29, సెప్టెంబర్ 2012, శనివారం

పద్య రచన - 127

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. ఉంచితి నాకుల నీపై
    ఉంచకు వ్యాకులములన్ని యుల్లమునందున్
    ముంచుదు నీటను నిన్నే
    ముంచుము నను పాలలోన మూషిక వాహా.

    రిప్లయితొలగించండి
  2. శిరమున నుంచితి నిన్నే
    భరమే గద నింటనున్న భరియిం పంగన్ !
    సరగున కలిపెద నీటను
    వరమీయుము మమ్ము గాచి విరుచుకు తినకన్ !

    రిప్లయితొలగించండి
  3. చిన్న సవరణ తో..

    ఉంచితి నాకుల నీపై
    ఉంచకు వ్యాకులము నాదు యుల్లమునందున్
    ముంచుదు నీటను నిన్నే
    ముంచుము నను పాలలోన మూషిక వాహా !

    రిప్లయితొలగించండి
  4. నవరాత్రి పర్వముల్ నవభక్తి రీతులన్
    ....గావించినార మో గజవరాస్య!
    సంగీత సాహిత్య సద్గోష్ఠులనొనర్చి
    ....నృత్య నాటక తతుల్ నిర్వహించి
    ఆటపాటలతోడ నానందమును బంచి
    ....తేలియాడితి సంబరాలలోన
    సిద్ధి వినాయకా! శ్రీ గణనాయకా!
    ....నిన్ను సేవించితి నెమ్మనమున
    చాల ధన వస్తుతతుల చందాలు వచ్చె
    లడ్డు వేలమ్ములో పాట లక్షలంటె
    పోయిరా దేవ! కైలాసమునకు ననుచు
    ననుపుచుంటిమి నిన్ను మహాగణేశ!

    ఈ యేటి వ్రతము ముగిసెను
    పోయి మరల రమ్ము దేవ! ముందటి వర్షం
    బోయి గణనాథ! సాదృతి
    చేయుదు వందనము నీకు సిద్ధి గణేశా!

    రిప్లయితొలగించండి

  5. తొమ్మిది రోజులు పూ జలు


    నెమ్మది నేజేసి నిన్ను నీ రము నందున్


    నిమ్ముగ గలుపుదు సామీ !


    యిమ్ముగ మఱి ముక్తి నాకు నీ శుని తనయా !

    రిప్లయితొలగించండి
  6. నీట మునుగుట ప్రతి యేడు నీకు ముదము
    పాల ముంచెదవో లేక వార్ధి లోనొ !
    మమ్ము గరుణించి కాపాడి యిమ్ము శుభము
    పోయి రావయ్య ! యేనుగు మొగము సామి

    రిప్లయితొలగించండి

  7. తొమ్మిది రోజులు పూ జలు


    నెమ్మది నేజేసి నిన్ను నీ రము నందున్


    నిమ్ముగ గలుపుదు సామీ !


    యిమ్ముము మఱి ముక్తి నాకు నీ శుని తనయా !

    రిప్లయితొలగించండి
  8. భాద్రపదమైనవర్షముల్ బడుట లేదు
    పెక్కువేదికలన్ నిల్ప వేడి జేసె
    నిల్వ నీటిలో ముంచగా నేర మనకు
    గంగ తల్లికి మాబాధఁ గలిసి జెప్పి
    వానలేరులై పారంగ వరముఁగోరు!

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మనం నీట ముంచినవాడు మనల్ని పాల ముంచాలా? చక్కని భావన. బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    పాపం! ఆయన్ని ఇంటనుంచుకొనే భారం భరించలేనిదంటారు. మంచి భావం. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    వినాయక నవరాత్రుల విశేషాలను గురించి చక్కని పద్యాలు చెప్పారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘నిమ్ముగ’ అనే పదం లేదు. ‘నీరమునందున్ + ఇమ్ముగ’ను ‘నీరమునందు న్నిమ్ముగ’ అని ప్రయోగించవచ్చు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ఏనుగు మొగము సామిని పోయిరమ్మని సాగనంపిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి




  10. నీటి నుండి పుట్టె నేల ,యా మట్టిని
    విఘ్నపతిని జేసి విరుల గొల్చి
    మరల నీటిలో నిమజ్జనమున్ జేయ
    విహితమగును శాస్త్రవిధిని జూడ.

    రిప్లయితొలగించండి




  11. నీటి నుండి పుట్టె నేల ,యా మట్టిని
    విఘ్నపతిని జేసి విరుల గొల్చి
    మరల నీటిలో నిమజ్జనమున్ జేయ
    విహితమగును శాస్త్రవిధిని జూడ.

    రిప్లయితొలగించండి