18, సెప్టెంబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 825 (శూర్పణఖ సాధ్వి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
శూర్పణఖ సాధ్వి లోకైక సుందరాంగి.

25 కామెంట్‌లు:

 1. కవిమిత్రులకు నమస్కృతులు.
  రాత్రి పోయిన కరెంటు ఇంతకు క్రితమే వచ్చింది. అందువల్ల ఈనాటి పద్యరచన, సమస్య ఇవ్వడం ఆలస్యమయింది. నిన్నటి పూరణలను, పద్యాలను చూసి వ్యాఖ్యానించడానికి అవకాశం దొరకలేదు. వీలైతే సాయంత్రం వరకు వ్యాఖ్యానిస్తాను. ఆలస్యానికి మన్నించండి.

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !

  శూర్పణఖ :

  01)
  _______________________________

  సుందరంబైన రాముని - శూరు , గనిన
  సుదతి , రావణు చెల్లెలు - చుప్పనాతి
  కామరూపపు శక్తిని - కలుగు కతన
  సురల తలదన్ను రీతిగా - సుందరముగ
  వికృత రూపము మార్చెను - వేగముగను
  శూర్పణఖ సాధ్వి లోకైక - సుందరాంగి !
  _______________________________

  రిప్లయితొలగించండి
 3. శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,

  ( రెడ్డి= ఊరి పెద్ద, Manmohan sing)

  F .D . i ల అనుమతులపై

  నరులు మెచ్చు శూర్పణఖ సాద్వి లోకైక

  సుంద రాంగి , భార్య సొగసు లడవి

  నందు పూయు బూలు , విందు పొందు లకై ది

  రిగెడి మాన హీన రెడ్డి వార్కి
  -----

  కష్ట నష్ట ములందున గలసి మెలసి

  కాపురము జేయు భార్య ను కాటి కంపి ,

  మాన హీను డై దిరిగెడి మంత్రి గార్కి

  శూర్పణఖ సాద్వి లోకైక సుంద రాంగి ,

  రిప్లయితొలగించండి
 4. తామ్ర వర్ణద్యుతి తనరారు కేశముల్
  ....చింత నిప్పుల జిమ్ము నింతి కనులు
  వాడిగాగల నిరు వంకల దంష్ట్రలు
  ....చేటల నుంబోలు చెవులు రెండు
  అతి భయంకరమగు నానన రీతియు
  ....గార్ధభంబును మించు కంఠ సరళి
  కలుగుచు నడయాడు క్ష్మాధరమ్మన నొప్పు
  ....దుర్గుణమ్ముల రాశి దురిత చిత్త
  శూర్పణఖ యన రావణాసురుని చెల్లి
  యసురు డొకడు విద్యుజ్జిహ్వు డనెడు వాడు
  శూర్పణఖ సాధ్వి లోకైక సుందారాంగి
  యనుచు మోహించి పరిణయమాడె వేడ్క

  ఆ రాక్షస నేతకు సరి
  యారీతిగ దొరకె జోడు హా హా బలె వ
  హ్వారే యని తిలకించుచు
  నారదుడుప్పొంగ జేసె నర్మోక్తులతో

  రిప్లయితొలగించండి
 5. పర్ణశాలముంగిట రఘువరునిఁజూచి
  మరుని తండ్రంచువాంఛించిమాటఁగలిపి
  యవనిజన్ గాంచి యంతరంగంబుఁదలచె
  శూర్ఫణఖ, సాధ్వి లోకైక సుందరాంగి!
  నిక్కమా? మహాలక్ష్మని యక్కసుఁబడె!

  రిప్లయితొలగించండి
 6. శూర్పణఖ " సాధ్వి లోకైక సుందరాంగి"
  ననుచు రాఘవు చెంతజేరంగ నంత
  నగ్రజుని యాజ్ఞ గైకొని యనుజుడపుడు
  ముక్కు చెవులను గోసె నా ముదితకంద్రు.

  రిప్లయితొలగించండి

 7. మగఁడుఁ జావఁగ, రామలక్ష్మణులఁ గోరె!
  ముకు సెవుల్గోయఁ బగఁ బూని మూర్ఖముగను
  శూర్పణఖ, "సాధ్వి, లోకైక సుందరాంగి
  సీతఁ గొని ర"మ్మనియు నన్నఁ జేరి పలికె!!

  రిప్లయితొలగించండి
 8. మిత్రులారా! శుభాశీస్సులు. వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

  మా దౌహిత్రుల కృషి:

  మా దౌహిత్రులు చి. అప్పల అజిత్ శర్మ మరియు చి. అప్పల అమిత్ శర్మ (కవలు) 9 సంవత్సరముల ప్రాయములో హిందీలో విశారద పరీక్షలో ఉత్తీర్ణులైరి అనే ఆనందకరమైన విషయమును ఇందుమూలముగా మీకు తెలియజేయుచున్నాను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. శూర్పణఖ - సాధ్వి, లోకైక సుందరాంగి 
  వోలె కామరూపమ్మును పొల్చి, నిలిచె 
  రామలక్ష్మణుల కుటీర ప్రాంగణమున ; 
  తనను వరియించమని కోరె తరుణి యపుడు ! 


  చేటలను బోలు గోళ్ళున్న చేడె యెవరు ? 
  మహిని యెటువంటి పత్ని వైదేహి కనగ ? 
  తెలియ జెప్పుము " మిస్ వరల్డ్ " తెలుగు లోన ! 
  శూర్పణఖ, సాధ్వి, లోకైక సుందరాంగి. 

  రిప్లయితొలగించండి
 10. వ్యంగ్య ధోరణిలో:
  రూప లావణ్య గుణములు కాపుఁ గాయ
  వింక డబ్బొక్కటిక చాలవెట్టు లున్న
  జరుగు, కాసులఁ గురిపించు సాఫ్టువేరు
  శూర్పణఖ సాధ్వి లోకైక సుందరాంగి
  ఆమె యేనాకు నచ్చిన భామ చంద్ర!

  రిప్లయితొలగించండి
 11. రాము ప్రక్కన నున్నట్టి రమణి వలన
  తనను జూచుట లేదని తలచి యపుడు
  శూర్పణఖ, సాధ్వి లోకైక సుందరాంగి
  సీత దూరగ గోల్పోయె చెవులు ముక్కు.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ గురువులకు, పెద్దలకు
  ప్రణామములు!

  భర్త ప్రేమకు నోఁచిన పడఁతి; రూపు
  గొన్న యట్టి శాంతము; తన కులము వెలుఁగు;
  కోపవేళల మాత్రము గొంచె మామె
  శూర్పణఖ; సాధ్వి లోకైకసుందరాంగి.

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 13. శ్రీ ఏల్చూరి వారు సరసులు. నారీ హృదయాన్ని బాగా అర్థం చేసుకొన్నారు. నాకు కూడా ఆ మెళకువలు నేర్పండి, సార్!

  రిప్లయితొలగించండి
 14. హితవు పల్కెను మారీచు డిట్లు రాజ
  కల్ల సుద్దులు చెప్పెను కపటి వినుము
  శూర్పణఖ సాధ్వి లోకైకసుందరాంగి
  సీత జెరబట్ట నెంచుట చేటు నీకు.

  రిప్లయితొలగించండి
 15. పండిత వర్యా !
  హిందీలో విశారద పరీక్షలో ఉత్తీర్ణులైన మీ దౌహిత్రు(కవలు) లకు మా శుభాకాంక్షలు.

  మిత్రులందరూ "శూర్పణఖను" వివిధ కోణములలో
  చక్కగా పరికించి వ్రాయుచున్నారు. అభినందనలు..

  రిప్లయితొలగించండి
 16. “హిందీ విశారద” పరీక్షలో భావివిజయపురోవచనికగా ఉత్తీర్ణులైన చిరంజీవులకు, తత్కారకులైన తల్లిదండ్రులకు, తత్ప్రేరకులైన శ్రీ గురుదంపతులకు అభినందనలు!

  రిప్లయితొలగించండి
 17. ఎప్పుడూ ప్రౌఢిమకు, గంభీరిమకు వేదికగా ఉండిన “మన తెలుగు” ఈ రోజు చిలిపితనానికి వాహిక అయినందుకు సంతోషంగా ఉన్నది!

  రిప్లయితొలగించండి
 18. పండిత నేమాని వారూ,

  సంశయ మ్మేల? పండిత వంశ మిద్ది;
  వారసత్వమ్ముగా వచ్చు ప్రతిభ మెఱయ
  వ్రాసెడి పరీక్ష లన్నింటఁ బ్రథములుగను
  విజయ మందు దౌహిత్రులు వీరు, మీకు
  యశము నానందమును గూర్తు రనవరతము
  నా శుభాకాంక్ష లివియె చిన్నారులకును.

  రిప్లయితొలగించండి
 19. చంద్ర శేఖర్ .. గారూ ! నేను మరో కోణం లో పరికించాను లెండి...

  రిప్లయితొలగించండి
 20. వసంత కిశోర్ గారూ,
  కామరూప శక్తిగల శూర్పణఖను చక్కగా వర్ణించారు. పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,

  ఓహో! వహ్వారే! భలె!
  యాహా! యనిపించునట్టి యద్భుతరీతిన్
  మీ హాయి గొలుపు పద్యము
  లే హృదయానంద మిచ్చు, నివె మీకు నుతుల్.
  *
  సహదేవుడు గారూ,
  మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  ‘తండ్రి + అంచు’, ‘లక్ష్మి + అని’ అన్నప్పుడు సంధిలేదు. యడాగమం వస్తుంది. మూడవ పాదంలో యతి తప్పింది. నా సవరణలతో మీ పద్యం....

  పర్ణశాలముంగిట రఘువరునిఁజూచి
  మరుని తండ్రి యని కోరి మాటఁగలిపి
  జానికిని గాంచి తలపోసె మానసమున
  శూర్ఫణఖ, సాధ్వి లోకైక సుందరాంగి!
  నిక్కమా? లక్ష్మియే యని యక్కసుఁబడె!
  *
  లక్ష్మీదేవి గారూ,
  ఈమధ్య మీ ‘అటెండెన్స్ పర్సంటేజ్’ తగ్గిపోతున్నది :-)
  చలా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  రెండవ పాదంలో యతి తప్పినట్టుంది. ‘ననుచు రాఘవు చెంతజేరెను పదపడి’ అందామా?
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ప్రశంసనీయంగా ఉన్నాయి. అభినందనలు.
  రెండవ పూరణ రెండవ పాదంలో ప్రాసయతి తప్పింది. ప్రాసపూర్వాక్షరం గురులఘువులలో ఏది ఉంటే మిగిలిన చోటుల్లో అదే వేయాలి కదా! ‘మహిని వైదేహి యెటువంటి మహిళ యంద్రు?’ అని నా సవరణ.
  *
  చంద్రశేఖర్ గారూ,
  ఖచ్చితంగా చంద్రభాసురం సేవించే ఆమెను మొదటిసారి చూసి ఉంటారు. :-)
  చమత్కారాహవంగా ఉంది మీ పూరణ. అభినందనలు. ‘ఒక్కటి + ఇక’ అన్నప్పుడు సంధి లేదు. ‘ఒక్కటియె’ అందాం.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  మీ పూరణలోనూ చమత్కారం అలరిస్తున్నది. చాలా బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,

  ఉల్ల మలరించు సుద్దుల కెల్ల మీదు
  పద్యములు గను లందును; హృద్యమైన
  కవితఁ జెప్పెద రని మోదకరు లటంచు
  సన్నుతించెద మిమ్ము మిస్సన్న నేఁడు.

  రిప్లయితొలగించండి
 21. "ఆడ వారిని మగ వారలణగ ద్రొక్కె
  పురుషులనగ స్త్రీ జాతికి పురుగు"లనెడి
  పిచ్చి ఫెమినిస్టు నవలలో ప్రేలెనిటుల
  "శూర్పణఖ సాధ్వి లోకైక సుందరాంగి"!!

  రిప్లయితొలగించండి

 22. కంది వారి ఇంట కరెంటు పోయె రేతిరి
  అంది వచ్చిన పుస్తకమున చుప్పనాతి బొమ్మ
  అందమై కాన , సమస్య తట్టె అయ్య వారికి
  శూర్పణఖ సాధ్వి లోకైక సుందరాంగి !


  జిలేబి.

  రిప్లయితొలగించండి
 23. గురువుగారూ మీ ప్రశంసకు కడుంగడు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 24. నేమాని పండితార్యా మీ దౌహిత్రులు సరస్వతీ కటాక్షముచే మరింత విద్యాభి వృద్ధిని పొంది మాతామహులకు తగ్గ మనుమలుగా పేరొందాలని మా ఆకాంక్ష.

  రిప్లయితొలగించండి