25, సెప్టెంబర్ 2012, మంగళవారం

పద్య రచన - 123

నైమిశారణ్యము
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. వనమిది భారత శుభ జీ
    వనమునకే తొల్లి మెట్టు వైదిక ధర్మా
    వనులకు స్థానము మన భా
    వనమున దలచిన జాలును భాగ్యము లబ్బున్.

    రిప్లయితొలగించండి
  2. నైమిశారణ్యమెల్లెడ నప్పియుండె
    ఋషులకెల్ల, యాగాదుల నెల్లపుడును
    విశ్వశాంతి వరల జేయు వేదవరుల
    కెల్ల; సూతమునిని గౌరవించి భక్తి
    తోడను పురాణములనెల్ల వేడుకనట
    వినుచు నుందురు వారలు వీనులలర;
    తలచి నంతనె పుణ్యము దరిని జేరు
    పావనమయిన నామము భారతమున.

    రిప్లయితొలగించండి
  3. పరమ వివేకశాలురును బ్రహ్మవిదుత్తములైన సన్మునీ
    శ్వరులగు సూత ముఖ్యుల నివాసవరేణ్యము యజ్ఞయాగముల్
    జరుగు పవిత్ర సీమ విలసన్నిగమాగమ ముఖ్య గోష్థులన్
    బరగెడు నైమిశాఖ్య వన వైభవమున్ వినుతింప శక్యమే

    రిప్లయితొలగించండి
  4. నైమి శారణ్య మది జూడ నలరు చుండె

    మునుల యాగంబు తోడన మొదటి నుండి

    సూ త మునియును మొదలగు హోత లచట

    చర్చ సేతురు వేదాల సార మంత .

    రిప్లయితొలగించండి

  5. బ్రహ్మ దర్భలతో నొక్క రథముఁ జేసి
    భూమిపై విసిరెను, దాని నేమి పడిన
    యడవియే నైమిశారణ్య మైన, దచట
    తపము చేసికొందురు మునుల్, దద్వనంబె
    బహుపురాణ కథన కీర్తి వడసి యలరె.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నైమిశారణ్య ప్రాశస్త్యాన్ని చక్కగా వివరించారు. బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    నైమిశారణ్య విశేషాలను బాగుగా వివరిస్తూ చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    నైమిశ వన వైభవాన్ని మనోహరంగా చిత్రించారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    వేదసార చర్చ జరిగే పవిత్రమైన నైమిశాన్ని గురించి చక్కగా చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. భగవత్భక్తిపరాయణుల్ బుధజనుల్ వైరాగ్యసంపన్నులున్
    నిగమాంతర్గతుడైన శ్రీహరినిహృన్నీరేజముల్ సాక్షిగా
    పొగడన్ జేతురు,యాగముల్ జరుగునంభోజాక్షు సేవింతురే
    జగమందిట్టి పవిత్ర పుణ్య ఫలదస్థానంబులున్ గల్గునే.

    రిప్లయితొలగించండి
  8. నైమి శారణ్య మందున నిమిష మాత్ర

    ధ్యాన మైనను గూర్చును ధ్యాన శక్తి !

    సూత శౌనకాది మునుల శుద్ధ గమన

    యజ్ఞ యాగాది క్రతువుల యంత్ర మహిమ!

    రిప్లయితొలగించండి
  9. శ్రీ సహదేవుడు గారికి,

    మొదటి పాదములో యతి / గణములు కుదరవనుకుంటానండీ.

    రిప్లయితొలగించండి

  10. నైమిశారణ్యాఖ్యోత్పత్తికథ
    కం.
    గౌరముఖాశ్రమ పరిసర
    ఘోరాటవిఁ జొచ్చి వేఁటకున్ దుర్జయుఁడన్
    రారాజు డస్సి, తన పరి
    వార సహితుఁడయ్యు, మునికిఁ బ్రాగార్ణకుఁడై;(1)

    తే.గీ.
    పోవఁగను గౌరముఖుఁడు సంపూర్ణ మతిని
    సంతసమ్మంది, యాతిథ్య సత్క్రియలను
    జేయ, విష్ణుని వేడఁగ, శ్రీహరి యొక
    మణిని నిచ్చె, నా మణి మహిమాతిశయత;(2)
    తే.గీ.
    ఒక్క నగరము నిర్మించి, మిక్కుటముగ
    షోడశోపచారమ్ములు శుద్ధమతిని
    జేయఁ దుష్టుఁడై యా రాజు చిత్తమందు
    మణిని సంగ్రహింపఁగ నెంచి, మునినిఁ గోరె!(3)
    ఆ.వె.
    ముని నిరాకరించ; మునితోడ యుద్ధమ్ముఁ
    జేసియైన, మణియ చిక్కు కొఱకు
    మదినిఁ గోర్కి గాఢమై యంపె సైన్యమ్ము
    మునినిఁజంపి, పిదప మణినిఁ దేఁగ!(4)

    కం.
    వర సైన్యమ్మునుఁ బంపిన
    తఱి నా ముని గంగఁ జేరి, తరణికి నర్ఘ్యో
    త్కర్షమిడుచుండె; భటు లిట
    తరవారులఁ జేఁతఁ బూని, దందడి సేయన్;(5)
    కం.
    మణినుండి శూరతతి సం
    జనియించియు సైన్యతతినిఁ జండించుచు వే
    రణమునుఁ జేయుచు నుండఁగ
    ముని యటకును నేఁగుదెంచి, మురరిపుఁ బిలువన్;(6)
    ఆ.వె.
    విష్ణుమూర్తి యపుడు వేగమ్ముగా వచ్చి,
    మునికి భయముఁ దీర్పఁ బూని యపుడు
    నిమిషమందు సేన నిర్మూలనము సేసి,
    మాయమాయెఁ దాను మరు నిముసము!(7)
    తే.గీ.
    ఎచట నిమిషమునందున నెదిరిఁ జంపె;
    నట్టి యారణ్యమునకును నైమిశాఖ్య
    కల్గి, "నైమిషారణ్యము" ఘనతనుఁ గని,
    సకల మునులకునదియ సుస్థానమయ్యె!

    (సమాప్తము)

    రిప్లయితొలగించండి
  11. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ‘వినుతింపం దగు పద్యలేఖనపు ప్రావీణ్యంబు నీ సొమ్మయెన్’
    *
    సహదేవుడు గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
    సంపత్ కుమార్ శాస్త్రి గారి వ్యాఖ్యను గమనించారా?
    పద్యంలో మొదటగా చెప్పవలసింది అన్వయలోపం. మొదటి పాదంలో యతి తప్పింది. పాదాంతం గురువవుతున్నది ‘మాత్ర/ధ్యాన’ అన్నప్పుడు ‘త్ర’ గురువవుతున్నది. సవరించండి.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ‘వరాహపురాణం’ లోని నైమిశారణ్య కథను చక్కగా ఖండికగా వ్రాసి అలరించారు. అభినందనలు.
    నేను స్కాందపురాణంలో చెప్పిన కథను గ్రహించాను.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారికి మరియు కవి మిత్రులు శ్రీసంపత్ కుమార్ శాస్త్రుల వారికి ధన్యవాదములు. తమరి సూచన మేరకు రెండు పాదముల సవరణ:

    నైమిశారణ్యపావనభూమి మీద

    ధ్యానమది గూర్చునసమాన మౌన శక్తి!

    రిప్లయితొలగించండి