25, డిసెంబర్ 2015, శుక్రవారం

సమస్య – 1895 (క్రీస్తు జన్మించె…)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి.
ఈ సమస్యను పంపిన శశికాంత్ మల్లప్ప గారికి ధన్యవాదాలు.

55 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు

    నిశ్చితార్థమ్ము జరిగె కన్నియ మరియకు
    జోసెఫనువాడు కన్యకు జోడుగాగ
    అద్భుతముయె జరిగెనంత యామె కపుడు
    గర్భవతియయ్యెనాయింతి కన్నెదశన
    క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అద్భుతము+ఎ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘అద్భుతమ్మె జరిగెనంత...’ అనండి.

      తొలగించండి
    2. గురువు గారికి నమస్కారములు

      నిశ్చితార్థమ్ము జరిగె కన్నియ మరియకు
      జోసెఫనువాడు కన్యకు జోడుగాను
      యద్భుతమ్మె జరిగెనంత యామె కపుడు
      గర్భవతియయ్యెనాయింతి కన్నెదశన
      క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి

      తొలగించండి

  2. శిలువ పై క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి
    తెలియదు వారికి ప్రభువు తిరిగి జనియించు
    భరతదేశమున ఈశా గ బౌద్ధ గురువుల చెంత
    నేర్చిన విద్యన జనియించె తాను భరతభూమి కేగ !


    జీసస్ జిలేబీయం
    (Jesus Lived in India) ఆధారం గా
    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ వచన కవితకు నా ఛందోరూపం....
      కన్నె మరియకు లోకరక్షకుఁడు నగుచు
      క్రీస్తు జన్మించె; జనులెల్ల ఖిన్నులైరి
      శిలువ నెక్కించగా, పునర్జీవితుఁడయి
      భరతదేశాన గడపెను బౌద్ధులకడ.

      తొలగించండి
  3. కన్నెమరియకు చూడగా కడుపు పంట
    కనగ సైతాను జనులకు కడుపుమంట
    దైవ నిర్ణయమిదియని తలపలేక
    క్రీస్తు జన్మించె, జనులెల్ల ఖిన్నులైరి

    రిప్లయితొలగించండి
  4. జనులనుద్ధరించజగమందునుదయించి
    క్రీస్తు జన్మించె, జనులెల్ల ఖిన్నులైరి
    శిలువ పైనజూసియతనిన్ మొలలగుచ్చి
    మరలనుత్థానుడయ్యెను మహిమ దెలిపి

    రిప్లయితొలగించండి
  5. జనులనుద్ధరించజగమందునుదయించి
    క్రీస్తు జన్మించె, జనులెల్ల ఖిన్నులైరి
    శిలువ పైనజూసియతనిన్ మొలలగుచ్చి
    మరలనుత్థానుడయ్యెను మహిమ దెలిపి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శశికాంత్ మల్లప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదం చూసి మీరు ఆటవెలది వ్రాసారేమో అని సందేహించాను సుమా!

      తొలగించండి
    2. నాకు సహజంగా ఆటవెలదిలో స్ఫురిస్తుంది గురువుగారూ...
      ధన్యవాదాలు

      తొలగించండి
    3. నాకు సహజంగా ఆటవెలదిలో స్ఫురిస్తుంది గురువుగారూ...
      ధన్యవాదాలు

      తొలగించండి
  6. గొడ్ల సాలన నొకరోజు గోముగాను
    క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి
    శిలువ వేసిన సమయాన చేత లుడిగి
    సిక్త మగుటఃను నాక్రీస్తు రక్త మందు

    రిప్లయితొలగించండి
  7. నిన్నటి సమస్యకు పూరణ. గురువుగారు చూసి తప్పులున్న తెలియజేయ మనవి.

    ఒక నిష్ఠగల బామ్మ తను వండుకున్న పాయసంలో ఓ ఊరకుక్క తీసుకొచ్చిన యముకలు వేయగా, ఇలా దూషిస్తుంది.

    ఎక్కడనుంచి వచ్చినదొ యీ శునకంబిటు నోటదెచ్చె, నే
    కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో
    బొక్కలు, వండినట్టి మడి పొంగలి జేయగ గంగపాలు, నే
    నిక్కము ఒక్కటిచ్చెదను నిట్టెము దీనిది చెక్కలవ్వగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవికాంత్ మల్లప్ప గారూ,
      మీ (నిన్నటి సమస్యకు) పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  8. కరుణ మూర్తీభవించిన ఘనత గాంచి
    సహన శీలిగ నెలకొన్న సాధు మూర్తి
    కన్నె మరియకు ఫలముగ కడుపు పండ
    క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులవగ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. కృష్ణ క్రీస్తులిరువురు విపత్కర పరిస్థితులలో రాత్రి వేళ పుట్టారు. కృష్ణునికి యమునా నది దారిస్తే క్రీస్తునకు సముద్రము దారి యిస్తుంది. ఇరువురు పశుకాపరులే. ఒకరు ప్రవక్త వేరొకరు గీతాచార్యులు. బోయ వాని చేతిలో కృష్ణుడు, రాజు చేతిలో క్రీస్తు మరణిస్తారు.
    కంస చెఱ రాత్రి దేవకి కనియె కృష్ణు
    గడ్డిపాకలో గనె మేరి కాళరాత్రి
    జగతిఁ బరిరక్షకుండు కంసారి భంగి
    క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి.


    స్వపర భేదంబు లెక్కడ ప్రభుసుతునకు
    పరమ పురుషుడు మోద తాపముల సముడు
    యేసు నెఱుగ రప్పుడు తగ దిటు లనంగ
    క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ క్రీస్తుల పేర్లలో గూడ అక్షర సామ్యము. కంసుడు, హెరాడ్ రాజిరువురు కృష్ణ క్రీస్తుల వధార్థము పిల్లలని చంపిస్తారు.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. దుఃఖములను తొలగ జేసి దురితములను
    బాప కరుణాంత రంగుడై పావనుండు
    క్రీస్తు జన్మించె;జనులెల్ల ఖిన్నులవగ
    గొడ్లపాక యందున కన్నె కుక్షి యందు.

    రిప్లయితొలగించండి
  11. జీవ మున్నట్టి దేవుడు! శిలువపైన
    మరణమును పొంది మనలకై మరల లేచు
    ప్రభువు! పశువుల కట్టెడి పాకలోన
    క్రీస్తు జన్మించె! జనులెల్ల ఖిన్నులైరి.

    రిప్లయితొలగించండి
  12. దీన జనులను బ్రోచెడు దీక్ష తోడ
    కన్నెమరియమ్మ పావన గర్భమందు
    క్రీస్తు జన్మించె, జనులెల్ల ఖిన్నులైరి
    శిలువ వేయగనుత్తమున్ గలత జెంది

    రిప్లయితొలగించండి
  13. శిలువ నెక్కితినొకపరి తొలగ జేయ
    జనుల పాపము, లిక నేడు జనుల పాప
    కృత్యములు సేయబోరని యెంచి మరల
    క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి

    రిప్లయితొలగించండి
  14. మేరి మాత పుణ్య ఫలము తీరుగాను
    శుభ ముహూర్తము నందున శోభతోడ
    క్రీస్తు జన్మించె , జనులెల్ల ఖిన్నులిరి
    దైవ పు సుతుని వధియించ దారుణముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. వాడ వాడల వెలసిన గుడులయందు
    క్రీస్తు జన్మించె, జనులెల్ల ఖిన్నులైరి
    వదల దేవుడు మానస మందిరమును
    తానిమడలేననుచును సైతానుతోను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవికాంత్ మల్లప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ. దేవుడు కేవలం గుడుల్లో వెలసి మనుష్యుల హృదయాల్లోంచి మాయమవడం వల్ల మానవాళికి దుఃఖం మిగిలిందన్న అర్థంలో పూరించాను

      తొలగించండి
  16. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి పూరణ....

    శుక్రవారంపు దినమున శుద్దుడైన
    క్రీస్తునకు వేయగ శిలువ వాస్తవముగ
    ఆదివారమ్ము మహిమేమొ యచటె తిరిగి
    క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. పాపులను బ్రోవగ పశుల పాకనందు
    క్రీస్తు జన్మించె, జనులెల్ల ఖిన్నులైరి
    చూచి శిలువకు క్రీస్తను చిత్రమిదియె
    మంచివానికే జరుగును వంచనిలను.

    రిప్లయితొలగించండి
  18. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారూ...
    ప్రాస యతి కుదిర్చినప్పుడు, పాదంలో మొదటి అక్షరం గురువు లేదా బిందు పూర్వకం గాని అయితే ప్రాసయతి పూర్వాక్షరం కూడా గురువు లేదా బిందు పూర్వకం ఖచ్చితంగా అవాలని నియమం ఉందా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రాసయతి వాడునప్పుడు ఈ క్రింది లక్షణాలు గమనించాలి.
      1.ప్రాస పూర్వాక్షరం దీర్ఘమైతే ప్రాసయతిలోని యతిస్థానాక్షరం దీర్ఘమే కావాలి, అలాగే హ్రస్వమైతే హ్రస్వమే కావాలి.
      2.ప్రాస పూర్వాక్షరం గురువైతే ప్రాసయతికి ముందున్న యతిస్థానాక్షరం గురువే కావాలి. అలాగే లఘువైతే లఘువే కావాలి.
      3.ప్రాసాక్షరం ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం బిందుపూర్వకం, విసర్గపూర్వకం గాని అయితే ప్రాసయతిగా వాడే యతిస్థానాక్షరం తరువాత వేసే ప్రాసాక్షరం కూడ అలాగే ఉండాలి.
      4.ప్రాసయతిలో ప్రాసాక్షరంలోని హల్లు సామ్యమేకాని అచ్చు సామ్యం పాటించ బడదు.

      తొలగించండి
    2. అవును.
      నీలకంఠ! దేవ! ఫాలాక్ష! శశిమౌళి!
      రుద్ర! నాగభూష! భద్రమూర్తి!

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      చక్కని వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీకు కొంచెము శ్రమ తగ్గించుదామని నాకు తెలిసినవి వ్రాస్తున్నాను. ఇందులో యేమయునా దోషములున్న మీ సవరణలతో లబ్ది పొందవచ్చును గదా యని. ధన్యవాదములు.

      తొలగించండి
    5. పూజ్యులు కామేశ్వర రావుగారికీ గురువుగారికీ ధన్యవాదాలు నమస్కృతులు

      తొలగించండి
  20. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    గన జెరూసెల మున కన్య , గర్భమందు
    క్రీస్తు జన్మించె ; జనులెల్ల ఖిన్నులైరి
    శిలువగాగాంచి ; దీనుల చింత బాప
    నుర్భవించెను దైవమై యుర్వి లోన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఉద్భవించెను’ టైపాటు వల్ల ‘ఉర్భవించెను’ అయింది.

      తొలగించండి
  21. పసులపాకన మరియమ్మభాగ్యమట్లు
    క్రీస్తు జన్మించె|జనులెల్ల ఖిన్నులైరి
    ఆకశంబున నక్షత్రమందు కాంతి
    కదలి పసి కందునేజేరి|వదలి వెళ్ళ.

    రిప్లయితొలగించండి