యముడు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
సీ.
మహిషవాహనుఁడు సమ్యగ్ధర్మపాలుండు
దారుణతర దీర్ఘ దండపాణి
దివ్య కాళిందీనదీ సోదరుఁడు నీల
వర్ణుండు కమలినీ వరసుతుండు
గతజన్మ కర్మసంచిత ఫలదుఁడు యుధి
ష్ఠిరగురుఁ డమృతనిషేచణుండు
గంధవతీ మనఃకాసార సంచార
సంగతానంద చక్రాంగవిభుఁడు
తే.గీ.
విష్ణురుద్రాది భక్తి వర్ధిష్ణుహితుఁడు
దక్షిణేశుండు ధర్మవిచక్షణుండు
శమనుఁ డనురక్తచిత్తుఁడై యమర మమ్ము
నాయురారోగ్య యుక్తులఁ జేయుగాత!
మహిషవాహనుఁడు సమ్యగ్ధర్మపాలుండు
దారుణతర దీర్ఘ దండపాణి
దివ్య కాళిందీనదీ సోదరుఁడు నీల
వర్ణుండు కమలినీ వరసుతుండు
గతజన్మ కర్మసంచిత ఫలదుఁడు యుధి
ష్ఠిరగురుఁ డమృతనిషేచణుండు
గంధవతీ మనఃకాసార సంచార
సంగతానంద చక్రాంగవిభుఁడు
తే.గీ.
విష్ణురుద్రాది భక్తి వర్ధిష్ణుహితుఁడు
దక్షిణేశుండు ధర్మవిచక్షణుండు
శమనుఁ డనురక్తచిత్తుఁడై యమర మమ్ము
నాయురారోగ్య యుక్తులఁ జేయుగాత!
(అజ్ఞాతకవి - శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘చాటుపద్య మణిమంజరి’ నుండి)
దక్షిణదిశఁ బాలించుచు,
రిప్లయితొలగించండిశిక్షించుచుఁ బాపజనుల క్షితిలో ధర్మం
బక్షయముగఁ గాపాడెడి
దీక్షాబద్ధుఁడవు, నీ కిదే ప్రణతి యమా!
శ్రీ గురువులకు, పెద్దలకు
రిప్లయితొలగించండిప్రణామములు!
కలవొ? లేవో? నీవు కల్పాంతకాలదిక్పాలకాస్థానికపదవి యందు
శక్తియుండెనొ? లేదొ? సర్వజీవనికాయపాపనికృంతనపాశమందు
పట్టుదప్పెనొ గాక? ఫాలలిఖితవర్ణవిజ్ఞానపాండితీవిభవమందు
చెవినిఁ బెట్టవొ యేమొ? యవమానికోక్తుల “దండి యముండ”, య“ముండ” ననుచు
నఘవికర్తను సంప్రదాయాంతరంగ
ధర్మకర్తను నిన్ను నధఃకరించి
హాస్యభాజను జేయు బేహారి జాతి
పతనమును గాంచి మౌనమ్ము వట్టితేల?
విధేయుఁడు,
ఏల్చూరి మురళీధరరావు
రిప్లయితొలగించండిధర్మ పాలన త త్ప ర ! ధర్మ రాజ !
దేహ మారోగ్య ముండగ దేవ ! నాది
తీ సుకొనుమయ్య ప్రాణంబు తీసుకొనుము
ప్రణతు లిడుదును గాలుడ ! ప్రతి దినంబు .
చిరంజీవి రాంభట్ల పార్వతీశ్వర శర్మకు వధాన విజయోస్తు.
రిప్లయితొలగించండిఏల్చూరి వారి ఆవేదన ఆర్ద్రంగా ఉంది.
రిప్లయితొలగించండిధర్మము పాలించుటలో
రిప్లయితొలగించండినిర్మలమౌ యశము నంది నిల్చిన దేవా!
కర్మము పరిపక్వమ్మగు
మర్మము దెలుపవె యనేక మాయలు గ్రమ్మెన్.
యమరాజును సకలాఘము
రిప్లయితొలగించండిశమియింపగ భక్తితోడ సన్నుతి చేతున్
సమవర్తిని మది దలచెద
నమలిన సద్యశము లొసగ ననవరతంబున్.
సత్వదీప్తితోడ సర్వకాలములందు
ధర్మ మించుకైన దప్పకుండ
సకలజీవములకు శాశ్వతానందంబు
కలుగజేయుచుండు ఘనుడితండు.
దివ్యతేజ మంది దిక్పాలకుండౌచు
దక్షిణాశ జేరి ధరణి నెపుడు
కరుణ జూపుచుండి కాపాడు వానిని
శమను దండధరుని సన్నుతింతు.
యమాయ సూర్యపుత్రాయ
రిప్లయితొలగించండిధర్మరూపాయ తే నమః
కాలాయ పాశహస్తాయ
శమనాయ నమోస్తుతే
గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి నమస్కారములు! తమరు దయతో మా పద్యములలో దొరలిన దోషములను దెలుపుట నా కెంతయు నామోద దాయకమ! తమరు సూచించిన దోషములను వెంటనే సవరించుట జరిగినది. దానిని 15వ తేదీ పద్య రచన శీర్షికలో శ్రీ శంకరయ్యగారు ప్రకటించినారు. తాము దయతో మఱొక్క మాఱు పరిశీలించఁగలరు. సభక్తిక ప్రణామములతో...స్వస్తి.
గుండు మధుసూదన్
గుండు మధుసూదన్ గారి పద్యము....
రిప్లయితొలగించండితేటగీతి(మాలిక)
యమ! కృతాంత! శమన! సౌరి! సుమన! పాశి!
శ్రాద్ధదేవ!లులాయధ్వజ! సమవర్తి!
దృంభు! భీమశాసన! కాల! దినకరసుత!
దండధర! యమునాభ్రాత! ధర్మరాజ!
జీవితేశ! కీనాశ! దక్షిణదిగీశ!
హరి! పరేతరాట్!పితృపతి! యమన! విజయ!
కంక! మృత్యు! స్త్రిధామ! హే కాలపాశ!
సంగమన! శీర్ణపాద! హే సౌర! యాతు!
దండి! పార్పర! వైవస్వతా! నమోSస్తు!
మాలిని:
రిప్లయితొలగించండియముని సమయవర్తిన్ అబ్జనాభానువర్తిన్
ప్రమధ పతి నిజాప్తున్ భాస్కర ప్రేమ పుత్రున్
శమను సకల వేద్యున్ సర్వసంహారు పూజ్యున్
యమునకు సహజాతున్ ఆద రమ్మొప్ప దల్తున్
రిప్లయితొలగించండిదక్షిణాధీశ్వరుడు, యమధర్మరాజు
పాపులెల్లర శిక్షించు పక్షపాత
రహితముగ సమవర్తియై విహితరీతి
యతని పాశమ్ము దప్పింప నలవి యగునె?
తెలుగు చలనచిత్రమ్ముల దెగులుమీరి
యముని హాస్యాస్పదుని జేసి యాటలాడు
చుందు రట్టివారికి శిక్ష యొక్కమారు
తప్పదని చూచెదముగ ప్రత్యక్షముగను.
శ్రీ గుండు మధుసూదన్ గారు! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు ఐరావతమును గురించిన సవరించిన 8 పద్యములను చూచితిని. గణభంగములను అన్నిటినీ సరిజేసేరు. బాగున్నది. కొంచెము విపులముగా నా పరిశీలనను వ్రాయుచున్నాను. ఈ ఖండికను మీరు కథా కథనముగా(ప్రథమ పురుషలో) వ్రాసేరో లేక నాటక ఫక్కీలో వ్రాసేరో (ముఖా ముఖీ మాటాడుట) అనే స్పష్టత లేదు. ప్రారంభించిన స్వాగత వృత్తమును ఎవరు పలుకుచున్నారో తెలియదు. అన్వయ సౌలభ్యము లేదు. మేఘవిస్ఫూర్జితములో ఈ అన్వయము కొంచెము ఇబ్బందిగానే యున్నది. అన్నీ విశేషఛ్ఛందస్సులే కాబట్టి అందులోను "ముద్రాలంకారము" కూడా ఉండాలి అని నియమము పెట్టు కొన్నారు కాబట్టి మీరు ఒక విధముగా బంధములను పెంచుకొనినారు. 2 చోట్ల నుగాగములు ఉండరాని చోట వేసేరు. ఇవన్నీ వదలివేస్తే మీ ప్రయత్నము అనితర సాధ్యము. అద్భుతము. అందుకే మా శుభాభినందనలు. స్వస్తి.
ధర్మము వీడని వాడవు
రిప్లయితొలగించండికర్మములను బట్టి పాపకర్మ లటంచున్ !
మర్మము లేకనె శిక్షలు
నిర్మొహ మాటమ్ము గాను నిర్దేశించన్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియమ రాజా! చూడగను ని
రిప్లయితొలగించండియమమును పాటించు టందు నాద్యుడ వీవే
సమవర్తీ! నా ప్రాణపు
సుమమది నీదయ్య నాకు సుగతుల నీవే!
యమునిఁజూడఁమదిఁదోచుయర్థమేమి?
రిప్లయితొలగించండిభక్తి,సుజ్ఞానములుగల్గబ్రతుకుఁబెఱుగు!
యిలమృకండుసుతుడటులెనీశుఁవేడి
యమునిఁదన్నించిపాశానికందకుండె
భర్తకాయుస్సుసావిత్రిమాటఁగల్పి
యమునినేమార్చిపొందదెయవనిపొగడ!
గురువుగారికి నమస్సులు,
రిప్లయితొలగించండితమరు మా పద్యాల రోగ చికిత్స కు ఏరోజుకారోజు డోసు యివ్వకుంటే తల్లడిల్లి పోతాము.బహుశ Adict కావటమంటే యిదే కాబోలు. శిష్యుని మన్నించండి. స్వస్తి.