25, సెప్టెంబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 832 (కోపి నకులుఁడు భ్రాతను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కోపి నకులుఁడు భ్రాతను రూపుమాపె.
ఈ సమస్యను పంపిన
ఏల్చూరి మురళీధర రావు గారికి
ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

 1. మునికి దూర్వాసు నకుగల ముద్దు పేరు ?
  మాద్రి పుత్రులలో నొక్క మాన్యు డెవరు ?
  రావణానుజు డేంజేసె రాము గలసి ?
  కోపి- నకులుఁడు- భ్రాతను రూపుమాపె.

  రిప్లయితొలగించండి
 2. కోపమును జూపు పేరును కొంచెమనుము.
  సుందరుండగు పాండవ శూరుడెవరు?
  కపివరుడగు సుగ్రీవు కథలవేమి?
  కోపి- నకులుఁడు- భ్రాతను రూపుమాపె.

  రిప్లయితొలగించండి
 3. కోపి నకులుడు భ్రాతను రూపు మాపె
  నని యుపాధ్యాయు డొక డుదాహరణ కొరకు
  పద్యపాదమ్ము నొక్కటి వ్రాసి యందు
  ప్రాసయతి తీరు జూపెను బాగు బాగు

  రిప్లయితొలగించండి
 4. కోపి నకులుడు భ్రాతను రూ పు మాపె

  ననుట పొసగదు భారత మందు నెచట

  నకుల సహదేవు లెం త యొ నమ్రు లు కద

  ధర్మ రాజున కెప్పుడు ధర్మ విదులు .

  రిప్లయితొలగించండి
 5. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
  గురువుగారికి ధన్యవాదములు
  సమస్యా పూరణను నారదుడు దేవ సభలో వినిపించగా కలత జెందిన వారు
  " కోపి నకులుఁడు భ్రాతను -రూపుమాపె"
  నని కలహభోజనుడు జెప్ప -గమరు లెల్ల
  యముని తోడ నవని కొచ్చె, -విమల చరితు
  నిగని కుశలము లడిగి di-rigi vedalenu .

  రిప్లయితొలగించండి
 6. "ఆస్తు లధికార మోహాంధకారు లెపుడు
  మంచి చెడులనే భావన నెంచ రవని
  రాజ్య కాంక్షచే, తక్బరు రాజు యొక్క
  కోపి నకులుడు, భ్రాతను రూపు మాపె."

  రిప్లయితొలగించండి

 7. ఇనుమడిగఁ గోపమున్నచో నేమనెదరు?
  మాద్రి కన్నట్టి జ్యేష్ఠ కుమారుఁ డెవఁడు?
  నిలను సుగ్రీవుఁ డెవనిని, నేమి సేసె?
  కోపి; నకులుఁడు; భ్రాతను, రూపుమాపె!

  రిప్లయితొలగించండి
 8. "ఆస్తు లధికార మోహాంధు లైన నరులు
  మంచి చెడులనే భావన నెంచ రవని
  రాజ్య కాంక్షచే, తక్బరు రాజు యొక్క
  కోపి నకులుడు, భ్రాతను రూపు మాపె."
  మీ
  గండూరి లక్ష్మీనారాయన

  రిప్లయితొలగించండి
 9. ఈనాటి సమస్యను క్రమాలంకార పద్ధతిలో ముగ్గురు పూరించారు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఈరోజు మొదటి క్రమాలంకార పూరణ మీదే. బాగుంది. అభినందనలు.
  ‘దూర్వాసుడు’ కాదు ‘దుర్వాసుడు’. ‘ఏంజేసె’ అనేది వ్యావహారికం. ‘రావణానుజు పని యేమి రాము గలసి’ అందామా?
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  ‘తాను సుందరుడ’ననే కించిద్గర్వం నకులున కుండేదట. ఆ విషయాన్ని మీ పూరణలో ప్రస్తావించారు. సంతోషం!
  *
  పండిత నేమాని వారూ,
  ‘బాగు! బాగు!’ మీ పూరణ చదివి మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. సమస్యను ప్రాసయతికి లక్ష్యంగా చూపాడా ఉపాధ్యాయుడు? ఉత్తమమైన పూరణ. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  దుర్యోధనునకు కూడా నకుల సహదేవుల మీద అంతగా ద్వేషభావం లేదని అంటారు.
  *
  వరప్రసాద్ గారూ,
  మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
  ‘చెప్పగ + అమరు’ అన్నప్పుడు సంధిలేదు. అది ‘చెప్పగ నమరు’ అవుతుంది. ‘ఒచ్చె’ గ్రామ్యం. అది ‘వచ్చె’ చివరి పాదం నడక సాఫీగా లేదు. నా సవరణలతో మీ పద్యం.....
  " కోపి నకులుఁడు భ్రాతను -రూపుమాపె"
  నని కలహభోజనుడు జెప్ప -నమరు లెల్ల
  యమునితో భువి కేతెంచి, -విమల చరితు
  డైన ధర్మజు గుశలమ్ము నడిగి చనిరి.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  సవరించిన పూరణలో ‘ఆస్తులు’ శబ్దానికి అన్వయం క్లేషం ఉంది. ‘ఆస్తు లధికారముల గోరునట్టు నరులు’ అంటే ఎలా ఉంటుందంటారు? ‘కాంక్షచేత + అక్బరు’ అన్నప్పుడు సంధిలేదు. ‘కాంక్షచే నక్బరు’ అంటే సరి!
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. ఏమి సంస్కృత భాషయం "దెవరునైన" ? -
  మంజు నాథుండు మరియును మాద్రి కొడుకు -
  కృష్ణ సహకారమున క్రీడి కృత్య మేమి ? -
  కోపి - నకులుడు - భ్రాతను రూపు మాపె

  రిప్లయితొలగించండి
 11. నాగరాజు రవీందర్ గారూ,
  ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మొదటి ప్రశ్నలో అన్వయక్లేశమున్నట్టుంది.

  రిప్లయితొలగించండి
 12. వెర్రి పుచ్చకాయను తిన్న వెంగళప్ప
  నేడు చెప్పుదు " కపితము " చూడు మనుచు
  నాల్క తత్తర పాటున పల్కె నపుడు -
  " కోపి నకులుడు భ్రాతను రూపు మాపె ! "

  రిప్లయితొలగించండి
 13. మాస్టరు గారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు...
  మీ సవరణ తో...

  మునికి దుర్వాసు నకుగల ముద్దు పేరు ?
  మాద్రి పుత్రులలో నొక్క మాన్యు డెవరు ?
  రావణానుజు పని యేమి రాము గలసి ?
  కోపి- నకులుఁడు- భ్రాతను రూపుమాపె.

  రిప్లయితొలగించండి
 14. ధన్యవాదములు గురువు గారూ !
  ఈ సవరణను చూడండి :


  చదువ నేమండ్రు " యెవరును "సంస్కృతమున ?
  మంజు నాథుండు మరియును మాద్రి కొడుకు -
  కృష్ణ సహకారమున క్రీడి కృత్య మేమి ? -
  కోపి - నకులుడు - భ్రాతను రూపు మాపె

  రిప్లయితొలగించండి
 15. నాటి నకులుఁడు భ్రాతతో నడచె కలసి

  ధర్మ రాజుకు సాటి యితరులు లేక!

  నేటి తమ్ముల పైజూపు నీతి తగ్గఁ

  కోపి నకులుఁ డు భ్రాతను రూపు మాపె!

  రిప్లయితొలగించండి
 16. అయ్యా శ్రీ శంకరయ్య గారూ!
  అల్ప సంతోషివగు మీకనల్పమైన
  హర్షమును గూర్చె మా పద్య మబ్బురముగ
  శంకరయ్య! నే మిక్కిలి సంతసమున
  దీవెనల గూర్తు నలరుమా ధీవిశాల!

  రిప్లయితొలగించండి
 17. మాడ్గుల యవధాన సభలో నడ్గు బెట్టి
  పృచ్ఛకుడ నైతి నొకమారు యిచ్ఛగించి
  జటిలమైన సమస్య నొకటి విసిరితి -
  " కోపి నకులుడు భ్రాతను రూపు మాపె!"

  రిప్లయితొలగించండి
 18. ఏల్చూరి మురళీధర రావుమంగళవారం, సెప్టెంబర్ 25, 2012 10:28:00 PM


  రాఘవపాండవీయం చదువుతున్నప్పుడు “అల్క చూ, పినకులుఁ డించుకంత సమపేక్షితసంగరకేళియై (4-75)” అని కనిపించిన దళం (అల్క చూపి నకులుఁడు; అల్క చూపి ఇనకులుఁడు) ఈ సమస్యకు ఆధారం.

  దురితరక్షోగణంబులఁ ద్రుంపఁ బూని
  కుటిలయోద్ధను దొలుత నా కుంభకర్ణు,
  నసకృదవినీతివర్తను నంతఁ దీవ్ర
  కో పినకులుఁడు భ్రాతను, రూపుమాపె.

  రిప్లయితొలగించండి
 19. నాగరాజు రవీందర్ గారూ,
  మన్నించాలి. మీ మొదటి పూరణలో అన్వయక్లేశం ఉందని పొరపడ్డాను. మీ సవరణ చూసిన తర్వాత వెలిగింది ‘ట్యూబ్‌లైట్’
  మీ రెండవ పూరణ చమత్కారజనకంగా ఉంది. పూరణ ఏమాత్రం సాధ్యం కాని క్లిష్ట సమస్య ఇచ్చినప్పుడు అవధాని ఈమార్గాన్ని ఎంచుకొనడం అక్కడక్కడ చూసాను. అది సమయస్ఫూర్తి అనుకోవాలి. మంచి పద్యం. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  ‘ఈనాటి నకులుని’ గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమానీ! మీ
  నిండు శుభాశీస్సులంది నేను మురిసితిన్
  దండిగ పలు శీర్షికలన్
  బండించెద బ్లాగులోన వదలక మిమ్మున్.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  ఇదీ సమస్యాపూరణలో తప్పించుకుని వెక్కిరించే విధానాలలో ఒకటి. బాగుంది. అభినందనలు.
  *
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  సమస్యను ఎన్ని కోణాల్లో దర్శించాలో మిత్రులకు ఒక కొత్త పాఠం చెప్పారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 20. గురువుగారికి మరియు శ్రీ ఏల్చూరి గారికి నమస్కారములు.

  రాఘవపాండవీయము ఎక్కడ లభ్యమవుతుందో చెప్పగలరా ( టీక తో అయితే ఇంకా మంచిది ).

  రిప్లయితొలగించండి


 21. ఈ సమస్యకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఒక అభ్యర్థన.నా మిత్రుడొకడు నన్ను అడుగుతూన్నాడు కాని నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను.ఈ మధ్య '' అష్ట సిద్ధులు '' గురించి ఎవరో ఒక పుస్తకం వ్రాసారట.రచయితపేరు,ప్రచురణ కర్తలు మొదలైన వివరాలు బ్లాగు మిత్రులకు ఎవరికైనా తెలిసివుంటే త్వరలో యీ బ్బ్లాగు ద్వారా తెలియజేయమని కోరుతున్నాను.

  రిప్లయితొలగించండి
 22. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  ఏల్చూరివారి స్ఫూర్తితో :

  01)
  _______________________________

  కోతి మూకను దినుచుండ- క్రోధమూని
  క్రూర రావణు బ్రాతయౌ - కుంభకర్ణు
  ఘోర రణమందు, శస్త్రాస్త్ర - కోవిదుండు
  కో పినకులుఁడు భ్రాతను, రూపుమాపె !
  _______________________________

  రిప్లయితొలగించండి
 23. సుయోధనుని స్వప్నంలో శకుని :

  (ద్రౌపది వివాహానంతరం , ద్రౌపది కోసం కొట్టుకొని
  ధర్మరాజును అర్జునుడు, అర్జునుణ్ణి భీముడు,
  భీముణ్ణి సహదేవుడు, సహదేవుణ్ణి నకులుడు చంపేసారు !
  మిగిలిన నకులుణ్ణి మనం కడతేరిస్తే , ద్రౌపది యిక నీదే
  నని శకుని చెప్పినట్టుగా కలగన్న సుయోధన స్వప్నం)

  02)
  _______________________________

  ధర్మరాజును కడతేర్చె - తమ్ము డొకడు
  భీము డర్జును జంపెను - భీకరముగ
  పట్టి పల్లార్చె దేవుండు - పవన సుతుని
  కోపినకులుఁడు భ్రాతను - రూపుమాపె !

  కోమలిని పొంద గోరిన - కూళులంత
  కొట్టుకొని వారిలో వారు - కూలిరంత
  కుర్ర నకులుడు మన చేత - కూలు నిజము
  కోమలిని నీవు పొందుము - కొంకులేక !
  _______________________________

  రిప్లయితొలగించండి
 24. నాగరాజు రవీందర్ గారి స్ఫూర్తితో :

  కోట అనే ఊరిలో జరిగిన అవధానంలో :

  03)
  _______________________________

  కోట జరిగిన యవధాన - కూట మందు
  కోరి పృచ్ఛకు డొక్కడు - కొరుకు పడని
  కొంటె పూరణ నిచ్చిన - కులుకు తోడ !
  "కో పినకులుఁడు భ్రాతను, రూపుమాపె "

  కోతి మూకను దినుచుండ- క్రోధమూని
  క్రూర రావణు బ్రాతయౌ - కుంభకర్ణు
  ఘోర రణమందు, శస్త్రాస్త్ర - కోవిదుండు
  కో పినకులుఁడు భ్రాతను, రూపుమాపె
  ననుచు నవధాని పూరించె - నద్భుతముగ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 25. నేమాని వారి స్ఫూర్తితో :

  04)
  _______________________________

  కుర్ర వానికి జెప్పగ - గురు వొకండు
  కొన్ని యతులను , ప్రాసల - గూర్చి నేర్ప
  క్రింది వాక్యము నిచ్చెను - మూదలముగ !
  "కో పినకులుఁడు భ్రాతను, రూపుమాపె " !
  _______________________________
  మూదల = ఉదాహరణము

  రిప్లయితొలగించండి
 26. లక్ష్మీదేవి గారి స్ఫూర్తితో :

  05)
  _______________________________

  క్రోధ మూనిన వాని పే- రేది జూడ ?
  కోమలం బైన తనయుడు - కుంతి కెవడు ?
  కోల నేసిన పార్థుడు - గూల్చె నెవని ?
  కోపి ! నకులుఁడు ! భ్రాతను రూపుమాపె !
  _______________________________

  రిప్లయితొలగించండి
 27. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ఆమధ్య ఎవరో ‘లింక్’ ఇస్తే దాని ద్వారా రాఘవపాండవీయం వ్యాఖ్యానంతో pdf డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఆ లింక్ ఏదో గుర్తు లేదు. ఈమధ్య మా అబ్బాయి నా సిస్టమ్‌ను ఫార్మాటింగ్ చేసినప్పుడు అది పోయింది. మళ్ళీ ఎంత ప్రయత్నించిన నెట్‌లో దొరకడం లేదు.
  *
  కమనీయం గారూ,
  మీరు చెప్పిన పుస్తకం నా దృష్టికైతే రాలేదు.
  *
  వసంత్ కిశోర్ గారూ,
  మీ అయిదు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  ఐదు పూరణలలోను ఎక్కడా సవరణలు చెప్పవలసిన అవకాశం ఇవ్వలేదు. :-)

  రిప్లయితొలగించండి
 28. 06)
  _______________________________

  అన్న మాటకు తలయొగ్గి - యడవు లందు
  అన్న సేవించె దురవస్థ - లందున శ్రమ
  కోపి , నకులుఁడు ! భ్రాతను రూపుమాపె
  ననిని పార్థుడు వానిపై - యమ్ము నేసి !
  _______________________________

  రిప్లయితొలగించండి