కవిమిత్రులారా,
“ఇందుఁ గలఁ డందు లేఁడను
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి వింటే!”
పై పద్యభావాన్ని మీకు నచ్చిన ఛందస్సులో వ్రాయండి.
“ఇందుఁ గలఁ డందు లేఁడను
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి వింటే!”
పై పద్యభావాన్ని మీకు నచ్చిన ఛందస్సులో వ్రాయండి.
హరియె లేని ప్రాంతమంగుళ మైనను
రిప్లయితొలగించండిలేదు నిజము వినుము నాదు మాట
గుడిన నుండు వాడు గుండెలో నుండును
తరచి చూచు వారు తథ్య మంద్రు
ఆంజనేయ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
కాని పోతన గారి పద్యభావాన్ని సంపూర్ణంగా అనువదించలేకపోయారు.
సందుల గొందుల మరిమీ
రిప్లయితొలగించండిముందర నే నిలచియుండు మురహరి యెపుడున్
సందియము వలదు మీకు ప
సందుగ తా గానుపించు సరి హరి వెతుకన్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎందున వెదకిన తండ్రీ!
రిప్లయితొలగించండియందండే యుండు చక్రి యనుమానంబున్
డెందమునకు రానీయక
వందనములు సేయుమయ్య! పరమాత్మునకున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఇందుఁ గలఁ డందులేఁ డను సందియ మిఁక
వలదు! శ్రీపతి మధురిపుఁ డిలను జూడ
నెందు వెదకిన నందె గోవిందుఁ డుండు!
దానవేంద్ర! సత్యమ్మిది! తండ్రి! వినుము!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిపోతన గారి భావాన్ని ఉన్నదున్నట్టుగా చక్కగా అనువదించారు. చాలా బాగుంది. అభినందనలు.
ధన్యవాదములు శంకరయ్యగారూ!
తొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండిఇ౦దున్నాడను చ౦దు లేడనుచు నూహి౦ప౦గ నేలా ? జగ౦
బ౦దా శ్రీరమణు౦డు ప్రత్యణువులో వ్యాపి౦చు నిక్షిప్తమై
యె౦దె౦దున్ హరి c గా౦చ గోరినను త౦డ్రీ యు౦డు న౦ద౦దె,ని
స్స౦దేహ౦బిది|కా౦చు మీవు నతనిన్ సామర్థ్యమే యున్నచో !
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండిఇ౦దున్నాడను చ౦దు లేడనుచు నూహి౦ప౦గ నేలా ? జగ౦
బ౦దా శ్రీరమణు౦డు ప్రత్యణువులో వ్యాపి౦చు నిక్షిప్తమై
యె౦దె౦దున్ హరి c గా౦చ గోరినను త౦డ్రీ యు౦డు న౦ద౦దె,ని
స్స౦దేహ౦బిది|కా౦చు మీవు నతనిన్ సామర్థ్యమే యున్నచో !
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
ఎందు జూచిన నందందు నెరుగ బడును
రిప్లయితొలగించండిసందియము వలదింకనీచక్రివెలసి
సర్వమందు లేడిందునందుర్విజూడ
గానని తలప వలదయ్య దానవేంద్ర
శశికాంత్ మల్లప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ఇందందని వెతుకగ వల
రిప్లయితొలగించండిదెందెందు గనిన మురారి యేలోకమున
న్నందంద యుండు నిక్కము
సందేహం బేల తండ్రి సర్వేశ్వరుపై
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
అనంత్ మూగి గారి పద్యం....
రిప్లయితొలగించండిఇక్కడ నక్కడ ననుటకు
చిక్కం డనుమాన మేల శ్రీహరి తండ్రీ
ఎక్కడి కక్కడ వెదకిన
నక్కడి కక్కడనె గలడు నమ్ము నిజ మిదే.
అనంత్ మూగి గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
కరినట గాచెను మొరలిడ
రిప్లయితొలగించండిహరికట దర్శన మొసంగె హర్షము తోడన్
హరిహరియించు నఘములు యనవరతంబున్
2:ఎందున్నాడన జనకుని
డెందెములోనే గలడని లహరిని బలుకన్
యందరి కచ్చెరు వగుతరి
నందము తోడహరిరాగ నందనమయ్యెన్.
3ఎక్కడ వెదికిన జనకా
నక్కడె గలడా నరహరి నమ్ము మటంచున్
చక్కగ బాలుడు పల్కగ
గ్రక్కున స్తంభము వెలువడి హరియేతెంచెన్.
మీ పద్యాలలో ఒక తూగు ఉందండి! అభినందనలు.
