9, సెప్టెంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 107

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

 1. యముడే వచ్చెను తానె ని
  యమముల నే దప్పకుండ హర హర యనుచున్
  భయమును వీడుచు గొల్చెను
  యమ బాధను దీర్చి బాలు నభవుడు బ్రోచెన్.

  రిప్లయితొలగించండి
 2. శైలజాప్రియ! సర్వరక్షక! చంద్రశేఖర! పాహిమాం
  కాలకాల! యటంచు వేడు మృకండు పుత్రుని బ్రోచుచున్
  కాలు గర్వ మడంచితో శితికంథరా! శివ! శంకరా!
  బాలచంద్ర విభూష! నీ పదపద్మ యుగ్మము గొల్చెదన్

  రిప్లయితొలగించండి
 3. మార్కండేయుని కథయే
  తార్కాణము మానవునికి ధారుణి శివునే
  కర్కశ రహితుని గొలువగ
  నర్కజ బాధలవన్నియు నవియే దీరున్.

  రిప్లయితొలగించండి
 4. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
  శుభాశీస్సులు.
  మీ 2వ పద్యములో 4వ పాదములో గణభంగమును సరిజేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. "దేవా,నమ్మితినయ్య, మృత్యుభయమున్ దీయంగ రావేలనో,
  నీవే దిక్కని యెంచు, బాలుని మొఱన్ నీవాలకింపంగదే!"
  భావావేశముతోడ వేడినపుడే ఫాలాక్షుడుగ్రుండుగా
  నావిర్భావము నందె నాశిశువుకై యావేశముప్పొంగగాన్.

  రిప్లయితొలగించండి
 6. మరియిక నీకు దిక్కొక డుమా పతియే శరణమ్ము వేడుమా
  హరునని తండ్రి చెప్పగను నార్తిని బాలుడు నీదు లింగమున్
  హరహర యంచు బట్టుకొన నా సమవర్తిని కాల దన్నవే
  సరగున బ్రోవగా నతని శంకర నీ సరి వేల్పు లేరయా!

  రిప్లయితొలగించండి
 7. పాహిమాం గిరిజానాథ!
  పాహి కైలాసమందిర!
  పాహిమాం సర్వలోకేశ!
  పాహి మృత్యుభయాపహ!

  వందేహం వృషభారూఢం
  వందే భక్తాభయప్రదం
  వందే జ్ఞానప్రదం దేవం
  వందేహం చంద్రశేఖరం

  నమస్తే విశ్వనాథాయ
  నమస్తే శూలపాణినే
  నమశ్శివాయ రుద్రాయ
  నమస్తే శంభవే నమః

  రిప్లయితొలగించండి
 8. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులార! శుభాశీస్సులు.
  ఈనాటి పద్య రచన - లక్ష్యము: మార్కేండేయ రక్షణ:
  అందరికీ అభినందనలు.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి 2 పద్యములు చాలా బాగున్నవి - హాయిగా కందములు సాగెను.

  శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
  1,2 పాదములకు 3,4 పాదములతో సంబంధము చూపే పదములు పద్యములో లేవు. అంతట అని గానీ మరొక పదము ఏదేని గాని ఉంటే అన్వయము బాగుంటుంది. మృత్యు భయమున్ దీయంగ అన్నారు - దీర్చంగ అంటే ఇంకా ప్రస్ఫుటముగా ఉంటుంది. ఉత్తమముగా నున్నది.

  శ్రీ మిస్సన్న గారు:
  మార్కండేయుని కథ బాగుగనే చెప్పేరు. అన్వయ సౌలభ్యమును ఇంకా మెరుగు పరచుకోవాలి. ప్రశస్తముగా నున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. అయ్యా,
  ధన్యవాదములు.
  మీ సూచన మేరకు సవరించి, ఇంకొక పాదం అన్వయ సౌలభ్యార్థము చేర్చితిని.

  "దేవా,నమ్మితినయ్య, మృత్యుభయమున్ దీర్చంగ రావేలనో,
  నీవే దిక్కని యెంచు, బాలుని మొఱన్ నీవాలకింపంగదే!"
  జీవమ్ముంచగదే" మృకండుసుతుడే సేవించి ప్రార్థింపగా,
  భావావేశముతోడ వేడినపుడే ఫాలాక్షుడుగ్రుండుగా
  నావిర్భావము నందె నాశిశువుకై యావేశముప్పొంగగాన్.

  రిప్లయితొలగించండి

 10. మృడు ని లింగము గట్టిగ మృ కము నితన
  యుండు పట్టుకు గోరెను యో భవుండ !
  భక్త లోలుడ ! భవహర !భస్మ ధ రు డ !
  కావు మిప్పుడు వేగమె కాలు నుండి .

  రిప్లయితొలగించండి
 11. ఆర్యా ! ధన్యవాదములు.
  మీ సూచన మేరకు నా పూరణ లోని గణ దోషమును సవరించు చున్నాను.

  మార్కండేయుని కథయే
  తార్కాణము మానవునికి ధారుణి శివునే
  కర్కశ రహితుని గొలువగ
  నర్కజ బాధలు నిరతము నవియే దీరున్.

  రిప్లయితొలగించండి
 12. నేమాని పండితార్యా ధన్యవాదములు.
  మరొక పద్యం వ్రాశాను. పరిశీలించండి.

  కావవె శంకరా కరుణ కాలుని పాశమునుండి దిక్కు నీ-
  వే వరదా భయార్తి హర ఈశ్వర యన్న మృకండు సూనునిన్
  నీ వరుదెంచి బ్రోచితివి నీ కృపకున్ దరి యున్నదే మహా-
  దేవ సదాశివా భవ దధీనులు గారె సమస్త దిక్పతుల్.

  రిప్లయితొలగించండి
 13. చంద్రశేఖరాష్టకమ్....

  తన్మృకండ సుపుత్ర రక్షక! దండధారి భయంకృతా!
  శిష్టపాలక! దుష్టశిక్షక! చిత్తజాంతక! శంకరా!
  దక్షజా పతి! శైలకార్ముక! దక్షయజ్ఞ వినాశకా!
  చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

  అంధకాంతక! తాండవప్రియ! హాటకేశ్వర! ధూర్జటీ!
  విష్ణుమిత్ర! కృశానురేతస! పింగళాక్ష! వృషాం చరా!
  శూలపాణి! మహేశ! భార్గవ! సూర్య! శంభు! సదాశివా!
  చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

  అస్థిమాలి! గిరీశ! రుద్ర! మహానట! ధ్రువ! భీషణా!
  విశ్వనాథ! పినాకపాణి! వృషధ్వజ! త్రిపురాంతకా!
  మృత్యుజేత! ఫణీంద్ర భూషణ! కృత్తివాస! జటాధరా!
  చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

  అంబరాంబర! భానుతేజ! విషాంతకా! ద్రుహి! ణాక్షరా!
  నీలలోహిత! పార్వతీపతి! నీలకంఠ! నిరంజనా!
  వ్యోమకేశ! భవ! క్రతుక్షయ! భూతనాథ! నదీ ధరా!
  చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

  నాగకంకణ! సర్వతోముఖ! నందివర్ధన! పింగళా!
  శర్వ! పందముఖ! త్రిలోచన! శాశ్వత! స్మర శాసకా!
  పాంశుచందన! నీలకంధర! ఫాలలోచన! భాస్కరా!
  చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

  అష్టమూర్తి! విశాఖ! సాంబ! సహస్ర బాహు! భవాంతకా!
  శ్వేత పింగళ! సాంఖ్య ముఖ్య! వశీకృతాంగ! సునిశ్చలా!
  స్థాణు! హింస్ర! హిరణ్యబాహు! విశాలనేత్ర! దిగంబరా!
  చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

  అంబికేశ! సుమేరు! సిద్ధిద! త్ర్యంబ! కాజిత! సంగ్రహా!
  రాజశీర్షక! లింగమూర్తి! విరాగి! భైరవ! త్ర్యంగటా!
  హైమవత్యుపయంత! వామ! విషాంతక! ప్రమథాధిపా!
  చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

  మార! దానఘ! భస్మగాత్ర! కుమార హేరుక జన్మదా!
  సర్వకామద! వామదేవ! విశాల మానస! పాలకా!
  విశ్వసాక్షి! సమస్త కుక్షి! కవీశ సంస్తుత! రక్షకా!
  చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

  శుభం భూయాత్

  రిప్లయితొలగించండి
 14. చంద్రశేఖర కాలపాశము చల్లగా నను చుట్టెడిన్
  చంద్రశేఖర నిన్వినా కనజాల రెవ్వరు నాకికన్
  చంద్రశేఖర బాలుడన్ కని సంకటమ్మును బాపవే
  చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర కావవే.

  కాలకాలుడు వేగ వచ్చె మృకండు సూనుని కావగన్
  ఫాలనేత్రుని జూచి కాలుడు పారె విహ్వలచిత్తుడై
  శూలపాణి దయార్ద్రదృక్కులు సోకినంత చిరాయువై
  బాలభక్తుడు ప్రస్తుతించె నపార భక్తిని శంభునిన్.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ సరస్వత్యై నమః:
  మరికొన్ని పద్యములు:
  మిత్రులారా! శుభాశీస్సులు. అందరికీ అభినందనలు.

  శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
  మీ 2వ ప్రయత్నమైన పద్యము బాగున్నది. ప్రశస్తమైన పద్యము.

  శ్రీ సుబ్బా రావు గారు:
  మీ పద్యము బాగున్నది - ఉత్తమముగా నున్నది.

  శ్రీ మిస్సన్న గారు:
  మీ 2వ ప్రయత్నము బాగున్నది. తరువాతి 2 పద్యములు చాల సొగసుగా నున్నవి. మత్తకోకిలను ఆహ్వానించేరు.

  శ్రీ గుండు మధుసూదన్ గారు:
  మీ అష్టకము భక్తిభరితముగా నున్నది. నిత్య పఠనీయము. అమూల్యమైన కృషి - అభినందనలు. సంస్కృత ఛందస్సు సంప్రదాయమును పాటించేరు. అయితే అన్ని పదములు సంబోధన ప్రథమా విభక్తిలో నుండాలి(సంస్కృతములో). తెలుగులో 2 విడి పదములు ఉంటే ఉత్తర పదము తొలి అక్షరము సంయుక్త అక్షరము అయినచో దాని ప్రభావము పూర్వ పదముపై నుండదు. కాని సంస్కృతములో ఆ వెసులుబాటు లేదు. పూర్వ పదములోని చివరి అక్షరముపై ఆ ప్రభావము పడుతుంది. ఈ ప్రకారము మీ శ్లోకములలో ప్రయోగింపబడిన పదములు -- త్ర్యంబక, త్ర్యంగట అనే పదముల ముందు అక్షరములు గురువులు అయేయి. గణ భంగము అయినట్లు తోచుచున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. లింగడు మృకండు సుతునా
  లింగమునకాయువునిడి లేరెవ్వరనన్
  గొంగున బంగారంబై
  కంగుతినన్ గాలునైనఁగాలితొ దన్నున్!

  రిప్లయితొలగించండి
 17. శ్రీగురుభ్యోనమః
  రెండవ పాదము లో టైపాటు: 'లింగనమునకాయువునిడి లేరెవ్వరనన్'

  రిప్లయితొలగించండి
 18. భక్తుల పాలిట శివుడన
  శక్తిగ వలవేసి బట్టు జమ పాశమ్మౌ
  భక్తికి సంతస మొందుచు
  ముక్తిని గలిగించె భక్త మార్కం డునికే !

  రిప్లయితొలగించండి

 19. శ్రీ సరస్వత్యై నమః:
  అందరికీ అభినందనలు.
  శ్రీ సహదేవుడు గారు:

  మీ పద్యము బాగున్నది. తోడన్ తోన్ అని తృతీయా విభక్తి ప్రత్యయములు. అందుచేత తొ అని వాడ రాదు. మీ పద్యములో 4వ పాదము ఇలా మార్చుదాము:
  "కంగు తినన్ కాలదన్ను గాలుని నేనిన్"
  ఉత్తమముగా నున్నది మీ భావము.

  అమ్మా రాజేశ్వరి గారూ:
  మీ పద్యములో 4వ పాదమును ఇలా మార్చుదాము:
  "ముక్తి నొసంగెను మృకండ మునితనయునకున్"
  మీ పద్యము ఉత్తమముగా నున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. గురువులకు ప్రణామములు
  మృకండు మహఋషి అవునొ కాదో అని సందెహం కలిగింది.సవరణ జేసి సందెహము దీర్చి నందులకు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 21. శ్రీగురుభ్యోనమః
  గురువుగారికి నమస్సులుః
  ఆర్యా!
  ధన్యవాదములు. తమరి సూచన ప్రకారము 4 పాద సవరణ:
  కంగుతినన్ కాలదన్ను కాలుని మేనిన్!

  రిప్లయితొలగించండి
 22. గుండు మధుసూదన్ అన్నారు...

  చంద్రశేఖరాష్టకమ్....

  తన్మృకండ సుపుత్ర రక్షక! దండధారి భయంకృతా!
  శిష్టపాలక! దుష్టశిక్షక! చిత్తజాంతక! శంకరా!
  దక్షజా పతి! శైలకార్ముక! దక్షయజ్ఞ వినాశకా!
  చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

  అంధకాంతక! తాండవప్రియ! హాటకేశ్వర! ధూర్జటీ!
  విష్ణుమిత్ర! కృశానురేతస! పింగళాక్ష! వృషాం చరా!
  శూలపాణి! మహేశ! భార్గవ! సూర్య! శంభు! సదాశివా!
  చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

  అస్థిమాలి! గిరీశ! రుద్ర! మహానట! ధ్రువ! భీషణా!
  విశ్వనాథ! పినాకపాణి! వృషధ్వజ! త్రిపురాంతకా!
  మృత్యుజేత! ఫణీంద్ర భూషణ! కృత్తివాస! జటాధరా!
  చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

  అంబరాంబర! భానుతేజ! విషాంతకా! ద్రుహి! ణాక్షరా!
  నీలలోహిత! పార్వతీపతి! నీలకంఠ! నిరంజనా!
  వ్యోమకేశ! భవ! క్రతుక్షయ! భూతనాథ! నదీ ధరా!
  చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

  నాగకంకణ! సర్వతోముఖ! నందివర్ధన! పింగళా!
  శర్వ! పంచముఖ! త్రిలోచన! శాశ్వత! స్మర శాసకా!