1, ఫిబ్రవరి 2016, సోమవారం

సమస్య – 1931 (కాలయమునిఁ గొలువ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాలయమునిఁ గొలువఁ గాసు లొసఁగు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

43 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారము...ఆరోగ్యమెలావుందో...జాగ్రత్తగా మందులు వాడండి.

    సవితృ సుతుడతండు సమవర్తి గావున
    కాలయముని గొలువఁ గాసు లొసఁగు
    ననుట యనృత మదియు నాలకింపుడిదియు
    జాలి లేని వాడె కాలుడనగ

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      జ్వరం తగ్గింది. కానీ ఇంకా కోలుకోలేదు. ధన్యవాదాలు.
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘ముని’ అన్నచోట గణభంగం. ‘మౌనివేషమందు మాయగా డొకరుండు...’ అందామా?

      తొలగించండి
    2. మౌని వేషమందు మాయగాడొకరుండు
      జనుల జేరి పలికె, స్వర్ణమందు
      కాలయముని గొలువఁగాసు లొసఁగు నంచు
      పసిడి తస్కరించి పారిపోయె

      తొలగించండి
  3. శివుని యాజ్ఞ లేక చీమైన కుట్టదే
    నమ్ము చుండు జనులు నెమ్మి గాను
    నేది సత్య మిలను నేదసత్య మనగ
    కాల యమునిఁ గొలువఁ గాసు లొసఁగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘నమ్ముచుంద్రు’ అనండి.

      తొలగించండి
    2. శివుని యాజ్ఞ లేక చీమైన కుట్టదే
      నమ్ము చుంద్రు జనులు నెమ్మి గాను
      నేది సత్య మిలను నేదసత్య మనగ
      కాల యమునిఁ గొలువఁ గాసు లొసఁగు

      తొలగించండి

  4. శుభోదయం

    ఊరి లోన పంపకాలయ మనుగుడి
    యుండె; గలడు సామియు ముని రూప
    ముగను; మనసు వెన్న ; ముప్పూటలన పంప
    కాలయ ముని గొలువ గాసు లొసగు

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. చెప్పుడు పలుకులను చెవియొగ్గియు వినబో
    'కాలయమునిఁ గొలువఁ గాసు లొసఁగు'
    మునుల గొలువ నీకు మోక్షమార్గముజూపు
    కాసు లొసగ డెపుడు దాసు వైన.

    రిప్లయితొలగించండి
  6. ఇచ్చు నాయువునిల నిబ్బడిగనుమరి
    కాలయమునిగొలువ, గాసులిచ్చు
    నాదిదేవుగొలువ ,నైహికసుఖములు
    భోగభాగ్యములను గూడ బుడమియందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరిపాదంలో గణదోషం. ‘భోగభాగ్యములను బుడమియందు’ అనండి.

      తొలగించండి
  7. ఉగ్రవాదమెంచి యుర్వి జనులజంపు
    రాక్షసత్వమేల? కుక్షి నింప!
    భాగ్యమందుడోయి పాపుల శిక్షింప
    కాలయమునిఁ గొలువఁ గాసులొసగు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. ఇలను తండ్రి యొకడు యెల్లైసి నేగట్టె
    నట్టి ధనము గోరి యాశతోడ
    కాలయముని గొలువ గాసులొసగునంచు
    తండ్రి చావు గోరె తనయుడపుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.

      తొలగించండి
  10. కలిని బాధలన్ని గడతేర్చు నిజముగ
    కాలయముని గొలువ, గాసులొసగు
    పాల కడలి యందు ప్రభవించు లక్ష్మిని
    భక్తి మీఱ గొలువ భవ్యముగను!!!