తొలగించండిడా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమొదటి పద్యంలో మూడవపాదం లోపించింది.
రెండవపద్యం రెండవపాదంలో యతి తప్పింది. ‘బలుకన్+అందరి’ అన్నపుడు యడాగమం రాదు.
మూడవపద్యం చివరిపాదంలో యతి తప్పింది.
సవరించండి.
దానవాగ్రజవిను-తలచియు వెదికిన
రిప్లయితొలగించండిసంశయంబు లేక చక్రియుండు
అందు-ఇందుననక నంతట నిండియు
అన్ని గతులయందు-నణగియుండు
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అనక+అంతట’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘అనక’ అనేది కళ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసర్వాత్మకుడౌ శ్రీహరి
తొలగించండిసర్వోపస్థితుడు.వలదుశంకింప౦గ
న్నుర్వర గల డెట జూచిన
సర్వస్థానముల రాక్షసాగ్రణి1 వినుమా
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
సవరించానండి పరిశీలించ గలరు
రిప్లయితొలగించండికరినట గాచెను మొరలిడ
హరికట దర్శన మొసంగె హర్షము తోడన్
నారికి చీరలు యొసగిన
హరిహరియించును నఘములు యనవరతంబున్
2.ఇందున్నాడా హరియన
సందేహమదేల తండ్రి చక్రధరుడు తా
నందరి మనముల లోపల
నందముగా కొలువు దీరు నందము తోడన్.
3ఎక్కడ వెదికిన జనకా
నక్కడె గలడా నరహరి నమ్ము మటంచున్
చక్కగ బాలుడు పల్కగ
గ్రక్కున స్తంభము వెలువడె కమలాక్షుడు తాన్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిసవరించిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఒకచోట నుండునని వే
తొలగించండిరొకచో నుండడని శంక యుండగఁ దగునే
సకలజన సమ్మతు నెట వె
తకిన నట కలండు చక్రి దానవవీరా
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వెదకిన’ అనండి.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సవరణకు ధన్యవాదములు. వెతకు, వెదకు రెండు సరియయినవని తలుస్తాను. సంశయము తీర్చ గోర్తాను.
తొలగించండి"చ. అతఁడు మహాప్రసాదమని యత్తొలివాకిలిచొచ్చి యచ్చటన్, వెతకి." ఉ, రా. ౪, ఆ.
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమన్నించండి. తొందర పడ్డాను.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అయ్యో అంత మాట అనకండి. క్షమించండి. నా సంశయము నివృత్తికై అడిగాను. అంతే.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅక్కడ నుండెడు శ్రీహరి
రిప్లయితొలగించండియిక్కడ లేడంచు శంక లేటికి యధిపా
యెక్కడ నైనను గలడీ
యక్కర దీర్చెడు ప్రభుండు యార్తిగ జూడన్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఇందుగలడందు లేడను
రిప్లయితొలగించండిసందియమెందులకు దండ్రి! సర్వేశ్వరుడా
నందకి యెందెందుగనిన
నందందే నుండు చక్రి నసురవరేణ్యా!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
" ఉన్నాడిట లేడచ్చట "
రిప్లయితొలగించండినెన్నను కుశ్శంకలేల నిందిర నాథుం
డున్నా డరయగ నంతట
నాన్నా! వెదుకంగ దొరకు నా నుడి వినవో.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
శౌ రి యన్నితావులనందు సంచరించు
రిప్లయితొలగించండిసంశయములేదు, వానిని సన్నుతించు
భక్తులకు కనుపించును వల్లభుండ
నమ్మునామాటలవి యెప్డు వమ్ముగాదు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘తావులయందు’ అనండి.
అక్కడిక్కడయను ననుమానమదియేల
రిప్లయితొలగించండియెక్కడెక్కడైన చిక్కుచక్రి
నిఖిలప్రాణులందు నీయందునాయందు
గాననగును వెదుక దానవేంద్ర !!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇచటఁ గలఁడచట లేడని
తొలగించండివచియించెడు శంక దానవాధిప తగునే
యెచటెచటఁ జూడఁ దలచిన
నచటచటే శౌరి గలడు నంతట(టి) వాడై
మన్నున కొండలందు సిరి మామిడి తోపుల కోయిలందునన్
రిప్లయితొలగించండిపన్నుగ సూర్యునందు విరి వన్నెల మబ్బుల వానవిల్లునన్
కన్నుల యందునన్ పడుచు కాంతల వృద్ధుల హృత్తులందునన్
చెన్నుగ కన్న వారికిల శ్రీపతి దాగును రాక్షసోత్తమా!