జిగురు సత్యనారాయణ గారూ, ముక్కలు చేర్చిన మీ పూరణ వింతగా, వినూత్నంగా ఉంది. ఔత్సాహికులకు మార్గదర్శకం. చాలా బాగుంది. అభినందనలు. ఇంతకూ ఈ తరహా పూరణ ఇంతకుముందెప్పుడూ వినలేదు. గతంలో ఏ అవధానియైనా ఇలా పూరించిన దాఖలా ఉంటే తెలియజేయండి.
జిలేబీ గారూ, జ్వరం మీద జిలేబీలు తినొద్దనీ, తిన్నా చేదుగా ఉంటాయని అంటారు. అయినా సాహసం చేసి చదివాను. మొదటి కొద్దిగా చేదు కొట్టింది... తరువాత మాధుర్యం తోచింది. మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘రాముని మీదనే యటం| చంగన...’ అనండి.
ఇంతకూ జ్వరంతో ఉన్నాను, సులభమైన సమస్య ఇస్తే ఎక్కువగా వచ్చే పూరణలను సమీక్షించడం కష్టమౌతుందనీ, వృత్తంలో కఠినమైన సమస్య ఇస్తే తక్కువ పూరణలు వస్తాయి, శ్రమ తగ్గుతుంది కదా అనుకున్నాను. నాది దురాశే అయింది సుమా!
జిలేబీ గారూ, సంతోషంగా పంపించండి. రోజుకొక సమస్యను సృష్టించడం నాకు సమస్యే. ఎలాంటి సమస్యలనైనా పంపవచ్చు. బ్లాగులో వ్యాఖ్యగా కాకుండా నా మెయిల్ (shankarkandi@gmail.com)కు పంపండి.
మ్రింగుట కాలకూటమును మిక్కిలి కష్టమె యైన త్రాగెదన్
రిప్లయితొలగించండినింగిని త్రాకమన్ననొక నిచ్చెన వేయగ సాహసించెదన్
కృంగును ధైర్యమంతయును క్లిష్టము పూరణ దీనిచేయగా
అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ అద్భుతమండి
తొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిఆంజనేయ శర్మ గారన్నట్లు నిజంగా మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదములు మాష్టారు...ధన్యవాదములు విరించి గారు
తొలగించండిగురువు గారికి నమస్కారములు....ఆరోగ్యము జాగ్రత్తండీ....శ్రమతీసుకొనక విశ్రాంతి తీసుకొండి.
రిప్లయితొలగించండిఅంగద ప్రొలుగట్టె నెవడా కపియెందుకు లంకగాల్చె నే
యంగన బెండ్లియాడెనలు డాగ్రహమందు సుమిత్ర పుత్రు డే
భంగిన తూ లనాడెకపి పాలకు, నెవ్వడటంగరాజు యా
జంగమ దేవుడెందుకని జంపిన బాలుని బ్రోచెనో యన
న్నంగదుడాగ్రహించి దమయంతిని దిట్టెను గర్ణుడేడ్వగన్ .
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిధన్యవాదాలు. ఇంకా నేను కోలుకొనలేదు.
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అంగద ప్రోలుగట్టె నెవడు’ అర్థం కాలేదు.
అంగద ప్రోలు అని అంగదపురము ను ఉద్దేశీంచి ఉపయోగించాను
తొలగించండిలక్ష్మణుని కుమారుడు అంగదుడు అంగదపురము ను నిర్మించాడని చెబుతారు కదా!
బాగుంది. అయితే ‘అంగదు ప్రోలుఁ గట్టె నెవఁ’ డనండి.
తొలగించండిపొంగుచు వ్రాయగో రితిని భూరిగ ఛందము నింపి పద్యమున్
రిప్లయితొలగించండిమ్రింగుడు గాకపో పోయెనె మేలగు పాదము బూర్తి జేయగన్
నింగిని నేలకున్ గలుప నేరదు యెంతటి కష్టమో యనన్
అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మ్రింగుడు గాక పోయినది... గలుప నేర దిదెంతటి కష్టమో...’ అనండి.
పొంగుచు వ్రాయగో రితిని భూరిగ ఛందము నింపి పద్యమున్
తొలగించండిమ్రింగుడు గాకపో యెనిది మేలగు పాదము బూర్తి జేయగన్
నింగిని నేలకున్ గలుపనేర దిదెంతటి కష్టమో యనన్
అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వగన్
అంగదుఁ డాగ్రహించి మరి యాలము సేసెను ధర్మ రక్షకై
రిప్లయితొలగించండిఅంగన రంభ చేరి దమయంతినిఁ దిట్టెను మత్సరంబునన్
సంగరమందు సూనుడటఁ జచ్చె మనంబునఁ గర్ణుఁ డేడ్వఁగన్
ముంగిట మూడు పాదముల ముక్కలు పేర్చిన వింత వ్రాతలౌ
అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్!!
జిగురు సత్యనారాయణ గారూ,
తొలగించండిముక్కలు చేర్చిన మీ పూరణ వింతగా, వినూత్నంగా ఉంది. ఔత్సాహికులకు మార్గదర్శకం. చాలా బాగుంది. అభినందనలు.
ఇంతకూ ఈ తరహా పూరణ ఇంతకుముందెప్పుడూ వినలేదు. గతంలో ఏ అవధానియైనా ఇలా పూరించిన దాఖలా ఉంటే తెలియజేయండి.
శుభోదయం !
రిప్లయితొలగించండితప్పొప్పులు తెలియవు ! "మూడు" మారు రంగడు కథ చెప్పన మొదలెడితే ఎట్లా ఉంటుందో అనుకుని :)
చెంగన రాముడే గురుడు చెప్పెద రాముని మీదనే యనే
అంగన భీమపా కమగు ఆనల భీముడు గుర్తుకొచ్చెనే
రంగడు భారతాన కథ రయ్యన గానగ "మూడు" మార్చెనే
అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిజ్వరం మీద జిలేబీలు తినొద్దనీ, తిన్నా చేదుగా ఉంటాయని అంటారు. అయినా సాహసం చేసి చదివాను. మొదటి కొద్దిగా చేదు కొట్టింది... తరువాత మాధుర్యం తోచింది.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘రాముని మీదనే యటం| చంగన...’ అనండి.
ఇంతకూ జ్వరంతో ఉన్నాను, సులభమైన సమస్య ఇస్తే ఎక్కువగా వచ్చే పూరణలను సమీక్షించడం కష్టమౌతుందనీ, వృత్తంలో కఠినమైన సమస్య ఇస్తే తక్కువ పూరణలు వస్తాయి, శ్రమ తగ్గుతుంది కదా అనుకున్నాను. నాది దురాశే అయింది సుమా!
తొలగించండికంది వారు :)
తొలగించండిజ్వరం లోనూ తియ్యదనాన్ని ఆశ్వాదించడం మీకే జెల్లు ! నెనర్లు !
కష్ట మైన సమస్యా పూరణం నేను పంపించ వచ్చా మీకు ? పబ్లిష్ చేస్తారా మీకు బాగనిపిస్తే ? తెలియ జేయ గలరు :) ఎట్లా పంపించాలి ?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిసంతోషంగా పంపించండి. రోజుకొక సమస్యను సృష్టించడం నాకు సమస్యే. ఎలాంటి సమస్యలనైనా పంపవచ్చు. బ్లాగులో వ్యాఖ్యగా కాకుండా నా మెయిల్ (shankarkandi@gmail.com)కు పంపండి.
పొంగుకు వచ్చుకోపమున భూరిగ రావణు తిట్టెనెవ్వరో?
రిప్లయితొలగించండిఅంగన రంభ, నక్కసుగ నాఱడి జేసెను జెప్పుమెవ్వరిన్?
గంగను దేలుబేటికను గాంచగ రాధయె దీసెనెవ్వనిన్?
అంగదుడాగ్రహించి, దమయంతిని దిట్టెను, కర్ణుడేడ్వగన్!!!
శైలజ గారూ,
తొలగించండిప్రశ్నోత్తర మాలికగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంగదుడాగ్రహించి దమయంతిని దిట్టెను కర్ణుడేడ్వగన్
రిప్లయితొలగించండిఅంగనలారవిం టిరిదె యంగదు తిట్టెను గర్ణుడేడ్వగా
నంగన చారుశీ లియగునాదమయంతిని న్యాయమే?మరిన్
అంగద రాజ్యలక్ష్మి!చెపుమంచిత ధర్మము నీవయిప్పుడున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ కొంచెం తికమకపెట్టినా బాగుంది. అభినందనలు.
అంగదు డుత్తముండు దమయంతికి భర్తయు వాని పుత్రుడు
రిప్లయితొలగించండిత్సంగ విరాజితుండు వయసుండగ నోపయిదేండ్లు గర్ణుడి
భ్భంగిన నున్న నొక్కపరిఁబాటున భార్య కృతాపరాధి కా
నంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండిక్ర మా ల౦ కా ర ము
"వ౦గడ మెల్ల కూలు దశవక్త్ర !"యట౦చనె రాయబారియౌ|
భ౦గమనస్కుడౌచు,శనిబాధితు డౌచు నలు౦. డయుక్తతన్
స౦గర ర౦గ భ౦గత ను-చచ్చె వికర్ణ సుత౦డు,మిక్కిలిన్|
అ౦గదు|డాగ్రహి౦చి దమయ౦తిని దిట్టెను|కర్ణు డేడ్వగా|
{ భ౦గత = అపజయము }
ె
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణము ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఒక నాటకసంఘ మందునడచినదిది
రిప్లయితొలగించండి**************************************
సంగతులేవి నాటకము సాగుటలేదన?నిన్నరాత్రియే
అంగదు డాగ్రహించి దమయంతిని దిట్టెను గర్ణు డేడ్వగన్
చంగున భీముడా గదన శాంతము లేకను గొట్టె రామునే
రంగమునందుభంగములె రాజిల నాటక ముండునాయికన్?
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.
సంగర వేళనెవ్వరుదశానను చెంతకు చేరి వాలమె
రిప్లయితొలగించండిబ్భంగిని ద్రిప్పుచున్ దిరిగె బాధల నొందుచు నెవ్వరెవ్విధిన్
క్రుంగుచు కష్టముల్ పడిరి గుండెలు మండగ నెవ్వరేడ్చిరో?
అంగదు డాగ్రహించి దమయంతిని దిట్టెను గర్ణుడేడ్వగన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంగన జానకిన్ వదలు మా ! యని రావణు గోరె నెవ్వడో
రిప్లయితొలగించండిక్రుంగుచు బాహుకుండలిగి క్రోధము నెవ్వరి పైన జూపెనో
పొంగుచు శల్యుడేల జనె పోరున తోల రధమ్ము గుట్టుగా
అంగదుఁ డాగ్రహించి , దమయంతినిఁ దిట్టెను , గర్ణుఁ డేడ్వఁగన్.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ప్రణామములు.తమరు ఆరోగ్యము గూర్చి జాగ్రత వహించ మనవి.
రిప్లయితొలగించండినేటి పూరణ:
నాటక పోటీలు జరిగే చోటనుండెడు మేకప్ రూంలో...
అంగద వేషధారి దమయంతికి భర్త, కుమార బాలకు
న్నంగన కుంతికిన్ చెవిన నందిన కర్ణుని పాత్ర కోరిన
న్నంగజుఁమోమునన్ తిలకమద్దగ లాలన జేయలేవటం
చంగదుడాగ్రహించి దమయంతిని దిట్టెను కర్ణుడేడ్వగన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభంగముఁజేసెనెవ్వరని వాలముతోడుత వజ్ర దంష్రునిన్?
రిప్లయితొలగించండిజంగలమందువీడిచెనె చక్కని భార్యనెవండు శర్వరిన్?
గంగతనూభవుండెవని కావరుడంచు నొగుల్చెకిన్కతో?
అంగదుడాగ్రహించి, దమయంతిని, దిట్టెను కర్ణుడేడ్వగన్
కావరుడుః దుర్మదుడు, గర్వి, నొగుల్చుః బాధపెట్టు
(గంధర్వుల చేత పరాభవింపబడినప్పుడు సుయోధనునితో భీష్ముడన్న మాటలు - ఈ కావర కష్టచిత్తు నధికమ్ముగ నమ్ముదువీవు.వీని బాహావిభవమ్ము కయ్యమున నచ్చట కాంచితే కన్నులారగన్)
జంగలమందువీడె సతి క్షత్రియుడొక్కరు డామెయెవ్వరో?
తొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బంగరుబాబు తోడనొక పందెమువేసెను బద్రి, చెప్పుమా
రిప్లయితొలగించండిసంగతమింతగాని యొక చక్కని మాటను, చెప్పలేనిచో
చెంగును గప్పి మోమునకు చెప్పకబొమ్మన , చెప్పెనిట్టులన్
అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచెంగున నిద్రలేవగనె సెల్లున వెద్కితి నేటి పూరణన్
రిప్లయితొలగించండిగింగురు మన్నగా చెవులు గిల్లితి ముక్కును దుగ్ధబుట్టగా...
సంగతు లింకలేవిచట శంకర! హైదరబాదు కొంపలో:
"అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్"
రిప్లయితొలగించండితుంగన దొక్కెదన్ కవుల తొంగొన నివ్వరు పద్య మాలలన్
చెంగున వ్రాసి ముంగటన చేర్చి భళారె యిదేను శంకరా
వింగడమందురా నిదియె వీరికి క్లిష్టపు కైపదంబగున్
"అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్"
జిలేబి