వరుణుఁడు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
సీ.
మహనీయ సమదోగ్ర మకరవాహనుఁడు క
చ్ఛపమీననక్రాది జంతువిభుఁడు
పద్మినీమానస పంజరకీరంబు
ఫణగణాంచిత నాగపాశధరుఁడు
భీకరాకార గుంభిత కనత్కల్లోల
వారిసంభృత వార్ధి వల్లభుండు
నూత్న తృణగ్రాహి రత్న విభూషితుం
డఖిల జగద్వర్ష హర్షదాత
తే.గీ.
దుష్టనిగ్రహకారి యుత్కృష్ట మహిముఁ
డభయహస్తుఁడు కరుణారసార్ద్రహృదయుఁ
డమృతజీవన మొనగూర్చి యన్వహంబు
వరుణదేవుండు మిమ్ముఁ గాపాడుఁగాత!
(అజ్ఞాత కవి - శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘చాటుపద్య మణిమంజరి’ నుండి)
మహనీయ సమదోగ్ర మకరవాహనుఁడు క
చ్ఛపమీననక్రాది జంతువిభుఁడు
పద్మినీమానస పంజరకీరంబు
ఫణగణాంచిత నాగపాశధరుఁడు
భీకరాకార గుంభిత కనత్కల్లోల
వారిసంభృత వార్ధి వల్లభుండు
నూత్న తృణగ్రాహి రత్న విభూషితుం
డఖిల జగద్వర్ష హర్షదాత
తే.గీ.
దుష్టనిగ్రహకారి యుత్కృష్ట మహిముఁ
డభయహస్తుఁడు కరుణారసార్ద్రహృదయుఁ
డమృతజీవన మొనగూర్చి యన్వహంబు
వరుణదేవుండు మిమ్ముఁ గాపాడుఁగాత!
(అజ్ఞాత కవి - శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘చాటుపద్య మణిమంజరి’ నుండి)
అమృతసమమగు జలముల నందజేయు
రిప్లయితొలగించండివరుణదేవుండకిల్లిదె ప్రణతులందు.
ప్రకృతి నెల్ల కాపాడుచు పచ్చదనము
తోడ నింపగ స్వామిదె దొరతనమ్ము.
వరుణాయ నమస్తేస్తు
రిప్లయితొలగించండివారిధీశాయ తేనమః
వార్ధించరాధినాథాయ
దివ్య రూపాయ తేనమః
రిప్లయితొలగించండివరుణ దేవుడ! మాకొక వ రము నిమ్ము
నిండు హృదయాన , పంటలు పండు కొఱకు
మంచి వానలు కురిపించు మాకు ధరను
వేయి విధముల మ్రొక్కుదు మోయి సామి !
స్వల్పనీరైనదొరకని
రిప్లయితొలగించండియల్పులమయ!
నీరె జీవనా ధారంబు, నీదుకరుణ
వరుణ మాపై కురియజేసి వర్షమొసగు
సన్నుతింతుము నిను యాద సాంపతిగను!
వానలు సకాలమందున పడుట లేదు
రిప్లయితొలగించండివైన మదియేమి !? చెప్పుము వరుణ ! మంద
గమన మకరంబును విడిచి కారులోన
వచ్చి వానలు కురిపించవయ్య దేవ !
రిప్లయితొలగించండిశుచిష్మంతుఁడు వరుణునిగ మారిన కథ:
తే.గీ.
కర్దమ ప్రజాపతికినిఁ గలఁడు పుత్రుఁ
డాతఁడే శుచిష్మంత సమాహ్వయుండు!
నతఁ డొక దిన మచ్ఛోదమన్ దమ్మె యిల్లు
సొచ్చి, తోడి బాలురతోడ నిచ్చకమగు;
ఆ.వె.
ఆట లాడుచుండ నందొక మొసలియు
మ్రింగి జలధి విభు సమీప మిడియె!
నంత నొక్క నాఁడు నట శివభటులును
బాలుఁ గని, "యిదేమి వారిధిపతి?
తే.గీ.
కర్దముని పుత్రుఁ దెచ్చితి? కనఁగఁ దగునె?
తమరు నిట్టి పనినిఁ జేయ ధర్మ మగునె?"
యనఁగ భయపడి, కైలాసమునకుఁ జేర్చ;
శివుఁడు బాలుని నింటికిఁ జేరఁ బంప-
కం.
జనకుని యాజ్ఞనుఁ బడసియుఁ
జని, కాశీ పట్టణమునఁ జంద్ర ధరునికై
యనితరమగు తపమునుఁ జే
సెను; శివుఁడును వచ్చి, సంతసించి వర మిడెన్!
ఆ.వె.
"వత్స! నీకు నిత్తు వరముఁ గోరు” మటన్న
"దేవ! ధన్యు నైతి! త్రిపురవైరి!
'వరుణ పథము' నిమ్ము; వరుణుండ నగుదును!
భూతనాథ! భర్గ! బుధ్న!తుంగ!"
ఉత్సాహము:
కరుణతోడ వరమునిడఁగఁ గాంక్ష తీరె నతనికిన్;
శరపుసిరులఁ గొనియుఁ దాను సాగరేశుఁ డయ్యుఁ దాఁ
గరము వర్ష మిడియుఁ జనులఁ గాచుచుండ నిత్యమున్,
జిర యశమ్ము వడసె! జనులు చేరి, కొలిచి రాతనిన్.
