6, సెప్టెంబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 814 (యముఁ గని రోగార్తుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
యముఁ గని రోగార్తుఁ డొక్కఁ డానందించెన్.

26 కామెంట్‌లు:

  1. క్రమముగ క్షీణించె బలము
    భ్రమలవి వీడెనిక దేహి పయనమ్మునకై
    సమయమదెప్పుడని వగచె;
    యముఁ గని రోగార్తుఁ డొక్కఁ డానందించెన్.

    శ్రమయని దలపక దననే
    గమనించి యొకడు వడివడి కరుణామయుడై
    మమతను చూపి యొసగు సా
    యముఁ గని రోగార్తుఁ డొక్కఁ డానందించెన్.

    రిప్లయితొలగించండి
  2. సమవర్తి రోగి కలలో -
    "సమయము గలదింక నీకు జచ్చుట కొరకై!"
    అమరుడవని పలికే అభ
    యముగని రోగార్తు డొక్కడానందించెన్ !

    రిప్లయితొలగించండి
  3. విమలాత్ములు నెలకొల్పిరి
    "యమరద్రుమ వైద్యశాల" నాధునిక ప్రమా
    ణము లలర నట్టి సదుపా
    యముగని రోగార్తు డొక్క డానందించెన్

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గుండా సహదేవుడు గారు మా శ్రీమదధ్యాత్మరామాయణము కాపిని చదువుటకు నుత్సాహమును జూపేరు. చాల సంతోషము. వారి చిరునామె తెలియజేస్తూ నాకు ఒక పోస్టు కార్డు వ్రాస్తే నేను రామాయణమును ఉచితముగా పంపుతాను. ఎవరు నాకు వ్రాసినా నేను తప్పక స్పందించుతాను. ఈ క్రింది వెబ్ సైట్లో కూడా మా అధ్యాత్మరామాయణము మరి కొన్ని రచనలు చూడవచ్చును.
    "panditha-nemani@info"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. శ్రమనొందక పలువిధ రో
    గములన్ పరిమార్చు దివ్య కసరులఁగొని సం
    భ్రమములఁ గల్గించునుపా
    యముఁగని రోగార్తుడొక్కఁడానందించెన్.

    కసరు = కషాయము, ఆకుపసరు,

    రిప్లయితొలగించండి
  6. అయ్యా శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
    శుభాశీస్సులు.
    "దివ్య కసరులు" అనే ప్రయోగము చెయ్య కూడదు. మంచి కసరులు అనండి. సమాసములో దివ్య అనే సంస్కృత పదము తరువాతి పదముగా తెలుగు పదము ఉండకూడదు. మీ భావము బాగున్నది. అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. సందేహము: "యముఁగని..." అని అరసున్న ప్రయోగించటం వల్ల, యముడు అని అర్థం వచ్చేట్లు మాత్రమే పూరించాలి కదా! ఒకసారి డా. విష్ణునందన్ గారు ఇటువంటి దానిమీద వివరణ ఏదో ఇచ్చినట్లు గుర్తు. పెద్దలు వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  8. చంద్రశేఖర్ గారు,
    యమున్ గని అనే రూపంలో ఉంటే ఏ పదమైనా వాడవచ్చు. సాయము, ఉపాయము మొదలైనవి.
    అంతే గాని యముగని అని ఒకే పదం రూపముంటే (లేదు కదా) వాడకూడదు. అరసున్న రాని రూపమైతే వాడకూడదు. అని నాకు తెలిసినది.

    రిప్లయితొలగించండి
  9. మిత్రులారా!
    అర్థానుస్వార ప్రభావమేమిటి యని సందేహము కదా.
    యమున్ + కని అని అన్వయము. యము అనే అక్షరములతో ముగిసే ఏ పదము నయినా వాడవచ్చును. యముడు అనే అర్థములో కూడ వాడవచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  10. విమలమ్మ సేయు ధన సా
    యము గని రోగార్తు డొక్క డానం దించెన్
    నమితంబుగ దన మదిలో
    శమి యించును రోగ మంచు సాయీ కృప చేన్

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి పూరణ....

    సమయించి వ్యాధి; రోగుల
    యము దరికిం జేరకుండ నాపెడువారౌ
    ప్రముఖోద్య ద్వైద్య నికా
    యముఁ గని, రోగార్తుఁ డొక్కఁ డానందించెన్!

    రిప్లయితొలగించండి
  12. శమనగిరికరుగఁదప్పదు
    శమనములేనట్టి ప్రాణసంకట మన్నన్
    క్రమమగు ధన్వంతరి వై
    ద్యముఁగని రోగార్తుడొక్కడానందించెన్!

    రిప్లయితొలగించండి
  13. శ్రీ నేమాని గురువర్యులకు,

    నమస్సుమాంజలి. మొన్న కూడా ఇదేవిధమైన వివరణ ( వేరొకరి పద్యప్రస్తావనతో ) చెప్పడము జరిగినది. తప్పవుతుందని తెలుస్తూనే వ్రాసేశాను. క్షంతవ్యుడను.

    రిప్లయితొలగించండి
  14. యమ పొగ త్రాగుడు కే హృద
    యమునకు పెను జబ్బు రాగ నా వైద్యుండే
    క్రమముగ నయమౌనను ధై
    ర్యముఁగని రోగార్తుడొక్కడానందించెన్.

