పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'తాత్విక స్వాదు' అన్నప్పుడు 'క' గురువై గణదోషం. 'తాత్విక సాధు' అందామా?
గురువుగారికీ, పెద్దలకు నమస్కారం. ఒక తల్లి కుమారుడికి హితము చెప్తున్నట్టుగా భావించి పూరణ చేశాను. మూడవ పాదాంతం లో నీవు కు మారుగా నీ అని ప్రయోగించాను. అది సరి అయినదా? పద్యమూ, భావమూ పరిశీలించి తప్పులు తెలియచేయగలరు. ధన్యవాదాలు.
సుభద్ర గారు గురువు గారు సూచించిన సవరణ బాగుంది. నీ అంటే నీయొక్క అనే అర్థము. నే అంటే నేను అని కూడా అర్థము దృతము లోపించు చోట. మొదటి పాదము లో జన్మమే యిలన్ అనండి. రెండవ పాదములో “నిల్పు ధర్మమున్” చివర గురువుండాలి గదా.
రిప్లయితొలగించండిటక్కరి వాడవై జనుల డబ్బును దోచుచు నేతనందువా
కక్కినకూడు మేయుచును ఖద్దరు దుస్తులు వేసుకొందువా
నిక్కము పూర్వజన్మమున నీవయి యుందువు తప్పకుండ యే
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తప్పకుండ నే...’ అనండి.
అక్కర లేనిమాటలను హద్దులు మీరుచు బుధ్ధిలేకయున్
రిప్లయితొలగించండితిక్కగ మాటలాడెదవు తిన్నగ జెప్పగ నెక్కదేమిరా
తుక్కవ గొట్టినన్ దెలియ దోచునొ లేదొమరేమి ఖర్మమో
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో
శశికాంత్ మల్లప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమస్కారమండి....అద్భుతమైన సమస్యనిచ్చారు...ధన్యవాదములండి
రిప్లయితొలగించండిమక్కువ గల్గినట్టి ఘన మానవ జన్మము పూర్వపుణ్యమే
చిక్కదు మాటిమాటికని చెప్పిరి పెద్దలు చిత్తగింపుడీ
యక్కరలేని జీవవలె నంకురమొందితి వెన్నిమారులో
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిఇది నేను సృష్టించిన సమస్య కాదు. ప్రసిద్ధమైన పాత సమస్యే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘జీవివలె’ టైపాటు వలన ‘జీవవలె’ అయినట్టుంది.
ధన్యవాదములండి గురువు గారూ! ......ఔను టైపోటు గమనించలేదండి.....సరిచేస్తాను........
తొలగించండిగురువు గారికి నమస్కారమండి....అద్భుతమైన సమస్యనిచ్చారు...ధన్యవాదములండి
తొలగించండిమక్కువ గల్గినట్టి ఘన మానవ జన్మము పూర్వపుణ్యమే
చిక్కదు మాటిమాటికని చెప్పిరి పెద్దలు చిత్తగింపుడీ
యక్కరలేని జీవివలె నంకురమొందితి వెన్నిమారులో
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో.
ఎక్కడి వాడవోయి యిట కెందుల కీవర దెంచినావు నీ
రిప్లయితొలగించండిటక్కరి చూపు మాటున బడాయి గనన్మరి తిక్కచేతలున్
మిక్కిలి మేయు తిండి గన మేదిన మాకు జనించె శంక చీ
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అరుదెంచినావు’ టైపాటు వల్ల ‘అరదెంచినావు’ అయింది.
మక్కువమీర గల్గినది మానవ జన్మము, తీరులోఫునే
రిప్లయితొలగించండిచక్కగసాటివారలకు సాయము జేయక మోసగించినన్
తక్కిన జన్మలందు మరి తప్పక నౌదువు, నిక్కమే సుమా
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు.
దక్కిన మానవాంశమున ధార్మిక తాత్త్విక స్వాదుచింతనన్
రిప్లయితొలగించండిమక్కువతో జరించినను మాన్యత రామ కృపా వశంబునన్
పెక్కగు పుణ్య రాసులవి పేర్మిని గల్గును లేనిచో సఖా!
కుక్కవొ పిల్లివో ..,,,,,,
మాన్యులు శంకరయ్య గారికి నమశ్శతములు.
రిప్లయితొలగించండిపొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తాత్విక స్వాదు' అన్నప్పుడు 'క' గురువై గణదోషం. 'తాత్విక సాధు' అందామా?
తప్పక అనుసరిస్తాను. సూచనకు కృతజ్ఞతలు.
తొలగించండిమాన్యులు శంకరయ్య గారికి నమశ్శతములు.
రిప్లయితొలగించండిదక్కిన మానవాంశమున ధార్మిక తాత్త్విక స్వాదుచింతనన్
రిప్లయితొలగించండిమక్కువతో జరించినను మాన్యత రామ కృపా వశంబునన్
పెక్కగు పుణ్య రాసులవి పేర్మిని గల్గును లేనిచో సఖా!
కుక్కవొ పిల్లివో ..,,,,,,
పొక్కి పడంగ నోపు నిక,బూటకమాడును మాయ జేయుచున్,
రిప్లయితొలగించండిబుక్కము గ్రోలు పాలితుల,పోకిరి చేష్ట లొనర్చు;త్రొక్కిడిన్
దక్కును,ఎక్కటిన్ దురము దార్కొను.ధీరుడ వయ్య నాయకా!
కుక్కవొ,నక్కవో,పులివొ,కోతివొ,పిల్లివొ,భూత పిల్లివో.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చక్కని రూప మింపలరు సద్గుణ రాశ్యతి కోమ లాంగియున్
రిప్లయితొలగించండిమక్కువ జూపి నింగొలుచు మానిని పైయిటు శంక వీడుమా
వెక్కస మాయె చేష్ట లవివేకపు మాటలు చాలునింక ఛీ
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో.
ఫొచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అక్కజమైననేమి యిది హాస్యముగాదు విధాత కేళిలో
రిప్లయితొలగించండికుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో
కొక్కెరవో కపోతమువొ కోయిలవో గత జన్మలోననీ
వెక్కడ యేలబుట్టితివొ నెవ్వడు జెప్పగ జాలడీ భువిన్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య క్రమాలంకారంలో
రిప్లయితొలగించండి1]చక్కటి నూర సింహముగ?2]సాత్వికమోసము?3]కాల్మణందునన్?
4]ఎక్కువ చేష్ట లున్న?5]మనసెంచెడి పార్టిని మారుటందునన్?
6]తిక్కగ వస్త్రదారణల తీరును గాంచగమానవాధమా?
1]కుక్కవొ,2]నక్కవో,3]పులివొ4],కోతివొ5],పిల్లివొ 6],భూతపిల్లివో.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చక్కని మాటలాడి కడు సాధువు వోలె చరించుచున్ సదా
రిప్లయితొలగించండితుక్కులు పెట్టుచున్ తిరుగు దుష్టుడ వంచు నిజంబెరింగితిన్
నిక్కముగా మనుష్యు నిగ నిన్ను తలంచను, పూర్వ జన్మలో
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ బూతపిల్లివో
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో
రిప్లయితొలగించండినిక్కము జెప్పుమా రమణ! నీయదిచేష్టలుజూడగామరిన్
మక్కువ తోడనుంటినిట చక్కనివంశము నందుపుట్టియు
న్నిక్కరణిన్ భుజించుటయ యెట్లుగ దోచెనునీకునక్కటా!
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చక్కని జన్మ నొందితివి సార్థకమొందగ సంచరించుచున్
రిప్లయితొలగించండిమ్రొక్కుము కన్నవారికిల మోదము నీయుచు నెల్లవేళలన్
మక్కువమీర నందరికి మంచిని పంచుమ నీదు దారిలో
నక్కర లెన్నివచ్చినను నాత్రుత జెందక సద్గుణమ్ములే
చిక్కుల జక్కజేయునని శీఘ్రము నమ్ముచు విష్ణుగొల్చినన్
దక్కును మంచి పుట్టుకయె తక్కినజన్మములందు లేనిచో
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుమూర్తి ఆచారి గారి పూరణ.....
రిప్లయితొలగించండి{అత్తను దూషి౦చిన కోడలిని ప్రక్కి౦టావిడ మ౦దలి౦చగా కోడలు పశ్చాత్తాపము చె౦దుట}
"చిక్కవు మ౦చి మాటలకు ఛీ యనినన్ చెవి యొగ్గబోవు నీ
తిక్కదన౦బు కాల" యని తిట్టుచు కోపిలు నత్తc గా౦చుచున్
చక్కదనాల కోడ లనె నవ్వులు రువ్వుచు "తెల్పు మత్తరో
నిక్కము పూర్వజన్మమున నీవొక గూబవొ మాలకాకివో
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో?"
ముక్కయు పల్కకు౦డ నొక మూలన కూర్చొనె నత్త, కారణ౦
బొక్కటె, ని౦డ బ౦డ చెవు డున్నది, ప్రక్కన ఆ౦టి వచ్చుచున్
చక్కున నిట్లు పల్కినది "జానకి యత్తను దూర న్యాయమే?
మిక్కుట మైన పాపము సుమీ! విను నీదగు మ౦చి గోరియే
నొక్కి వచి౦చు, కాదు నిను నొవ్వగ జేయగ నత్త యన్నచో
చొక్కపు ప్రేమ మెల్లపుడు జూపెడు మాతృసమాన, నేటి కోడలే
చిక్కును రేప టత్త యయి, చెప్పవె యామెకు సారి యన్న తా
గ్రక్కున నత్త పాదముల వ్రాలెను కోడలు రాల్చి బాష్పపున్
చుక్కలు, కోడలిన్ నిమురుచున్ మిగులన్ పులకి౦చె నత్తయున్ !!!
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిక్కని యంధకారమున చెంగున ప్రక్కన దూకెనెవ్వరో
రిప్లయితొలగించండినిక్కము గాంచలేనిచట నీవెవరో మరి జెప్పునేస్తమా
పక్కనెవచ్చుచుంటివిగ బల్కవె నామది చింత బాపగా
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో !!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికీ, పెద్దలకు నమస్కారం. ఒక తల్లి కుమారుడికి హితము చెప్తున్నట్టుగా భావించి పూరణ చేశాను. మూడవ పాదాంతం లో నీవు కు మారుగా నీ అని ప్రయోగించాను. అది సరి అయినదా? పద్యమూ, భావమూ పరిశీలించి తప్పులు తెలియచేయగలరు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఎక్కడిపుణ్యమోతగిలియెత్తితివీనరజన్మమేనిలన్
మిక్కిలిమంచికార్యములుమిన్నగచేయుచుధర్మమేనిల్పు
చక్కనిమార్గమే గనుచు చాగుము,పట్టిన పక్కదారి,నీ
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో
వేదుల సుభద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
నీవును నీ అనడం సరికాదు. ‘సాగుము పట్టినదారి తప్పినన్’ అందామా?
సుభద్ర గారు గురువు గారు సూచించిన సవరణ బాగుంది. నీ అంటే నీయొక్క అనే అర్థము. నే అంటే నేను అని కూడా అర్థము దృతము లోపించు చోట.
తొలగించండిమొదటి పాదము లో జన్మమే యిలన్ అనండి.
రెండవ పాదములో “నిల్పు ధర్మమున్” చివర గురువుండాలి గదా.
కామేశ్వర రావు గారూ,
తొలగించండినా దృష్టికి రాని లోపాలను గుర్తించి, సవరణలను సూచించారు. ధన్యవాదాలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఎన్నో పూరణలను తక్కువ వ్యవధిలో పరిశీలించునపుడు దృష్టి పథానికి రాకపోవడము సహజము. ధన్యవాదములు.
తొలగించండిధన్యవాదాలు గురువుగారు, కామేశ్వరరావు గారు. మీ సూచనలననుసరించి తప్పులు సవతించుకుని పద్యం తిరిగి రాసుకున్నాను. ధన్యవాదాలు.
తొలగించండిగురువుగారూ నమస్కారం. క్రింది సమస్య పరిశీలించి క్రిస్మస్ సందర్భంగా పూరణ కై ఉంచగరని మనవి.
రిప్లయితొలగించండి"క్రీస్తు జన్మించె తనవారు ఖిన్నులవగ"
గురువుగారూ నమస్కారం. క్రింది సమస్య పరిశీలించి క్రిస్మస్ సందర్భంగా పూరణ కై ఉంచగరని మనవి.
రిప్లయితొలగించండి"క్రీస్తు జన్మించె తనవారు ఖిన్నులవగ"
శశికాంత్ గారూ,
తొలగించండిసమస్య బాగుంది. ‘అవగ’ అనడం వ్యాకరణరీత్యా దోషం. ‘క్రీస్తు జన్మించె తనవారు ఖిన్నులైరి’ అంటే ఎలా ఉంటుంది?
బాగుంది.
రిప్లయితొలగించండివ్యాకరణ దోషం వివరించగలరని మనవి
ధన్యవాదాలు.
‘అగు’కు రూపాంతరం ‘అవు’. కాని అవగా అనే అర్థంలో గ్రాంధికంలో ‘కాఁగ’ అనేదే ఉంది. వివరంగా చెప్పాలంటే నా దగ్గర ప్రస్తుతం వ్యాకరణగ్రంధాలేవు. ప్రయత్నిస్తాను.
తొలగించండిశ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిఎక్కువ మాటలాడి నిజమెన్నడు దెల్పని ప్రాణి వౌచునున్
తక్కువ జేసి యన్యులను తల్చుచు , హీనులయట్లు జూచుచున్
చిక్కగ నీక నీ మనసు చిత్రముగా చరియించు జీవివే !
కుక్కవొ, నక్కవో, పులివొ, కోతివొ,పిల్లివొ
భూత పిల్లివో
భాగనతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
ఇద్దరు మిత్రుల మధ్య చరవాణిలో జరిగిన సంభాషణ:
తొలగించండిచక్కగ పాఠశాలకని సాగితివక్కడ నీతిచంద్రికన్
మక్కువ తోడ నాటికగ మార్చగ నీకొక జంతు వేషమే
దక్కెనటంచు దెల్పితివి దాచక చెప్పుము పాత్రలందునన్
కుక్కవొ? నక్కవో? పులివొ? కోతివొ? పిల్లివొ? భూతపిల్లివో?
గురుదేవులకు ధన్యవాదములు.
తొలగించండిఒక నిష్ఠగల బామ్మ తను వండుకున్న పాయసంలో ఓ ఊరకుక్క తీసుకొచ్చిన యముకలు వేయగా, ఇలా దూషిస్తుంది.
రిప్లయితొలగించండిఎక్కడనుంచి వచ్చినదొ యీ శునకంబిటు నోటదెచ్చె, నే
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో
బొక్కలు, వండినట్టి మడి పొంగలి జేయగ గంగపాలు, నే
నిక్కము ఒక్కటిచ్చెదను నిట్టెము దీనిది చెక్కలవ్వగన్
ధన్యవాదాలు గురువు గారు, కామేశ్వర రావు గారు. తప్పులు సవరించి తిరిగి రాశాను.
రిప్లయితొలగించండిమనుచరిత్ర (by GP Sastry): 👇
రిప్లయితొలగించండిమిక్కిలి యాశతోడ నిను మెచ్చుచు వల్చితి భూసురేంద్ర! నీ
చక్కని పిల్కజూచి మహ చక్కిలి గింతలు గల్గగాను...నా
కక్కర లేదు ముద్దులని కౌగిలి విప్పుచు పారిపోతివే!
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో!!!
కట్టుచు సూత్రమున్ మెడకు కౌగిలి జేర్చుచు ముద్దులాడితే!
రిప్లయితొలగించండిపిట్టను వోలి యుద్ధవుడ! పెండ్లిని రద్దిడి పిల్లపుట్టగన్
చట్టున భాజపా విడుచు జంకగ సోనియ కాళ్ళు పట్టితే!
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో?