11, ఫిబ్రవరి 2016, గురువారం

సమస్య – 1941 (రాముని సవతితల్లి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముని సవతితల్లి ధరాతనూజ.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

  1. గురువు గారికి కవి/కవయిత్రి మిత్రులకు నమస్కారములు....,

    1.
    రాజ్య లక్ష్మిని వీడి యరణ్యములకు
    తరలి తీరవలయు నన్న తరుణి కైక
    రాముని సవతి తల్లి, ధరాతనూజ
    జనక రాజసుత మరమసాధ్వి భార్య.

    2.
    దశరథేంద్రుని యిష్టసఖి తరుణి కైక
    రాఘవునకేవరుస వివరమ్ము తెలుపు
    రావణుడపహరించిన రమణి యెవరు?
    రాముని సవతి తల్లి, ధరాతనూజ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారు మీ రెండు పద్యాలు చక్కగా ఉన్నాయి. అభినందనలు. క్రమాలంకారముతో బాగుంది. మొదటి పద్యము లో పరమ కి మరమ అని పడింది గమనించండి. “ఇష్ట సఖి” అనడమంత సమంజసము కాదేమోనని నా యనుమానము. సతి కి బదులు సఖి యని పడిందేమో మరి. చూడండి.

      తొలగించండి
    2. “దశరథేంద్రుడు” సరియేనా యని నాసందేహము. రాజేంద్రుడు, నరేంద్రుడు రాజులలో, నరులలో శ్రేష్టుడని వ్రాయవచ్చును .

      తొలగించండి
    3. దశరథ నరేంద్రు బ్రియసతి తరుణి కైక
      రాఘవునకేవరుస వివరమ్ము తెలుపు ?
      రావణుడపహరించిన రమణి యెవరు?
      రాముని సవతి తల్లి, ధరాతనూజ.

      పోచిరాజు కామేశ్వరరావు గారికీ ధన్యవాదములు....మీ సూచనలు శిరోధార్యములు..అందుకే మార్చానండీ.


      తొలగించండి
    4. విరించి గారు. ధన్యవాదములు. సవరించిన మీ పద్యము చక్కగ నున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. కాన లకుబంపె తనయుని కైక యనగ
    రాముని సవతితల్లి , ధరా తనూజ
    పరమ పావని జానకి వరము వలన
    సతిగ జేపట్టె రాఘవు డతిశ యమున

    రిప్లయితొలగించండి
  3. దశరథుని కోరె ఆత్మజు తలము నంప
    రాముని సవతితల్లి ; ధరా తనూజ
    జానకి జతగ రాముడు సోదరుని గొ
    ని యడవికిచనె ఆజ్ఞయే నియతి యనగ

    రిప్లయితొలగించండి
  4. ఈ తెల్లవారు జామున మా పెద్ద బావమరది మార్గం కొమురయ్య మరణించాడు. కరీంనగర్ వెళ్తున్నాను. ఈరోజు కూడా మీ పద్యాలను సమీక్షించలేను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విచారకర వార్తలు వరుసగా వస్తున్నాయి.చాలా బాధగాఉంది. ధైర్యము వహించండి.

      తొలగించండి
  5. పుత్రుని కొరకు కైకేయి శత్రు వాయె
    రాముని సవతితల్లి ధరాతనూజ
    భర్తను వనవాసంబంప భర్తఁ గోరఁ
    జకిత మానసుండాయె దశరధు డంత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారి కోరిక మేర నా పద్యాన్ని కవి వరులెవరైనా సమీక్షించ వలసినదిగా కోరుతున్నాను.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ నమస్కారము.....మీ పద్యం బాగుందండి....అయినా మీరు అన్యధా భావించ నంటే....
      ధర తనూజ | భర్తను వనవాసంబంప పతిని గోర |జకితు.....
      అంటే బావుంటుందేమో ననే నా సలహా....భర్త అనే పదం ఒకే పాదములో రెండు సార్లు ఉందికదా యని.....నా పూరణలను మీరూ తిలకించాలని విన్నపమండి.

      తొలగించండి
    3. విరించి గారు మీ సూచన చక్కగా ఉంది. ధన్యవాదములు. ప్రాస యతి
      చమత్కారముగా ఉంటుందని కావాలనే భర్త పదము వాడాను.

      తొలగించండి
  6. అరయగసుమిత్రయే మరి యగునుసుమ్ము
    రామునిసవతితల్లి,ధరాతనూజ
    రాముసహధర్మచారిణి రామ సాధ్వి
    వంద నంబులుసేతును పావనికిట

    రిప్లయితొలగించండి
  7. కైక, కౌసల్యకు సవతి గాన నగును
    రామునికి సవతి తల్లి.ధరాతనూజ
    జానకీదేవి రాముని సతి యనంగ
    వినుతి కెక్కెను లోకులు ప్రణుతి సేయ

    రిప్లయితొలగించండి
  8. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఆ ధరా మతల్లికను , సహనము న౦దు ,

    మి౦చు నన్నుల మిన్న - సుమిత్ర. యెవరు ?

    = రాముని సవతి తల్లి | ధరాతనూజ c

    దల్లి గా నె౦చి కొలిచిన. ధన్యు డెవరు ?

    లక్ష్మణుడు , సర్వసద్గుణ లక్ష్మణు౦డు. |

    అరయ నీతి కోశమ్ము రామాయణమ్ము ! !


    { పాదా౦తమున౦దు , వాక్యావసానమయిన౦దున
    ఆరవ పాదము అచ్చు తో మొదలైనది }

    రిప్లయితొలగించండి
  9. కానలకు నంపె నాతని కల్మషమతి
    రాముని సవతి తల్లి, ధరాతనూజ
    తాననుసరించి బతిదేవు తనివితోడ
    బాధ్యతల మరి బాధల భాగమయ్యె

    రిప్లయితొలగించండి
  10. . దశరథునిభార్య కైకేయి ధైర్య వనిత
    రాముని సవతి తల్లి|”ధరాతనూజ
    కోస లాదీశు కోడలే”|”కొడుకుభార్య
    సీత”|రామాయణ సుజాత|జాతిమాత|

    రిప్లయితొలగించండి
  11. కాన కంప నెవరినెంచె కైక తాను
    రామచంద్రుని కేమగు రాణి కైక
    విడక రాముఁవెంట చనిన వెలది యెవరు
    రాముని, సవతితల్లి,ధరాతనూజ.

    రిప్లయితొలగించండి
  12. కాన కంప నెవరినెంచె కైక తాను
    రామచంద్రుని కేమగు రాణి కైక
    విడక రాముఁవెంట చనిన వెలది యెవరు
    రాముని, సవతితల్లి,ధరాతనూజ.

    రిప్లయితొలగించండి
  13. రామ జననము లోకోద్ధరణము చూడ!
    రావణాసురున్ వధియించు లక్ష్యమైన
    సేతు నిర్మాణ కారణ భూతులైరి
    రాముని సవతితల్లి, ధరాతనూజ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారు,
      మీ పూరణ బాగుంది. సమస్యను చివరి పాదముగా స్వీకరించి, క్రమాలంకారముపై ఆధారపడక పూరించటము బాగుంది.

      తొలగించండి