23, సెప్టెంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 121

ఈశానుఁడు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
సీ.
హిమశైల శిఖరోన్నత మహా వృషభవాహ
          నాధిరోహణుఁడు, విశ్వాధినేత,
నిరతార్ధగాత్ర సన్నిహిత పర్వతరాజ
          పుత్రీ ద్వితీయానుభూతిరతుఁడు,
కైలాస పర్వతాగ్రనివాస పరితోషి,
          వరవీరగణవార పరివృతుండు,
సర్వభూతవ్రాత సర్వవిద్యాజాత
          నిర్ణేత, మహిత కృక్కర్ణభూషుఁ,
తే.గీ.
డిష్టసఖుఁడు కుబేరున, కిందుధరుఁడు,
గగనకేశుఁ, డతిస్వచ్ఛ కాంతితనుఁడు,
ఈశ్వరుండు, మహానటుం డెల్లవేళ
సర్వసౌఖ్యంబు లిడి మమ్ము సాఁకుఁగాక!

(అజ్ఞాతకవి - శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘చాటుపద్య మణిమంజరి’ నుండి)

19 కామెంట్‌లు:

 1. ఈశానుడె విద్యాపతి
  ఈశానుడె భూత భర్త సృష్టికి మూలం-
  బీశానుడె బ్రహ్మాధిప-
  తీశానుడె బ్రహ్మ విష్ణు వీశ్వర ప్రభృతుల్

  రిప్లయితొలగించండి
 2. మా అధ్యాత్మ రామాయణమునుండి:

  శిఖరిణి:
  నమస్తే సోమాయ త్రిభువన శరణ్యాయచ నమో
  నమస్తే రుద్రాయ త్రిదశనుత విజ్ఞాన నిధయే
  నమస్తే శర్వాయ ప్రమథ గణ వంద్యాయచ నమో
  నమస్తే తామ్రాయ శ్రిత భవ భయఘ్నాయచ నమః

  భుజంగప్రయాతం:
  నమస్తే సదా లోక నాథార్చితాయ
  నమస్తే గిరీశాయ నాదప్రియాయ
  నమస్తే భవానీ మనస్సంస్థితాయ
  నమశ్శంభవే విశ్వనాథాయ తుభ్యం

  పంచచామరం
  నమో హిరణ్య బాహవే సనాతనాయ తే నమః
  నమశ్శివాయ సర్వ భూత నాయకాయ తే నమః
  నమో హరాయ నందివాహనాయ శూలినే నమః
  నమో భవాయ నాగభూషణాయ శంభవే నమః

  రిప్లయితొలగించండి
 3. క్లేశమ్ములు రావని నరు
  డీశాన్యపు మూల దలచి యింటిని గట్టున్
  ఈశా! నీవే మూలము
  ఏ శాస్త్రపు వాస్తు కైన నివిగో జోతల్!

  రిప్లయితొలగించండి

 4. దండమయా శివ శంకర
  దండమయా సాంబ నీ కు దండము శంభో
  దండమయా నీలాంబర
  దండమయా గరళ కంట దండము భవుడా

  రిప్లయితొలగించండి
 5. అయ్యా! చి. డా. ఏల్చూరి మురళీధర రావు గారూ! శుభాశీస్సులు.
  ప్రసిద్ధులైన లక్షణ గ్రంథ కర్తలు ప్రస్తావించని కొన్ని కొన్ని మారుమూల ప్రయోగముల జోలికి పోవద్దు అని నా సలహా. నిన్నను మీరు ఉదహరించిన "దేశీయ యతి"ని నేను సమర్థించలేను. మా గురువు గారు అనే వారు - దమ్ము ఉన్నదే కవిత్వము అని. ఆ దమ్మును మనము ప్రదర్శించుటకు తగు ప్రయత్నము చేద్దాము గాని స్థాయిని తగ్గించుకొన వలదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. దేవా! మము పరిపాలన
  నీవే చేయంగ వచ్చి నిలబడవోయీ!
  యేవేళనైన మాకిక
  నీవే దిక్కని తలచుచు నిన్నే గొలుతున్.

  రిప్లయితొలగించండి
 7. Respected Sri Guruji,

  Pranams.

  I entirely agree with your instruction(s) to keep up high standards in poetry. I suppose it is only when certain instances demand an exception that these are considered for employment. As you said, I shall also restrain the streak to use these in my endeavor too and adhere to your word in letter and spirit.

  Thank you very much for your timely guidance, Sir, in deed. Since electricity supply failed at home, kindly excuse me for replying in English.

  With warm regards,

  Sincerely,
  Elchuri Muralidhara Rao

  రిప్లయితొలగించండి
 8. శిఖరమ్మునకొలువై,నీ
  వఖిలమ్మునుగావ నీశ యంజలులివె! నీ
  ముఖ మూలఁ భక్తి పారిన
  సుఖమన్నదిగూడునంటశుభకర శూలీ!

  రిప్లయితొలగించండి
 9. తలపైన గంగమ్మ, తనవక్త్రమునయగ్ని
  ధరియించినట్టి యద్వైతవిభుడు,
  ఘోరవైరాగ్యమ్ము చేరదీసినవాడు
  భువనైకపితృడై పొల్చువాడు
  సకలవేదమ్ముల సారమై జనువాడు
  మరుభూమియందు తామసలువాడు
  ఐశ్వర్యసామ్రాట్టు కాప్తమిత్రుడుచూడ
  నాదిభిక్షువుపేరఁనరయువాడు

  సర్వవిద్యలకధిపతి శంకరుండు
  సర్వభూతాత్ముడై వెల్గు జంగమయ్య
  సర్వలోకాధినాథుడు చంద్రధరుడు
  సర్వశుభములనిచ్చునశ్రాంతముగను.

  రిప్లయితొలగించండి


 10. ఈశానోద్భవము
  (బ్రహ్మ వైవర్త పురాణాంతర్గతము)

  తే.గీ.
  శ్లోకియౌ కృష్ణుఁ డుండ గోలోకమందు;
  వామ నేత్రమ్ము నందుండి వ్యాఘ్ర చర్మ
  ధారి, ముక్కంటి, భయదుఁడుఁ దగ జనించి,
  యపుడు "నీశాన" నామమ్ము నధివహించె! (1)

  వ.
  అట్లుద్భవించిన దేవదేవుండైన యీశానుని లోకు లెట్లు స్తుతించుచుండి రనగా...(2)

  తే.గీ.
  ఈశ! శంకర! శివ! పరమేశ! సాంబ!
  శీతనగవేశ్మ! శశిధర! క్ష్వేళకంఠ!
  వ్యాఘ్రచర్మధర! వికల్ప! వామదేవ!
  శూలి! శైలధన్వ! పినాకి! సూక్ష్మ! భర్గ!
  చిత్తజహర! త్రిపురభేది! శేషకటక!
  లింగమూర్తి! సిద్ధిద! భృగు! లేలిహాస!
  త్ర్యంబక! శితికంఠ! కపాలి! ప్రమథనాథ!
  వృషభవాహన! విషమాక్ష! విశ్వనాథ!
  భస్మదేహ! భార్గవ!మృడ! భవవినాశ!
  శర్వ! దక్షాధ్వరధ్వంసి! శాశ్వత!హర!
  చంద్రశేఖర! చండ! విశాఖ! భూరి!
  సాంఖ్య! పింగాక్ష! పింగళ! శంభు! బుధ్న!
  హాటకేశ! కపర్ది! సహాయ! హింస్ర!
  స్వస్తిద! వృషధ్వజ! హిరణ్య బాహు! శబర!
  వ్యోమకేశ! వృషాకపి! భూతనాథ!
  పాహి! మాం పాహి! గౌరీశ! పాహి! పాహి!(3)
  -:సర్వేభ్యః సర్వేశ్వర కృపా కటాక్ష ప్రాప్తిరస్తు:-
  (సమాప్తము)

  రిప్లయితొలగించండి
 11. 'ధర్మదండం' నుండి -


  సుర నిమ్నగా జటా జూటంబు తోడ , శీ
  ర్ష న్యస్త శశిధర ప్రభల తోడ ;
  ఫాల నేత్రము తోడ , ఫణిభూషణము తోడ ,
  హస్తి చర్మోత్తరీయంబు తోడ ;
  భస్మాంగ రాగ విభ్రాజితాంగము తోడ ,
  లంబితంబగు కపాలంబు తోడ ;
  సునిశితంబైన త్రిశూలాయుధము తోడ ,
  ఢమఢమ ధ్వని యుక్త ఢక్క తోడ ;

  ఘన కకుద్యుక్త నంది వాహనము తోడ
  వెలుగు నెవ్వండు ? వాడె సర్వేశ్వరుండు !
  నిర్వికల్ప చిదానంద నియత మూర్తి
  మహిత దీప్తిచ్చటా ప్రభామయ విభూతి !!!

  రిప్లయితొలగించండి
 12. కాశి పట్టణ మందున వాసి గాను
  మూడు లోకములకు నీవు మూల మగుచు
  జగతి పాలించు చుండెడి సార్వ భౌమ
  భక్తి నిండుగ మ్రొక్కెద ముక్తి నిడుము .!

  రిప్లయితొలగించండి
 13. పాల లోచన పరమేశ భస్మ ధారి
  పన్నగా భరణుండ వో సన్ను తాంగ
  గరళ కంఠుడ నెలవంక శిరము పైన
  శిరము తాటించి ప్రణుతింతు శివుడ నీకు !

  రిప్లయితొలగించండి
 14. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  ఈశ్వరుడు - విష్ణువు :
  (పరమాత్మ)

  01)
  _______________________________

  ఎద్దు నెక్కిన వాడు - గ్రద్ద నెక్కిన వీడు
  యిద్దరూ యొకడేను - యీశ్వరుండె !

  విషము దాల్చిన వాడు - విషపు రంగూ వీడు
  యిద్దరూ యొకడేను - యీశ్వరుండె !

  పాల రంగున వీడు - పాలయందే వాడు
  యిద్దరూ యొకడేను - యీశ్వరుండె !

  పాము మెడను వీడు - పాము పైనే వాడు
  యిద్దరూ యొకడేను - యీశ్వరుండె !

  పేరు,రూపము వేరు,వే - ర్వేరు గాని
  వీరు యిద్దరు నొక్కటే - వేరు గాదు
  కోరి కొల్చిన దీర్చును - కోరికలను !
  చేరి కోరిన భక్తుల - చేదు కొనును !
  _______________________________

  రిప్లయితొలగించండి
 15. 02)
  _______________________________

  గజ చర్మ ధారియూ - గజ ప్రాణ రక్షకుం
  డిద్దరూ యొకడేను - యీశ్వరుండె !

  బట్ట గట్టని వాడు - పట్టు పుట్టపు ధారి
  యిద్దరూ యొకడేను - యీశ్వరుండె !

  శ్రీని బీల్చిన వాడు - శ్రీని దాల్చిన వీడు
  యిద్దరూ యొకడేను - యీశ్వరుండె !

  గంగ నెత్తిన వాడు - గంగ పుట్టుక వీడు
  యిద్దరూ యొకడేను - యీశ్వరుండె !

  పేరు , రూపము, వేరు వే- ర్వేరు గాని
  వీరు యిద్దరు నొక్కటే - వేరు గాదు
  కోరి కొల్చిన దీర్చును - కోరికలను !
  చేరి కోరిన భక్తుల - చేదు కొనును !
  _______________________________
  శ్రీ = విషము , లక్ష్మి

  రిప్లయితొలగించండి
 16. ఈశ్వరుడు - విష్ణువు :
  (పరమాత్మ)

  03)
  _______________________________

  వేడి కంటిన వాడు - వేల కన్నుల వీడు
  యిద్దరూ యొకడేను - యీశ్వరుండె !

  పంచ శీర్షుడు వాడు - పంది రూపుడు వీడు
  యిద్దరూ యొకడేను - యీశ్వరుండె !

  అర్థ నారియె వాడు - యాడు రూపే వీడు
  యిద్దరూ యొకడేను - యీశ్వరుండె !

  చర్మధారియె వాడు - చక్రధారియె వీడు
  యిద్దరూ యొకడేను - యీశ్వరుండె !

  పేరు , రూపము, వేరు వే- ర్వేరు గాని
  వీరు యిద్దరు నొక్కటే - వేరు గాదు
  కోరి కొల్చిన దీర్చును - కోరికలను !
  చేరి కోరిన భక్తుల - చేదు కొనును !
  _______________________________

  రిప్లయితొలగించండి
 17. భుజంగ ప్రయాతము :

  పరబ్రహ్మ ! శూలీ ! శివా ! నీలకంఠా !
  పరా ! దేవ ! కైలాసవాసా ! మహేశా !
  హరా ! యీశ ! గంగాధరా ! చంద్రచూడా !
  గిరీశా ! జటాజూట ! కేదార ! శంభో !

  రిప్లయితొలగించండి
 18. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  నిన్న రోజంతా వివిధ కార్యక్రమాల్లో వ్యస్తుడనై మీ పూరణలను, పద్యాలను చూడలేకపోయాను. ఆలస్యానికి మన్నించండి.
  మనోహరమైన స్తోత్రాలను, పద్యాలను వ్రాసి, బ్లాకును అలంకరించి మిత్రులను అలరించిన
  మిస్సన్న గారికి,
  పండిత నేమాని వారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సహదేవుడు గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  డా. విష్ణునందన్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  వసంత కిశోర్ గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి