5, డిసెంబర్ 2015, శనివారం

సమస్య - 1875 (నన్నెచోడుఁడు రచియించె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
నన్నెచోడుఁడు రచియించె నైషధమును. 

42 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో '... యిలను పెరిగి,... కవులు మా కేల యనెడి, ...పరీక్షను దెల్పె' అనండి.

   తొలగించండి
  2. 1.
   యెంసె టైయ్యైటి చదువులే యిలను పెరిగి
   గోల కావ్యముల్ కవులుమా కేల యనెడి
   యువకు డొకపరీక్షను దెల్పె నుత్తరముగ
   నన్నెచోడుడు రచియించె నైషదమును.

   2.
   తెలుగు భాషకె వన్నెయై తేనెలొలుకు
   చక్కనైన కృతి కుమార సంభవమును
   నన్నెచోడుడు రచియించె, నైషదమును
   వ్రాసె కవిసార్వ భౌముండు రమ్యముగను

   తొలగించండి
  3. గురువు గారికి నమస్కారములు.....పిత్రుదేవుని కర్మాది క్రతువులో పూర్తి గా తీరిక దొరకని వేళలోనూ మా పద్యములను సమీక్షించిన మీ కార్యదీక్ష కు జోహారులు....ధన్యవాదములు.

   నా మొదటి పద్యపు రెండవ పాదములో
   నాటి కావ్యముల్ కవులు నాకేటి కనెడు స్థానమున మీరు
   నాటి కావ్యముల్ కవులు మాకేల యనెడు గా సూచించినారు..ఐతే అపుడు యతి కుదరడం లేదని
   గోల కావ్యముల్ కవులు మాకేల ననెడి గా సవరించాను దొషమున్నట్టవుతే తెలుప మనవి

   తొలగించండి
  4. శర్మ గారూ,
   నిజమే... సవరణ సూచించే సమయంలో యతని గమనించలేదు. ధన్యవాదాలు. మీ సవరణ బాగున్నది. అభినందనలు

   తొలగించండి
 2. పద్య సంపద కాణాచి భరత భూమి
  స్కంద చరితగు కుమార సంభ వమ్ము
  నన్నె చోడుడు రచియించె.నైష ధమును
  ప్రౌఢ శ్రీనాధు డలరించె భాసు రముగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. 'స్కందచరిత మగు కుమారసంభవమును' అనండి.

   తొలగించండి
  2. పద్య సంపద కాణాచి భరత భూమి
   స్కంద చరితగు కుమార సంభ వమును
   నన్నె చోడుడు రచియించె.నైష ధమును
   ప్రౌఢ శ్రీనాధు డలరించె భాసు రముగ

   తొలగించండి
  3. అక్కయ్యా,
   చరిత + అగు = చరిత యగు అవుతుంది. అక్కడ సంధి లేదు.

   తొలగించండి
  4. పద్య సంపద కాణాచి భరత భూమి
   స్కంద చరితమగు కుమార సంభ వమును
   నన్నె చోడుడు రచియించె.నైష ధమును
   ప్రౌఢ శ్రీనాధు డలరించె భాసు రముగ

   తొలగించండి
 3. ఆదికవియైన నన్నయ యాది లోనె
  భారతమును వ్రాసె ;కుమార సంభవము నిచట
  నన్నె చోడుడు రచియించె;నైషధమ్ము
  వ్రాసి కవిసార్వ భౌముడు వాసి కెక్కె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. 'కుమారసంభవమును' అనండి.

   తొలగించండి
 4. మిత్రులందఱకు నమస్సులు!

  మితిలేని పనుల యొత్తిడిచే నేను మన బ్లాగునందుఁ బూరణాదులు చేయలేకపోవుచుంటిని. మన్నింపుఁడు.

  తెనుఁగునఁ గుమారసంభవము నెవఁడు రచి
  యించె? దండి కావ్యాదర్శ మేమి సేసెఁ?
  బఱఁగ శ్రీహర్షుఁ డెట్టి కావ్యము రచించె?

  నన్నెచోడుఁడు; రచియించె; నైషధమును!

  రిప్లయితొలగించండి
 5. గుండు మధుసూదన్ గారూ,
  క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. గురువు గారు నమస్తే నా పద్యం రెండో పాదంలో గణభంగం వల్ల మళ్ళీ వ్రాశాను పరిశీలించ మని మనవి.

  రిప్లయితొలగించండి
 7. ఆదికవియైన నన్నయ యాది లోనె
  వ్రాసె తాను;కుమార సంభవము నిచట
  నన్నె చోడుడు రచియించె;నైషధమ్ము
  వ్రాసి కవిసార్వ భౌముడు వాసి కెక్కె.

  రిప్లయితొలగించండి
 8. భాసురముగ కుమార సంభవమును సుక
  వి “కవి రాజశిఖామణి” బిరుదు నలరి
  నన్నెచోడుఁడు రచియించె, నైషధమును
  వ్రాసె నింపుగ “కవిసార్వభౌము” డడరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నా శతకము లోని పద్యము:
   జీవు లిల తమతమ మనో
   భావేచ్ఛల వర్తిలంగ వశులే మృతులన్
   భావించి హృదిం దగునే
   తా వగవం బోచిరాజతనయా వినుమా

   నాత్ర కశ్చిద్యథాభావం ప్రాణీ సమభివర్తతే.
   తేన తస్మిన్న సామర్థ్యం ప్రేతస్యా స్త్యనుశోచతః వా.రా. 2.105.28

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
   మీ పూరణ, శతకపద్యం రెండూ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 9. చారిమముగనిల కుమార సంభవమును
  నన్నెచోడుడు రచియించె, నైషధమును
  ఆంధ్ర పంచకావ్యములలో నాదిగాను
  రచన జేసి శ్రీనాధుడు రహినిగాంచె!!!  రిప్లయితొలగించండి
 10. గురువు గారూ, 'నన్నెచోడుడు రచియించె నైశధమును' పై పెద్దల పూరణలు బాగున్నవి విశేషించి ఇంకనేమియు వ్రాయలేకున్నాను.

  నిన్నటి సమస్యపై నా పూరణ ఇక్కడ ప్రచురిస్తున్నాను
  తప్పులున్న పరిష్కరించగలరు

  పురుషు డెవ్వడేని సతము భోగ విషయ
  మందు నాసక్తు డయ్యేని వాంఛ గలుగు
  జతగ వాంఛతో క్రోధంబు జనితమగును
  క్రోధమధికమవ్వ గలుగు క్షోభయెంతొ

  క్షోభ గల్గిన తన బుధ్ధి క్షూణమగును
  నాశమవ బుధ్ధి మనుజుడే నాశమగును
  తెలిసి, కృష్ణుడు గీతలో తెలియబరచ
  విడిచి చనదగు మనమంత వెలుగుకనగ...

  క్రోధ లోభ మోహములు. సద్గుణము లండ్రు,
  యింక ముప్పది తొమ్మిదా యీశ్వరునవె
  గొంచెమైన సంచితంబవ గోరదగును
  యంచెలుగ మోక్షసోపాన మమర మనకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శశికాంత్ మల్లప్ప గారూ,
   మీ సవివర పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పద్యంలో రెండవ పాదంలో యతి తప్పింది. అయ్యేని అనడం గ్రామ్యం. '.. మందు నాసక్తు డగునేని పొందు వాంఛ' అనండి.
   రెండవ పద్యంలో నాశమై బుద్ధి.. అనండి.
   మూడవ పద్యంలో అండ్రు + ఇంక.. అన్నప్పుడు యడాగమం రాదు.

   తొలగించండి
 11. ఘన కుమారసంభవమున-కల్పనలను
  నన్నె చోడుడురచియించె|”నైషధమును
  సరస శృంగార భావ నాభరణముగను
  మలచె” –శ్రీనాథుడానాడు|విలువ లెపుడు|

  రిప్లయితొలగించండి
 12. సమస్య
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  సత్కవులు నుతి౦ప = కుమార స౦భవమును
  నన్నెచోడుడు రచియి౦చె | నైషధమును ,
  హరవిలాసమున్ శ్రీనాధుడు రచియి౦చె |
  బమ్మెర రచి౦చె భవ్యమౌ భాగవతము |
  నా కవిత్రయము కలసి యద్భుతముగ
  రచన జేసిరి భారత గ్ర౦ధ మరయ |

  ................................................

  నిన్ననే గద యీ ధరణీ తలాన
  నాటె పావన రామాయణ మను కల్ప
  వృక్షమును మనోహరముగ. విశ్వనాధ
  సత్యనారాయణుడు ,కవిచక్రవర్తి
  ................. ............. ............ .
  ి

  రిప్లయితొలగించండి
 13. చదువులమ్మ కృప కుమార సంభవమును
  నన్నె చోడుడు రచియించె, నై ష దమును
  తెలుగు కవి సార్వ భౌముడుతీరుగాలి
  ఖించి కవులలో మేటిగా కీర్తిపొందె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. సముచిత మయినట్టి కుమార సంభవమును
  నన్నె చోడుడు రచియించె. నైష ధమును
  వ్రాసి కవి కాలిదాసు కడు వాసి కెక్కె
  నేటికిని వాటి ఘన కీర్తి నెగుడు చుండె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నైషధ కవి శ్రీహర్షుడు కదా!

   తొలగించండి
  2. శ్రీ శంకరయ్య గురువులకు నమస్కారములు
   నైషధము కలిదాసు వ్రాసిండను కున్నాను . సరియైన కవి పేపురు
   తెలిపిన మీకు ధన్యవాదములు. సవరించాను
   సముచిత మయినట్టి కుమార సంభవమును
   నన్నె చోడుడు రచియించె. నైష ధమును
   వ్రాసి కవియు శ్రీహర్షుడు వాసి కెక్కె
   నేటికిని వాటి ఘన కీర్తి నెగుడు చుండె.

   తొలగించండి
  3. లక్ష్మినారాయణ గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. "నన్నె చోడుడు రచియించె నైషధమును"
  యను దళము సమస్యగను మీరడిగినంత
  దెలిసె గాదె నేటికి భవదీయునకును
  నైషదము వేరొకని రచన యను నిజము.

  రిప్లయితొలగించండి
 16. మంత్ర దండము గూగుల్సు మనకు దెలుపు
  చక్కనౌ కావ్యము కుమార సంభవమ్ము
  నన్నెచోడుఁడు రచియించె ; నైషధమును
  నాడు లిఖియించె నల శ్రీనాధుడనుచు

  రిప్లయితొలగించండి
 17. నన్నెచోడుఁడు రచియించె నైషధమును
  బోలు పద్యము లెన్నియో, కాళిదాసు
  వారల కృతి కుమారసంభవముఁ దాను
  తేటతెనుఁగున వ్రాసెడు తెగువతోడ

  రిప్లయితొలగించండి
 18. స్కంద చరిత మగుకుమార సంభవమును
  నన్నెచోడుడు రచియించె, నైషధమును
  వ్రాసి శ్రీనాధు డలరెను వాసి కవిగ
  భువిని నాచంద్ర తారార్క ముగను సుమ్ము

  రిప్లయితొలగించండి