15, సెప్టెంబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 823 (జానకినిఁ బెండ్లియాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
జానకినిఁ బెండ్లియాడె లక్ష్మణుఁడు వేడ్క.
ఈ సమస్యను పంపిన ఏల్చూరి మురళీధర రావు గారికి ధన్యవాదాలు.

26 కామెంట్‌లు:

  1. గుండు మధుసూదన్ గారి పూరణ....

    శివ ధనువుఁ ద్రుంచి, రాముండు, సిగ్గు లొలుకు
    జానకినిఁ బెండ్లియాడె! లక్ష్మణుఁడు వేడ్కఁ
    జూడ; గాధిజుం డలరఁగ; సురలు మురియ;
    జనకుఁ డుప్పొంగ; సభయును సంతసింప!

    రిప్లయితొలగించండి
  2. మాస్టారూ, సందేహం - వేడ్క అనేది విశేష్యముము కదా, "...లక్ష్మణుండు వేడ్క" అనేదానిని ఎలా అర్థం చేసుకోవాలి? ఏల్చూరి వారిచ్చిన సమస్య అంటే మరి మాటలా నా మట్టి బుర్రకి అందటంలేదు. దయచేసి సందేహం తీర్చగలరు.

    రిప్లయితొలగించండి
  3. రామ చంద్రుండు కల్యాణ రామ మూర్తి
    జానకినిఁ బెండ్లియాడె లక్ష్మణుఁడు వేడ్క
    నూర్మిళన్ మాండవిని తాను కూర్మి భరతు
    డున్ను శ్రుత కీర్తిఁ శత్రుఘ్ను డున్ను పొంద.

    రిప్లయితొలగించండి
  4. జనకపుత్రిక నూర్మిళన్ వినయశీల
    సర్వ లక్షణ లక్షితన్ సన్మనమున
    దండ్రి దానమొసంగగా తద్వధువగు
    జానకిని బెండ్లియాడె లక్ష్మణుడు వేడ్క

    రిప్లయితొలగించండి
  5. చంద్రశేఖర్ గారూ,
    అది సాధువూ, సుప్రసిద్ధమైన ప్రయోగమే. నిజానికి అది ‘వేడ్కన్’... ద్రుతం లోపించింది.
    ఎవరైనా ఆ పాదాన్ని చివరి పాదంగా కాకుండా పద్యం మధ్యలో ప్రయోగించినపుడు ఆ శబ్దం తరువాత యడాగమం చేస్తే దోషం అవుతుంది.
    పైన మధుసూదన్ గారి పూరణను గమనించండి.“వేడ్కన్ + చూడ = వేడ్కఁ జూడ’ అని ప్రయోగించారు.

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.
    వేడుక అనేది విశేషణము మరియు నామవాచకము కూడా అగును. వేడుకతో లేక వేడుకగా అనే 2 అర్థములలోను ప్రయోగించ వచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. మాస్టారూ, వేడ్కన్ అని ఉండాలని అనిపించే అడిగాను, సందేహంగా. ద్రుతం లోపించే సరికి సమస్య పాదానికి సంపూర్ణ అర్థం రాలేదని అనిపించింది. కానీ "వేడ్క" అనేది "వేడ్కన్" కి సాధురూపమని తెలియలేదు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  8. రామ భూ పతి యందాల భామ యైన
    జానకిని బెండ్లి యాడె , లక్ష్మణుడు వేడ్క
    నొంది నయ్యెడ విన్నపా లొ నర జేసె
    సామి దయ జూపి మాయెడ, శరణు నిమ్ము .

    రిప్లయితొలగించండి
  9. శ్రీరామలాక్ష్మణులిరిరువురికీ ఒకే మూహూర్తానికి పెళ్లయినదిట.
    ఆ పూట సీతారాముల వివాహాన్ని చూస్తున్న లక్ష్మణ స్వామికి, "ఇటు చూడుము , ఇది వినుము" అని బ్రహ్మ ఎన్నిసార్లు హెచ్చరిక చేసిఉంటారో

    సురసమస్తము,ముని,మహీసురసమూహ,
    ముర్విప, జననీజనకాళి,యూర్మిళలకు
    వలెను,జూచుచు నారఘు వరునిఁ వధువు
    జానకినిఁ; బెండ్లియాడె లక్ష్మణుఁడు వేడ్కఁ!

    రిప్లయితొలగించండి
  10. ఇంతకీ సమస్యలో సమస్యయెక్కడ అంటున్న పండితనేమానివారి పూరణ బహు బాగు.

    గతములో రాఘవుడు అని ఉన్న ఒక సమస్యను కూడ ఈలాగునే సమర్ధించారు.
    వ్యాకరణ శాస్త్ర సూత్రములే గాక, పూరణలో సులువులు నేర్పుతున్న వారికనేక ప్రణామములు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ రామకృష్ణ గారూ! (ఊకదంపుడు)
    మీరభిమానమును జూపి మెచ్చిరి నన్నున్
    సారమతిన్ దీవింతును
    భూరి సుఖములొంది మీరు పుడమి జెలంగన్

    రిప్లయితొలగించండి
  12. "ఫెల్లు" మనుచు శ్రీరాముడు విల్లు విరిచి
    జానకిని బెండ్లియాడె ; లక్ష్మణుడు వేడ్క
    మీర నిలిచె ; జేజేలు పల్కిరి పురజను
    లంత ; జనకు డానందించె లగ్నము గని

    రిప్లయితొలగించండి
  13. శ్రీ ఏల్చూరి మురళీధర్ గారికి, మీ బ్లాగు ఈ రోజు చూడటం జరిగింది. మీరు పురాతన స్వహస్త లిఖిత ప్రత్రులకోసం చేసే ప్రయత్నం అభినందనీయము. మీరు నాకు lanpad@gmail.com కి మీ ఫోను వగైరా వివరాలు ఇవ్వండి. వీలు వెంట సంప్రదించగల వాడను.

    రిప్లయితొలగించండి
  14. ఆదిశేషావతారమైన లక్ష్మణుడు,శేషతల్పము పై లక్ష్మి నారాయణుల అనురాగమునకు నిత్యసాక్షి అన్న భావంతో:

    విల్లువిరుగంగ రాముఁడు వీరుడయ్యు
    జానకినిఁ బెండ్లియాడె! లక్ష్మణుడు వేడ్క
    గనియె! లక్ష్మినారాయణులనుచు మ్రొక్కె!
    వారియనురాగసాక్ష్యంపుపాన్పుయతడె!

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! శుభాశీస్సులు.

    ఈనాటి సమస్యకు "విరుపు" తోనే ఎక్కువగా సాధ్యము అయినది. అందరికీ అభినందనలు.

    శ్రీ గుండు మధుసూదన్ గారు:
    మంచి విరుపుతో రాముని పెండ్లి చూచిన లక్ష్మణుని వర్ణించేరు. సొగసుగా నున్నది.

    శ్రీ మిస్సన్న గారు:
    నలుగురి పెండ్లిళ్ళు గూర్చి ముచ్చటించేరు. ఉత్తమముగా నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు:
    మంచి విరుపునే ఆశ్రయించేరు. ఉత్తమముగ నున్నది.

    శ్రీ రామకృష్ణ గారు:
    ఒకే ముహూర్తములో జరుగుచున్న పేండ్లిళ్ళు కావున లక్ష్మణునికి ఎప్పటి కప్పుడు గురువు జేసిన హెచ్చరికలను ప్రస్తావించేరు. వినూతనముగా నున్నది.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు:
    చక్కని పద్యములో పూరించేరు. ప్రశస్తముగా నున్నది.

    శ్రీ సహదేవుడు గారు:
    లక్ష్మీ నారయణులను స్మరింప జేసేరు. ఏ వధూ వరులను అయినా లక్ష్మీ నారాయణ మూర్తులుగానె భావించుతారు పెండ్లి పీటలమీద.

    రిప్లయితొలగించండి
  16. అందరికి నమస్కారం చిన్న మనవి

    ఈ నెల 17 వ తారీఖున ( సోమవారం) నాడు సాయంత్రం 6 గంటలకు మా తమ్ముడు చిరంజీవి రాంభట్ల పార్వతీశ్వర శర్మ అష్టావధానం విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో ఉంటుంది.(17-09-2012)

    ఇట్లు
    రాంభట్ల వేంకట రాయ శర్మ

    రిప్లయితొలగించండి
  17. నారదుని శాప వశమున నరుడి గాను
    హరియె నవతార పురుషుడై యవత రించి
    జానకిని పెండ్లి యాడె లక్ష్మణుడు వేడ్క
    నొందుచు విష్ణువే యని నుడివి మ్రొక్కె !

    రిప్లయితొలగించండి




  18. రఘుకులాంబుధి సోముండు రామచంద్రు
    డీశ్వరుని చాపమున్ విరిచి యెలమి మీర
    జానకిని బెండ్లి యాడె ; లక్ష్మణుడు వేడ్క
    నూర్మిళాదేవి జేపట్టె నుత్తమాంగి.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! అందరికీ శుభాభినందనలు.

    శ్రీమతి రాజేశ్వరి గారు:
    హరి నరునిగ యవతరించి జానకిని పెండ్లియాడుట, లక్ష్మణుడు వారికి మ్రొక్కుటను వర్ణించేరు మంచి విరుపుతో. ఉత్తమముగా నున్నది.

    డా. కమనీయం గారు:
    మీ పద్యము చాల బాగుగనున్నది. 2వ పాదములో చాపమున్ అనే పదములో "న్" (ద్రుతమును) టైపు పొరపాటుగా భావించుచున్నాను. న్ లేకుంటే గణములు సరిపోవును. పద్యము మంచి విరుపుతో సమస్యా పూరణమునకు తావు ఇచ్చినది. మనోహరమైన పూరణ.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. మనుమడు చి: రాంభట్ల పార్వతీశ్వర శర్మకు శుభాశీస్సులు.

    రాంభట్ల పార్వతీశ్వర!
    డింభక! యొనరింపు మతుల ఠీవి చెలగ, సం
    రంభము మెరయ వధానం
    బంభోజజు రాణి కరుణ నని దీవింతున్

    రిప్లయితొలగించండి



  21. శ్రీ పండిత నేమాని వారికి అభివాదములతో,మీరన్నట్లు అక్కడ ద్రుతం లేకపోతే గణవిభజన సరిపోతుంది.అర్థం కూడా మారదు.'చాపమున్ 'బదులు ' చాపము 'అని సవరిస్తున్నాను.ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  22. యాగమును గావ వెళ్ళిన రాఘవుండు
    శివ ధనుస్సును వంచి జేజేలు మ్రోగ
    జానకిని పెండ్లియాడెను, లక్ష్మణుడు కూడ
    కట్టుకొనె నూర్మిలను తండ్రి కాంక్ష తోడ.

    గండూరి లక్ష్మినారాయణ

    రిప్లయితొలగించండి
  23. శ్రీ రఘురామ మూర్తి ఘన శీలవతిన్ మిథిలేశు పుత్రికన్
    శూరులు, రాజరాజులును జూచుచు నుండగ విల్లు నొంచిశ్రీ
    నారిని పెండ్లియాడి గాహనంబుల కేగెను సీత ప్రేమతో
    వీరుని ధర్మవర్తనుని వెంట జనెన్ తన భర్త సేవకై .

    Ganduri Laxminaarayana
    sep.18-9-2012

    రిప్లయితొలగించండి
  24. గండూరి లక్ష్మీనారాయణ గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ రెండు పూరణలలో రెండవది ధారాశుద్ధితో ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    మొదటి పూరణలో సమస్య పాదాన్ని కొద్దిగా మార్చారు. అలా మార్చడం సంప్రదాయం కాదు కదా! స్వస్తి.

    రిప్లయితొలగించండి