అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనే యున్నది. కాని మరికొంత అన్వయ సౌలభ్యము కొరకు ఈ క్రింది మార్పులు సూచించున్నాను. (1) 2వ పాదము చివరలో "న్" చేర్చండి. 3వ పాదములో దాచెను కి బదులుగా "నందిడి" అనండి. (అప్పుడు 2వ పాదము చివర "న్" ఉంది కాబట్టి 3వ పాదములో యతి మైత్రి కూడా సరిపోతుంది.) స్వస్తి.
శ్రీ సరస్వత్యై నమః: మిత్రులారా! ఈనాటి పద్యరచన (కుంతి బిడ్డని నీటిలో విడుచుట) కరుణ రసముతో నిండిన విషయము. వచ్చిన పద్యములు చాలా బాగుగ నున్నవి. తొలి మూడు పద్యములు చంపకమాలలే. చాల బాగున్నవి. మంచి వాసనలను వెదజల్లుచున్నవి. అందరికి అభినందనలు.
శ్రీమతి లక్ష్మీ దేవి గారు: సొగసైన చంపకమాలను సమర్పించేరు. ప్రశస్తముగ నున్నది.
శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు: మంచి సరళమైన శైలితో చంపకమాలను వ్రాసేరు. చాల బాగున్నది.
శ్రీ సుబ్బారావు గారు మంచి ప్రయత్నముతో చక్కని చిన్న తేటగీతితోనే ఆనందమును కలిగించేరు. చాల బాగున్నది.
శ్రీ గుండు మధుసూదన్ గారు: ఒక 15 పాదముల గీత మాలికను ఆవిష్కరించేరు. ఉత్తమముగా నున్నది.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు : "ర్ణ" ప్రాసతో కందపద్యమును అలరింప జేసేరు. చాల బాగున్నది.
ముని వరమిచ్చె దేవతలు పుత్రు నొసంగెదరంట సత్యమా?
రిప్లయితొలగించండియని కడు నుత్సుకంబున ప్రభాకరు బిల్చెను కుంతి ప్రీతుడై
వనజహితుం డొసంగెను శుభప్రద లక్షణు కర్ణు పుత్రుగా
మనమున కంపమొంది సుతు మానిని యక్కట వీడె గంగలో
చిరునగవొల్కు బిడ్డడిని జెంతకు చేర్చుచు "నింద వచ్చునే,
రిప్లయితొలగించండిపరిణయమాడకుండగనె పాపడు కల్గె"నటంచు భీతితో,
తరుణి యదొక్కమందసము దాచెను వానిని కంట నీటితో,
విరులను శయ్యజేయుచును వేదన తోడను వీడె నీటిలో.
వరమది యున్నదే యనుచు భాస్కరదేవుని గాంచినంతనే
రిప్లయితొలగించండివరసుగుణాఢ్యుడైన యొక పట్టినిఁగన్నది, యంతలోనె భీ
కరమగు నిందలన్ తలచి, కర్ణుని, శోకసముద్రభారమున్
కరముల పారవైచినది గౌరవమెంతటి దుష్టమో కదా.
రిప్లయితొలగించండికుంతి పొందెను కర్ణుని కోరి రవిని
అంత లోననె భయపడి యామె వాని
నొక్క పట్టున విడిచెను గంగ లోన
ఆడ పిల్లల చెయిదము లట్లె యుండు .
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ gaari padyamu....
కుతీ విలాపము
తేటగీతి (మాలిక):
కుంతి సేసిన సేవల కుబ్బి మునియు
మంత్ర ముపదేశ మిచ్చె! తన్మంత్ర మహిమ
గొంతి కుదయించఁ గర్ణుండు, "కొడుక! నిన్నుఁ
గన్నెఁగాఁ గంటి; నపవాదుఁ గందు నేమొ?
కష్ట మగునని విడచు పాపిష్టురాల!
నిట్టి నీ తల్లి గంగలో నిన్ను విడువఁ
గినుకఁ బూనకు మో తండ్రి, కెంపుఁ గనుల!
విడువలేనయ్య దయమాలి; విధి బలీయ
మగుడు నిన్నిట్లు విడుతును! మమత తోడ
నిన్ను నే తల్లి యేనియుఁ గన్నులారఁ
గాంచి, తప్పక సాకును గడు ముదమున;
కవచ కుండలముల చిన్ని కన్న! నన్ను
మన్ననము సేయు మో యన్న, కన్నతండ్రి!"
యనుచు నేడ్చుచుఁ బేటిక నునిచి పృథయ
గంగలోఁ బో విడెను శోక కంజ నేత్ర!
అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
మీ పద్యము బాగుగనే యున్నది. కాని మరికొంత అన్వయ సౌలభ్యము కొరకు ఈ క్రింది మార్పులు సూచించున్నాను.
(1) 2వ పాదము చివరలో "న్" చేర్చండి. 3వ పాదములో దాచెను కి బదులుగా "నందిడి" అనండి. (అప్పుడు 2వ పాదము చివర "న్" ఉంది కాబట్టి 3వ పాదములో యతి మైత్రి కూడా సరిపోతుంది.)
స్వస్తి.
శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు
రిప్లయితొలగించండిమీ పద్యము బాగున్నది. మరి కొంచెము స్పష్టత కొరకు 3, 4 పాదములలో ఈ క్రింది మార్పులు సూచించున్నాను.
"కరమగు నిందలన్ దలచి కర్ణుని వీడెను నీట నక్కటా!
పరువును నిల్ప నెంచునెడ బాపురె! తప్పవు కష్ట నష్టముల్"
శ్రీ సుబ్బారావు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము 3వ పాదములో యతి మైత్రి లేదు. సరిజేయండి.
స్వస్తి.
అయ్యా! శ్రీ మధుసూదన్ గారూ!
రిప్లయితొలగించండిమీ గీతమాలికలో వేదనలోనున్న కుంతి హృదయమును చక్కగా ఆవిష్కరించేరు. చాల బాగున్నది. అభినందనలు. స్వస్తి.
అయ్యా, ధన్యావాదాలండి. చక్కని సవరణ చేసినారు.
రిప్లయితొలగించండిఅదే విధంగా సవరించిన పద్యము.
చిరునగవొల్కు బిడ్డడిని జెంతకు చేర్చుచు "నింద వచ్చునే,
పరిణయమాడకుండగనె పాపడు కల్గె"నటంచు భీతితోన్,
తరుణి యదొక్కమందసము నందున వానిని కంట నీటితో,
విరులను శయ్యజేయుచును వేదన తోడను వీడె నీటిలో.
నా సవరణతో పద్యము.
చిరునగవొల్కు బిడ్డడిని జెంతకు చేర్చుచు "నింద వచ్చునే,
పరిణయమాడకుండగనె పాపడు కల్గె"నటంచు భీతితో,
మరులను వీడి వానినొక మందసమందున దాచి, నీటిలో
దొరలగ జేసి పంపెనిక దుఃఖము పొంగగ కంట నీరుగా.
గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య.....
రిప్లయితొలగించండినా పద్యము, గురుతుల్యులు పండిత నేమానివారి మెప్పు వడయ గలిగినందులకు నా కెంతయు నానందము కలిగినది. వారికిఁ గృతజ్ఞుఁడను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండికుంతి పొందెను కర్ణుని కోరి రవిని
అంత లోననె భయపడి యామె వాని
గంటి తడితోడ విడిచెను గంగ లోన
ఆడ పిల్లల చెయిదము లట్లె యుండు .
శ్రీ నేమాని గురువర్యులకు,
రిప్లయితొలగించండిప్రణామములు. మీ సవరణ సర్వదా శిరోధార్యము.
కర్ణముల మంత్ర మిడ నా
రిప్లయితొలగించండికర్ణించిన కుంతియె దిన కరునే పట్టెన్
కర్ణుని గని పెట్టె ను నిడి
వర్ణ విహీనత ముఖమున వదలెను నదిలో.
ముని యిచ్చిన వరమును తన
రిప్లయితొలగించండిచిన తనపుం జాపలమున జేయగ పరిశీ-
లనమును బిల్చెను కుంతి ర-
విని భాస్కరుడిచ్చి పోయె బిడ్డ నతివకున్.
బిడ్డను గని భయమున రా-
బిడ్దొక మందసము నందు పెట్టెను వానిన్
ఆడ్డుపడ మాతృ హృదయము
చెడ్డది నీతల్లి యనుచు చేరెను నదికిన్.
పెట్టెను బాలుని తోడను
గట్టిగ బిగబట్టి గుండె కన్నియ నదిలో
నెట్టన విడువం బెట్టెను
చట్టున వెనుదిరిగె తల్లి చంచల మతియై.
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా!
ఈనాటి పద్యరచన (కుంతి బిడ్డని నీటిలో విడుచుట) కరుణ రసముతో నిండిన విషయము. వచ్చిన పద్యములు చాలా బాగుగ నున్నవి. తొలి మూడు పద్యములు చంపకమాలలే. చాల బాగున్నవి. మంచి వాసనలను వెదజల్లుచున్నవి. అందరికి అభినందనలు.
శ్రీమతి లక్ష్మీ దేవి గారు: సొగసైన చంపకమాలను సమర్పించేరు. ప్రశస్తముగ నున్నది.
శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు: మంచి సరళమైన శైలితో చంపకమాలను వ్రాసేరు. చాల బాగున్నది.
శ్రీ సుబ్బారావు గారు మంచి ప్రయత్నముతో చక్కని చిన్న తేటగీతితోనే ఆనందమును కలిగించేరు. చాల బాగున్నది.
శ్రీ గుండు మధుసూదన్ గారు: ఒక 15 పాదముల గీత మాలికను ఆవిష్కరించేరు. ఉత్తమముగా నున్నది.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు : "ర్ణ" ప్రాసతో కందపద్యమును అలరింప జేసేరు. చాల బాగున్నది.
అందరికీ పేరు పేరునా అభినందనలు.
స్వస్తి.
the 3 poems of Sri missanna are also of a good standard. Congratulations.
రిప్లయితొలగించండిమండే సూర్యుని వరమున
రిప్లయితొలగించండిగుండెల కుంపటి వలెగని కుంతీ కుమారై
ఎండకు వాగునఁ వదలన్,
కుండీలన్ జెత్త నేటి కుంతీ కొమరుల్!
రిప్లయితొలగించండికరుణశ్రీ కుంతీవిలాపము తర్వాత ఏం రాస్తాము?ఐనా యథాశక్తి ఒక పద్యం.-
వరమహిమన్ బరీక్ష గను వాంఛను తొందరపాటు చేత నా
తరుణవయస్క కుంతి వెస దాల్చెనుగర్భము భాను తేజమున్
నరుణసమానుడౌ శిశువు నన్యులెరుంగని రీతి బెట్టి యన్
దొనరగ నుంచి ,గంగనిడె దుః ఖితయై యపవాద భీతిచే.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిరెండవ పాద సవరణ:
కుంతీ కుమారై అని టైపయ్యింది దానిని 'కుంతి కుమారై' అని చదువ ప్రార్థన