9, సెప్టెంబర్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 817 (ఇద్దఱు సతు లున్నవాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
ఇద్దఱు సతు లున్నవాఁడె యిల ధన్యుఁ డగున్.

26 కామెంట్‌లు:

 1. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
  శుభాశీస్సులు.
  "ఇద్దరు" అనే పదము వ్యావహారికము అని ఒక మారు మీరే సెలవిచ్చేరు. మరి ఈనాడు మీరుకూడ అదే పదమును సమస్యలో ప్రయోగించేరు. సమీక్షించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 2. నిండు సుహృద్భావంబున
  మెండగు వాత్సల్య మొప్ప మిత్రుల రచనల్
  దండిగఁ బరిశీలించెడి
  పండిత నేమాని! మీకు ప్రణతుల నిడుదున్.

  రిప్లయితొలగించండి
 3. పెద్దమ్మ చెల్లి శ్రీ సతి
  విద్దెలనే యిచ్చు తల్లి వినగను విధి కే
  ముద్దుల సతి గద ధరలో
  నిద్దఱు సతు లున్నవాఁడె యిల ధన్యుఁ డగున్.

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమాని వారికి,
  నమస్కృతులు.
  నా ఆరోగ్యము ఇంకా కుదుట పడలేదు. జ్వరతీవ్రత తగ్గినా, శిరోవేదన తగ్గుముఖం పట్టలేదు.
  ‘ఇద్దఱు’ వ్యావహారిక మని నేనెప్పుడు అన్నానో గుర్తుకు రావడం లేదు. అది సాధురూపమే.
  ‘రెండు శబ్దమునకు మహన్మత్యర్థక బహువచన రూపము’ అని సూర్యరాయాంధ్ర నిఘంటువు చెప్తున్నది.

  రిప్లయితొలగించండి
 5. సమస్యలో "ఇద్దరు"కి బదులుగా "ఇరువురు" అని మార్చి చేసిన పూరణ:

  పరితాపమొందు చుందురు
  పరిణయమును జేసికొనని వాడును, మరి కా
  పురము త్యజించిన వాడను
  నిరువురు, సతులున్న వాడె యిల ధన్యుడగున్

  రిప్లయితొలగించండి
 6. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  మీరు తెలుగు పండితులుగా చాల అనుభవమున్న వారు. నేను శ్రుత పాండిత్యము బాపతు వాడను. లోగడ మీరు చేయు వ్ర్యాఖ్యానములలో "ఇద్దరు" అనే పదము వ్యావహారికము అనుటచే నేను ఆలాగుననే భావించేను. కాని మీరు ఇప్పుడు చేసిన ప్రస్తావన చూచి మళ్ళీ మీ లాగుననే భావించెదను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. సుద్దుల జెప్పుటకైనను
  ముద్దగు పోషణముకైన మోహము తోడన్
  హద్దులెఱుంగని మరులతొ
  ఇద్దఱు సతు లున్నవాఁడె యిల ధన్యుఁ డగున్.

  రిప్లయితొలగించండి
 8. ఇద్దఱు భార్యలు గలిగిన
  మద్దెలగా మారిపోవు మగడికి బ్రతుకే !
  వద్దుర వామ్మో ! ఎట్టుల
  ఇద్దఱు సతు లున్నవాడె యిల ధన్యుడగున్?!

  రిప్లయితొలగించండి

 9. ఇద్దరు సతులే శివునకు
  ముద్దుగనే వారు గలరు మృ డు నుని యెడ లన్
  గుద్దియు బల్లను బలుకుదు
  నిద్దరు సతులున్న వాడె యిల ధన్యుడ గున్

  రిప్లయితొలగించండి
 10. గుండు మధుసూదన్ గారి పూరణ ....

  ముద్దుగ సంపద లిడి తా
  నెద్దడిఁ దొలఁగించు తల్లి; యెంతయుఁ గోర్కిన్
  విద్దెల నొసఁగెడి తల్లియు
  నిద్దఱు సతులున్న వాఁడె యిల ధన్యుఁ డగున్!

  రిప్లయితొలగించండి
 11. హద్దులు చూపే బుద్ధియు
  వద్దకు జేరిన సుశాస్త్ర్రవక్తవ్యంబుల్
  పెద్దగ గాచును సతతము
  నిద్దఱు సతు లున్నవాఁడె యిల ధన్యుఁ డగున్.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులారా! శుభాశీస్సులు.
  అందరికీ అభినందనలు.
  ఈనాటి సమస్య "ఇద్దరు సతులుండుట"

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
  ఒకరు పెద్దమ్మ చెల్లి (లక్ష్మి) మరొకరు విద్దెలనిచ్చు తల్లి (సరస్వతి) అనే ఈ చెల్లి & తల్లి ఉండాలని అంటున్నారు. ఉత్తమముగా నున్నది.

  శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
  హద్దు లెరుగని మరులకు ఇద్దరు సతులు కావాలి అంటున్నారు. ఇదొక సంబరము కొన్నాళ్ళే - తరువాతి కథలు ఎలాగ ఉంటాయో మరి? ఉత్తమముగా నున్నది.

  శ్రీ నాగరాజు గారు:
  జీవితము మద్దిలగా మారుతుంది అని చక్కగా సెలవిచ్చేరు. ఆ మద్దిల దరువులు తింటేనే గాని ఆ ముచ్చటలు తెలియవు ఎవరికైనా. ప్రశస్తముగా ఉన్నది.

  శ్రీ సుబ్బా రావు గారు:
  శివునికి ఇద్దరు భార్యలు కదా అంటున్నారు. అది అంతా కవుల కల్పనే. అసలే అర్ధ శరీరుడు కదా.శివుడు సర్వమంగళాకరుడు.
  2వ పాదములో యతి మైత్రి లేదు. ఋ ౠ లకు ఇ ఈ ఎ ఏ లతో యతి చెల్లును.
  మృడునుని అనే ప్రయోగము సరికాదు. మృడుని అనే అనాలి - మాత్రల కొరకు మరొక అక్షరము వెయ్య కూడదు.

  శ్రీ గుండు మధుసూదన్ గారు:
  లక్ష్మీ సరస్వతులు ఉన్నవాడే ధన్యుడు అని చక్కగా సెలవిచ్చేరు. సొగసుగా నున్నది.

  శ్రీ చంద్రమౌళి గారు:
  హద్దులు చూపే బుద్ధియు అన్నారు - అది వ్యావహారికము "చూపెడు" అంటే బాగుంటుంది. బుద్ధి, వక్తవ్యము అనే సతులు ఉంటే చక్కగా రాణించగలరు - నిజమే. ఉత్తమమైన పూరణ.  రిప్లయితొలగించండి

 13. తద్దయు నిజమును జెప్పిరి
  యిద్దరు సతు లున్న వాడె యిల ధన్యు డగున్
  నిద్దరి లో నొక రున్నను
  ముద్దూ ముచ్చట్లు మఱియు మురిపెము లుండున్ .

  రిప్లయితొలగించండి
 14. ఆర్యా! ధన్యవాదములు.
  చిన్న సవరణ తో..

  పెద్దమ్మ చెల్లి శ్రీ సతి
  విద్దెలనే యిచ్చు తల్లి వినగను విధి కే
  ముద్దుల సతి గద, కనని
  య్యిద్దఱు సతులున్న వాఁడె యిల ధన్యుఁ డగున్.

  రిప్లయితొలగించండి
 15. హద్దులు చూపెడు బుద్ధియు
  వద్దకు జేరిన సుశాస్త్ర్రవక్తవ్యంబుల్
  పెద్దగ గాచును సతతము
  నిద్దఱు సతు లున్నవాఁడె యిల ధన్యుఁ డగున్.

  సవరణకు కృతజ్ఞుణ్ణి. నేమానిగారికి నమోవాకములు.

  రిప్లయితొలగించండి
 16. (క్రమాలంకారము)
  హద్దేలేకఁబసిడెగయ
  నెద్దానికి నేమి దెచ్చు? నిష్టముదీర్చన్
  ముద్దుగ నొకతే యున్నన్
  యిద్దఱు సతులున్న వాడె? యిల ధన్యుడగున్!

  రిప్లయితొలగించండి
 17. అయ్యా! శ్రీ సహదేవుడు గారు:
  మీ పద్యము 3వ పాదము చివరలో "న్" ఉన్నది. దాని తరువాత యిద్దరు అని యడాగమము రాదు గదా? పద్యము ఉత్తమముగా నున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. ఇద్దఱు భార్యల రుద్రుడు
  బద్దము జేసెను శిరమున భాగీ రధినే !
  దిద్దెను సగమని పార్వతి
  ఇద్దఱు సతులున్నవాఁ డె యిల ధన్యుఁ డగున్ !
  ---------------------------------
  పెద్దలు జెప్పెద రెప్పుడు
  ఇద్దరు సతులున్నవాఁ డె యిల ధన్యుడగున్ !
  ముద్దుగ యలిగిన నొక్కరు
  ఒద్దికగా జేర దగును నొకరికి బదులౌ !

  రిప్లయితొలగించండి
 19. శ్రీ సరస్వత్యై నమః:
  అందరికీ అభినందనలు.

  శ్రీ సుబ్బా రావు గారు:
  ముద్దూ ముచ్చట్లు అనుట వ్యావహారికము. మీ పద్యము ఉత్తమముగా నున్నది.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
  మీ పద్యము సొగసుగా నున్నది.

  అమ్మా రాజేశ్వరి గారూ:
  మీ 2 పద్యములు రసాత్మకముగా నున్నవి.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. శ్రీగురుభ్యోనమః

  గురువుగారికి ధన్యవాదములు.
  తమరి సూచన ప్రకారం పద్య3వ పాద సవరణ
  'ముద్దుగ నొకతే నుండిన
  నిద్దఱు సతులున్న...'
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 21. కద్దగు ,దొల్లిటి దినముల
  నిద్దరు సతులున్న వాడె యిల ధన్యుడగున్
  సుద్దిగ, నేడది రద్దయె
  వద్దు సుమా దానగల్గు వంతలవెన్నో.

  రిప్లయితొలగించండి
 22. కద్దగు ,దొల్లిటి దినముల
  నిద్దరు సతులున్న వాడె యిల ధన్యుడగున్
  సుద్దిగ, నేడది రద్దయె
  వద్దు సుమా దానగల్గు వంతలవెన్నో.

  రిప్లయితొలగించండి
 23. ప్రొద్దున సాయం వలెనే
  ముద్దుగ నొకపరిని గాక ముచ్చట తీరన్
  బొద్దుగ "జీతము-పెన్షను"
  ...ఇద్దరు సతులున్నవాఁడె యిల ధన్యుఁ డగున్

  రిప్లయితొలగించండి