అధిక పుష్టి నిచ్చు ఆరోగ్యమిచ్చునుబలము నిచ్చు కదళి ఫలము నిజముహద్దు మీరి దాని నధికము గా తిన్ననరటిపండు ప్రాణహరము విషము
అమృత మైన నేమి యధికము గాగ్రోలగరళ మగు ననుటయె మరువ రాదు రుచిని మరిగి హద్దెరుగక భుజించినన్ అరటి పండు ప్రాణ హరము విషము
ఆంజనేయ శర్మ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మరువ రాదు మనము మంగళ కరమంచు నరటి పండు , ప్రాణ హరము విషము పుడమి వరమ టంచు పుట్టిన ఫలములు హితము గాను తినగ మితము మరచి
రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నా అన్వయలోపం ఉంది. సవరించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సత్తువిచ్చునట్టి సంపూర్ణ ఫలమిదేఅరటి పండు ప్రాణహరము విషముజిమ్ము నట్టి ఫలము తీపినొసగునంచుతినగ నేల మనుజ తిక్క రేగు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, పూరణ బాగున్నది. కాని అన్వయలోపం ఉన్నట్టుంది. మీ భావాన్ని వివరిస్తారా?
పలు రసాయనములు వాడి పండించెడుపండ్లనారగించ వలదు! వలదు!కల్లకాదునిజము కార్బైడుతో మాగుయరటి పండు ప్రాణహరము! విషము!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘మాగు నరటిపండు...’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:పలు రసాయనములు వాడి పండించెడుపండ్లనారగించ వలదు! వలదు!కల్లకాదునిజము కార్బైడుతో మాగునరటి పండు ప్రాణహరము! విషము!
త్రాగబోకుడయ్య తనివిదీరగ సార మందు మానుడయ్య పొంద సుఖముఅరయ నాదుమాట ననుకోకు మాటలో నరటి పండు, ప్రాణ హరము విషము
భలె! భలే!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, విలక్షణమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు.సహదేవుడు గారూ ! మీ మెచ్చుకోలునకు ధన్యవాదములు
త్రాగబోకుడయ్య తనివిదీరగ సార మంచిజెప్పుచుంటి మాను, మందు అరయ నాదుమాట ననుకోకు మాటలో నరటి పండు, ప్రాణ హరము విషము
చలువజేయునయ్య! సామి!యీ పచ్చనియరటి పండు ప్రాణహరము విషముకుళ్ళినట్టి పండు కొంచెమై నదినకుమా,యెపుడును గలుగు మైకముయును
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మైకముయును’ అనడం దోషం. ‘మైక మెంతొ’ అనండి.
పుష్కలముగ కదళి పుష్టినొసంగుచుచాల మేలు చేయు జగతి కిదియెఅరటిపండు ప్రాణహరము విషముగాదు అమృతమ్ము సమము నంటిపలము!!!
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. అమృతమ్ము ... అన్నప్పుడు ‘అ’ లఘువే. దానివల్ల గణదోషం. ‘గాదు అమృత’ అని విసంధిగా వ్రాసారు. ‘విష మనకు| డమృతసమము గాదె యరటిపండు’ అనండి.
పుడమి పండ్ల శ్రేష్టము కదళీఫల మెంచ స్వాదుతరము నమృత సమము నైనమరులు కొనగ దగదు మధుమేహ రోగికినరటిపండు ప్రాణహరము విషము.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిన్ని,పెద్దకైన జీర్ణ శక్తిని బెంచుఅరటిపండు|”ప్రాణ హరము విషముమాగజేయగలుగు మందులు వాడినకృతిమ గెలలపంటకీడుమనకు.2.మాగినట్టి దైన మలబద్దకము మాన్పుఅరటిపండు|”ప్రాణహరము విషమునౌషదాలు గొట్ట?దోషముగల్గినరోజు-తినగరాదు మోజటంచు”
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కృత్రిమను కృతిమ అన్నారు. ‘కృత్రిమముగ పండ గీడు మనకు’ అనండి.
సుగరు రోగులకును వగపు కలుగ జేయు నరటి పండు ప్రాణ హరము, విషము కావు లోన పెట్టు కార్బైడు కెమికలు కాలుని దరి జేర్చు కరము వేగ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘కరము వేగ’ అన్నచోట ‘కడు రయమున’ అంటే బాగుంటుందేమో?
.”మంచిబలము నింపు మనచెంతమిత్రుడు,అరటిపండు|”ప్రాణ హరము,విషమునమ్మినట్టి వాణ్ణి నట్టేట ముంచునుగ|మధు మేహము మరి ఘాతకుడును.”
కె. ఈశ్వరప్ప గారూ, మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.‘మిత్రుడు అరటి’ అని విసంధిగా వ్రాయరాదు. ‘మిత్రుడౌ| నరటిపండు...’ అనండి. వాణ్ణి అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘నమ్మినట్టి నరుని...’ అనండి.
సర్వదేవతలకు చక్కనౌనైవేద్యమరటి పండటంచు మాన్యులనిరి సకలరోగులందు చక్కెర రోగుల కరటిపండు ప్రాణహరము విషము.
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధనికొండ రవిప్రసాద్ గారి పూరణ.....ఆత డేమి సేయు నని పల్క నాటలోనరటి పండు ప్రాణహరము విషమునగుచు నుండు నేత యది గమనించినరాజకీయ మందు తేజరిల్లు (రాజకీయాలలో ఒక్కొక్క మారు " ఈ ఆటలో అరటిపండు లాంటి చిన్న లీడర్ నన్నేమి చేస్తాడులే!" అనే ధీమాతో ఉంటే అతడు ప్రాణాంతకంగా తయారౌతాడు.)
M]సత్తువిచ్చునట్టి సంపూర్ణ ఫలమిదేఅరటి పండు: ప్రాణహరము విషముజిమ్ము నట్టి ఫలము తీపినొసగునంచుతినగ నేల మనుజ తిక్క రేగు.మనకు శక్తి నొసగు పండు అరటి పండు.ప్రాణాలనుతీసే ,విషాన్నిచ్చే పిచ్చిపళ్ళను తిని తిక్క (పిచ్చి)తెచ్చుకోవడమెందుకనే అర్థంలో వ్రాశాను .లేదంటే మరొకటి వ్రాస్తాను.
అధిక పుష్టి నిచ్చు ఆరోగ్యమిచ్చును
రిప్లయితొలగించండిబలము నిచ్చు కదళి ఫలము నిజము
హద్దు మీరి దాని నధికము గా తిన్న
నరటిపండు ప్రాణహరము విషము
అమృత మైన నేమి యధికము గాగ్రోల
రిప్లయితొలగించండిగరళ మగు ననుటయె మరువ రాదు
రుచిని మరిగి హద్దెరుగక భుజించినన్
అరటి పండు ప్రాణ హరము విషము
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మరువ రాదు మనము మంగళ కరమంచు
రిప్లయితొలగించండినరటి పండు , ప్రాణ హరము విషము
పుడమి వరమ టంచు పుట్టిన ఫలములు
హితము గాను తినగ మితము మరచి
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నా అన్వయలోపం ఉంది. సవరించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసత్తువిచ్చునట్టి సంపూర్ణ ఫలమిదే
రిప్లయితొలగించండిఅరటి పండు ప్రాణహరము విషము
జిమ్ము నట్టి ఫలము తీపినొసగునంచు
తినగ నేల మనుజ తిక్క రేగు.
సత్తువిచ్చునట్టి సంపూర్ణ ఫలమిదే
రిప్లయితొలగించండిఅరటి పండు ప్రాణహరము విషము
జిమ్ము నట్టి ఫలము తీపినొసగునంచు
తినగ నేల మనుజ తిక్క రేగు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిపూరణ బాగున్నది. కాని అన్వయలోపం ఉన్నట్టుంది. మీ భావాన్ని వివరిస్తారా?
పలు రసాయనములు వాడి పండించెడు
రిప్లయితొలగించండిపండ్లనారగించ వలదు! వలదు!
కల్లకాదునిజము కార్బైడుతో మాగు
యరటి పండు ప్రాణహరము! విషము!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మాగు నరటిపండు...’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు.
తొలగించండిసవరించిన పూరణ:
పలు రసాయనములు వాడి పండించెడు
పండ్లనారగించ వలదు! వలదు!
కల్లకాదునిజము కార్బైడుతో మాగు
నరటి పండు ప్రాణహరము! విషము!
త్రాగబోకుడయ్య తనివిదీరగ సార
రిప్లయితొలగించండిమందు మానుడయ్య పొంద సుఖము
అరయ నాదుమాట ననుకోకు మాటలో
నరటి పండు, ప్రాణ హరము విషము
భలె! భలే!
తొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండివిలక్షణమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు.
తొలగించండిసహదేవుడు గారూ ! మీ మెచ్చుకోలునకు ధన్యవాదములు
త్రాగబోకుడయ్య తనివిదీరగ సార
రిప్లయితొలగించండిమంచిజెప్పుచుంటి మాను, మందు
అరయ నాదుమాట ననుకోకు మాటలో
నరటి పండు, ప్రాణ హరము విషము
చలువజేయునయ్య! సామి!యీ పచ్చని
రిప్లయితొలగించండియరటి పండు ప్రాణహరము విషము
కుళ్ళినట్టి పండు కొంచెమై నదినకు
మా,యెపుడును గలుగు మైకముయును
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మైకముయును’ అనడం దోషం. ‘మైక మెంతొ’ అనండి.
పుష్కలముగ కదళి పుష్టినొసంగుచు
రిప్లయితొలగించండిచాల మేలు చేయు జగతి కిదియె
అరటిపండు ప్రాణహరము విషముగాదు
అమృతమ్ము సమము నంటిపలము!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమృతమ్ము ... అన్నప్పుడు ‘అ’ లఘువే. దానివల్ల గణదోషం. ‘గాదు అమృత’ అని విసంధిగా వ్రాసారు. ‘విష మనకు| డమృతసమము గాదె యరటిపండు’ అనండి.
పుడమి పండ్ల శ్రేష్టము కదళీఫల మెంచ
రిప్లయితొలగించండిస్వాదుతరము నమృత సమము నైన
మరులు కొనగ దగదు మధుమేహ రోగికి
నరటిపండు ప్రాణహరము విషము.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిన్ని,పెద్దకైన జీర్ణ శక్తిని బెంచు
రిప్లయితొలగించండిఅరటిపండు|”ప్రాణ హరము విషము
మాగజేయగలుగు మందులు వాడిన
కృతిమ గెలలపంటకీడుమనకు.
2.మాగినట్టి దైన మలబద్దకము మాన్పు
అరటిపండు|”ప్రాణహరము విషము
నౌషదాలు గొట్ట?దోషముగల్గిన
రోజు-తినగరాదు మోజటంచు”
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కృత్రిమను కృతిమ అన్నారు. ‘కృత్రిమముగ పండ గీడు మనకు’ అనండి.
సుగరు రోగులకును వగపు కలుగ జేయు
రిప్లయితొలగించండినరటి పండు ప్రాణ హరము, విషము
కావు లోన పెట్టు కార్బైడు కెమికలు
కాలుని దరి జేర్చు కరము వేగ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కరము వేగ’ అన్నచోట ‘కడు రయమున’ అంటే బాగుంటుందేమో?
.”మంచిబలము నింపు మనచెంతమిత్రుడు,
రిప్లయితొలగించండిఅరటిపండు|”ప్రాణ హరము,విషము
నమ్మినట్టి వాణ్ణి నట్టేట ముంచును
గ|మధు మేహము మరి ఘాతకుడును.”
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మిత్రుడు అరటి’ అని విసంధిగా వ్రాయరాదు. ‘మిత్రుడౌ| నరటిపండు...’ అనండి. వాణ్ణి అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘నమ్మినట్టి నరుని...’ అనండి.
సర్వదేవతలకు చక్కనౌనైవేద్య
రిప్లయితొలగించండిమరటి పండటంచు మాన్యులనిరి
సకలరోగులందు చక్కెర రోగుల
కరటిపండు ప్రాణహరము విషము.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధనికొండ రవిప్రసాద్ గారి పూరణ.....
రిప్లయితొలగించండిఆత డేమి సేయు నని పల్క నాటలో
నరటి పండు ప్రాణహరము విషము
నగుచు నుండు నేత యది గమనించిన
రాజకీయ మందు తేజరిల్లు
(రాజకీయాలలో ఒక్కొక్క మారు " ఈ ఆటలో అరటిపండు లాంటి చిన్న లీడర్ నన్నేమి చేస్తాడులే!" అనే ధీమాతో ఉంటే అతడు ప్రాణాంతకంగా తయారౌతాడు.)
M]
రిప్లయితొలగించండిసత్తువిచ్చునట్టి సంపూర్ణ ఫలమిదే
అరటి పండు: ప్రాణహరము విషము
జిమ్ము నట్టి ఫలము తీపినొసగునంచు
తినగ నేల మనుజ తిక్క రేగు.
మనకు శక్తి నొసగు పండు అరటి పండు.ప్రాణాలనుతీసే ,విషాన్నిచ్చే పిచ్చిపళ్ళను తిని తిక్క (పిచ్చి)తెచ్చుకోవడమెందుకనే అర్థంలో వ్రాశాను .లేదంటే మరొకటి వ్రాస్తాను.