తే.గీ.(పంచపాది)
జలపతి! వరుణ! సరిదీశ! జంబుక! కప!
కేశ! పాశ్చాత్య! వార్షుభ! పాశహస్త!
ప్రత్యగాశాపతి! విలోమ! వర్ష దేవ!
శ్యామలాపతి! సంవృత్త! సన్నుతు లిడి,
మిమ్ముఁ గొలుతుము! కాపాడు, మేఘనాథ!"
వ.
అనుచు నిట్లు కొలువ, వరుణుఁడు సంతుష్టుఁడై సకాలమున వర్షములఁ గురిపించుచు, వారలఁ గాచుచుఁ దాను సుఖంబుండె.
(సమాప్తము)
-: శుభం భూయాత్ :-
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
‘దేవుండకిల్లిదె’ అనడంలో ఏదో అపశృతి... ‘దేవుడా నీకివే’ అనవచ్చునా? లేక నేను అర్థం చేసికొనడంలో ఏదైనా పొరబడ్డానా?
*
పండిత నేమాని వారూ,
మీ వరుణ స్తోత్రం అద్భుతంగా ఉంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘స్వల్పనీరు’ అనడం దుష్టసమాసం. ‘స్వల్పనీరము దొరకని...’ అందాం.
*
నాగరాజు రవీందర్ గారూ,
చమత్కారభరితమై అలరించింది మీ పద్యం. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
వరుణ వృత్తాంతాన్ని మనోహరంగా చెప్పారు. బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరార్యా !
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారు,
రిప్లయితొలగించండిమీరు చెప్పినదే సరి.
ఇల్లిదె లాంటి పదములు అన్నమయ్య పాటల్లో చెవిన బడుతుంటాయి.
పద్యరచనలో యుక్తము కాకపోవచ్చును.
మన్నించండి. గ్రంథాలు పఠించే అలవాటుంటే ఈ పొరబాట్లు దొర్లవు.
జలము నావిరి జేయుచు జలద మలరి
రిప్లయితొలగించండిమలయ మారుత మంటగ కులికి కరిగి
సంత సమ్మున మురియుచు పంత మనక
ప్రకృతి పులకించ వరుణకు ప్రణతు లిడుతు
క్షమించలి . నా కంప్యుటర్ సరిగా లేక , పూరణలకు దూరం కాలేక ఎలాగొ పూరణ లొక్కటీ వ్రాయ గలుగు తున్నాను
" సోదరు లందరికీ శుభా కాంక్షలు [ ఆలస్యంగా ]
మిత్రశ్రీ గుండు మధుసూదన్ గారికి,
రిప్లయితొలగించండి"శంకరాభరణము" బ్లాగుముఖంగా మీరు దిక్పాలకుల కథానకాలను పూర్వోత్తరసంహితయా వివరించటం సముచితంగా ఉన్నది. దీనినే మఱికొంత కవితాత్మకంగా విస్తరించి, ఆవశ్యకాలైన వర్ణనలను చేర్చి "అష్టదిక్పాల చరిత్రము" అని చిన్ని కావ్యంగా రూపొందిస్తే తెలుగులో ఆ పేరిట కావ్యమేదీ లేనందువల్ల అపురూపమైన రచన కాగలదని సూచించేందుకు ఈ నాలుగు మాటలు వ్రాశాను.
"భద్రా స్టే పంథానః" - భవతు!
సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు
"భద్రా స్తే పంథానః"
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండికవిమిత్రులు శ్రీ ఏల్చూరి వారికి,
మీ నాపట్ల చూపుచున్న స్నేహభావమునకు కడుంగడు సంతసించుచున్నాఁడను.
మీ సూచనకు కార్యరూపము నిచ్చుటకు తప్పక ప్రయత్నించెదను. అందుకు మీ ప్రోత్సాహము, భగవత్కృప కావలెను.
ధన్యవాదములు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యంలో ‘అనావృష్టిరవుగ’?
రెందవ పద్యం మూడవ పాదంలో బేసిగణంగా జగణం పడింది. ‘పెద్ద మనస్సున లోగొను/మిద్ది...’ అంటే?
*
లక్ష్మీదేవి గారూ,
అల్లదె వంటిదే ఇల్లిదె... అక్కడ అభ్యంతరం లేదు. ‘దేవుండకు..’ దగ్గరే సందేహం. ఓహ్..! అది ‘దేవుండ విల్లిదె’కు టైపాటా?
*
రాజేశ్వరి అక్కయ్యా,
మధురమైన భావంతో మంచి పద్యం చెప్పారు. అభినందలు.
‘వరుణకు’ను ‘వరుణుడా’ అంటే బాగుంటుందని నా సలహా.
*
ఏల్చూరి వారూ,
మధుసూదన్ గారికి సర్వామోదమూ, ఆనందకరమూ అయిన సూచన నిచ్చారు. ధన్యవాదాలు.
గురువుగారూ మీ సూచనలకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండితప్పులు సరిదిద్దిన పద్యములు:
వరుణున కపచారంబగు
నరులు జలమ్మందు నాడ స్నానంబు దిగం-
బరముగ కారణ మగునది
కరవుకు భువి నెంచ బోరు కాపురుషు లహో ......
పెద్దలు హితవుగ జెప్పిన
సుద్దులు తలకెక్కవయ్య దయతో మమ్మున్
పెద్ద మనస్సున లోగొను
మిద్ది కలిమహత్వ మంచు నెంచుము వరుణా.