29, డిసెంబర్ 2015, మంగళవారం

సమస్య – 1898 (భజనాదుల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భజనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే. 
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

40 కామెంట్‌లు:

 1. గురువుగారికి నమస్కారములు

  సుజనుడు సద్గుణ వంతుడు
  భజనాదుల కిష్టపడడు, పరమాత్ముండే
  విజయము చేగూర్చును నా
  మజపము జేసినను చాలు మహిమాన్వితుడే

  రిప్లయితొలగించండి
 2. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
  -------------------------
  నిజమైన భక్తి లేనిదె
  రజతపు సింహాస నమీయ రారాజు వట
  న్నజితుని ప్రీతిగ కొలిచిన
  భజనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో గణదోషం. ‘రజతపు సింహాసనమున రారాజైన| న్నజితుని...’ అందాం.

   తొలగించండి
 3. నిజమైన యోగ విద్యయె
  విజయముజేకూర్చిపెట్టి విజయుంజేసెన్
  సుజనులకదె యోగ్యంబను
  భజనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే

  రిప్లయితొలగించండి
 4. నిజమే! నవవిధభక్తుల
  నజయుని సేవించవచ్చు నందురు; కానీ
  సుజనత్వరహిత కుహనా
  భజనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కుహనా భజనాదులని చక్కగా విశదీకరించారు. అభినందనలు. నామసంకీర్తనలు భజనలూ భగవంతునికి యిష్టమే.

   తొలగించండి
 5. గురువుగారికీ, పెద్దలకు నమస్కారం. భజనా, కీర్తనములు భగవంతుని చేరేందుకు దగ్గర దారులే కానీ సుజనత లేక వాటిని చేసిన ఏడల భగవంతుడు ఇష్టపడడు అన్న భావనలో రాసిన పద్యము. దయచేసి పరిశీలించగలరు. ధన్యవాదాలు.
  కం:
  భజనయుసంకీర్తనములు
  అజన్మసాధకతెరువులుయన్నదినిజమే
  సుజనతచేరకగరిపెడు
  భజనాదులకిష్టపడడు,పరమాత్ముండే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేదుల సుభద్ర గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘తెరువులు+అన్న’ అన్నపుడు యడాగమం రాదు. ‘తెరువు లటన్నది నిజమే’ అనండి.

   తొలగించండి
 6. నిజమైన భక్తుడెప్పుడు
  భజనాదులనిష్టపడడు ,పరమాత్ముండే
  సుజనుల భక్తికి మెచ్చుచు
  నజరామర ముక్తినిచ్చి యాహ్వానించున్

  రిప్లయితొలగించండి
 7. సుజల ఫలామల దళ కుసు
  మజాలముల సంతసించు మాధవు డెలమిన్
  కుజన కృతాడంబర ఘన
  భజనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాశతకమునందలి పద్యము:
   ఫల పుష్పామల తోయా
   దుల హరి గొలిచిన యఘములు తుత్తునియలగున్
   బలమైన భక్తి మన మం
   దలరారగఁ బోచిరాజతనయా వినుమా

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ, శతకపద్యం రెండూ బాగున్నవి. అభినందనలు.
   శతక పద్యంలో ‘...గొలిచిన నఘములు...’ అనండి.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. శతక పద్యములో సవరించితిని.

   తొలగించండి
 8. సుజనత లేకుండ జరుపు
  భజనాదుల కిష్టపడడు పరమేశ్వరుడే
  నజరామరమగు భక్తికి
  నిజముగ హరి దాసుడందు రిలలో విజ్ఞుల్!!!

  రిప్లయితొలగించండి
 9. కుజను లొనర్చెడి భేషజ
  భజనాదుల నిష్ట పడడు పరమాత్ముం డే
  ఋజువర్తను డిచ్చెడి సుమ
  రజ మైనను స్వీకరించి రక్షణ నొసగున్

  రిప్లయితొలగించండి
 10. నిజభక్తి లేక చూచెడు
  ప్రజలెల్లన్ భక్తుడంచు ప్రస్తావించన్
  భజనలుఁ జేసెడు సంరం
  భ జనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. నిజమగు భక్తుని గనుగొని
  భజనాదులు నిష్టపడడు పరమాత్ముండే
  రుజువులు గలవిటవెన్నో
  భజనలు నధికారిచెంత వంచనగూర్చున్

  రిప్లయితొలగించండి
 12. సమస్య
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  భజనలను. పూజనముల. వ్ర
  త జప నియమముల నొనర్చి ధన్యలగుదురే ?
  కుజనాదుల , క్రౌర్యా ర౦
  భ జనాదుల , నిష్టపడడు పరమాత్ము౦డే ! !

  రిప్లయితొలగించండి
 13. కుజనుల భక్తిని మెచ్చడు
  భజనాదులనిష్టపడడు పరమేశ్వరుడే
  సుజనుల భక్తికి మెచ్చుచు
  నిజరూపముతోడవారి నిల రక్షించున్.
  2.అజసుతుడొనరించు భజన
  నిజమనమున మెచ్చి వరము నిచ్చె,నసురులై
  న జయవిజయాది రక్కసు
  భజనాదుల నిష్టపడడు పరమేశ్వరుడే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘జయవిజయాది రాక్షస| భజనాదుల...’ అనండి. ‘ఆది రక్కసు’లని సమాసం చేయరాదు కదా! అందులోను ‘రక్కసు’ ఏకవచన మవుతున్నది.

   తొలగించండి
 14. గజిబిజిగా జనులు సలుపు
  భజనాదుల నిష్ఠ పడడు పరమాత్ముండే
  నిజమైన భక్తి తోడు త
  నజస్రము సలుపు భ జనము నజితుడు మె చ్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. నిజమగు భక్తినె జూపును
  సుజనుం డాముష్మికమున సురలను జేరన్ ,
  కుజనుడు నటియించి జరువు
  భజనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే.

  రిప్లయితొలగించండి
 16. సమస్య
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  భజనలను. పూజనముల. వ్ర
  త జప నియమముల నొనర్చి ధన్యలగుదురే ?
  కుజనాదుల , క్రౌర్యా ర౦
  భ జనాదుల , నిష్టపడడు పరమాత్ము౦డే ! !

  రిప్లయితొలగించండి
 17. నిజముగ మానవ జాతిని
  కుజనలు తమ స్వార్థములక కుల మత హద్దుల్
  సుజనా! గీసిరి కాని వి
  భజనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే.

  రిప్లయితొలగించండి
 18. సుజనుల యిండ్లను సాదము
  గుజియలు బజ్జీలు లడ్లు గుంజుట కొరకై
  నిజమైన భక్తి కరవగు
  భజనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే :)

  రిప్లయితొలగించండి
 19. సుజనులు రోసెడి రీతిని
  భుజగమ్ముల వోలె నాడి పుంగీ తోడన్
  గజగజ వణకించెడి పలు
  భజనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే

  రిప్లయితొలగించండి