తొలగించండిసవరించిన పూరణలోను గణదోషం. చివరిపాదాన్ని ‘సురలోకము గానుపించు చోద్య మటన్నన్’ అనండి.
మిరపలు గాంచిన చాలును
తొలగించండివరమని బజ్జీలు తినగ పరమ ప్రీతిన్
కొరికిన కారము మెండగు
సురలోకము గానుపించు చోద్య మటన్నన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికొరికిన కారమ్మగునని
రిప్లయితొలగించండిమిరపను గనఁ దోచుచుండె మేధిని ప్రజకున్
మరి నేడు కొనన్ గారపు
మిరపేనా యని యడిగిన మేలగునమ్మా!
(సంకరజాతిమహిమ)
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కొరికిన కారమ్మగునని
రిప్లయితొలగించండిమిరపను గనఁ దోచుచుండె మేధిని ప్రజకున్
మరి నేడు కొనన్ గారపు
మిరపేనా యని యడిగిన మేలగునమ్మా!
(సంకరజాతిమహిమ)
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅకటా ! నోరూరించు జిలేబి కి
మిరప కాయల ఫోటోల ని జూడ
జిహ్వాచాపల్యము జర కలిగే
జిలేబి అయ్యెను మిర్చీ బజ్జీ :)
శుభోదయం
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ భావానికి నా పద్యరూపం....
అకట నోరూరఁ జేయు నత్యంతముగను
మిరపకాయల్ జిలేబీకి నరయ చిత్ర
మదియె జిహ్వచాపల్యము నందఁజేసె
మిగుల నీ జిలేబీ యయ్యె మిర్చిబజ్జి.
ఇంపు గొలుపు కెంపుల వ
రిప్లయితొలగించండిర్ణంపు మిరపకాయ సొంపు లరయంగన్నా
వెంపు హరితంపు పెంపున
గుంపీ వైపుఁ గనువిం దగుచు విలసిల్లెన్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండివృత్యనుప్రాసతో మీ పద్యం శోభిస్తున్నది. బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిమిరప కాయ జూడ మిసమిస లాడును
రిప్లయితొలగించండికొరికి జూడ నోరు జురుకు మనును
చారు కూరపప్పు సాంబారు లాదిగా
మిరప లేని వంట ధరను గలదె ?!!!
పత్రముల నడుమ మెరయుచు
రిప్లయితొలగించండిచిత్రంబున తోరమువలె చెన్నుగ నుండెన్
నెత్రును గాచెడి మిరపలు
చిత్రా !తగ్గించు బరువు చిత్రము గాదే!!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కనిన మిరపతోట మనసు పరవసించు
రిప్లయితొలగించండివివిధరంగులు కను విందు జేయ
చిన్నతనము నందు చెన్నుగా పెంచిన
తోట గుర్తుకొచ్చి తుష్టి గలిగె
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వచ్చి’ని ‘ఒచ్చి’ అన్నారు. ‘గుర్తువచ్చి’ అంటే సరి!
మిర్చి తోటను జూడుడు మిలమిలమరి
రిప్లయితొలగించండిమెరయు చుండెను నచ్చట మెరుపువోలె
పండ్ల తోడను గాయల వరుస తోడ
చెలువు మీరగ వ్రేలాడు చుండె నార్య!
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
చివరిపాదంలో యతి తప్పింది. ‘చెలువు మీరగ వ్రేలాడ గలుగు నార్య’ అందామా?
జండా వందన సమయాన రైతుపండించినజండా|
రిప్లయితొలగించండిమూడురంగుల జండాలు జూడుమనుచు
రైతు చెట్టునజూపించె రాజువోలె|
ఆకుపచ్చయు,యెరుపును షోకులందు
పూల తెలుపును మిరపయు పొంది యుండె,
2.మిరప కాయలకెందుకీ మిడిసిపాటు?
వంటలందున రుచులను పండజేయు.
పండుమిరపన్న భావనల్ నెండబెట్టి
రోట దంచియు పొడిజేతు మేటియనగ
3.ఆకుల కోకగట్టుకొని అందము జిందెడి కొమ్మరెమ్మకున్
షోకునగాయగా మిరప సుందర బంధము మాకువిందుగా
రూకలు బంచి రైతుల విరోదపు నప్పులుదీర్చునట్లుగా
కాకుల వోలే నైఖ్యతన్ దెలుపుకాయలుపండగ పండుగేగదా|
4.కారము కామితార్థము వికారము మాన్పెడి నౌషదంబు,సం
స్కారపు పప్పు,నుప్పు సహకారము నందున వంట లౌను|ఆ
కారమునందు చిన్న.నుపకారముజేయుచులోకమందు పుర
స్కారము లందులే మిరప కారపువంటల కాలమందునన్.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ నాలుగు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యంలో ‘పచ్చయు నెరుపును’ అనండి.