    రిప్లయితొలగించండి
  15. విమలంబౌ జీవితమది
    సమయోగమునాశ్రయించి సార్థకమాయెన్
    క్రమముగ మృత్యోన్ముఖ సమ
    యము గని, రోగార్తుఁ డొక్కఁ డానందించెన్

    టైపాటుసవరణతో...

    రిప్లయితొలగించండి
  16. వమనము లధికమ్మై యుద-
    రము కడు నొచ్చు టను వెజ్జు రయమున బాధల్
    శమియిం చుట కిడిన కషా-
    యము గని రోగార్తుఁ డొక్కఁ డానందించెన్

    రిప్లయితొలగించండి
  17. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్య ఏ మాత్రము కష్టముగా లేదు. అందరి పూరణలు కూడా చాలా సుకరముగా నున్నవి. అందరికి శుభాభినందనలు. తొలి మూడు పూరణలు చంపకమాలలే చాల అందముగా వచ్చేయి. మంచి వాసనలను వెదజల్లెను.

    శ్రీమతి లక్ష్మీ దేవిగారు 2 విధములుగా పూరించేరు. (1) ప్రాణ ప్రయాణ సమయములో యముని చూచిన రోగి యని .. ఉత్తమముగా నున్నది. (2) కరుణామయుడొకడు అందించిన సాయము అని .. ఇదీ చాలా బాగున్నది.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు: సాక్షాత్తు యముడే దిగివచ్చి అభయమునిచ్చినచో ఆ రోగి పొందు ఆనందమును గూర్చి వర్ణించేరు. ప్రశస్తముగా నున్నది.

    శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు: దివ్యౌషధముల గొని తగు నుపాయము గనిన రోగిని వర్ణించేరు. ఉత్తమముగా నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు: విమలమ్మ చేయు సాయము గని సంతసించిన రోగిని వర్ణించేరు. చాల బాగున్నది.

    శ్రీ గుండు మధుసూదన్ గారు: రోగముల నయముచేయు వైద్య నికాయమును గనిన రోగిని వర్ణించేరు. ప్రశస్తముగా నున్నది - మంచి సమాసములు వాడేరు.

    శ్రీ చంద్రమౌళి గారు: జీవనాంతిమ దశలో మృత్యోన్ముఖ సమయము అని చక్కని సమాసములు వేసేరు -- ప్రశస్తముగా నున్నది.

    శ్రీ సహదేవుడు గారు: ధన్వంతరి వైద్యము నాశ్రయించేరు. ఉత్తమముగా నున్నది.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: వైద్యుడు ఇచ్చిన ధైర్యమును చక్కగా వర్ణించేరు. ఉత్తమముగా నున్నది.

    శ్రీ మిస్సన్న గారు: బాధలు శమింపజేయు కషాయమును విడుదల చేసేరు. ప్రశస్తముగా నున్నది.

    రిప్లయితొలగించండి
  18. ముందుగా వ్రాసిన లైనులలో ఒక తప్పు దొరలినది. చంపకమాలలు మూడును ఈ సమస్యలలో రాలేదు. ఆ భాగమును తొలగించినటులుగా గ్రహించండి.

    రిప్లయితొలగించండి


  19. అమితమగు జఠర వేదన
    శమియింపగలేదు చాల సాధనముల,నా
    సమయమున 'ఆంబులెన్సు 'సా
    యము గని రోగార్తు డొక్క డానందించెన్ .


    రిప్లయితొలగించండి
  20. శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,
    గురువుగారి సవరణలకు ధన్యవాదములు

    పేద వాడికి రోగ మొచ్చి ఆసుపత్రి లో బాధలు పడలేక
    --
    దమకమ్మున దీయరు ప్రా
    ణ ములను వైద్యులని విన్న నరుడు గలత జెం
    ది మగత నిద్రన ముందుగ
    యము గని రోగా త్తు డొక్క డానం దిం చెన్ |
    --
    శ్రీ హరిని వేడిన యమపాశము బాధిం చదని విన్న భక్తుడు
    ---
    యమ పాశము, రాదిక యా
    కమలాప్తుడు దాససతిని గాచును విముఖ
    త్వము జూపక, యని వేడన
    యము గని రోగా త్తు డొక్క డానం దిం చెన్ |
    ----
    సి బి ఐ . వారు అపరాదులని జెప్పినను వారిపై ఎటు వంటి శిక్షలు వేయగలేము
    అని (మన యములు )మంత్రి వర్యులు సెలవిచ్చిరి
    ---
    దుమికిం చగ సి బి ఐ (చట్టము ) బొ
    గ్గు మసిన దొరకెను గనులను గొన్న ఘనులు, దం
    డము వేయ గ లేమను మన
    యము గని రోగా త్తు డొక్క డానం దిం చెన్ |

    రిప్లయితొలగించండి



  21. శ్రీ పండిత నేమాని గారి సూచన ప్రకారము 3 వ పాదంలో ఈ విధంగా సవరణ చేస్తున్నాను.
    ' సమయమున వైద్యుని సహా
    యము గని '.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. కొమరుడు నవ్వుచు తెచ్చిన:
    తమ కంపెని వారు తల్లి తండ్రుల కొరకై...
    అమితమ్మౌ బీమా "అభ
    యముఁ" గని రోగార్తుఁ డొక్కఁ డానందించెన్

    రిప్లయితొలగించండి
  23. అమితపు దగ్గును జలుబును
    నిమిషము కొకసారి తుమ్ము నిర్భరమగుచున్
    కుములగ మిరియాల కషా
    యముఁ గని రోగార్తుఁ డొక్కఁ డానందించెన్

    రిప్లయితొలగించండి