4, సెప్టెంబర్ 2012, మంగళవారం

పద్య రచన - 102


కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

28 కామెంట్‌లు:

 1. మాస్టారూ, బ్రహ్మాండమైన చిత్రం పెట్టి దాని మీద పద్యం వ్రాయమంటే ఎలా సార్; అలా చూస్తూ ఎంత సేపు కూర్చొన్నా కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం సార్!

  రిప్లయితొలగించండి
 2. ఆకాశసీమలో నపరంజి కాంతుల
  ....ప్రసరించుచుండెను భాస్కరుండు
  ఆ దివ్య కాంతుల కద్భుత రీతిగా
  ....పరవశించుచునుండె ప్రకృతి కాంత
  ఆ సోయగాలకే యాభరణమ్ముగా
  ....లేలేత జవరాలు నీలవేణి
  ఒంపుసొంపులు నింపు నొయ్యారములు జిల్కి
  ....కలిగించుచుండెను కనుల విందు
  లేత నగవులు చిందించు ప్రేమరాశి
  విశ్వమోహిని మన్మథు వింటికోల
  అచ్చరలనేని మించిన యందగత్తె
  వర్ణనలకేని నందని భామ యామె

  రిప్లయితొలగించండి
 3. టమటమాల బండిర దాని టక్కుటక్కు
  మంచు లాగుచూ తట్టలో నించి చక్క
  బట్టి ఒక్కటొక్కటి తీసి వట్టి కాసు
  కమ్ము చిన్నది పిటపిట గట్టె కోక

  బండిలాగు పిల్లన్ జూచి గుండెలదిరె
  కళ్ళు త్రిప్పనా సూరీడు మళ్ళి రాగ
  కష్టపెట్టె మా మాష్టరు కంది వారు
  పద్యరచన చేయమనుట పాడిగాదు
  మనవి: ఆ పిల్ల లాక్కెళ్ళే ఆటవస్తువుని మేము టమటమాల బండి అనే వాళ్ళం. దానికీ నా బాల్యానికీ చాలా అవినాభావ సంబంధమున్నది. మాస్టారికి ధన్యవాదాలు ఈ బొమ్మసెలెక్టు చేసి పెట్టినందుకు.

  రిప్లయితొలగించండి
 4. "ప్రొద్దు గ్రుంకెడు వేళయ్యె పువ్వు బోలు
  పిల్లవానికి యాకలి వేగదీర్చి
  చిన్న బండితో నాడగ జేతు నింక"
  మత్స్య కన్నియ కొమరుని మది దలంచె.

  రిప్లయితొలగించండి

 5. జవ్వ నంబున గల యట్టి జాణ యామె
  మరులు గొల్పెను జూ డంగ మమత హెచ్చె
  పరుల భామిని యగు టన ప్రణతు లిడుతు
  నింతు లెవరైన పూ జ్యులె యిహము లోన .

  రిప్లయితొలగించండి
 6. శ్రీ గురువులకు, పెద్దలకు
  ప్రణామములు!

  మురిపెంపుఁ జిఱునవ్వు ముద్దులేఁజెక్కులఁ బొలుపారి వెన్నెల ప్రోవులాడ
  ముందువెన్కల నూఁగు డెందమ్ము సిబ్బితి గబ్బిగుబ్బల యుబ్బు నిబ్బరింప
  చందనమ్మునకు వెచ్చందనమ్మును గూర్చు నందమ్ము చందమ్ము చిందులాడ
  వరుణాలయమ్మున కరుణోల్బణమ్మున నరుణకిరణబింబ మురవణింప

  ప్రాణవిభుఁ గూడ నేతెంచు పణఁతి కెంపు
  మోవి చివురులపైని తమోవినీల
  కోమలకరాంగుళీకటకాముఖైక
  చతురలీలాభినయము విస్మయము గొలుపు.

  విధేయుడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 7. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులారా!
  ఈనాడు ఒకటే చిత్రము - వివిధములైన వర్ణనలు. చాలా బాగుగ నున్నవి.

  1. శ్రీ చంద్రశేఖర్ గారు:
  టమటమాల బండితో నున్న పడుచును వర్ణించేరు.

  2. శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
  బిడ్డని తలుచుకొనుచున్న తల్లి యొక్క హృదయమును ఆవిష్కరించేరు.

  3. శ్రీ సుబ్బా రావు గారు:
  కన్నుదోయికి నన్య కాంతలడ్డంబైన మాతృభావన చేయుట మన సంప్రదాయము అని
  గుర్తు చేసేరు.

  4. చి. డా. ఏల్చూరి వారిలో కవితావేశము ఉప్పొంగినది. ప్రాణవిభు గూద నేతెంచు
  ప్రణయ హృదయను అభివర్ణించేరు.

  అందరి పద్యములు అలరారుచున్నవి. అందరికి అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. చిన్నగనవ్వు మోవియును, చెన్నులనిమ్మడసేయు కన్నులన్,
  సన్నని చిన్ని నాసికయు, చక్కగ చెక్కిన చెక్కుటద్దముల్,
  వన్నెల వెల్గు దేహమును, వంపులుతీరిన మేనిసొంపులన్
  కన్నియకిచ్చె బ్రహ్మ తన కందూవజూపెడు కాంక్షమీరగన్

  రిప్లయితొలగించండి
 9. అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ!
  మీ పద్యములో "మత్స్య కన్నియ" అని వాడేరు. సంస్కృత పదముతో తెలుగు పదమును కలిపేరు.
  సమాసములో తెలుగు పదము ఉత్తర పదముగా ఉండరాదు. "మత్స్య కన్యక" అంటే సరిపోతుంది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. గుండు మధుసూదన్ గారి పద్యము....

  అన్నులమిన్న బొమ్మలను నమ్మఁగఁ బ్రొద్దున నేగుదెంచెఁ దా
  నన్నువ వేసమందు సొగసైనటువంటియు మేని పొంకమున్
  మిన్నెగయంగ; మింటిదొర మీలన మేమియు లేక చూడఁగన్,
  వన్నెలు చిందులాడె; వలపాఱఁగఁ బోసె; నిదేమి చోద్యమో?

  రిప్లయితొలగించండి
 11. పూజ్యశ్రీ గురుదేవుల శుభాశీర్వచస్సులకు ధన్యవాదాలు. మీ హృద్యరచన మాకు మార్గదీపకం. మీ అంతఃకరణశుద్ధి, స్వస్త్యంతమైన పవిత్రవాక్కు మాకు ఆరాధనీయాలు.

  ఇటీవల శ్రీ మిస్సన్న గారివి, శ్రీ వసంత కిశోర్ గారివి; శ్రీమతి లక్ష్మీదేవి గారివి, శ్రీ గుండు మధుసూదన్ గారివి, మన తెలుగు (చంద్రశేఖర్) గారివి పూరణ-వర్ణనలు, వారి కవితాహృదయం, ప్రయోగవైచిత్రి, ధారాశుద్ధి సద్యఃప్రశంసనీయంగా ఉంటున్నాయి. సుకవు లందరికి నా అభివందనలు.

  రిప్లయితొలగించండి
 12. ఈనాటి ఏల్చూరి వారి పద్యంలో వారిని కొత్త కోణంలో చూచే అవకాశం కలిగింది. పద్యం రసవత్తరంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ సరస్వత్యై నమః:
  మరికొందరు మిత్రుల సరస గతులను ముచ్చటిద్దాము:

  1. శ్రీ ఆధిభట్ల కామేశ్వర శర్మ గారు సొగసైన ఉత్పలమాల నందించేరు ఆ సుందరాంగికి. కన్నుల విందగు కన్నె వన్నె చిన్నెలతో ఆ పూల మాల సాటి వస్తుందా?

  2. శ్రీ గుండు మధుసూదన్ గారు కూడా కలువ పూల దండనే సమర్పించేరు ఆ చిన్నదానికి. మింటి దొరే కను లప్పగించి చూచు చున్నాడట ఆ కొమ్మను - పూరెమ్మని.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. రసహృదయులైన కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈ నాటి చిత్రాన్ని చూచి కవితావేశాన్ని పొంది మనోహరమైన పద్యాలను అందించి మనోల్లాసాన్ని కల్గించారు.
  పండిత నేమాని వారు విశ్లేషించిన తరువాత నేను పరిశీలించడానికి పూనుకొనడం సాహసమే అవుతుంది. వారికి కృతజ్ఞుడను.
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పునర్దర్శనం ఆనందాన్ని కలిగించింది.
  కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 15. సుబ్బారావు గారూ,
  మొదటి రెండు పాదాలు వ్రాసిన తరువాత ప్రక్కనే మీ భార్యామణి ఉన్నవిషయం గుర్తుకు వచ్చిందా? మిగిలిన పాదాల ధోరణి అకస్మాత్తుగా మారింది... :-)

  రిప్లయితొలగించండి
 16. మురళీధర రావుగారూ ధన్యవాదాలు. మీ బోటి సత్కవి మిత్రుల మార్గదర్శనము, నేమాని పండితుల ఆశీస్సుల
  ఫలము, గురువుగారి ప్రోత్సాహమూ మాకు అండదండలై ఉండగా మాకేమి కావాలి?

  రిప్లయితొలగించండి
 17. నండూరి వారి యెంకీ!
  నిండగుహృదయమ్ముఁబెంచె నీదగుసొగసున్!
  బండిని లాగెడు లాస్యము
  గుండెలఁగుచ్చదె?యనంగు గునపశరంబై!?

  (మన్మధ శరములకే తట్టుకోలేకుంటె, శరములే గునపాలైనట్లు తపింప జేసె అందమన్న భావం)

  రిప్లయితొలగించండి
 18. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  అయ్యా ఈ నాటి చిత్రము
  నండూరి సుబ్బారావు గారి
  యెంకిని గుర్తు జేయు చున్నది !
  ఒక్కసారి నండూరి వారి యెంకిని పరికిద్దామా !

  రిప్లయితొలగించండి
 19. నమిలి మింగిన నా యెంకి :
  ____________________________

  యెంకి వంటి పిల్ల లేదోయి లేదోయి!
  యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!

  మెళ్ళో పూసల పేరు
  తల్లో పూవుల సేరు

  మెళ్ళో పూసల పేరు
  తల్లో పూవుల సేరు

  కళ్ళెత్తితే సాలు
  కనకాబిసేకాలు

  యెంకి వంటి పిల్ల లేదోయి లేదోయి!
  యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!

  సెక్కిట సిన్నీ మచ్చ
  సెపితే సాలదు లచ్చ!

  సెక్కిట సిన్నీ మచ్చ
  సెపితే సాలదు లచ్చ!

  వొక్క నవ్వే యేలు
  వొజ్జిర వయిడూరాలు!

  యెంకి వంటి పిల్ల లేదోయి లేదోయి!
  యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!

  పదమూ పాడిందంటె
  పాపాలు పోవాల

  పదమూ పాడిందంటె
  పాపాలు పోవాల

  కతలూ సెప్పిందంటె
  కలకాల ముండాల!

  యెంకి వంటి పిల్ల లేదోయి లేదోయి!
  యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!

  తోటంతా సీకట్లె
  దొడ్డీ సీకటి మయమె!

  తోటంతా సీకట్లె
  దొడ్డీ సీకటి మయమె!

  కూటి కెళితే గుండె
  గుబగుబమంటా బయిమె!

  యెంకి వంటి పిల్ల లేదోయి లేదోయి!
  యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!

  రాసో రింటీ కైన
  రంగూ తెచ్చే పిల్ల!

  రాసో రింటీ కైన
  రంగూ తెచ్చే పిల్ల!

  నా సొమ్ము - నా గుండె
  నమిలీ మింగిన పిల్ల

  యెంకి వంటి పిల్ల లేదోయి లేదోయి!
  యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
  ____________________________
  నండూరి సుబ్బారావు గారి "ఎంకి పాటలు " నుండి

  రిప్లయితొలగించండి
 20. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  అభిసారిక :

  01)
  _______________________________

  తట్ట నొకదాని నెత్తిన - బెట్టి యటను
  చిట్టి పొట్టగు యడుగుల - నట్టె నడచు
  గబ్బి గుబ్బల బిట్టుగా - గట్టి యలరు
  గుమ్మ గనినంత యువకుల - గుండె లోన
  గుబులు గుబులుగా కోర్కెలు - గొల్లుమనగ
  నేగు చున్నది చిన్నది - యేరి కొఱకొ ?
  _______________________________

  రిప్లయితొలగించండి
 21. బండి బొమ్మల నమ్మును పడతి యెంకి
  ఎండ దిరుగుచు నింటికి నేగు చుండె
  'ఇంత మాడ్చిన నల్లటి యింతి కింత
  సోయ గంబ?' ని యెరు పెక్కె సూరి గాడు.

  రిప్లయితొలగించండి
 22. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
  మీ పద్యములో భావము బాగున్నది. మన ప్రత్యక్ష దైవము త్రిమూర్త్యాత్మక స్వరూపుడు అయిన సూర్యనారాయణ మూర్తిని కవిత్వ పరంగా "సూరిగాడు" అనుట ఉచితమేనా? స్వస్తి.

  రిప్లయితొలగించండి
 23. అయ్యా పల్లె టూరి యెంకిని వర్ణిస్తూ అల్లా వ్రాసాను. ( సరదాగా..గాడ్(god ) దేవుడే కదండీ ..)

  మరొక విధంగా...
  బండి బొమ్మల నమ్మును పడతి యెంకి
  ఎండ దిరుగుచు నింటికి నేగు చుండె
  'ఇంత మాడ్చిన నల్లటి యింతి కింత
  చక్క దనమ ?యనుచు రవి నక్కె చూడు

  రిప్లయితొలగించండి