శ్రీ ఆదిభట్ల వారూ! శుభాశీస్సులు. మీ పద్యము చూచేను. జగముల కాదివేలుపు అని గణపతిని గూర్చి చెప్పేరు. గణపతి ఆది వేలుపు కాడు, ఆది వేలుపు బ్రహ్మ. ఆదిపూజ్యుడు గణపతి. ఆలాగున సవరిస్తే బాగుంటుంది ఏమో. స్వస్తి.
శ్రీ సరస్వత్యై నమః: మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాటి దేవత "అన్నపూర్ణ" గురించి మంచి మంచి పూరణలే వచ్చినవి. అందరికీ అభినందనలు.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: అమ్మ శివునికి పెట్టిన భిక్షను "శక్తి" అని ప్రశంసించేరు. ఉత్తమముగా నున్నది.
శ్రీ సుబ్బా రావు గారు: అమ్మా! శివునికి అన్నము పెట్టుచున్నావు - ఆ చేత్తో నాకు కూడా ఇంత అన్నము పెట్టమ్మా అని వినయముగా ప్రార్థించేరు. ఆ తల్లి జగన్మాత కదా! మనము అడుగకుండానే ఇస్తోంది. భక్తిపూర్వముగా నున్నది.
శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు: సొగసైన వృత్తములో ఆ అన్నపూర్ణమ్మ యొక్క ఔదార్యమును ప్రస్తుతించేరు. ప్రశంసనీయముగా నున్నది.
గుండు మధుసూదన్ గారి పద్యము..... (అన్నపూర్ణాష్టకమ్ ప్రథమ శ్లోకానువాదము) శా. మా కానందము నిచ్చ లిచ్చి, వరముల్ మా కిచ్చి, మా కందమై; మా కృత్యమ్ముల ఘోర పాపము నశింపం జేయు మాహేశ్వరీ! యో కాళీ! హిమశైల వంశ విమలా! యో కాశికాధీశ్వరీ! మా కీయం గదె, భిక్ష రక్ష దయలున్! మా తాన్నపూర్ణా! శివా!!
(పూర్వము అన్నపూర్ణా స్తోత్రమును ఇదే సంపూర్ణపాద మకుటముతో 24 పద్యములను వ్రాసితిని. ఇది మరియొక పద్యము). స్వస్తి.
రిప్లయితొలగించండిఎన్న వచ్చునె నీదు లీలల నెవ్వియేనియు దల్లిరో!
మున్ను భిక్ష నొసంగితీవట భూతనాథునికే కదా!
కన్న తల్లివి భూత కోటికి కాశికాపుర వాసినీ!
అన్నపూర్ణ భవాని! నీ పద మాశ్రయించితి భక్తితో
అన్నిట మిన్నగు నీశుడు
రిప్లయితొలగించండిఅన్నన్నా! యన్న మడుగు నమ్మా నిన్నే
అన్న మనగ శక్తియె సరి
నెన్నగ నీ భిక్ష మదియె నిక్కము తల్లీ! .
రిప్లయితొలగించండిచూ డ రమ్య మదియు చోద్యము గూడను
భిక్ష వేయు చుండె భిక్షు నకదె
మాకు కూడ భిక్ష మసలక వేసి యో
యన్న పూర్ణ ! మమ్ము నాదు కొనుము .
నగపతి ముద్దుపట్టి మదనారి గజాజినధారికాలి ము
రిప్లయితొలగించండిజ్జగములకాదివేలుపగు సామజవక్త్రుని గన్నతల్లి తా
మగనికి సుంతబెట్టి బహుమానముగాను మరింతపొంది యి
జ్జగమునకమ్మయై మనకు సాంతమొసంగును అన్నపూర్ణయై.
శ్రీ ఆదిభట్ల వారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము చూచేను. జగముల కాదివేలుపు అని గణపతిని గూర్చి చెప్పేరు. గణపతి ఆది వేలుపు కాడు, ఆది వేలుపు బ్రహ్మ. ఆదిపూజ్యుడు గణపతి. ఆలాగున సవరిస్తే బాగుంటుంది ఏమో. స్వస్తి.
పండితార్యా, నమస్కారం
రిప్లయితొలగించండిఅలాగే సవరిస్తాను,
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి దేవత "అన్నపూర్ణ" గురించి మంచి మంచి పూరణలే వచ్చినవి. అందరికీ అభినందనలు.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
అమ్మ శివునికి పెట్టిన భిక్షను "శక్తి" అని ప్రశంసించేరు. ఉత్తమముగా నున్నది.
శ్రీ సుబ్బా రావు గారు:
అమ్మా! శివునికి అన్నము పెట్టుచున్నావు - ఆ చేత్తో నాకు కూడా ఇంత అన్నము పెట్టమ్మా అని వినయముగా ప్రార్థించేరు. ఆ తల్లి జగన్మాత కదా! మనము అడుగకుండానే ఇస్తోంది. భక్తిపూర్వముగా నున్నది.
శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు:
సొగసైన వృత్తములో ఆ అన్నపూర్ణమ్మ యొక్క ఔదార్యమును ప్రస్తుతించేరు. ప్రశంసనీయముగా నున్నది.
స్వస్తి.
గుండు మధుసూదన్ గారి పద్యము.....
రిప్లయితొలగించండి(అన్నపూర్ణాష్టకమ్ ప్రథమ శ్లోకానువాదము)
శా.
మా కానందము నిచ్చ లిచ్చి, వరముల్ మా కిచ్చి, మా కందమై;
మా కృత్యమ్ముల ఘోర పాపము నశింపం జేయు మాహేశ్వరీ!
యో కాళీ! హిమశైల వంశ విమలా! యో కాశికాధీశ్వరీ!
మా కీయం గదె, భిక్ష రక్ష దయలున్! మా తాన్నపూర్ణా! శివా!!
సర్వ జగతి నేలు సాంబశివుడికైన
రిప్లయితొలగించండిభుక్తి నొసగు నన్న పూర్ణసతియె!
నెంత వాని కైన నిలలోనఁ జూడగ
నాలి భిక్ష మిడెడి యన్న పూర్ణ!
కాశి యన్న పూర్ణ కానినేయుని గాచె
రిప్లయితొలగించండిశాప మిడు నటంచు పాప మడచ
భర్త వచ్చి యడుగ భక్తిగా వడ్డించె
బిక్ష యనగ కాదు ప్రేమ నిష్ఠ !
రిప్లయితొలగించండిఅన్నపూర్ణాష్టక ప్రథమ శ్లోకమునకు అనువాదమునకై మా చిన్న ప్రయత్నము:
(శ్రీ మధుసూదన్ గారి పద్యము చూచిన ప్రేరణతో)
నిరతానంద మభీతి కామితములన్ ప్రేమన్ ప్రసాదించు శాం
కరి! ఘోరాఘ వినాశినీ! భగవతీ! కళ్యాణి! మాహేశ్వరీ!
కరుణాబ్ధీ! గిరివంశ పావనకరీ! కాశీపురాధీశ్వరీ!
తరుణీ! భిక్షను గోరి వేడుదును మాతా! అన్నపూర్ణేశ్వరీ!
రిప్లయితొలగించండిశ్రీ సరస్వత్యై నమః:
మరికొన్ని రచనలు:
శ్రీ గుండు మధుసూదన్ గారు:
భక్తి రసపూర్ణముగా అన్నపూర్ణాష్టకము యొక్క శ్లోకమును చక్కగా అనువదించేరు. నిత్యానందకరముగా నున్నది.
శ్రీ సహదేవుడు గారు:
ఆలి అందరికీ భిక్షపెట్టే సత్యమును చక్కగ వివరించేరు. వినూత్నముగా నున్నది.
శ్రీమతి రాజేశ్వరి గారు:
అన్నపూర్ణా దేవి కాశీలో వ్యాసమహర్షికి శిష్యులకు భిక్షపెట్టిన కథను గుర్తు చేసేరు. ప్రశంసనీయముగా నున్నది.
స్వస్తి.
గురువులకు ప్రణామములు
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅఖిల జీవరాశులకు నాహార మొసగు
కరుణతో జగమ్ముల బ్రోచు కన్నతల్లి
యాదిభిక్షువునకు భిక్ష నన్నపూర్ణ
యొసగు టాదిదంపతులకు నొక్కలీల.
గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య.....
రిప్లయితొలగించండిగురుతుల్యులు పండిత నేమానివారూ! తమరి యనువాదము చక్కని పదబంధములతో, ధారాశుద్ధితో, హాయిగా సాగినది. మాదృశుల కిట్టి ప్రేరణములే మార్గ నిర్దేశకములు! తమకు ధన్యవాదములు మఱియు నభినందనలు. స్వస్తి.
భవదీయ విధేయుడు
గుండు మధుసూదన్
డా. కమనీయం గారు:
రిప్లయితొలగించండిఆది దంపతుల లీలపై మీ పద్యము మనోహరముగా నున్నది.
"ఆది భిక్షువగుట యా తండ్రి కొక లీల
అన్న దాన మమ్మ యద్భుతమ్ము"
స్వస్తి.
ఆలస్యమైన నా ఊహకు రూపం.
రిప్లయితొలగించండిదీనుల పాలనమ్మునను దేవి కడుంగడు తాల్మి జూపెడిన్
తానెటు లామెకుం దగిన స్థాయిని జేరుట యంచు నెంచె నీ
శానుడు దారి గానకను శాంభవి గోరెను భిక్ష వేయగా
పూనిక యోరుపున్ తనకు మోదము తోడుత నామె వేసెడిన్.
శ్రీ మిస్సన్నా గారూ!
రిప్లయితొలగించండిఆ ఆదిదంపతులకు ఉత్పలమాలను సమర్పించుకొనినారు. మనోహరమైవన భావ మకరందము చాలా హాయిగా నున్నది.
నేమాని పండితార్యా ధన్యుడను.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ గురువులకు, పెద్దలకు
రిప్లయితొలగించండిప్రణామములు!
ఆఁకలి గొని వచ్చితివో
నాకౌకసపూజితాంఘ్రినళిన! మహేశా!
నీ కర్పిత మగు భిక్షం
బాకల్పముఁ బ్రోచు మము గృపార్ణోరాశీ!
నీ కళ్యాణమనోహర
లోకైకారాధ్యముఖవిలోకనభాగ్యా
నేకఫలాశ్రయభిక్షా
స్వీకరణము మమ్ము నోము శివ! పరమేశా!
నీవై యుంచెదు మంటినేల మొలకన్; నీర్వోసి పేరాదటం
జేవన్నించెద విట్లు; పెంచెదవు హృత్సీమన్ వెలుంగై; మమున్
నీవే నొంచెద; వింకఁ ద్రుంచెదవునున్ నీలాభ్రధూర్జాటజూ
టీవిస్తీర్ణసురాపగాశివచిరంటీరమ్య! భిక్షార్థివే!
విధేయుఁడు,
ఏల్చూరి మురళీధరరావు
పూజ్యశ్రీ పండిత నేమాని గురుదేవులకు
రిప్లయితొలగించండివిహితానేక ప్రణామములతో,
పావన మగు భావనమున
దీవెన లొసఁగిన సరస్వతీనిర్మలపుం
భావితమూర్తికి బుధసం
భావితకీర్తికిని మీకుఁ బ్రణతిశతంబుల్.
విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు
పూజ్యశ్రీ పండిత నేమాని గురుదేవులకు
రిప్లయితొలగించండివిహితానేక ప్రణామములతో,
పావన మగు భావనమున
దీవెన లొసఁగిన సరస్వతీనిర్మలపుం
భావితమూర్తికి బుధసం
భావితకీర్తికిని మీకుఁ బ్రణతిశతంబుల్.
విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు