కవిమిత్రులారా,
“నిండుమనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్క మీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డోపు నో
పం డతిశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్”
నన్నయ గారి పై పద్యం యొక్క పూర్తి భావాన్ని కాని, కొంతభాగాన్ని కాని తేటగీతిలో చెప్పండి.
“నిండుమనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్క మీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డోపు నో
పం డతిశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్”
నన్నయ గారి పై పద్యం యొక్క పూర్తి భావాన్ని కాని, కొంతభాగాన్ని కాని తేటగీతిలో చెప్పండి.
నవ్య నవనీత సమాన మాపలు కులు
రిప్లయితొలగించండిదారు ణాఖండల జగన్నుత విప్రు లందు
రాజు లందున విపరీత రాజ సమ్ము
శాంతు డయ్యునర పాలు శాప ముక్తి
ఇక్కడా తప్పులే
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమరో ప్రయత్నం చేయండి.
హమ్మో ! మళ్ళీ కుస్తీ ! .......
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమనము నవనీత తుల్యము మాట కఠిన
రిప్లయితొలగించండివజ్ర తుల్యము కావున బ్రాహ్మణుండు
శాపమును గ్రమ్మరింపఁగఁ జాలు; రాజు
లందు విపరీతవర్తన మరయగలము.
మాట కఠినమ్ము వెన్నయే మనసు నిండ
రిప్లయితొలగించండిబ్రాహ్మణుల యందు నివియె భూపాలురందు
తారు మారౌను ,శాపమున్ తాను మార్చ
నోప నొల్లడు విప్రుడే నోపుటొప్పు !!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘విప్రుడే యోపు టొప్పు’ అనండి.
విప్ర జనముల మనములు విమల మగుచు
రిప్లయితొలగించండిపలుకులయ్యవి కఠినమై బరగు చుండు
విభుల యందున నీయవి వేరుగుంట
మార్చ నోపడు శాపము మహివి భుండు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మనము నవనీత తుల్యము మాటలు గన
రిప్లయితొలగించండిదారుణాఖండలాశని ధారలు సుమి
విప్రులకు విపరీత ముర్వీశుల కును
ద్విజు డెఱుగు శాప నిహతియు రాజె ఱుగడు
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
చివరిపాదంలో ప్రాసయతి తప్పింది. ప్రాసపూర్వాక్షరాల గురులఘుసామ్యం పాటించాలి కదా! ‘ద్విజు డెఱుగు శాపనిహతి భూవిభు డెఱుగడు’ అందామా?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. గమనించ లేదు “జ” సరిపోయిందికదా యనుకున్నాను. మీ సవరణ చక్కగా సరిపోయింది. ధన్యవాదములు.
తొలగించండిమనము నవనీత తుల్యము మాటలు గన
తొలగించండిదారుణాఖండలాశని ధారలు సుమి
విప్రులకు విపరీత ముర్వీశుల కును
ద్విజు డెఱుగు శాప నిహతి భూవిభు డెఱుగడు
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
భూసురే౦ద్రుని మనము నవోధృతమ్ము ,
వచన మా సురే౦ద్ర భయద వజ్ర సమము |
క్ష్మాపతుల రె౦డును వ్యతిరిక్తముగను౦డు
కాన నోపడు శాపము గ్రమ్మరి౦ప
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘నవోధృతము’...?
మాట కఠిన మైన మనసంత వెన్నయే
రిప్లయితొలగించండిద్విజులయందు జూడ నిజము గాను
నృపుల యందు నివియె విపరీతమగుగాన
శాపమోప లేడు,బాపడోపు!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఓపలేనిది శాపమా? శాపోపశమనమా? ‘‘నిజముగ నివి| నృపులలోన గాన ముపమింప శాపమ్ము| భూపు డోపలేడు బాప డోపు’ అంటే ఎలా ఉంటుంది?
ప్రణామములు గురువుగారు.. ఓపలేడు అన్నది ఉపసంహారం అవ్వదు.. మీ సూచన చాలా బాగుంది..ధన్యవాదములు..
తొలగించండిమాట కఠిన మైన మనసంత వెన్నయే
ద్విజులయందు జూడ నిజము గనివి
నృపుల లోన గాన ముపమింప శాపమ్ము
భూపు డోప లేడు బాపడోపు!!!
శైలజగారూ!
తొలగించండిమీ పూరణము ఆటవెలదిలో బాగున్నది. అభినందనలు. కాని, నియమము తేటగీతి కదా! పరిశీలింపుఁడు.
విప్రవర్యుల మనసులే వెన్నయైన
రిప్లయితొలగించండిపలుకు లుకఠిన శరముల ములుకు లవియె
శాపమును గ్రమ్మరించిన జాలు రాజు
లందు విపరీత వర్తన మంత మగును
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అంత మగును’ అన్నది కొత్తభావం. ‘విపరీత వర్తన మరయగలము’ అంటే బాగుంటుందేమో ఆలోచించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివెన్న హృదయము పవి మాట విప్రులకును
రిప్లయితొలగించండిరాజు లందిది ప్రతిలోమ మో జననుత!
కాన ద్విజుడోర్చు నరపతి క్షాంతి లేమి
శాపమిచ్చి మరల్పడు శాంతు డయ్యు.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం కొంచెం సంశయార్థంగా ఉంది. ‘మోజ+అనగ’ అన్నపుడు యడాగమం రాదు. ‘మోజనంగ’ అనవచ్చు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
గురువర్యునికి నమస్కారములు
నవోధృతము = వెన్న
మీకు మరియు కవులకు కవయిత్రులకు నూతన స౦వత్సర. శుభాకా౦క్షలు
రేపు ఉదయo మాక౦దరికి మీరొక పద్య౦తో నూతన వత్సర శుభాకా౦క్షలు తెలుపుతూ దీవి౦చ౦డి
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీకు కూడ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!
మాట కఠినమైనను నిండు మనసు వెన్న
రిప్లయితొలగించండిబాపలకు గాన శాపమ్ము బాప గలరు
రేని యందున నివి విపరీత మవగ
శాపమును గ్రమ్మరింపగ జాల డతడు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
. నిండుమనసన నవనీతనిలువలేగ|
రిప్లయితొలగించండివిప్రులందున, రాజుల విధులయందు.
రాజుశాపమ్ము నొసగగ మోజనంగ?
ద్విజుడు నోపునా? విపరీత మిదియె|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నవనీతనిలువలు’ అనడం దుష్టసమాసం. అన్వయలోపం ఉంది. చివరిపాదంలో గణదోషం. మీ పద్యానికి నా సవరణ....
నిండుమనమన నవనీత నిధులె గాద
విప్రులందున, రాజుల విధము వేరు,
రాజు లోపరు శాపమ్ము గ్రమ్మరింప
ద్విజుడు నోపును విపరీత విధము గాగ.
రేడు మెత్తగామాటల నాడు చుండు
రిప్లయితొలగించండిమనసు సంతతము కఠిన మనుట నిజ ము
బ్రాహ్మణులయందు నియ్యది వేరు గుండు
శా పమోచన ద్విజునకు సాధ్య మెపుడు
సార్వభౌముల కయ్యదసాధ్య మగును
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
భూసురేంద్రుడు,భూపతి పుడమి యందు
రిప్లయితొలగించండిసములు,శాపమివ్వగలరు శక్తి యుతులు
బ్రాహ్మణుడు శాపముపహరింప గలడిలను
భూపతి కదియసాధ్యమౌ పోల్చి చూడ.
2.భూసురుడును భూపతియును పుడమిలోన
త్రికరణముల వారు శక్తిపరులిలను
కాని రాజు శాపమొసగ గలడు గాని
సద్ద్విజుని వోలెమరలింప శక్తుడౌనె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిభూసురుని యెద మిసిమియౌ! బాస కఱకు!
కాన, శాప మిడియుఁ ద్రిప్పఁ గలఁ డతండు!
భూవరున కిది విపరీతము నగుఁ గాన,
శాప మిడియునుఁ ద్రిప్పంగఁ జాలఁ డితఁడు!!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.