28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 835 (హనుమను ముద్దాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
హనుమను ముద్దాడె శంభుఁ డానందమునన్.

25 కామెంట్‌లు:

 1. అనితయె శంభుని పుత్రిక
  కనగా నేడామె నొక్క కన్నను ' హనుమన్ '
  మనుమడు పుట్టెను నాకని
  హనుమను ముద్దాడె శంభుఁ డానందమునన్.

  రిప్లయితొలగించండి
 2. వినుడయ్యా శ్రీ రాముని
  మనమున తానుండు గాదె మహదేవుండే
  హనుమకు ముద్దిడ రాముడు
  హనుమను ముద్దాడె శంభుఁ డానందమునన్.

  రిప్లయితొలగించండి
 3. మిత్రులారా!
  సకల వర్ణములు అమ్మయొక్క స్వరూపములే కదా. మ వర్ణ వాచ్యగా అమ్మను వర్ణించుచూ చేసిన పూరణ యిది.

  జననుత సుగుణ మ వర్ణం
  బున సద్వాచ్యగ నలరెడు భూధరసుతయౌ
  యనుపమ విభవాన్విత దే
  హను "మ" ను ముద్దాడె శంభు డానందమునన్

  రిప్లయితొలగించండి
 4. అయ్యా! శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  శ్రీనాథుని పద్య పాదములను తీసుకొనుట పేరడీ కాదు. ఆ కవిసార్వభౌముని యెడల మనకు గల గౌరవమునకు సంకేతము. సాధారణముగా పేరడీలను వ్యంగ్యోక్తులకే ఉపయోగించుతారు కదా. స్వస్తి.

  రిప్లయితొలగించండి

 5. తన తలపై వెలసిన గం
  గను గని కోపించి సవతిగా భావించెడి శం
  కను తొలగింతు ననెడి యూ
  హ నుమను ముద్దాడె శంభుఁ డానందమునన్.

  రిప్లయితొలగించండి
 6. మనసునఁబొంగిన మధువుల్
  కనుకమలాలొలకఁజేయఁగమనీయముగన్
  గని జుర్రగ కోమల దే
  హ నుమను ముద్దాడె శంబుఁడానందముగన్!

  రిప్లయితొలగించండి
 7. మిత్రులారా!
  ఈ నాటి సమస్యలో "శంకరుని" ఊహ బాగుగనున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. మాన్యశ్రీ శంకరయ్య గారి స్ఫూర్తితో:

  హను పాలిత భక్త సమూ
  హను భాస్కర కోటి కాంతి నలరారెడు దే
  హను నతులిత ప్రేమోత్సా
  హనుమను ముద్దాడె నానందముతో

  (హను = హకార వాచ్యయైన దానిని = "హ" ఆకాశ తత్త్వాత్మిక కదా!)

  రిప్లయితొలగించండి 9. ఇనకుల భూ ష ణు డ ర్చితు

  విను వీ ధిన నుండు శివుడు విశ్వం భవుడున్
  ననుపమ సుందరి పార్వతి

  హనుమను , ముద్దాడె శంభు డా నందమునన్ .

  రిప్లయితొలగించండి
 10. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు, గురువుగారికి ధన్యవాదములు దెలుపుచు

  ఒలింపిక్ పధకము గెలిచిన శిష్యుడు గురువుగారి ఆశ్విర్వదమునకై వచ్చెను యప్పుడు ,
  ( హనుమ = శిష్యుడు , శంభుడు = గురువుగారు )
  హనుమకు జిక్కె "నొలింపిక్ "
  యని పండుగ జేసిరి జను లానందమునన్
  వినయముతో మ్రొక్కిన నా
  హనుమను ముద్దాడె శంభు డానందమునన్
  -----
  శ్రీ నేమాని వారికి, గురువు గారికి యీ చిట్టెలుక వేయు చిరుహారము
  ------
  నేమము నేర్పుచు నిలచిరి
  నేమము వారింటి పేరు, నేయుడు భువికిన్
  నేమానక బట్టెద "శ్రీ
  నేమాని" పదయుగళమును నెమ్మది తోడన్
  ( నేమము= వజ్రము , నేయుడు= సూర్యుడు , భువికిన్ = కవితావనము )

  రిప్లయితొలగించండి
 11. ఇనుడొకఫలమని తలచుచు
  ఘనకార్యముజేయదేవగణములు చూడన్
  అనునయముగ వరములనిడి
  హనుమను ముద్దాడె శంభుడానందమునన్.

  రిప్లయితొలగించండి 12. హనుమంతుడు సంజీవిని
  తన లక్ష్మణు కొరకు తేను త్వరగా వెడలెన్
  వినువీథిని జను ప్రియమగు
  హనుమని ముద్దాడె శంభు డానందముతో

  రిప్లయితొలగించండి
 13. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారికి శుభాశీస్సులు. మీ పూరణ మంచి భావముతో పురాణ గాథను జ్ఞప్తికి తెచ్చుచు నలరారుచున్నది. అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  హనుమను శంభునికి మనుమని చేసిన మీ మొదటి పూరణ బాగుంది. ‘శివాయ విష్ణురూపాయ’ అన్న భావంతో మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ అద్భుతంగా ఉంది.
  శబ్దాలంకార శోభితమైన మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  నా ఊహ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ ‘కోమల’మైన భావంతో అలరిస్తున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  హనుమను శంభునకు శిష్యునిగా చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘ఒలింపిక్ + అని’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఒలింపి క్కని’ అనవచ్చు.
  నేమాని వారిపై మీ పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. సంపత్కుమార్ శాస్త్రి గారి బాటలోనే :


  ఇనబింబము గని బాలుడు
  హనుమ ఫలంబని తలంచి యాశ్చర్యము గొ
  ల్ప నభము కెగిరెన్ ; మెచ్చుచు
  హనుమను ముద్దాడె శంభు డానందమునన్.

  రిప్లయితొలగించండి
 16. గురువుగారికి ధన్యవాదాలు.

  శ్రీ నేమాని గురువర్యా ధన్యోస్మి.

  రిప్లయితొలగించండి 17. తనతో సరియగు భంగిమ
  లను నటనమ్మాడుచు సురలందరు మెచ్చన్
  గనుగొని నవ్వుచు, మధురో
  హ,నుమను ముద్దాడె శంభుడానందముగన్

  రిప్లయితొలగించండి
 18. శంకరార్యా ! ధన్యవాదములు. మీ "ఊహ" ఆహా..ఓహో..చాలా బాగుందండీ ...

  రిప్లయితొలగించండి
 19. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  నిస్సందేహంగా మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  హనుమచ్ఛాస్త్రి గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 20. గురువుగారూ మీ యూహ చాలా బాగుంది. కానీ ఎందుకో రెండవ పాదం పై అనుమానం............
  క్షమించాలి.

  రిప్లయితొలగించండి
 21. మిస్సన్న గారూ,
  నిజమే. ఆ పాదంలో గణదోషం ఉంది. ధన్యవాదాలు.
  సవరణ...
  ‘గను గని కోపించి సవతిగాఁ దలఁచెడి శం’

  రిప్లయితొలగించండి
 22. జనకుని మిథిలను వెదకుచు
  కనుగొని సామీరి జేరి కైలాసమ్మున్
  తునిగిన తన విల్లునిడిన
  హనుమను ముద్దాడె శంభుఁ డానందమునన్

  రిప్లయితొలగించండి
 23. చనువును గైకొని పడతియె
  తనువున సగభాగ మౌచు తాడన జేయన్
  వినగా నొంటరి వాడని
  హనుమను ముద్దాడె శంభుఁ డానందమునన్

  రిప్లయితొలగించండి
 24. అనయము సేవల జేయుచు
  తనువున సగభాగమొదుగు తరుణినిగనుచున్
  పెనగొని సుమ కోమల దే
  హ నుమను ముద్దాడె శంబుడానందముగన్

  రిప్లయితొలగించండి