3, సెప్టెంబర్ 2012, సోమవారం

పద్య రచన - 101


కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

మిస్సన్న చెప్పారు...

ఆది కావ్య కర్త మోదమ్ముతో జెప్ప
రామ మూర్తి కథను రమ్యముగను
శ్రద్ధ తోడ నేర్చి సఫలత నొందిరి
కుశలవులదె మేటి యశము జూడ.

Pandita Nemani చెప్పారు...

మా శ్రీమదధ్యాత్మరామాయణము నుండి:

లలిత పదాళితో, రమణీయ భావ సం
....భృతముగా నలరారు కృతిగ జేసి
వాల్మీకి మౌని శ్రావ్యముగ రామాయణ
....మును శిష్యులకు గీతములను నేర్పె
సంగీత సరళిలో సరస రాగములతో
....శ్రుతి లయ తాళ సంయుతముగాగ
నా గీతములను శ్రద్ధాసక్తు లలరంగ
....నేర్చిరి కుశలవుల్ నెమ్మి వారు
గాన మొనరింప సుమధుర కంఠ మలర
శుక పికమ్ములు చాల ప్రస్తుతి నొనర్చు
ప్రముఖ గంధర్వు లబ్బుర పడుదు రంత
ప్రకృతి కాంతయు నెంతయు పరవశించు

subbarao చెప్పారు...


భూమి జాతయు మఱియును రామ విభుని
కవల సుతులేను నిరువురు లవుడు కుశుడు
చారు శీ లు రు కడు గొప్ప వీ ర వరులు
విద్య నేర్చిరి వాల్మీ కి యొ ద్ద వారు

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గురువులు జ్ఞానము నిచ్చుచు
నెఱుకపఱచెదరు జగతిన దెట్టి పగిదినిన్
మఱి మెలగవలయుననియెడి
గుఱుతుల; శిష్యులకు మేలు కోరుచు మదిలో

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారి పద్యము....

అవనీతనూజ సీతకు
లవకుశు లుదయించి, వీరులై, గాయకులై;
కవి వాల్మీకియు నేర్పఁగ;
శ్రవణ సుభగ రామగాథఁ బ్రవచించిరిగా!

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని ధారతో, సముచిత పదసంపదతో, వైవిధ్యంగా పద్యరచన చేసిన కవిమిత్రులు మిస్సన్న గారికి, పండిత నేమాని వారికి, సుబ్బారావు గారికి, లక్ష్మీదేవి గారికి, గుండు మధుసూదన్ గారికి అభినందనలు, ధన్యవాదాలు.

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

శ్రీ గురువులకు, పెద్దలకు
ప్రణామములు!

త్రిజగతీకళ్యాణదీపితార్థము లైన నిగమాగమంబుల నిర్వచించి
స్వస్వరూపజ్ఞానసవికల్పకం బైన బ్రహ్మచైతన్యంబు పాదుకొలిపి
శరవణోద్భవకృపాసమధిగతసమస్తశస్త్రాస్త్రసంహతి సంకలించి
పరమేశ్వరుని యందు పరమానురక్తిని భక్తిభావంబును పంతు గొలిపి

రామచరితామృతవిధాత వామలూరు
భవుఁడు బోధించె శబ్దార్థపారగుండు
భగవదవతారతత్త్వంబు బాలకులకు
లవకుశులు ధర్మపథకుశీలవులు గాఁగ.

విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గురువుగారు,
శ్రమకోర్చి కవిమిత్రుల,శిష్యుల పూరణలు అవధానిగారికి ఇచ్చారు. సంతోషము. ఇక అక్కడి సమస్యల్లో కొన్ని రాబోయే రోజుల్లో మాకు ఇస్తారనుకుంటున్నాను.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

stavaneeya raama charitamu
SravaNamula kiMpu gaanu raagammulatO
lava kuSulaku nErpiMchenu
avnija nE gaachinaTTi yaayaadi kavE!

కంది శంకరయ్య చెప్పారు...

ఏల్చూరి మురళీధర రావు గారూ,
వామలూరు భవుని సద్గురువుగా అభివర్ణించిన మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
మొదటి పాదంలో ‘త్రిజగతీ’ అన్నచోట గణభంగం. సవరించండి...
*
లక్ష్మీదేవి గారూ,
ధన్యవాదాలు.
అక్కడ అవధానికి పూరణకోసం ఇచ్చిన సమస్య ఒక్కటే!
మీరు కోరినట్లుగా రేపు ఆ సమస్యనే శంకరాభరణంలో ప్రకటిస్తాను.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
అదే కొన్ని సవరణలతో..

స్తవనీయ రామ చరితము
శ్రవణమ్ముల కింపు గొలుపు రాగమ్ములతో
లవ కుశులకు నేర్పించితి
వవనిజనే గాచినట్టి యాదికవి! మునీ!

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శుభాశీస్సులు.
డా.చి. ఏల్చూరి వారి సీసములో 1వ పాదములో నాకు ఎక్కడా గణభంగము కనుపట్టలేదు. మీరే పొరబాటుగా చూచేరేమో. స్వస్తి.

కమనీయం చెప్పారు...





సకల విద్యల నేర్చిరి శ్రద్ధ తోడ,
మునివరేణ్యుడు వాల్మీకి మ్రోల గవలు,
యంతియేకాక ,నేర్చిరి యద్భుతముగ
గానమొనరింప శ్రీరామ గాథనెల్ల.

కంది శంకరయ్య చెప్పారు...

పండిత నేమాని వారూ,
ఏమిటో... నావల్ల ఈమధ్య పెద్ద పెద్ద పొరపాట్లు ఎక్కువగానే జరుగుతున్నాయి. నిజమే.. వారి పద్యంలో ఎక్కడా గణభంగం లేదు.. అపరాధిని! క్షమించండి.

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
నమస్కారం!

మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

“త్రిజగతీ” అన్నచోట గణభంగాన్ని గురించి మీరన్నది నాకు సరిగా బోధపడలేదు. అయితే, “లవకుశులు ధర్మపథకుశీలవులు గాఁగ” అన్న పంక్తిలో “లవకుశులు” అన్నందుకు పూర్వకవిప్రయోగాలేవీ జ్ఞాపకం రాలేదు. అందువల్ల పద్యాన్ని -

త్రిజగతీకళ్యాణదీపితార్థము లైన నిగమాగమంబుల నిర్వచించి
స్వస్వరూపజ్ఞానసవికల్పకం బైన బ్రహ్మచైతన్యంబు పాదుకొలిపి
శరవణోద్భవకృపాసమధిగతసమస్తశస్త్రాస్త్రసంహతి సంకలించి
పరమేశ్వరుని యందు పరమానురక్తిని భక్తిభావంబును పంతు గొలిపి

రామచరితామృతవిధాత వామలూరు
భవుఁడు బోధించె శబ్దార్థపారగుండు
భగవదవతారతత్త్వంబు బాలకులకుఁ
గుశలవులు వశీకృతదశదిశులు గాఁగ.

అని మార్చుకొన్నాను.

నమస్సులతో,
ఏల్చూరి మురళీధరరావు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గురువగు వాల్మీకి చెంతన
పెరిగిరి లవకుశు లిరువురు పేర్మి తోడన్ !
బరువగు రాముని కధనే
కరిగించిరి జనుల హృదిని గానము నందున్ !

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శంకరార్యా ! సొగసైన సవరణ చేశారు. .. ధన్యవాదములు.
మీరు చేసిన సవరణ తో..

స్తవనీయ రామ చరితము
శ్రవణమ్ముల కింపు గొలుపు రాగమ్ములతో
లవ కుశులకు నేర్పించితి
వవనిజనే గాచినట్టి యాదికవి! మునీ!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

రవివంశ పరంపర లీ
యవనీతలమందెఱుంగు నాది కవి కడన్
లవకుశుల చదువు సాగన్
దివిజ వరుల మెప్పు పొందుతేజరులవరే!