29, ఫిబ్రవరి 2016, సోమవారం

సమస్య – 1958 (ధర్మసత్రనిర్మాణముల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధర్మసత్రనిర్మాణముల్ దగని పనులు.

48 కామెంట్‌లు:

  1. ధనము వెచ్చించి నిర్మించ ఘనము గాదు
    భక్తి వినయము లేనట్టి ప్రజల కొఱకు
    ధర్మ సత్రనిర్మాణముల్ దగని పనులు
    బ్రతుకు సుఖమున నేతలు బాగు పడగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘బ్రతుక సుఖముగ...’ అంటే ఇంకా బాగుంటుంది.

      తొలగించండి
    2. ధనము వెచ్చించి నిర్మించ ఘనము గాదు
      భక్తి వినయము లేనట్టి ప్రజల కొఱకు
      ధర్మ సత్రనిర్మాణముల్ దగని పనులు
      బ్రతుక సుఖముగ నేతలు బాగు పడగ

      తొలగించండి
  2. పుణ్యకార్యములనగ నీ పుడమి యందు
    నాలయమ్ములుకాసారమాసుపత్రి
    ధర్మసత్రనిర్మాణముల్ , దగని పనులు
    చోరవృత్తి గోవధయును జూదశాల
    పానగృహనిర్వహణమను పాప కృతులు

    రిప్లయితొలగించండి
  3. కొలది బుద్దితో గర్వించి కూల్చ తగునె?
    ప్రజకు మేలును గూర్చును పాఠశాల
    భవనముల్ వైద్యశాలలు బస్సు స్టాండు
    ధర్మసత్రనిర్మాణముల్! దగని పనులు!!

    రిప్లయితొలగించండి
  4. విటులు తిరిగెడు వేశ్యల వీధులైన
    జూద గృహములు నెలకొన్న చోటు లోన
    వధ్యశాలల నడిపెడు వాడలందు
    ధర్మసత్రనిర్మాణముల్ , దగని పనులు

    రిప్లయితొలగించండి


  5. బుద్ధుని గనెను క్రూరుని బుద్ధి మారె
    దారి వెంబడి చెట్లను దాపున మరి
    ధర్మసత్రనిర్మాణముల్ దగని పనులు
    జేయు నొకడు కట్టెను సేవ జేతు ననుచు

    రిప్లయితొలగించండి
  6. వైద్య శాలలు గలచోట వలయు దగిన
    ధర్మ సత్రనిర్మాణముల్, దగని పనులు
    దగినపనులేవొ వివరింత్రు ధర్మ పరులు,
    నాచ రించిన చాలు ముత్యాలు రాలు !!!

    రిప్లయితొలగించండి
  7. అధమ మార్గమ్ముల ధనార్జ నాను రాగు
    రాగ మత్సర కలిత దుర్వ్యసన పరుడు
    పరము విస్మరింపంగ నపగత ధర్ము
    ధర్మసత్రనిర్మాణముల్ దగని పనులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నా పూరణ లో విశేషమేమైనా గమనించారా?

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీరు చెప్పిన తరువాత నిశితంగా పరిశీలించినప్పుడు తెలిసింది మీ పూరణలోని ‘ముక్తపదగ్రస్తం’. బాగుంది. సంతోషం!
      ద్వితీయార్థంలో లేదా షష్ఠ్యర్తంలో ‘రాగు, ధర్ము’ అని ‘పరుడు’ మాత్రం ప్రథమలో ఉండి అన్వయక్లేశం ఏర్పడుతున్నది. అక్కడ ‘దుర్వ్యసనపరుని’ అంటే సరిపోతుంది కదా!

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీరు చెప్పినది నిజమే. నేను గమనించలేదు. సరిదిద్ద గలవాడను. ధన్యవాదములు.

      అధమ మార్గమ్ముల ధనార్జ నాను రాగు
      రాగ మత్సర కలిత దుర్వ్యసన పరుని
      పరము విస్మరింపంగ నపగత ధర్ము
      ధర్మసత్రనిర్మాణముల్ దగని పనులు.

      తొలగించండి
  8. * గు రు మూ ర్తి ఆ చా రి *

    ధర్మపరుడగు నాతని తాత . . . చేయ

    ధర్మసత్ర నిర్మాణముల్ :- దగని పను ల

    ట౦చు , స్థలమును లక్షల కమ్మ వచ్చు ,

    లేద యేని సౌధముల నిర్మి౦చ వచ్చు

    న౦చు , నె౦చిన మనుమ డొకి౦చు క౦త

    నాలసి౦పక. కూల్చివేయ౦గ నె౦చె

    రిప్లయితొలగించండి
  9. పుణ్య కార్యాచరణంపు మూర్తి చర్య
    ధర్మ సత్ర నిర్మాణముల్ - తగని పనులు
    తాను జేయకుండుటెగాక, ధర్మ హీను
    డగుచు నాటంకముల గూర్చి నగుచునుంట!

    రిప్లయితొలగించండి
  10. పుణ్య కార్యాచరణంపు మూర్తి చర్య
    ధర్మ సత్ర నిర్మాణముల్ - తగని పనులు
    తాను జేయకుండుటెగాక, ధర్మ హీను
    డగుచు నాటంకముల గూర్చి నగుచునుంట!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటిపాదంలో గణదోషం. ‘...కార్యాచరణపు సన్మూర్తి చర్య’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి


  11. మంచికార్యముల్సోదర!యంచితమగు
    ధర్మసత్రనిర్మాణముల్దగనిపనులు హానిగలిగించుగార్యముల్లాచరించ మంచిజేయుటశ్రేయముమందికెపుడు

    రిప్లయితొలగించండి
  12. మేలుచేయు పథికులకు మిక్కుటముగ
    ధర్మ సత్ర ని ర్మాణముల్ , దగని పనులు
    పెద్ద లేర్పరచిన సత్ర మద్దెకిచ్చి
    ధనము వెనకేసు కొనునట్టి దాష్టి కమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఏసుకొను’ అనడం వ్యావహారికం. ‘ధనము వెనుక వేసుకొనెడి...’ అందామా?

      తొలగించండి
  13. మంచి కార్యములనబడు మహిని గుడులు
    బడులు శరణాలయమ్ముల వాసములగు
    ధర్మసత్రనిర్మాణముల్,దగని పనులు
    నాసిరకముగ నిర్మించి గాసిబెట్ట !!!

    రిప్లయితొలగించండి
  14. పల్లె,పట్నాల ప్రభుత చేపట్ట వలెను
    ధర్మసత్ర నిర్మాణముల్;తగని పనులు
    జూద గృహములు మధుశాల సుంకము గొన
    ననుమతించుట ప్రజల కనర్ధ మొదవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. యాత్రలందు భక్తులకు –ప్రయాస మాన్ప
    ధర్మసత్ర నిర్మాణముల్.”తగనిపనులు
    నచట గావించి దోషంబు లంటనీక
    భక్తి వేషాన లాభాలఫలము దోచ|”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ప్రయాస మాన్చు’ అంటే బాగుంటుందేమో!

      తొలగించండి
  16. లోక కళ్యాణ కార్యములు జరుగుటకు
    మంచి బోధించుచున్నచో మహికి మేలు.
    కలలనైనఁ గాదనుటయే, వలదనుటయె
    ధర్మసత్రనిర్మాణముల్? దగని పనులు.

    రిప్లయితొలగించండి
  17. లోకమంతట చందాలు సేకరించి
    నిధుల దుర్వనియోగము! నీతి మఱచి!
    నాసిరకముగ నిర్మించ నవ్వి పోరె?
    ధర్మసత్ర నిర్మాణముల్! దగని పనులు!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. పల్లె,పట్నాల ప్రభుత చేపట్ట వలెను
    ధర్మసత్ర నిర్మాణముల్;తగని పనులు
    జూద గృహములు మధుశాల సుంకము గొన
    ననుమతించుట ప్రజల కనర్ధ మొదవు

    రిప్లయితొలగించండి
  19. దోచుకొని యక్రమమ్ముగ, దాచుకోనగ
    కోట్ల ధనము విదేశాన గుప్త పరచి
    ప్రజకు, ప్రభుతకు జూపగ ప్రకటనలిడి
    ధర్మసత్రనిర్మాణముల్ దగని పనులు.

    నిన్నటి పూరణ

    దేవకీ వసుదేవుల దీప్తి యనగ
    పార్థసారథి జన్మించె; భానుమతికి
    సర్వ లక్షణ లక్షితుడుర్వి ననగ
    లక్ష్మణకుమారు డటులె,విలక్షనుండు

    రిప్లయితొలగించండి
  20. దోచుకొని యక్రమమ్ముగ, దాచుకోనగ
    కోట్ల ధనము విదేశాన గుప్త పరచి
    ప్రజకు, ప్రభుతకు జూపగ ప్రకటనలిడి
    ధర్మసత్రనిర్మాణముల్ దగని పనులు.

    నిన్నటి పూరణ

    దేవకీ వసుదేవుల దీప్తి యనగ
    పార్థసారథి జన్మించె; భానుమతికి
    సర్వ లక్షణ లక్షితుడుర్వి ననగ
    లక్ష్మణకుమారు డటులె,విలక్షనుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘విలక్షణుండు’కు టైపాటు...

      తొలగించండి
  21. మంచి పనులను చేయంగ మాధవుండు
    కూడ మెచ్చుచుండునిలను కూర్మి తోడ
    ధర్మసత్రనిర్మాణముల్;దగని పనులు
    చేసి పరుల ముందు బ్రతుకు చెరుపుకోకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగుంది.
      ‘మెచ్చుచుండు, దగును కూర్మితోడ...’ అంటే అన్వయం చక్కగా కుదురుతుంది.

      తొలగించండి
  22. ఆగమమ్ముల సూత్రము లర్థ మవక
    కర్మ యోగపు కిటుకులు కాన లేక
    మర్మ మెరుగక వాస్తుల మాయ లెల్ల
    చింత దీరుట కొరకై చేసి నట్టి
    ధర్మసత్రనిర్మాణముల్ దగని పనుల
    కిరువు గావె భ్రష్టుల కిల పరువు బోవ!

    రిప్లయితొలగించండి
  23. ఆగమమ్ముల సూత్రము లర్థ మవక
    కర్మ యోగపు కిటుకులు కాన లేక
    మర్మ మెరుగక వాస్తుల మాయ లెల్ల
    చింత దీరుట కొరకై చేసి నట్టి
    ధర్మసత్రనిర్మాణముల్ దగని పనుల
    కిరువు గావె భ్రష్టుల కిల పరువు బోవ!

    రిప్లయితొలగించండి