మిత్రులందఱకు నమస్సులు!రాముఁ డంతట గురునకుఁ బ్రణతి సేసి,శివధనుర్భంగ మొనరించెఁ; బవనసుతుఁడుపరిచయము కాక మునుపె; యా పడతి సీతఁబెండ్లి యాడఁగఁ దలఁచియుఁ బ్రీతితోడ!!
గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువులకు నమస్కారములు సోదర సోదరీ మణు లందరికీ క్రిస్మస్ + నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను బొస్టన్ వెడుతున్నాను....... గ ! . సోమవారం వరకు సెలవు
గురువు గారికి నమస్కారములురఘు కులోత్తము డైనట్టి రాముడంతఅంబుజాక్షి సీతమ్మ స్వయంవరమునశివ ధనుర్భంగ మొనరించె! బవన సుతుడుశింశుపావృక్ష ఛాయన సీత గాంచిపలికిన పలుకు లవియెల్ల పడతి వినియె.
ఆంజనేయ శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హరియె తానైన రాముడే యక్కజముగశివధనుర్భంగ మొనరించె , పవనసుతుదుతా శివాంశ సంభూతుడై దాశరధికిదాసుడగుటేమి ? యిట్లుండు దైవలీల
ధనికొండ రవిప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నమస్కారం గురువర్యా. నిన్నటి పూరణ ఆలస్యంగా ప్రవురించడం వలన మీరు చూడనట్లుంది. మరలా ఇక్కడ ప్రచురిస్తున్నాను. తప్పులున్న తెలియజేయ మనవి.వళ్ళు బడగ చర్మ మొళ్ళు గూల, జననిమార జనకుఁ డతఁడె మార, వైరిభావమదియె వద్దు వారిపైన, వలదువదల వృద్ధ గృహము నందునింక
రవికాంత్ మల్లప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తాటకిని జంపె రాముండు! తపసి మెచ్చరాతి నాతిఁ జేసె!జనక కూతుఁ బొందశివధనుర్భంగ మొనరించె! పవనసుతుడుభక్తితో పాడు పరమాత్మ పాటలందు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురునియాజ్ఞగ నే స్వయం వరమునందుశివ ధనుర్భంగమొనరించె|బవన సుతుడునెంచు కొన్నట్టి దైవమే-నెలత సీతతలపునందునరాముడేధర్మపరుడు.2.శివ ధనుర్భంగ మొనరించె”పవనసుతుడుభక్తితో గొల్చు మదిభగవాను డైనరామచంద్రుడు-స్వయం వరమున-రాజులందరుజూడంగ-సీతను లగ్నమాడె.
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి * ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,అరయ రామాయణమున దశరథసుతుడు శివధనుర్భ౦గ మొనరి౦చె | పవనసుతుడు భారతమున కురుకులేశు నూరువులను భ౦గ మొనరి౦చి వధియి౦చె భ౦డనమున
గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీత నుద్వాహమాడగ శీఘ్రతతినినిండు సభలోన రాముడు నెమ్మితోడశివధనుర్భంగ మొనరించె ,బవనసుతుడురామ బంటుగ జగతిని రాణ కెక్కె
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామవైరియె జపియించు నామమెద్ది సీతబట్టగ రామయ్య చేసెనేది సీత జాడను లంకలో వెదకెనెవడు శివ, ధనుర్భంగ మొనరించెఁ, బవనసుతుఁడు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య * గు రు మూ ర్తి ఆ చా రి ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,హరికథా గాయకు డయిన. భరత శాస్త్రి ఆ౦జనేయ చరిత్ర నత్యద్భుతముగ గ్రామముల య౦దు వినిపి౦చి ఘనత గా౦చె |మొన్న నచ్చోట కథ చెప్పుచున్న వేళ" శివధనుర్భ౦గ మొనరి౦చె పవనసుతు డ "ట౦చనియె పొరబడి , సవరి౦చు కొనియె ! ె
అమల రాముడు సీతమ్మనుమనువాడశివధనుర్భంగ మొనరించెఁ, బవనసుతుఁడుజలధి లంఘించి సీతమ్మ జాడ నరసెపుడమి హనుమడు రాముడు పూజ్యవరులు.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధరణి పుత్రిని చేబట్ట దాశరధియెశివధనుర్భంగమొనరించె, బవనసుతుడుసీత జాడను కనుగొని శీఘ్రముగనురామ రావణ యుద్ధపు రచనజేసె!!!
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధరణి పతుల కసాధ్యంబు తాపసులును జనులు మెచ్చగ శ్రీరామ చంద్రు డంతశివధనుర్భంగ మొనరించెఁ బవనసుతుఁడునాకథ విని జెందె పరమానంద మంత
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు పనుపున రఘురాముడరగి మిథిలశివదనుర్భంగ మొనరించె, పవనసుతుడురామ భజనను సలుపుచు రమణ తోడభక్తులం దగ్ర గణ్యుడై వాసి కెక్కె
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికీ, పెద్దలందరికీ నమస్కారం. సీత యందున్న ప్రేమ, గౌరవం వల్ల రాముడు శివధనువు విరిచీ, హనుమ రామ చరితను గానం చేసీ ఆమెను సంతోష పెట్టారూన్న భావనలో పూరణ చేశాను. పరిశీలించి తప్పులుంటే తెలియచేయగలరు. ధన్యవాదాలు.తే.గీ: రమణిజానకిముదమొంద రాముడపుడుశివధనుర్భంగ మొనరించెఁ; బవనసుతుఁడుపలికె శ్రీరామ చరితము పడతి కొరకుఅవనిజయెడనిరువురికి,యమితనెనరు
వేదుల సుభద్ర గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రమణి సీతను పెండ్లాడ రాఘవుండు శివధనుర్భంగ మొనరించె.బవనసుతుడులంక చెరనున్నసీతమ్మ,రఘువరునకు మరల సంధాన మొనరి౦చె మహిత భక్తి
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొన్నటి పూరణ:జీవన ప్రక్రియల్ నిలువ చేటగు రీతిగ త్రవ్వకాల పర్యావరణమ్ము ధ్వంసమగు నా ఖనిజమ్ముల దోచి, సంపదల్కోవెల రాయడున్ కరుణఁ గూర్చగ వజ్రకిరీట సేవలన్దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతురెల్లడన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ (మొన్నటి సమస్యకు) పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణచాప మెత్తగ వివశులై చూప వెన్ను ధరణి రాజులు,వీరుడౌ దాశరధియె శివధనుర్భంగ మొనరించె;బవనసుతుడుశోకమును బాపె సీతకశోకవనిని
భాగవతుల కృష్ణమూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
దశరథసుతుడట మిథిలలో తరుణి సీతఁను పరిణయ మాడ దలచి తా నొక్కడపుడుశివధనుర్భంగ మొనరించె,పవనసుతుడువాసి గాంచెను శ్రీరామ బంటు గానె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
దాశరథి సీతఁ చేపట్ట దలచి తానుశివధనుర్భంగ మొనరించె ,పవన సుతుడురామకథను గానము చేయ రమణి సీత పులకరించుచు దీవించి ముదము నందె
పంకజనయన సుకుమారి పరమ సాధ్విరమణి సీతకొరకె గదా రాము డపుడుశివధనుర్భంగ మొనరించె, బవన సుతుడుకడలి లంఘించినదియునా పడతి కొరకె.
జానకిని గొన రాముడు జనకు సభనుశివధనుర్భంగ మొనరించెఁ ,బవనసుతుఁడుమ్రొక్కె పాదము లంటుచు చక్కగానురామపట్టాభిషేకము రహిని జరుగ
శశికాంత్ మల్లప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిరాముఁ డంతట గురునకుఁ బ్రణతి సేసి,
శివధనుర్భంగ మొనరించెఁ; బవనసుతుఁడు
పరిచయము కాక మునుపె; యా పడతి సీతఁ
బెండ్లి యాడఁగఁ దలఁచియుఁ బ్రీతితోడ!!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువులకు నమస్కారములు
తొలగించండిసోదర సోదరీ మణు లందరికీ క్రిస్మస్ + నూతన సంవత్సర శుభాకాంక్షలు
నేను బొస్టన్ వెడుతున్నాను....... గ ! . సోమవారం వరకు సెలవు
గురువు గారికి నమస్కారములు
రిప్లయితొలగించండిరఘు కులోత్తము డైనట్టి రాముడంత
అంబుజాక్షి సీతమ్మ స్వయంవరమున
శివ ధనుర్భంగ మొనరించె! బవన సుతుడు
శింశుపావృక్ష ఛాయన సీత గాంచి
పలికిన పలుకు లవియెల్ల పడతి వినియె.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హరియె తానైన రాముడే యక్కజముగ
రిప్లయితొలగించండిశివధనుర్భంగ మొనరించె , పవనసుతుదు
తా శివాంశ సంభూతుడై దాశరధికి
దాసుడగుటేమి ? యిట్లుండు దైవలీల
ధనికొండ రవిప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నమస్కారం గురువర్యా. నిన్నటి పూరణ ఆలస్యంగా ప్రవురించడం వలన మీరు చూడనట్లుంది. మరలా ఇక్కడ ప్రచురిస్తున్నాను. తప్పులున్న తెలియజేయ మనవి.
రిప్లయితొలగించండివళ్ళు బడగ చర్మ మొళ్ళు గూల, జనని
మార జనకుఁ డతఁడె మార, వైరి
భావమదియె వద్దు వారిపైన, వలదు
వదల వృద్ధ గృహము నందునింక
రవికాంత్ మల్లప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తాటకిని జంపె రాముండు! తపసి మెచ్చ
రిప్లయితొలగించండిరాతి నాతిఁ జేసె!జనక కూతుఁ బొంద
శివధనుర్భంగ మొనరించె! పవనసుతుడు
భక్తితో పాడు పరమాత్మ పాటలందు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురునియాజ్ఞగ నే స్వయం వరమునందు
రిప్లయితొలగించండిశివ ధనుర్భంగమొనరించె|బవన సుతుడు
నెంచు కొన్నట్టి దైవమే-నెలత సీత
తలపునందునరాముడేధర్మపరుడు.
2.శివ ధనుర్భంగ మొనరించె”పవనసుతుడు
భక్తితో గొల్చు మదిభగవాను డైన
రామచంద్రుడు-స్వయం వరమున-రాజు
లందరుజూడంగ-సీతను లగ్నమాడె.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అరయ రామాయణమున దశరథసుతుడు
శివధనుర్భ౦గ మొనరి౦చె | పవనసుతుడు
భారతమున కురుకులేశు నూరువులను
భ౦గ మొనరి౦చి వధియి౦చె భ౦డనమున
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీత నుద్వాహమాడగ శీఘ్రతతిని
రిప్లయితొలగించండినిండు సభలోన రాముడు నెమ్మితోడ
శివధనుర్భంగ మొనరించె ,బవనసుతుడు
రామ బంటుగ జగతిని రాణ కెక్కె
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామవైరియె జపియించు నామమెద్ది
రిప్లయితొలగించండిసీతబట్టగ రామయ్య చేసెనేది
సీత జాడను లంకలో వెదకెనెవడు
శివ, ధనుర్భంగ మొనరించెఁ, బవనసుతుఁడు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిక్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
హరికథా గాయకు డయిన. భరత శాస్త్రి
ఆ౦జనేయ చరిత్ర నత్యద్భుతముగ
గ్రామముల య౦దు వినిపి౦చి ఘనత గా౦చె |
మొన్న నచ్చోట కథ చెప్పుచున్న వేళ
" శివధనుర్భ౦గ మొనరి౦చె పవనసుతు డ "
ట౦చనియె పొరబడి , సవరి౦చు కొనియె !
ె
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమల రాముడు సీతమ్మనుమనువాడ
రిప్లయితొలగించండిశివధనుర్భంగ మొనరించెఁ, బవనసుతుఁడు
జలధి లంఘించి సీతమ్మ జాడ నరసె
పుడమి హనుమడు రాముడు పూజ్యవరులు.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తాటకిని జంపె రాముండు! తపసి మెచ్చ
రిప్లయితొలగించండిరాతి నాతిఁ జేసె!జనక కూతుఁ బొంద
శివధనుర్భంగ మొనరించె! పవనసుతుడు
భక్తితో పాడు పరమాత్మ పాటలందు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధరణి పుత్రిని చేబట్ట దాశరధియె
రిప్లయితొలగించండిశివధనుర్భంగమొనరించె, బవనసుతుడు
సీత జాడను కనుగొని శీఘ్రముగను
రామ రావణ యుద్ధపు రచనజేసె!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధరణి పతుల కసాధ్యంబు తాపసులును
రిప్లయితొలగించండిజనులు మెచ్చగ శ్రీరామ చంద్రు డంత
శివధనుర్భంగ మొనరించెఁ బవనసుతుఁడు
నాకథ విని జెందె పరమానంద మంత
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు పనుపున రఘురాముడరగి మిథిల
రిప్లయితొలగించండిశివదనుర్భంగ మొనరించె, పవనసుతుడు
రామ భజనను సలుపుచు రమణ తోడ
భక్తులం దగ్ర గణ్యుడై వాసి కెక్కె
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికీ, పెద్దలందరికీ నమస్కారం. సీత యందున్న ప్రేమ, గౌరవం వల్ల రాముడు శివధనువు విరిచీ, హనుమ రామ చరితను గానం చేసీ ఆమెను సంతోష పెట్టారూన్న భావనలో పూరణ చేశాను. పరిశీలించి తప్పులుంటే తెలియచేయగలరు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండితే.గీ:
రమణిజానకిముదమొంద రాముడపుడు
శివధనుర్భంగ మొనరించెఁ; బవనసుతుఁడు
పలికె శ్రీరామ చరితము పడతి కొరకు
అవనిజయెడనిరువురికి,యమితనెనరు
వేదుల సుభద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రమణి సీతను పెండ్లాడ రాఘవుండు
రిప్లయితొలగించండిశివధనుర్భంగ మొనరించె.బవనసుతుడు
లంక చెరనున్నసీతమ్మ,రఘువరునకు
మరల సంధాన మొనరి౦చె మహిత భక్తి
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొన్నటి పూరణ:
తొలగించండిజీవన ప్రక్రియల్ నిలువ చేటగు రీతిగ త్రవ్వకాల ప
ర్యావరణమ్ము ధ్వంసమగు నా ఖనిజమ్ముల దోచి, సంపదల్
కోవెల రాయడున్ కరుణఁ గూర్చగ వజ్రకిరీట సేవలన్
దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతురెల్లడన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ (మొన్నటి సమస్యకు) పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిచాప మెత్తగ వివశులై చూప వెన్ను
ధరణి రాజులు,వీరుడౌ దాశరధియె
శివధనుర్భంగ మొనరించె;బవనసుతుడు
శోకమును బాపె సీతకశోకవనిని
భాగవతుల కృష్ణమూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దశరథసుతుడట మిథిలలో తరుణి సీతఁ
రిప్లయితొలగించండిను పరిణయ మాడ దలచి తా నొక్కడపుడు
శివధనుర్భంగ మొనరించె,పవనసుతుడు
వాసి గాంచెను శ్రీరామ బంటు గానె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదశరథసుతుడట మిథిలలో తరుణి సీతఁ
రిప్లయితొలగించండిను పరిణయ మాడ దలచి తా నొక్కడపుడు
శివధనుర్భంగ మొనరించె,పవనసుతుడు
వాసి గాంచెను శ్రీరామ బంటు గానె.
దాశరథి సీతఁ చేపట్ట దలచి తాను
రిప్లయితొలగించండిశివధనుర్భంగ మొనరించె ,పవన సుతుడు
రామకథను గానము చేయ రమణి సీత
పులకరించుచు దీవించి ముదము నందె
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పంకజనయన సుకుమారి పరమ సాధ్వి
రిప్లయితొలగించండిరమణి సీతకొరకె గదా రాము డపుడు
శివధనుర్భంగ మొనరించె, బవన సుతుడు
కడలి లంఘించినదియునా పడతి కొరకె.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పంకజనయన సుకుమారి పరమ సాధ్వి
రిప్లయితొలగించండిరమణి సీతకొరకె గదా రాము డపుడు
శివధనుర్భంగ మొనరించె, బవన సుతుడు
కడలి లంఘించినదియునా పడతి కొరకె.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జానకిని గొన రాముడు జనకు సభను
రిప్లయితొలగించండిశివధనుర్భంగ మొనరించెఁ ,బవనసుతుఁడు
మ్రొక్కె పాదము లంటుచు చక్కగాను
రామపట్టాభిషేకము రహిని జరుగ
జానకిని గొన రాముడు జనకు సభను
రిప్లయితొలగించండిశివధనుర్భంగ మొనరించెఁ ,బవనసుతుఁడు
మ్రొక్కె పాదము లంటుచు చక్కగాను
రామపట్టాభిషేకము రహిని జరుగ
శశికాంత్ మల్లప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.