రెండవపద్యంలో ‘భావన లెండబెట్టి’ అనండి.
మూడవపద్యం నాల్గవ పాదంలో గణదోషం. ‘కాకుల యైక్యతన్ దెలుపు...’ అనండి.
నాల్గవపద్యం మూడవపాదంలో గణదోషం. ‘...జేయుచు భూమిపై పుర...’ అనండి.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ మిరపకాయలను చూడగనే కా ర ము
గుర్తుకు రావడ౦ వలన అనేక రకముల కా ర ము ల. పైన. మ ధ్యా క్క ర వ్రాశాను }
.....................................
1.కారము చ౦టిబిడ్డల ముఖమ్మున బోయు నౌషధము
2.కారము పప్పుకూరలకు కమ్మదన౦బు నొస౦గు
3.కారము గా పలుకు చప కారము చేయగ రాదు
4.కారము న౦దు మనో వి కారము కనిపి౦చ రాదు
5.కారము చేయక. మనము కార్యముల్ సాధి౦ప లేము
6.కారము ల౦దు మేలు సహకార స౦స్కారము లెపుడు
7. కారము సృష్టి కారణము క్ష్మాస్థలి జీవుల కెల్ల
...................... . ..................................
[ 1. వాము వాటర్ 2. కారము 3. కటువు
4. నిశ్చయము 5. ప్రయత్నము 6. పని
7 . స్త్రీ పురుషు ల౦దలి అనురాగము ]
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పండు మిరప జూడ బహుపసందుగ నుండు
రిప్లయితొలగించండికొరికిచూడ నోరు చురుకు మనును
పేదవారికెల్ల ఆదరువిదియేను
శక్యమౌన పొగడ శౌరి కైన.
2మిరప తోట లోని మిరపకాయను చూడ
నోరు తనకు తానె యూరు చుండు
కొరికి చూడ ఘాటు మరి నెత్తి కెక్కేను
ఐన తినుచు నుంద్రు యవని జనులు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ఎక్కేను’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘మరి యెక్కు నెత్తికి| నైన...’ అనండి.
మిరప కాయలు పండులు మేలిమైన
రిప్లయితొలగించండిమిరప తోటలో మిలమిల మెరయుచుండె
కోరి కాయను కొరకిని నోరు చెప్పు
కాయ కారపు సొగసును కమ్మదనము..
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కొరికిన’కు టైపాటు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి.మత్తకోకిల
రిప్లయితొలగించండిఊరిపంటలయందునున్నను నూహలందున నూగుచున్
పేరునందున నున్నకారము పెంచగా ధరజేరెనా?
కారుచౌకగ లేనిబేరమ-కామితార్థపు భారమా
కారమా|మమకారమా|సహకారమా|నుపకారమా?
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈరోజు మా నాన్నగారి ప్రథమ మాసికం. అందువల్ల రోజంతా తీరిక లేని పనులు. అందువల్ల మీ పద్యాలను వెంట వెంట సమీక్షించలేకపోయాను. మన్నించండి.
రిప్లయితొలగించండిమిరపకాయలు మనదేశానివి కావు. మనవాళ్ళు పూర్వం కారంకోసం మిరియాల పొడినే వాడేవారు. విదేశీయులు ఈ కాయలను తెచ్చారు. మిరియాలకు బదులుగా వాడే కాయలు కనుక వీటిని ‘మిరియపుకాయ’ లన్నారు. క్రమంగా అదే మిరపకాయ అయింది.
రిప్లయితొలగించండిమిరియముల నూరి పూర్వులు మేలుగాను
కారమును పొందుచుండిరి; దూరదేశ
వాసు లీకాయలను దెచ్చి పరిచయమ్ము
చేయ మిరియములకు బదులే యయినవి;
మిరియపుంగాయ యైనది మిరపకాయ.
(అన్నట్టు వేరుశనగ, తమాట మనవి కావు. మనం వాడుతున్నవాటిలో ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి)
Really very happy to say,your post is very interesting to read.I never stop myself to say something about it.You’re doing a great job.Keep it
రిప్లయితొలగించండిHoly Dip in Ganges will go off Sins - this site also provide most trending and latest articles