5, సెప్టెంబర్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 813 (బోధ సేయు గురుఁడు)

కవిమిత్రులారా,
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు! 
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
బోధ సేయు గురుఁడు మూర్ఖుఁడు కద!

23 కామెంట్‌లు:

 1. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భముగా గురువులు శ్రీ కంది శంకరయ్య గారికి, శ్రీ పండిత నేమాని గారికి, శ్రీ ఏల్చూరి గారికి, ప్రత్యేక నమస్కారములను తెలియజేసుకుంటున్నాను.

  జీవగతులఁమార్చి దేవమార్గముఁజూపి
  ముక్తినొసగునట్టి భక్తి తత్వ
  నిఖిల శాస్త్రములను నిరసించి వ్యర్థమౌ
  బోధ జేయు గురుఁడు మూర్ఖుఁడు కదా.

  రిప్లయితొలగించండి
 2. ఉపాద్యాయ దినోత్సవ సందర్భంగా గురువుగారు కందిశంకరయ్య గారికీ, బ్లాగు గురువులు శ్రీ నేమాని పండితులవారికీ, శ్రీ చింతా రామకృష్ణారావు గారికీ, డా. ఏల్చూరి మురళీధర రావు గారికీ, డా. విష్ణునందనుల వారికీ తదితర సత్కవి గురువులందరికీ శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 3. ప్రహ్లాదుని మాటలు:

  రండి మిత్రులార అండజ వాహను
  గొలువ ముక్తి గలుగు వలదసురుల
  విభుని కీర్తనములు విడువుడంచు హరిని
  బోధ సేయు గురుఁడు మూర్ఖుఁడు కద.

  రిప్లయితొలగించండి
 4. బలి స్వగతం:

  సిరులు భోగ చయము చిరకాల ముండునే
  తనువు శాశ్వతమ్మె తానయి హరి
  దాన మడుగ నీయ హానియన్ లౌకిక
  బోధ సేయు గురుఁడు మూర్ఖుఁడు కద

  రిప్లయితొలగించండి
 5. జ్ఞానము నిచ్చు పెద్దలకు, చక్కటి విద్యను నేర్పు వారికిన్,
  మౌనము దాల్చి; వందనము, మాన్య వరేణ్యుల దల్చి జేసెదన్.
  ప్రాణము తోడ నే భువిని బాయక నుండెడు నాళులన్నియున్,
  ధ్యానము లోన నిల్పి గురు దర్శన భాగ్యము చేయకుందునే?

  రిప్లయితొలగించండి
 6. ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా గురు పqరంపర కంతకునూ వందనములు.

  శాశ్వత సుఖ మయము జ్ఞాన ప్రకాశమ్ము
  నైన యాత్మబోధలన్ని విడిచి
  యల్ప సుఖదములును హానిని గూర్చు దు
  ర్బోధ సేయు గురుడు మూర్ఖుడు కద

  రిప్లయితొలగించండి
 7. సర్వ భూతములను సమదృష్టితో జూడు
  తనువ శాశ్వతమ్ము వినుమనుచును
  బోధ సేయు గురుఁడు మూర్ఖుఁడు కద దాని
  వినని వాడు ధరను గనగ నెపుడు.

  రిప్లయితొలగించండి
 8. అంత రాన్ధకార మంతయు తొలగించి
  జ్ఞాన తేజ మొసఁగు పూనికగొని
  బోధ జేయు గురుఁడు; మూర్ఖుఁడుకద దాని
  నందు కొనని శిష్యు డెందుకైన!

  రిప్లయితొలగించండి
 9. గురువు గారూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలండీ.

  రిప్లయితొలగించండి
 10. Wish you all Happy teachers Day

  పరమ పూ జ్యు డ గును పండి తులకు ధర
  బోధ సేయు గురుడు, మూ ర్ఖు డు కద
  మొండి పట్టు కలిగి మొరటు గల యతండు
  సజ్జ నుండు మెలగు సాదు వుగను .

  రిప్లయితొలగించండి
 11. గుండు మధుసూదన్ గారి పూరణ....

  తల్లి తండ్రి భార్య తనయులు సోదరుల్
  బంధు మిత్రు లనెడి భ్రమను విడక;
  యిదియ నిత్య మంచు నిహలోకమందు దు
  ర్బోధ సేయు గురుఁడు మూర్ఖుఁడు కద!

  రిప్లయితొలగించండి
 12. చదువు లెన్నొ జదివి శాస్త్రజ్ఞానము లేక
  నీతు లెన్నొ పలికి నిజము దాచి ;
  దైవ భక్తి సుంత దరికి రానీయక
  బోధ చేయు గురుడె మూర్ఖుడు కద !

  రిప్లయితొలగించండి
 13. "ఉన్నతోన్నతమగు నుర్వి నాధునిక వి
  జ్ఞానమొండె - ఘనుడు మానవుండె !
  దైవముండుననుట తప్ప"ని - నాస్తిక్య
  బోధ సేయు గురుడు మూర్ఖుడు గద !

  వ్యక్తిగతంగా అంతటి అర్హత లేకపోయినా , పెద్దల సరసన నాకూ ఒక చోటు కల్పించి మన్నించిన శ్రీ మిస్సన్నగారికి - బహుధా ధన్యవాదాలు !

  రిప్లయితొలగించండి
 14. అయ్యా శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగున్నది. "శాస్త్రజ్ఞానము" అని సమాసము అవుతుంది కాబట్టి అందులో జ్ఞా కి ముందున్న స్త్ర గురువు అయి గణభంగము అవుచున్నది. కాస్త సవరించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. నమస్కారం నేమాని గారూ! "శాస్త్ర మెరుంగక" అంటే సరిపోతుందా !

  రిప్లయితొలగించండి

 16. ఉపాద్యాయ దినోత్సవ సందర్భంగాగురువులందరికీ శుభాకాంక్షలు.


  బ్రహ్మ విష్ణు శివుల ప్రత్యేక రూపమై
  గౌరవంబు పొంది ఘనత చెంద
  శిష్యు లైన వారి సిగరెట్లుకై పంపి
  బోధ సేయు గురుఁడు మూర్ఖుడు కద

  రిప్లయితొలగించండి
 17. అయ్యా శ్రీ నాగరాజు రవీందర్ గారూ!
  శుభాశీస్సులు
  శాస్త్రమెరుంగక అని సవరణ చేస్తే చక్కగ సరిపోతుంది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. విష్ణు నందనులవారూ మీ అర్హత గురించి మాకు తెలియును గదా! మీకంతగా తెలియక పోవచ్చును లెండి.
  భవదీయుడు.

  రిప్లయితొలగించండి
 19. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు, నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు.
  నిన్నటినుండి నాకు తీవ్రమైన జ్వరం, తల, మెడ విపరీతంగా నొప్పి. అందువలన పూరణలపై స్పందించలేకపోయాను. మన్నించండి.
  అద్భుతమైన పూరణలు చెప్పిన
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  మిస్సన్న గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  పండిత నేమాని వారికి,
  చంద్రశేఖర్ గారికి,
  సుబ్బారావు గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  డా. విష్ణునందన్ గారికి,
  సహదేవుడు గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 20. కొండ మ్రుచ్చు లకును గోరంత నిజమును
  చెప్ప నెంచి చచ్చె చెవుల పిల్లి
  చెనటి జనుల మార్చగను సత్య మార్గమ్ము
  బోధ సేయు గురుఁడు మూర్ఖుడు కద

  రిప్లయితొలగించండి