19, సెప్టెంబర్ 2012, బుధవారం

చమత్కార (చాటు) పద్యములు - 205

జనకునకున్ విషం బిడిన సాగరు తోయములన్ని నేలపా
లొనరఁగఁ జేతు నంచుఁ గర మూనిన గౌరియుఁ జూచి “వద్దురా
తనయ! సురేంద్రు ధాటి కిటు దాఁగిన మామను బైట వేతువా?”
యనినఁ గరమ్ముఁ దీసిన గజాస్యునిఁ గొల్తు నభీష్టసిద్ధికిన్.

అజ్ఞాత కవి (శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటు పద్య రత్నాకరము’ నుండి)

4 కామెంట్‌లు:

  1. మంచు కొండపై నాయన మరచి మేను
    ప్రళయ తాండవ మొనరింప పరవశించి
    తల్లి యొడిలోన కూర్చుండి దాని జూచు
    బాల గణపతి గొల్తును భక్తి మీర.

    రిప్లయితొలగించండి
  2. చక్కని చమత్కారము....బాగుంది...

    కుడుము లడుగు మనల కిడుముల దొలగించు
    గరిక పోచ లడుగు సిరుల నిచ్చు
    ముంచ మనును నీట ముంచును గద పాల
    నేన్గు ముఖపు సామి నేను గొలుతు

    రిప్లయితొలగించండి
  3. మిస్సన్న గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి