17, సెప్టెంబర్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 824 (నారినిఁ బెండ్లియాడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
నారినిఁ బెండ్లియాడి గహనంబుల కేఁగెను సీత ప్రేమతోన్.
ఈ సమస్యను పంపిన ఏల్చూరి మురళీధర రావు గారికి ధన్యవాదాలు.

14 కామెంట్‌లు:

  1. సరస్వత్యై నమః:
    మిత్రులారా!
    అందరికీ శుభాశీస్సులు.

    సరస వాఙ్మయుండు కంది శంకరయ్య శంకరా
    భరణ నామ్ని బ్లాగు నిల్పి పండితులను కవుల సం
    బరము తోడ తీర్చి దిద్ది భారతికి సమర్చనల్
    నిరతమున్ బొనర్చు హితుని నెమ్మదిన్ నుతించెదన్

    రిప్లయితొలగించండి
  2. నీరజనేత్రుని,ఘననీలపయోధరవర్ణమోహనున్
    శౌరిని,యజ్ఞరక్షకుని,క్షత్రియవీరుని,ధీరమూర్తిఁ శృం
    గారరసాస్పదాననుని, గాధికుమారునివెంటనున్నపొ
    న్నారినిఁ బెండ్లియాడి గహనంబుల కేఁగెను సీత ప్రేమతోన్.

    రిప్లయితొలగించండి
  3. భూరి గుణాభిరామ, నృపపుంగవు నన్వయ పుణ్య రాశి, సీ
    తారమణీ శిరోమణి, సదా కమలాక్ష రతాంతరంగ, యం
    భోరుహమిత్ర వంశమణి భూషణు, రాముని, రాక్షస ప్రధా
    నారిని బెండ్లియాడి గహనంబుల కేగెను సీత ప్రేమతోన్

    రిప్లయితొలగించండి
  4. నారిని పూన్చ నెంచ రఘు నందను డా విలు రెండు ముక్కలై
    జారెను సర్వ లోకములు సంస్తుతి జేయ విదేహ పుత్రియౌ
    నారిని బెండ్లియాడి గహనంబుల కేగెను సీత ప్రేమతో
    నా రఘువీరు వెంట జన నయ్యను సత్య పథాన నిల్ప గన్.

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి పూరణ....

    శ్రీ రమణీయ గాత్రుఁడు; వశీకృత మానసుఁ డా రఘూత్తముం
    డారయఁ గౌశి కాజ్ఞఁ దలఁ దాలిచి, చాపముఁ ద్రుంచి, జానకీ
    నారినిఁ బెండ్లి యాడి, గహనంబుల కేఁగెను! సీత ప్రేమతోన్
    గారవమొప్ప రామునకుఁ గాంక్షను సేవలు సేయ నేగెఁ దా!!

    రిప్లయితొలగించండి
  6. ధీరుఁడు రామచంద్రుడదె దృష్టి తదేకము గానె నిల్పి యా
    పేరును పొందినట్టి కడు పెద్దది యౌ విలు వంచినాడహో,
    నారిని పెండ్లియాడి గహనంబుల కేఁగెను, సీత ప్రేమతో
    భారము నెంచకుండ పతి పట్టిన త్రోవను సాగె పత్నిగా.

    రిప్లయితొలగించండి
  7. గుండు మధుసూదన్ గారి రెండవ పూరణం...

    పంచపాది:
    శ్రీ రఘు వంశ సోముని, విశిష్ట ఘనాభ వినీల దేహునిన్,
    భూరి గుణాభిశోభితునిఁ, బూర్ణ శశాంక నిభాస్యునిన్, ధరా
    భార నివారణోద్యత సుబాణునిఁ, బాద జలేజ పృక్త్యహ
    ల్యా రమణీ పరిగ్రహ పరంపదు, నాశర, దైత్య, దేవ భి
    న్నారినిఁ బెండ్లియాడి, గహనంబుల కేఁగెను సీత ప్రేమతోన్!

    రిప్లయితొలగించండి
  8. వారిజనేత్రఁ గోమలిని వైభవమొప్పగ రామభూవిభుం
    డా రమణీలలామ జనకాత్మజ నెంతయు సుందరాంగియౌ
    నారిని బెండ్లియాడి గహనంబులకేగెను, సీత ప్రేమతో
    నా రఘునాథువెంట సుఖమంచును కానలకేగె నక్కటా!

    రిప్లయితొలగించండి
  9. మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు.
    మీ ఆరోగ్యము కుదుట పడినది అని తలంచుచున్నాను. వ్యాఖ్య చేయుటలో ఉచితానుచితములు నాకు తెలియవు. మొగమాటము లేకుండా వ్రాస్తూ ఉంటాను. అందుచేత నేను చేస్తున్న వ్యాఖ్యలు జనులకు ప్రీతికరముగా నుండవని నా భావన. అయిననూ మీకు ఏ మాత్రము సహాయము చేసినా మంచిదే అని చేస్తున్నాను. మీ యందు గాని మన బ్లాగు సభ్యులు ఎవరియందు గాని నాకు ఎట్టి విపరీత భావనయును లేదు. నిండు మనమ్ము నవ్య నవనీత సమానము అని మీరనుట మీకు నాయందు గల అమిత సుహృద్భావమే. నేను "సమోహం సర్వ భూతేషు, నమే ద్వేష్యోస్తి న ప్రియః" అని ఉండాలి అని అనుకుంటాను.
    నిన్న నేను శ్రీ గుండు మధుసూదన్ గారి 8 పద్యముల గురించి ప్రస్తావించేను. మీరు గమనించేరు కాని పిదప మరచినట్టున్నారు. బ్లాగు సభ్యుల మధ్య నన్ను చంద్రునితో సమానముగా పోల్చుట స్వభావోక్తి కాదు. మరొక మారి శుభాశీస్సులతో. మీ హితైషి
    సన్యాసిరావు - స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. వైరములేక యెల్లరను పావన భావముతోడ జూచుచున్
    వారిజలోచనుండు రఘువంశ సుధాంశుడు వెల్గుచుండు బృం
    దారక వందితుం డతడు తద్వరునిన్ త్రిజగత్ ప్రపూజ్యుడౌ
    "నారి"ని బెండ్లియాడి గహనంబులకేగెను సీత ప్రేమతో.

    (న + అరి = నారి అని అన్వయము). ఇట్టి అన్వయమును శ్లేష కావ్యములలోను అవధాన ప్రక్రియాదులలోను వాడవచ్చునని నా భావము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. వారిజ లోచనుండు వసివాడని ప్రాయము నందె వైరి సం
    హారము జేయ గుర్వాజ్ఞకు హ్లాదము నొందుచు గారవమ్ము నన్
    పోరుచు రాక్షసా ధముల పోరు నడంచగ ధీరుడౌ నిలన్
    నారినిఁ పెండ్లియాడి గహనంబుల కేఁ గెను సీత ప్రేమతోన్ !!

    రిప్లయితొలగించండి



  12. నారిని సాచి యెల్లరును నద్భుత మొందగ రుద్రు విల్లు వి
    స్ఫారిత నేత్రు డైన రఘువీరుడు భగ్నమొనర్చి భూమిజన్
    నారిని బెండ్లి యాడి ,గహనమ్ముల కేగెను; సీత ప్రేమతో
    వారిజనేత్రి కానలకు వద్దనినన్ వెనువెంట బోవగా.

    రిప్లయితొలగించండి
  13. వీరులు రామలక్ష్మణులు ప్రేష్యముఁజేసి స్వయంవరంబునన్
    జేరిరి శౌనకుండుగొన,సీతను జూచిన రామచంద్రుడా
    భారమనెండు చాపమును వంచి తలెత్త విరింగెఁగట్టగన్
    నారిని,పెండ్లియాడి గహనంబుల కేగెను సీత ప్రేమతోన్!

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సీతాస్వయంవరం :

    01)
    _________________________________________

    నారద సంయుతంబుగను - నాకపు దేవత లంత జూడగా
    నారము ధారవోసి జన - నాథుడు దాన మొనర్చ సిగ్గు తో
    నారద రంగు వాని, రఘు - నాయకు లందరి లోన మిన్నయౌ
    నీరజ నేత్రు, ధీరు, ఘన - నిర్మల మూర్తగు,రామచంద్రునిన్
    నారిని పూంచగా, ధనువు - నాశన మొందగ జేసినట్టి, పొ
    న్నారినిఁ బెండ్లియాడి; గహ - నంబుల కేఁగెను సీత ప్రేమతోన్
    నారియె కోరగా, వెడలు - నాయకు నెయ్యము వీడలేకనే
    నారము రీతిగా విడచి -నాడును , వీడును, దివ్య సంపదల్
    నారల చీర గట్టుకొని - నమ్మిన ధర్మమె తోడనెంచుటన్
    _________________________________________
    నారద = నారదుడు
    నారము = నీరు
    జన నాథుడు = రాజు (జనకుడు)
    నారదము = మేఘము
    నారి = అల్లెత్రాడు
    నారి = స్త్రీ(కైక)

    రిప్లయితొలగించండి