    రిప్లయితొలగించండి
  11. వైశ్రవణుడు పురుష వాహనుం డిలబిలా
    త్మజుడు పైడిఱేడు ధనదు డేక
    పింగళుండు యక్షవిభుడు నంచిత సమ
    కాలయమునిఁ గొలువఁ గాసు లొసఁగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    ప్రాణ హరు డత౦డు ! ప్రార్థి౦చెదవు , తెల్వి

    కాల. | యముని కొలువ. కాసు లొసగు ----

    నను చెవరు తెలిపిరి ? ఆ లక్ష్మి c బూజి౦పు |

    ముదమున సిరు లొసగు పుష్కలముగ

    ………………………………………………………


    అతడు చచ్చి నపుడె ఆస్తి మన వశమౌ |

    అయ్యొ ! యెట్లు చేయ నగును ప౦ప

    కాల. ? యముని గొలువ కాసు లిడును ,

    పాశ మతని పైన పార వౌచి


    { ప౦పకము + ల = ప౦పకాల = భాగప౦పకాల

    యముని కొలువగా యముడు వాని పై పాశము వేసి తీసుకొని పోయి ే మనకు ఆస్తి వశము
    చేసి కాసుల నొసగు }

    …………………… . ...................................

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. ఎన్నికందునిలిచి పన్నుచు మోసాలు
    యముని బంటులాగ ఆశబెంచు
    నతని పొగడి నపుడు నందించు మందు-స
    కాలయమునిగొలువ గాసు లొసగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఎన్నికయందు’ అని యడాగమం రావాలి. ‘ఎన్నికలను నిలిచి...’ అనండి.

      తొలగించండి
  14. .అవసరాని కప్పు నాదుకొనునని యీ
    కాలయముని గొలువ గాసులొసగు
    ఆస్తులన్ని గుంజి పస్తులతో జంపు
    పలుకు బడులయందు కులుకు చుండు|
    3.నమ్మినట్టి వాని నట్టేట ముంచెడి
    మంచి శత్రువతడె|వంచనాన
    ద్రోహ చింతలందు దొరలాగ నున్న?యా
    కాల యముని గొలువ గాసులొసగు.

    రిప్లయితొలగించండి
  15. ఫలిత మేమి లేదు వరముల నిడునంచు
    కాలయముని గొలువ, గాసులొసగు
    కలుముల జవరాలు కరమగు నిష్టతో
    పూజ చలిపి నపుడు ముదము తోడ (పూలతోడ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    అతని పేర భీమ = యరువది లక్షలు |

    పోవ కు౦డె - రాచ పు౦డు రోగి
    ి
    య౦చు , తలచి రిటుల పొ౦చి " రాబ౦దులు "

    " కాల యముని గొలువ కాసు లొసగు "

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. పెద్ద వల్లకాటి ప్రేతాధిపతి యైన
    కాల యముని గొలువ కాసు లొసగు
    ఆ ధనమ్ము నిచ్చి యతి ఋణమును దీర్చు
    మనుచు పలికె శిష్యు డధిపు గనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  18. ఘోరపాపు లెపుడు చేరుట నిక్కము
    కాలయమునిఁ ; గొలువఁ గాసు లొసఁగు,
    కరుణ జూపి రాల్చ కనక మహాలక్ష్మి
    యువిద యింట పైడి యుసిరి కలటు

    రిప్లయితొలగించండి
  19. కాలముడనెడి పేరుగలముని యొక్కడు
    గ్రామమందు యున్న గణపతి గుడి
    యందు వాసముండి యర్చించుచుండు:నా
    కాలయమునిఁగొలువఁ గాసు లొసగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో గణదోషం. ‘కాలయముడు పేరు గల ముని...’ అనండి. అలాగే ‘గ్రామమందు నున్న’ అనండి.

      తొలగించండి
  20. ​​​​దేవతార్చనిచ్చు స్థిరత్వమును గాని
    కష్టపడుచు నున్న కాసులబ్బు
    కాలయముని గొలువ కాసు లొసగు నన్న
    మాయమాట లన్ని మరచి మెలగు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బొడ్డు శంకరయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘స్థిరతత్వమును’ అనడానికి టైపాటు అనుకుంటాను. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  21. ​​​​ధన్యవాదములు గురువుగారు సవరణతో...

    దేవతార్చనిచ్చు స్థిరచిత్తమును గాని
    కష్టపడుచు నున్న కాసులబ్బు
    కాలయముని గొలువ కాసు లొసగు నన్న
    మాయమాట లన్ని మరచి మెలగు!

    రిప్లయితొలగించండి