గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, చక్కని పద్యం చెప్పారు. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీ ఆశీస్సులు గోరింటాకు అలంకరించుకున్న కన్నెలందరికీ వర్తిస్తాయి. మనోహరమైన పద్యం చెప్పారు. అభినందనలు. అన్నట్టు మీరూ పేరడీలను వ్రాయడంలో నేర్పరులే అనిపించుకున్నారు. ధన్యవాదాలు. * కమనీయం గారూ, ‘పిల్లి....’ పూరణ చాలా బాగుంది. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, హాయిగా ఉంది మీ చక్కని పద్యం. అభినందనలు.
కొమ్మలు లేకనె పూచెను
రిప్లయితొలగించండికొమ్మకు నరచేత నుంచ క్రొత్తగ పూలన్
కమ్మని గోరింటాకది
ఇమ్ముగ సత్పతినె యిచ్చు నెరుపుగ పండెన్.
పద్మరాగ ప్రభా పటలితో నలరారు
రిప్లయితొలగించండి....పంకజేక్షణ హస్త పల్లవములు
ఆ కోమల కరాల కాకర్షణీయమౌ
....రీతి నొప్పారు గోరింట కళలు
చిత్రచిత్రములుగా జెలువొందు నా కళ
....లినుమడింపగ జేయు నెర్రదనము
రెండు చేతులలోన ప్రేమ చిహ్నంబులు
....చూచు వారల మది దోచుకొనును
ఏమి పూవులు నాకులు నేమి లతలు
నెంత యెర్రగా పండెనో యింతి నీకు
నందగాడును గుణవంతుడైన మగడు
శీఘ్రమె లభించు ననుచు నాశీస్సులిడుదు
రిప్లయితొలగించండికల్లును ద్రాగి మైకమున ఘాతకుడొక్కడు దూరెనింటిలో
బల్లిదుడైన హంతకుని బారిని బిడ్డల గావనెంచి యా
తల్లి తెగించి వానిపయి దాడికి గత్తిని బట్టె నెట్లనన్
'' పిల్లి మహాగ్రహంబునను బెబ్బులి పై కురికెన్ వధింపగన్ ''
నారి య ఱ చేయి జూ డ గ నయన పర్వ
రిప్లయితొలగించండిమయ్యె నె ఱ్ఱ టి కాం తు ల ట్ల మరి వె లిగె
కోను రంగది ముచ్చట గొలిపె మాకు
కొమ్మ లాకుల కలయిక రె మ్మ ల వి య .
కవి సార్వభౌమ శ్రీనాథుని పద్యములో ఆ గోరింట చేతులని ఉంచితే:
రిప్లయితొలగించండిమాలిని:
ఘుసృణ కుసుమ మాలా కోటి పాటల్య లీలన్
కిసలయముల చాయన్ కీర చంచూ పుటశ్రీ
విసృమరసృమరోర్ణా విభ్రమ ప్రౌఢి నెంతే
బిసరుహముఖి చేతుల్ వెల్గె గోరింట తోడన్
(3వ పాదము చివరి పదము "ఎంతే నుంచి ....నేను కూర్చిన పదములు, మిగిలినవి శ్రీనాథునివే).
అరుదెంచును వరుఁడంచును
రిప్లయితొలగించండిసరసాలాడుచుచెలియలుచక్కగ దిద్దన్
విరివిగ విరులై కోమలి
కరముల గోరింట పండెఁగనువిందగుచున్!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిచక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ ఆశీస్సులు గోరింటాకు అలంకరించుకున్న కన్నెలందరికీ వర్తిస్తాయి. మనోహరమైన పద్యం చెప్పారు. అభినందనలు.
అన్నట్టు మీరూ పేరడీలను వ్రాయడంలో నేర్పరులే అనిపించుకున్నారు. ధన్యవాదాలు.
*
కమనీయం గారూ,
‘పిల్లి....’ పూరణ చాలా బాగుంది.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
హాయిగా ఉంది మీ చక్కని పద్యం. అభినందనలు.
రిప్లయితొలగించండిఅరవిందముల వంటి యరచేతులందున
చెలువారుచుండెను చిత్ర రచన
ఫలపుష్పపత్రముల్ పలువిధమ్ముల లతల్
చెంగల్వచేతుల జెన్ను మీరె
కోమలుల్ మురిపాన గోరింట జేతుల
నద్ది పండిన జూసి యలరుచుండ్రి
జాబిల్లి ,చుక్కలు,చక్కని పక్షుల
యందముల్ చూడంగ నక్కజమ్ము
తెలుగు కన్నెలు పండుగన్ దీర్థమాడి
ఏవొ కోర్కెలతో యౌవనోదయాన
భావ మహురిమ గోరింట బల్లవింప
రచన జేసి కుల్కెదరు రమ్యముగను
రిప్లయితొలగించండిటైపు తప్పులు దొర్లినవి.మధురిమ బదులు మహురిమ అని పడింది.అతిరమ్యముగను కి బదులు రమ్యముగను అని ఉన్నది సవరణ గమనించ ప్రార్థన.
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.