1, సెప్టెంబర్ 2012, శనివారం

పద్య రచన - 99


కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. ఆగు విడువకు బాణము నాగు పార్థ
    రథము క్రుంగెను చక్రమ్ము లాగి పైకి
    మరల యుద్ధమ్ము జేసెద నరయు మయ్య
    ఆయుధము లేని నన్ జంప న్యాయమగునె.

    విజయ బాణము సంధించు విడువబోకు
    నీతి మాలిన వానిపై నీకు జాలి
    తగదు బాలు నిరాయుధు తెగడి నపుడు
    ధర్మ పన్నము లేమాయె తప్పు లేదు .

    కర్ణు డీల్గెను భీభత్సు కరకుటమ్ము
    గుండె చీల్చగ పడమటి గూటికేగె
    నర్కు డాతని గనలేక నాశ్రయమ్ము
    చెడ్డదగుటను కర్ణుడు చెడెను తుదకు.

    రిప్లయితొలగించండి
  2. వలదో పార్థ! నిమేషమాగుమనుచున్ పద్మాప్త సూనుండనన్
    జలజాతాక్షు డిదే సుమా యదను శస్త్రమ్మున్ బ్రయోగింపుమా
    బలభిత్సూన! యటంచు బల్క వినుచున్ బాణంబునున్ వేసి వ్ర
    య్యలు గావించెను కర్ణు గుండె విజయుం డయ్యాజి నుత్సాహియై

    రిప్లయితొలగించండి

  3. పార్ధ ! యాగుము విడువకు బాణ మిపుడు
    క్రుంగి పోయెను రధ మిది కూడ దీ తు
    నాయుధంబులు నాదరి య స లు లేవు
    శాస్త్ర మొ ప్పు నె ? నా పైన శరము వే య .

    రిప్లయితొలగించండి
  4. ఆపదవేళలన్ కదలి యాదుకొనంగను వచ్చెనంచు నా
    పాపము లోన భాగమును పంచుకొనంగను ధర్మమేనొకో!
    శాపము చుట్టుముట్ట ననిఁ జావది ముంచగ రాకయుండునే?
    చూపకు మిత్రమా! దయను, శూరుడె; ధర్మము వీడెనీతడే!

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి పద్యము.....

    తేటగీతి(షట్పాది):
    భార్గవ ద్విజ పృథ్వి శాపాల కతన;
    సహజ కవచ కుండలములు శక్రుఁడుఁ గొన;
    శల్య సారథ్య మతని యుత్సాహ ముడుపఁ
    గర్ణుఁ జావుక వెన్నియో కారణములు!
    కాని, పార్థుఁడే సంపెను గర్ణు నంచు
    నప్రతిష్ఠను మోసె నా యర్జునుండు!

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ,
    మీ పద్యాలు చాలా బాగున్నవి. ముఖ్యంగా మూడవ పద్యం సర్వోత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    సముచిత పద ప్రయోగంతో ధారాళంగా సాగిన మీ పద్యం సర్వాంగసుందరంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ‘అరయంగా కర్ణు డీల్గె నార్గురి చేతన్’ అన్నదానిని చక్కగా వివరిస్తూ మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
    ‘గర్ణుఁ జావుక వెన్నియో కారణములు’ అన్నదానిని ‘కర్ణు చావుకు గల వారు కారణములు’ అంటే?

    రిప్లయితొలగించండి
  7. నీ'కన్న ' శక్తిమంతుడు
    మూకుమ్మడి శాప ఫలము ముప్పిరి గొనెగా
    చేకొని బాణము వేయుము
    ఆ కర్ణుడు ' తేరు 'కొనని యప్పుడె విజయా!

    రిప్లయితొలగించండి
  8. దాన వీర శూరుండు రాధా సుతుండు
    దుష్ట సాంగత్య మెంచగన్ దురితు డయ్యె
    ధర్మ సంస్థాప నార్థము తప్పు గాదు
    సంహ రించుమనియె పార్థ సార థుండు

    రిప్లయితొలగించండి



  9. ద్వాపరాంతము కాదె యధర్మమెక్కు
    వగుటచే మహావీరుడౌ యర్జునుండు
    వాసుదేవుని ప్రోత్సాహ వచనములను
    చంపె విరథుడౌ కర్ణుని శస్త్రహతిని.

    రిప్లయితొలగించండి
  10. కర్ణార్జునులతో శ్రీ కృష్ణుడు :

    01)
    _________________________________________

    ధర్మము కాదటం చిటు, వృ - థా పలు కేటికి సూతనందనా ?
    ధర్మమె ? ద్రౌపదిన్, సభ, న - ధర్మమ నెంచక చిన్న బుచ్చుటల్ !
    ధర్మమె ? బాలునొక్కని , న - ధర్మపు రీతిని సంహరించుటల్ !
    ధర్ముని చెంత జేరగ, న - దాటుగ కర్ణుని గూల్చు మర్జునా !
    _________________________________________
    అదాటు = హఠాత్తు(వెంటనే)

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    సారథి తప్ప ‘సారథుండు’ అనరాదు. అక్కడ ‘సారథి హరి’ అంటే సరి!
    *
    కమనీయం గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘అని + ఎంచక’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘అధర్మపు రీతిని’ అందాం.

    రిప్లయితొలగించండి
  12. శ్రీగురుభ్యోనమః
    గురువుగారికినమస్కారము.
    తమరిసూచనకు కృతఙ్ఞతలు.ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి