8, సెప్టెంబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 816 (మమ్మీ డాడీలు తెలుఁగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
మమ్మీ డాడీలు తెలుఁగు మాటలె తాతా!

27 కామెంట్‌లు:

  1. ఇంట్లో వుంటే అమ్మా నాన్నా కనబడరు...బడిలో తెలుగు వినబడదు...కమ్మనివగు ఆ రెండూ కావాలని ఒక మనవడు తాతతో..

    అమ్మా నాన్నా ఉద్యో
    గమ్మునకే బోవు నాకు కాన్వెంట్ బడిలో
    కమ్మని వేంలేవు కావలె
    మమ్మీ డాడీలు, తెలుఁగు మాటలె తాతా!

    రిప్లయితొలగించండి
  2. అమ్మీ యని పిలిచెదనే
    నమ్మను డా యన్న ఎడమ యౌ డీ యన్నన్
    నమ్ముము డీ కొట్టుట విను-
    మమ్మీ డాడీలు తెలుఁగు మాటలె తాతా!

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    శుభాశీస్సులు,
    మీ పద్యము 3వ పాదములో మాత్రలు ఎక్కువగ నున్నవి. సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. అమ్మా నాన్నా అనెడి ప
    దమ్ములు తొలగింపబడెను తప్పు పలుక నే
    రమ్మగుననె మా టీచరు
    మమ్మీ డాడీలు తెలుగు మాటలె తాతా!

    రిప్లయితొలగించండి
  5. "అమ్మా నాన్నలు" అన నాం
    గ్లమ్మున నేమండ్రు? తేనెల పలుకు లేవీ?
    అమ్మమ్మ మగడిని పిలువు;
    మమ్మీ డాడీలు,తెలుగు మాటలె,తాతా!

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! శ్రీ చంద్రశేఖర్ గారూ!
    శుభాశీస్సులు
    మీ పద్యము 2వ పాదము గణములు సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. “అమ్మ” కు గడువు ముగిసెగా
    తమ్ముళ్ళూ! “నాన్న”న వలదు, తగనా కాన్వెం
    టమ్మలిక నూరి పోసిరి
    మమ్మీ డాడీలు తెలుఁగు మాటలె తాతా!

    రిప్లయితొలగించండి
  8. అమ్మా నాన్నన తిడుదురు
    మమ్మీ డాడీలు తెలుఁగు మాటలె తాతా
    అమ్మో పలుకగ నింటను
    వామ్మో భయమౌను మాకు వద్దులె గ్రాండ్పా!

    రిప్లయితొలగించండి
  9. శ్రీ నేమాని గారూ ! ధన్యవాదములు.
    నా పూరణ లోని దోషమును సరిజేయుచున్నాను.

    అమ్మా నాన్నా ఉద్యో
    గమ్మునకే బోవు నాకు కాన్వెంట్ బడిలో
    కమ్మని వేంలేవు వలెను
    మమ్మీ డాడీలు, తెలుఁగు మాటలె తాతా!

    రిప్లయితొలగించండి
  10. శ్రీ నేమాని గారూ ! ధన్యవాదములు.
    నా పూరణ లోని దోషమును సరిజేయుచున్నాను.

    అమ్మా నాన్నా ఉద్యో
    గమ్మునకే బోవు నాకు కాన్వెంట్ బడిలో
    కమ్మని వేంలేవు వలెను
    మమ్మీ డాడీలు, తెలుఁగు మాటలె తాతా!

    రిప్లయితొలగించండి

  11. ముమ్మాటికి వర్జ్య నీ యము
    మమ్మీ డాడీ లు, తెలుగు మాటలె తాతా !
    యమ్మా నాన్నల పదములు
    అమ్మా యను పిలుపె ధరను కమ్మగ నుండున్ .

    రిప్లయితొలగించండి

  12. అమ్మా నాన్నాలన్నవి
    ముమ్మాటికి పాతకాలమునకే చెందున్
    నమ్ముము కాలము మారెను
    మమ్మీడాడీలు తెలుగు మాటలె తాతా!

    రిప్లయితొలగించండి
  13. గుండు మధుసూదన్ గారి పూరణ....

    డమ్మీ యాంగ్లపు మాటలు
    మమ్మీ డాడీలు! తెలుఁగు మాటలె తాతా,
    అమ్మా, నాన్నయ! కనఁగను
    మమ్మీ 'శవ'; మమ్మ 'యమృత మయ'మే తమ్మీ!

    రిప్లయితొలగించండి

  14. అమ్మమ్మ గారి ఊరువెళ్ళిన మనుమడు:

    అమ్మమ్మ నడిగిన తెలిసె
    నమ్మానాన్నాపిలుపుల నంతట విని నేన్
    నమ్మెదనికపైఁ "గావట
    మమ్మీ డాడీలు తెలుఁగు మాటలె!" తాతా!!

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా!
    ఈ నాటి పూరణలు వైవిధ్య భరితముగా నున్నవి. అందరికీ అభినందనలు.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: అమ్మా నాన్నలు ఉద్యోగమునకు పోవుట, కాన్వెంటులో తెలుగు లేక పోవుట, మొత్తానికి కమ్మనివి ఏవీ లేవు అని చింతించుచున్నారు పిల్లలు. భావము బాగున్నది. ప్రశస్తమైన పద్యము.

    శ్రీ మిస్సన్న గారు: 2 పూరణలు వినోదకరముగా నున్నవి - ఉత్తమమైన పూరణలు.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు: 1, 2 పాదాలు చాలా బాగుగనున్నవి. 3వ పాదములో "అమ్మమ్మ మగడు" అనే వాడుక ఉచితముగా లేదు. పద్యము చాలా బాగున్నది.

    శ్రీ చంద్రశేఖర్ గారు: కాన్వెంటమ్మల బోధలు గురించి ప్రస్తావించేరు - పద్యము ఉత్తమముగా నున్నది. 2వ పాదములో 1 లఘువు ఎక్కువగా నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు: తెలుగు దనములోని కమ్మదనమును ప్రస్తావించేరు - చాలా బాగున్నది. 1వ పాదములో 1 మాత్ర ఎక్కువ; 4వ పాదములో యతి మైత్రి లేదు.

    శ్రీ నిరంజన్ కుమార్ గారు: మారిన కాలములోని వ్యవహారమును ప్రస్తావించేరు. ఉత్తమముగా నున్నది పద్యము.

    శ్రీ గుండు మధుసూదన్ గారు: డమ్మీ యాంగ్లపు మాటలని తేల్చేరు - బాగున్నది - ప్రశస్తమైన పద్యము.

    శ్రీ రామకృష్ణ గారు: ప్రస్తుత సమాజములో వ్యవహరము ఇలా అయినది అని విచారించేరు - మంచి పద్యము.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. ఇమ్ముగ 'డు ము వు లు ' చేర్చిన
    కమ్మని తెలుగు పదమౌను! కాదన గలమే?
    క్రమ్మెను పర భాష యిటుల
    మమ్మీ డాడీలు తెలుఁగు మాటలె తాతా!!

    రిప్లయితొలగించండి
  17. పండితులకి నమస్కారం!
    ప్రతి రోజు మీ సమస్య పూర్ణం బ్లాగ్ చూస్తుంటాను.
    ఏంతో బాగుంటున్నాయి.
    మెదడుకి పదును పెట్టేవిల వున్నాయి.
    అందుకే నాకు పద్యాలు రాయటం తెలీకపోయినా
    యతి ప్రాసలు రాకపోయినా
    గణాలు ఎంచాలేకపోయినా
    నాకు తోచిన రీతిలో రాస్తున్న.


    చుట్టుపక్కల మమ్మీ డాడీ
    జగమంతా మమ్మీ దాడి
    అయిన మన మమ్మీడాడి
    తెలుగు మాటలే తాతా!

    * * *
    అమ్మ లోని అమ్మతనము నాన్న లోని నాన్నతనము
    అమ్మకానికి డబ్బుకోసమై ఇల్లు వదలినపుడు
    ఆప్యాయతలకు మనసు వెతుకుతుంటే
    మమ్మీ డాడీలు తెలుగు మాటలే తాతా!!

    * * *


    మమ్మీ డాడిలు తెలుగు మాటలు తాతా !
    ఆంగ్లంలో ....
    మమ్మీ అంటే పార్ధివ శరీరమంటారు
    డాడీ అనే పిలుపులో ప్రేమ దూరం ఉందంటారు.
    అమ్మ నను లాలించినా నాన్న నను పాలించినా
    మా భవిత కై ఇద్దరూ ఉద్యోగాలపెరిట దూరమవుతున్నా
    ఆప్యాతానురాగాలకి నాలా ఎందఱో చిన్నారులు అలమటి స్తున్నా
    అమ్మ నాన్నల అచ్చ తెలుగు పదాలు కనుమరుగై
    ఆంగ్ల పదాల మమ్మీ డాడీలు తెలుగు మాటలయ్యాయి తాతా!!


    (తెలుగంటే మక్కువ
    పద్యాలంటే ఇష్టం
    కాని రాయలేను.
    అందుకే మూడు రకాలుగా రాసాను.)
    మణి నాథ్ కె

    రిప్లయితొలగించండి
  18. సందర్భం వచ్చింది కాబట్టి చెబుదామనిపించింది. అమెరికన్ ఇంగ్లీషు వాళ్ళు మమ్మీ-డాడీ అని అనరు. మామ్-డాడ్ (Mom-Dad) అని మాత్రమే అంటారు. బ్రిటిష్ ఇంగ్లీషులో మమ్మీ-డాడీ అని ఇన్ఫార్మల్ గా వాడతారేమో నాకు తెలియదు. నేనెప్పుడూ ఎవరూ మమ్మీ-డాడీ అని వాడటం చూడలేదు, మనదేశంలో తప్ప. ఇంగ్లీషు కూడా చాలా రూపాంతరాలు చెంది వేరు వేరు దేశాలలో వేరు వేరు యాసలతో (డయలెక్టు) వ్యాప్తం అయింది. అన్ని తెలుగు యాసలు ఒకటి కానట్టే అన్ని ఇంగ్లీషులూ ఒకటి కాదు.

    రిప్లయితొలగించండి
  19. ఒక మనురాలు తాతయ్యతో అన్నట్లు:

    సొమ్ములు కావలె నన్నను
    బొమ్మా(గొమ్మా)యనిగుమ్మరింత్రుముద్దుగఁ(గోముగఁ) గానీ
    కమ్మని వైనను నేర్పరు
    మమ్మీడాడీలు,తెలుగుమాటలె తాతా!

    రిప్లయితొలగించండి




  20. అమ్మకు,నాన్నకు ,నదియే
    కమ్మగ వినిపించు మాట కావున మాకున్
    నిమ్ముగ నలవాటాయెను
    మమ్మీ,డాడీలు తెలుగు మాటలె తాతా.

    రిప్లయితొలగించండి
  21. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా!
    మరికొన్ని పూరణలు:
    అందరికి అభినందనలు.
    శ్రీ జిగురు సత్యనారాయణ గారు: డు, ము, వు, లు చేర్చితే తెలుగు భాష అవుతుంది అన్నారు, నిజమే ఇది కేవలము సంస్కృత పదములకు తెలుగు పదములకు మధ్య నున్న సంబంధము మాత్రమే. ఇంగ్లీష్ పదాలకు డు, ము, వు, లు కలుప బడవు. వారి పద్యము బాగున్నది.

    శ్రీ సహదేవుడు గారు: సొమ్ములు కావాలంటే మమ్మీ డాడీలు కావాలి కద - ఔను మరి సొమ్ములు కావాలి, కమ్మని తెలుగు పదములు కావాలి అందాము. వారి పద్యము బాగున్నది.

    డా. కమనీయం గారు: చక్కగా చెప్పేరు - అసలు అమ్మా నాన్నలకు అలాగ పిలిపించు కొంటేనే సరదా కదా. ఉత్తమముగా ఉన్నది భావము.

    శ్రీ మణి గారు: మీకు పద్యములంటే సరదా అన్నారు - మెలమెల్లగా ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి
  22. మమ్మీ మేకప్ వెరిగుడ్!
    రమ్మీ టెన్నిస్ కరాటె రగ్బీ క్రిక్కెట్
    "డమ్మీ" డాడీ నోగుడ్!!!
    మమ్మీ డాడీలు తెలుఁగు మాటలె తాతా!

    రిప్లయితొలగించండి